వాడుకరి చర్చ:Dev/క్రితం చర్చ1
Dev/క్రితం చర్చ1 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. వైజాసత్య 06:16, 17 అక్టోబర్ 2007 (UTC)
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
స్వాగతం
మీరు కొత్త సభ్యులయ్యిండి కూడా కొత్తగా వచ్చిన సభ్యులను చొరవగా ఆహ్వానించటం ముచ్చటగా ఉంది --వైజాసత్య 06:16, 19 అక్టోబర్ 2007 (UTC)
- గుడ్ వర్క్ కొనసాగించండి --బ్లాగేశ్వరుడు 18:40, 19 అక్టోబర్ 2007 (UTC)
- సంక్షిప్త సందేశం కొఱకు {{subst:స్వాగతం|సభ్యుడు=Dev|చిన్నది=అవును}} అని, పెద్ద సందేశం కొఱకు {{subst:స్వాగతం|సభ్యుడు=Dev]} టైపు చేయండి--బ్లాగేశ్వరుడు 18:40, 19 అక్టోబర్ 2007 (UTC)
మీ సభ్య పేజి చాలా ఆకర్షణీయంగా ఉన్నది--బ్లాగేశ్వరుడు 16:33, 20 అక్టోబర్ 2007 (UTC)
మూసలు
మీరు ఆంగ్లవికీ నుండి మంచి మంచి మూసలను తీసుకుని వచ్చి, ఇక్కడి వ్యాసాలను అకర్షణీయంగా తయారుచేస్తున్నారు. బాగుంది. అలాగే మీరు తీసుకుని వస్తున్న మూసలను ఎప్పటికప్పుడు అనువదిస్తూ ఉండండి, లేకపోతే మూసలన్నీ ఆంగ్లంలోనే ఉండిపోతాయి. వికీ సింటాక్సును ఎక్కువగా వాడటంవలన, వ్యాసాలను అనువదించటం కంటే మూసలను అనువదించటం కొంచెం కష్టం, అందుకని వాటిని అనువదించటానికి ఇతరులు ఆసక్తి చూపించరు. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 09:00, 24 అక్టోబర్ 2007 (UTC)
- దేవా గారూ, తెవికీలో మీ కృషికి అందుకోండి ఓ చిరుకానుక --వైజాసత్య 04:43, 25 అక్టోబర్ 2007 (UTC)
- దేవా గారు, మీసహాయం కొనసాగించండి , విశేష పతాకం అందుకొన్నందుకు అభినందనలు--బ్లాగేశ్వరుడు 05:04, 25 అక్టోబర్ 2007 (UTC)
విన్నపం, చదువరి చర్చాపేజీ నుండి
- చదువరి గారు మీరు వ్రాస్తున్న చిట్కాలను వికీపీడియా:వికీ చిట్కాలు/అక్టోబర్ 25 వలె తేదీ ప్రకారం వ్రాస్తే నేను ఆంగ్ల వికీ చూసి చేసిన ఒక మూస ఈ నాటి చిట్కా లో వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. మూస ఇంకా పూర్తిగా తయారవ్వలేదు. దయచేసి ఆ విధంగా రాయండి.దేవా 05:43, 25 అక్టోబర్ 2007 (UTC)
- దేవా గారూ, ఆ మూస లింకు కోసం వెతికాను, కనబడలేదు. ఇవ్వండి, అలాగే రాస్తాను. నెనరులు! __చదువరి (చర్చ • రచనలు) 05:53, 25 అక్టోబర్ 2007 (UTC)
- నా అభిప్రాయం మాత్రమే----> తెలుగు వికీపీడియాలొ ప్రస్తుతం అత్యంత ఆకర్షణీయ సభ్యత్వ పేజి మీది, మీరు చదువరి గారి సభ్యత్వ పేజి ని అధిగమించి మీరు ఆ స్థానాన్ని పొందారు. అభినందనలు--బ్లాగేశ్వరుడు 06:29, 25 అక్టోబర్ 2007 (UTC)
- నిజంగానే మీ పేజీ అద్భుతంగానూ అందంగానూ కూడా రూపొందిస్తున్నారు. విశ్వనాధ్. 06:47, 25 అక్టోబర్ 2007 (UTC)
- అవును దేవాగారి పేజీ చాలా బాగుంది. బ్లాగేశ్వరా! నా పేజీకి ఆయన పేజీకి ఓ తేడా ఉంది.. ఆయన పేజీ ఆయన స్వంత ఆలోచన. నాదీ కాపీ!!:) అవును, ఎన్వికీలో ఎవరో సభ్యుడి పేజీ చూసి కాపీ కొట్టాను.:)) __చదువరి (చర్చ • రచనలు) 02:46, 26 అక్టోబర్ 2007 (UTC)
వికీపీడియా:వికీ చిట్కాలు/అక్టోబర్ 25 పేజీలో..
