వాడుకరి చర్చ:Bhumana kiran Kumar
స్వాగతం
[మార్చు]Bhumana kiran Kumar గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
- "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
- వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
- చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
- వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
- వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
- వికీపీడియాలో మీకు సహాయమేమైనా అవసరమైతే, సంకోచించకుండా నా చర్చ పేజీలో అడగండి (నాకూ ఒక చర్చ పేజీ ఉంది మరి). నాకు వీలైనంతలో సాయం చేస్తాను.
ఇకపోతే..
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లోని ప్రతీ ఊరికీ, ప్రతీ మండలానికీ, జిల్లాకీ, ప్రతీ పట్టణానికీ, నగరానికీ వికీలో పేజీ ఉంది. మీ ఊరి పేజీ చూడండి. అందులో సవరణలు ఏమైనా అవసరమనుకుంటే చేసెయ్యండి. వెనకాడకండి.
- ప్రతీ తెలుగు సినిమాకీ ఒక పేజీ పెట్టాలనేది సంకల్పం. అందులో మీరూ పాలుపంచుకోవచ్చు.
- మానవ పరిణామం, మాయాబజార్, ఇస్రో, సూపర్‌స్టార్ కృష్ణ, జవాహర్ లాల్ నెహ్రూ, చంద్రుడెలా పుట్టాడు, తిరుమల ప్రసాదం, హిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులు, కొండారెడ్డి బురుజు,.. రండి. విజ్ఞాన సర్వస్వ ప్రపంచంలో విహరించండి. ఇక్కడ రాయండి. తప్పులను సరిదిద్దండి. ఒప్పులకు మెరుగులు పెట్టండి.
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
- ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Nrgullapalli (చర్చ) 11:03, 21 మార్చి 2020 (UTC)
జీవిత కథ రాసుకునే స్థలం కాదిది
[మార్చు]వాడుకరి పేజీలో చాలా రాసుకున్నారు. భాషలో లోపాల కారణం గాను, పేరా విభజన సరిగ్గా లేనందువలనా, విరామ చిహ్నాలు సరిగా లేనందువలనా.. నేను దాన్ని సరిగ్గా చదవలేదు, పూర్తిగా చదవలేదు. చదివినంతలో నాకు అర్థమైనది ఇది: మీ జీవిత కథను పూసగుచ్చినట్టు రాసుకున్నారు. అందులో దొంగతనం/దోపిడీ చేసే ప్లాన్లు కూడా వేసారు. అసలిదంతా ఏ కథలో నుంచైనా ఎత్తి రాసారేమో కూడా తెలీదు. ఏదైనప్పటికీ..
- ఇది ఇక్కడ రాసుకోడానికి కుదరదు. వాడుకరి పేజీ, వాడుకరి ఆత్మకథ రాసుకోడానికి కాదు; వాడుకరి తన గురించి తాను - వికీకి సంబంధించినంత వరకు మాత్రమే - క్లుప్తంగా రాసుకునే పేజీ ఇది.
- ఒకవేళ ఇదొక కథ అయి, దాన్ని ఎక్కడి నుంచో ఎత్తి రాస్తే.., అదీ కుదరదు. కాపీ హక్కుల ఉల్లంఘన ఇది.
- మీరు చేసిన/చెయ్యదలచిన నేరాల గురించి ఇక్కడ రాయనే కూడదు.