వికీపీడియా:వికీ చిట్కాలు/అక్టోబర్ 25 పేజీలో "వికీపీడియాలో సంతకం చెయ్యడం ఎలా" ను శీర్షిక నుండి మామూలు వాక్యంగా మార్చారు. దాన్ని శీర్షికగా పెట్టడం వలన వికీపీడియా:వికీ చిట్కాలు పేజీలో విషయసూచికలో అవి చేరుతాయి. అంచేత దాన్ని శీర్షికగా మార్చాను. ఇలా చెయ్యడం వలన ఇబ్బంది ఏమైనా ఉందేమో నేను గమనించలేదు. ఏదైనా ఉంటే చెప్పగలరు. ఒకవేళ ఇబ్బందేమీ లేకపోతే, దాన్ని తిరిగి శీర్షికగా పెట్టేద్దామా? __చదువరి (చర్చ • రచనలు) 08:44, 25 అక్టోబర్ 2007 (UTC)
స్వాగతం
వికీపీడియాకు ఇంకోసారి స్వాగతం :) __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 16:16, 25 అక్టోబర్ 2007 (UTC)
వికీచిట్కాలు
వికీపీడియా:వికీ చిట్కాలు పేజీ ఇప్పుడు చక్కగా ఉంది. ఈ చిట్కాల వ్యవహారాన్ని పట్టాలకెక్కించి, మీరు మనందరికీ పెద్ద పనే పెట్టారు. చిట్కాలు చేర్చడమనేది పెద్ద పనిగా పెట్టుకుని సాగాలి ఇక!:) ఈ విషయమై మీరు చేసిన కృషికి గాను నా అభినందనలు అందుకోండి. __చదువరి (చర్చ • రచనలు) 02:27, 26 అక్టోబర్ 2007 (UTC)
ఉచిత సలహాదారు
ఈ అభిప్రాయాన్ని ముందే రాసి ఉండాల్సింది. ఇప్పుడు రాస్తున్నందుకు సారీ! ఉచిత సలహా అనేది సానుకూల అర్థంలో వాడరనుకుంటా. దాన్ని నెగటివ్ అర్థంలోనే ఎక్కువగా వాడతారు. మీరు సూచించిన చిట్కా మాస్టర్ దీనికంటే బాగున్నట్టుంది.
పనంతా చేసేసాక తీరుబడిగా రాస్తున్నందుకు మళ్ళీ సారీ! __చదువరి (చర్చ • రచనలు) 07:07, 30 అక్టోబర్ 2007 (UTC)
రంగు
రంగు పేజీ మీరు ఏ ఉద్దేశంతో తయారుచేశారో అర్ధం కాలేదు. రంగుల పట్టిక అయితే పేజీ కూడా అలాగే ఉంటే బాగుంటుంది. రంగులన్నింటి గురించి ఇంగ్లీష్ వికీలో లాగా కలిపి వ్రాయవచ్చును.Rajasekhar1961 10:07, 6 నవంబర్ 2007 (UTC)
ప్రకటనలు
మీరు తయారు చేసిన ప్రకటనలు చాలా బాగున్నాయి. అలాగే మిగిలిన ప్రాజెక్టులకు కూడా ప్రకటనలు తయారు చేసి ఆయా ప్రాజెక్టుల పేజీలలో ఉంచగలరా? --వైజాసత్య 22:27, 21 నవంబర్ 2007 (UTC)
- అసలు ఈ ప్రకటనల ఐడియా అద్భుతం. ఏ విషయమైనా అందంగా చెప్పకుంటే ఎవరు పట్టించుకొంటారు? తెలుగు వికీలో ప్రభంజనంలా దేవా విజృంభిస్తున్నాడు. అభినందనలు --కాసుబాబు 08:47, 22 నవంబర్ 2007 (UTC)
అవును ప్రకటనలు బావున్నాయి. నాదో చిన్న ఆలోచన. ఇలాంటిదే హిందూమతం,గ్రంధాలు,పురణాలు,కావ్యాలు, హిందూ మతానికి సంబందించిన ప్రతి వాటికీ పెట్టే విదంగా తయారు చేస్తే బావుంటుందని. మీరు చేయగలనంటే దానిలో పెట్టేందుకు బొమ్మ నేనిస్తాను.. విశ్వనాధ్. 09:13, 22 నవంబర్ 2007 (UTC)
- దేవాగారూ నేను లోడ్ చేసిన బొమ్మ చూసారా?. మీ ప్రకటన పట్టుకొని నేనూ తంటాలు పడ్డా. కానీ మనవలన ఏంగాలే. మీకు నచ్చినట్టుగా, పైన నే చెప్పినట్టుగా మంచి మూస తయారు చెయ్యండి..కృతజ్ఞతలు..
మరోమాట మీ పేజీలో స్వాగతం అదిరిమ్ది. అక్షరాలు కొంచెం పెద్దవయితే బావుండేదేమో...విశ్వనాధ్. 11:03, 22 నవంబర్ 2007 (UTC)
- హిందూమత ప్రకటన బాగా చేసారు. నేను ప్రయోగశాలలో ప్రయత్నించినట్టూగా బొమ్మలు కొంచెం పెద్దవొచ్చి మేటర్ షేడ్ లేకుండా ప్లెయిన్ లెటర్లతో వచ్చే అవకాసం ఉందా?. అక్షరాలు షేడ్ లేకుండా అయితే బాగా కనిపిస్తాయి అని.అదీ ఆరెంజ్ లాంటి కలర్స్ కాక బ్రౌన్,డార్క్ గ్రీన్,డార్క్ వైలెట్, నేవీబ్లూ,డార్క్ గ్రే లాంటి కలర్ లెటర్స్ వాడితే ఆకర్షణగా కనిపిస్తాయనిపిస్తుంది. ప్రకటన సైజు కూడా పెంచగలగితే ఇంకా అద్భుతంగ ఉండొచ్చు. వీలయితే ఈసారి ఈ కాంబినేషన్ ప్రయత్నించగలరు.ధన్యవాదాలు..విశ్వనాధ్. 06:32, 24 నవంబర్ 2007 (UTC)
హిందూమత ప్రకటన ఇరగదీసింది. చుట్టూ ఒక బోర్డర్ కూడా గీసేస్తే ఇంకా బాగా ఇరగదీసుద్ది..విశ్వనాధ్. 11:16, 24 నవంబర్ 2007 (UTC)
మూసలు
మీరు తయారుచేస్తున్న మూసలు బాగున్నాయి. వారంరోజులకు కలిపి ఒక మూస తయారుచేయగలరు. ధన్యవాదాలు.Rajasekhar1961 05:18, 24 నవంబర్ 2007 (UTC)
- మూస:వారము రోజులు మూస చాలా బాగుంది. ధన్యవాదాలు. ఈ వారంరోజుల్ని ఆయా గ్రహాలకు కలిపితే వారాలపేర్లలోని ఆంతర్యం అర్ధం అవుతుంది.Rajasekhar1961 09:11, 24 నవంబర్ 2007 (UTC)
చిట్కాలు