కాబట్టి, తక్షణమే వాడుకరి పేజీలో రాసిన దాన్ని తీసెయ్యండి. __చదువరి (చర్చ • రచనలు) 01:45, 22 మార్చి 2020 (UTC)
క్షమించండి నేను పెద్దగా చదువుకోలేదు సమాజాన్ని మార్చే ప్రయత్నంలో ప్రస్తుతం నేను ఒంటరిగా ఉన్నాను నా ఆరోగ్యం సరిగా లేదు కాబట్టి సాధ్యమైనంతవరకు నా గురించి చెప్పాలి అనుకుంటున్నాను నా గురించి ఎందుకు చెప్పాలి అనుకుంటున్నాను అంటే ప్రపంచాన్ని మొత్తాన్ని మార్చే మేనిఫెస్టో ని తయారు చేశాను దయచేసి ఇది ప్రజలకు చేరే విధంగా మీరు ప్రయత్నించి కలిగితే చేయండి ఇంకొక విషయం ఇది నా జీవిత చరిత్ర అ మరియు ప్రపంచాన్ని మార్చే అంశాలు ఇందులో ఉన్నాయి ఇంకా పూర్తిగా పొందుపరచలేదు ఒకరిని ఉద్దేశించి ఇక్కడ రాయలేదు మీరు చదివిన దాన్ని బట్టి మీకు అర్ధం అయి ఉండవచ్చు నా విజ్ఞాన పరిజ్ఞానం ఎంత తక్కువ ఉందో నేను ఎవరిని అనుకరించలేదు వీలుంటే సహాయపడండి ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేద్దాం మీ సమాధానం కోసం వెయిట్ చేస్తున్నాను Bhumana kiran Kumar (చర్చ) 14:48, 26 ఏప్రిల్ 2020 (UTC)
- మీరు రాయదలచుకున్న అంశాల కోసం వికీపీడియా సరైన స్థలం కాదు. ఫేస్బుక్ గాని, బ్లాగు గానీ అయితేనే మీ ఆశయాలకు సరిపడే క్షేత్రాన్ని ఇవ్వగలవు. వ్యక్తుల ఆలోచనలు రెక్కలు విప్పుకుని ఎగిరే స్థలాలు అవి. స్వైరకల్పనలు స్వైరవిహారం చేసే స్థలాలవి. అక్కడ రాయండి. వికీపీడియా నియమాలు వాటిని అనుమతించవు. __చదువరి (చర్చ • రచనలు) 16:32, 26 ఏప్రిల్ 2020 (UTC)
Ok Bhumana kiran Kumar (చర్చ) 10:51, 2 మే 2020 (UTC)
నమస్కారం ఎప్పటికీ ఇప్పటికీ అందరి లాగానే నేను కూడా సామాన్య మనిషిని కానీ దురదృష్టమో అదృష్టమో తెలియదు కానీ మంచి నీతి జబ్బు నాకూ వచ్చినప్పటినుంచి 13 సంవత్సరాలుగా ఇంటిని వదిలి పెట్టి సమాజంలో తిరుగుతూ ప్రపంచ మార్పు కొరకు మ్యానిఫెస్టో నేను తయారు చేశాను వీలుంటే దాన్ని ప్రపంచానికి పరిచయం చేయండి నేను పెద్దగా చదువుకోలేదు నన్ను మీరు అర్థం చేసుకుంటున్నారు అని నమ్ముతున్నా మీ సమాధానం కోసం వేచి చూస్తున్నా నా మాటలలో ఆవేదనలు లేకపోతే నన్ను క్షమించండి నన్ను ప్రత్యక్షంగా మీరు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది
[మార్చు] సహాయం అందించబడింది
—Bhumana kiran Kumar (చర్చ) 14:59, 26 ఏప్రిల్ 2020 (UTC)
- ఇంతకు ముందు చర్చలో తెలిపినట్లు, వికీపీడియా నియమాలకు అనుగుణంగా మాత్రమే వ్యాసాలు, వాడుకరి పేజీలు (పరిచయ వివరాలు) వుండాలి. కావున మీ వాడుకరి పేజీలో సమాచారం తొలగించాను. స్వాగతం సందేశంలో లింకులను చదివి వికీపీడియా గురించి మరింత తెలుసుకోండి. --అర్జున (చర్చ) 05:11, 27 ఏప్రిల్ 2020 (UTC)
నా వయసులో 29 సంవత్సరాల వరకు జరిగిన సారాంశం
[మార్చు]ముందు రోజుల్లో రాస్తాను దయచేసి నేను ఎలా రాయాలో నాకు సహాయపడండి ఎందుకంటే నేను చదువుకోలేదు Bhumana kiran Kumar (చర్చ) 16:11, 26 ఏప్రిల్ 2020 (UTC)
- మీ వాడుకరి పేజీలో సమాచారం తొలగించబడింది. పై అంశంలో వ్యాఖ్య చూడండి. --అర్జున (చర్చ) 05:12, 27 ఏప్రిల్ 2020 (UTC)