ప్రదీప్ గారు నా బ్రౌసర్‌లో Alt ఒక్కదానితోనే కీ బోర్డ్ షార్ట్‌కట్‌లు పనిచేస్తున్నాయి. నేను ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ వాడుతున్నాను. మీరు కూడా అదే వాడుతున్నారా? లేకపోతే మీరు వాడే బ్రౌసర్‌కి అనుగుణంగానూ, IE కి అనుగుణంగానూ చిట్కాను మార్చండి. దేవా/DeVచర్చ 11:51, 8 డిసెంబర్ 2007 (UTC)
- నాకు ఫైరుఫాక్సు మరియు IE రెండిటిలోనూ alt+shift వాడుతుంటేనే పని చేస్తున్నాయి. నేను దాదాపూ ప్రతీ వికీపీడియాలోను అలా కీబోర్డుతోనే పని కానిచేస్తుంటాను. అవును మీరు alt+v నొక్కినప్పుడు "view menu" తెరుచుకోదా? __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 12:01, 8 డిసెంబర్ 2007 (UTC)
దేవా గారూ నమస్తే, మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. నేను వీకిపీడియా కొత్త సభ్యుడిని. అవగాహన, అనుభవం తక్కువ. మీ సహాయ సహకారాలుంటే తప్పకుండా కృషి చేస్తాను. * అహ్మద్ నిసార్
Thanks
మీరిచ్చిన సలహాకు Thanks. అయితే ఒక చిన్న సందేహం. ప్రతి మండలంలో ఉన్న గ్రామాలకు ఒకదానితో ఒకటి లింకులు ఏర్పాటు చేయాలని నా ఉద్దేశ్యం. ప్రస్తుతం ఒక గ్రామం పేజీ నుంచి అదే మండలంలోని గ్రామానికి వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మూసల ద్వారా నేను చేస్తున్నది సరైనదేనా లేదా దీని మరో దగ్గరి పరిష్కారం ఉందా.C.Chandra Kanth Rao 14:25, 12 డిసెంబర్ 2007 (UTC)
- దేవా గారూ! మీరు తరలింపు లాగ్ చేసిననూ బాలానగర్ మండలంలోని గ్రామాలకు కూడా మద్దూరు మండలపు మూసలే వస్తున్నాయి. మళ్ళీ కొత్త మూస చేసి మొత్తం మార్చవలసిందేనా?C.Chandra Kanth Rao 17:52, 12 డిసెంబర్ 2007 (UTC)
- అదే నాకూ అర్థం కానిది. రివర్ట్ ఆప్షన్ సరిగా పనిచేయడం లేదని నా అభిప్రాయం. చరిత్ర మొత్తం కనబడుతుంది కాని దిద్దుబాటు మాత్రం రద్దుకావట్లేదు. నిర్వాహకులు మాత్రమే రద్దు చేయగలరని నాకనిపిస్తుంది. ప్రదీప్‌గారు గాని చదువరిగార్ని గాని దిద్దుబాటు రద్దుచేయమని అడుగుదాం. వారివల్ల కూడా అవకపోతే కొత్త మూస చేయవచ్చు. మూస తయారుచేయడం ఎంతోసేపు పట్టదులెండి, అయినా మీరు కొద్దిగా ఆగండి, అప్పుడే మూస తయారుచేయకండి. దేవా/DeVచర్చ 18:09, 12 డిసెంబర్ 2007 (UTC)
- దేవా! క్రొత్త సభ్యులను ఆహ్వానించే విషయంలో ఇతర కార్యశీలక సభ్యులు తమ పని వత్తిడి వలన ఈ మధ్య వెనుకబడుతున్నారు. అలాంటి సమయంలోనే ఈ ముఖ్యమైన బాధ్యత నువ్వు నిర్వహిస్తున్నందుకు అభినందనలు- --కాసుబాబు 11:09, 17 డిసెంబర్ 2007 (UTC)
- దేవా గారూ! తెలుగు మెడల్ బహుకరించినందుకు అభినందనలు. ఇంత అందమైన మెడల్ తయారుచేసినందుకు మీకు ఏ మెడల్ ఇవ్వాలో!C.Chandra Kanth Rao 16:27, 18 డిసెంబర్ 2007 (UTC)
దేవా గారూ నమస్తే, మీరు మంచి టాపిక్ ను సూచించారు. తప్పకుండా ప్రయత్నిస్తాను. nisar 13:06, 20 డిసెంబర్ 2007 (UTC)
ప్రచార వ్యాసం
దేవా! క్రొత్త సభ్యులను చేర్చే విషయమై నీ అభిప్రాయంతో అందరూ ఏకీభవిస్తారు. ఇంతకు ముందు చేసిన ప్రయత్నాలు కొంత ఫలితాలను ఇచ్చాయి. మనం Institutional Support కోసం ప్రయత్నించడం ఒక ఉపాయమనుకొంటున్నాను. అంటే తెలుగు విశ్వ విద్యాలయం, ఇతర విద్యాలయాలలో తెలుగు శాఖలు వంటి వారి ఆదరణ. ఇందుకు ముందస్తుగా మనం ఒక ప్రచార వ్యాసం వ్రాస్తే ఉపయోగపడవచ్చును. దానిని ఒక చిన్నపుస్తకంగానో పత్రంగానో ప్రకటించి కాలేజీల లైబ్రరీలలోకి, రీడింగ్ రూములలోకీ చేర్చాలని నా సంకల్పం. ప్రకటనల మీద నీకున్న పట్టును బట్టి అడుగుతున్నాను. అలాంటి వ్యాసం మొదలుపెట్టగలవా? అందరం కలిసి దానిని ఒక షేపుకు తీసుకురావచ్చును. ప్రచురణ విషయం తరువాత ఆలోచిద్దాము. --కాసుబాబు 10:44, 24 డిసెంబర్ 2007 (UTC)
- కొత్త సభ్యులను చేర్చుకోవడం ఒక్కటే కాదు, మనకు రాశి కంటే వాసి ముఖ్యం. ప్రస్తుతం రోజూ ఎందరో కొత్త సభ్యులు చేరుతున్నారు, వారందరికీ స్వాగతం పలుకుతున్నాం. కాని వారు రచనలు చేసే విషయం పక్కన పెడితే కనీసం మన స్వాగతాన్ని అయినా చూస్తున్నారా అనేది కూడా సందేహమే. రచనలు చేసే ఉద్దేశ్యం వారికి లేదు, ఏదో సభ్యత్వం తీసుకుందాంలే అన్నట్లుంది వారి ధోరణి. రచనలు చేసే శక్తి ఉండి వారిని తెవికి వైపు రప్పిస్తేనే మన లక్ష్యం నెరవేరుతుంది. దీనికి నా అభిప్రాయం ప్రకారం మనం చేయాల్సింది, 1)ప్రతి వ్యాసంలో వీలైనంత వరకు బ్రాకెట్లలో ఆంగ్ల పదాలు చేర్చడం. దీని వలన ఆయా పదాల కోసం సెర్చ్ చేసినప్పుడు ఈ పదాలు తగులుతాయి. తద్వారా వారు ఇక్కడికి చేరుకోవచ్చు. 2) తెలుగు పత్రికలలో తెవికి గురించి వివరించడం (నేను ఇలాగే వచ్చాను). కనీసం దినపత్రికలకు లేఖలు వ్రాసిన బాగుటుంది. ఉదా.కు తెవికిలో 2 లక్షల దిద్దుబాట్లు అయ్యాయి, 38వేల వ్యాసాలు పూర్తయ్యాయి, అధికారిక వెబ్‌సైట్ల కంటే తెవికి లోనే తాజా సమాచారం (జిల్లాల సమాచారం, ప్రభుత్వ శాఖల సమాచారం మొ.నవి ముందు మనం తాజాకరించాలి)C.Chandra Kanth Rao 13:21, 24 డిసెంబర్ 2007 (UTC)
Happy New Year!
Dearest Dev,
Hi! Thanks for your reply and your generous offer to help. I would appreciate it if you could you please consider adding one or various of these images to the insightful article created by your colleague: here? image 1; image 2; image 3; image 4; and image 5 This would mean a lot to me. Thank you! -Tanmayi Nehru 02:59, 2 జనవరి 2008 (UTC)
కృతజ్ఞతలు
దేవా గారు మీ స్వాగతానికి కృతజ్ఞతలుThoutam 05:12, 4 జనవరి 2008 (UTC)
నిజామాబాద్ జిల్లా కవులు
చేర్చవలెను 175.101.31.253 22:15, 9 ఏప్రిల్ 2023 (UTC)
నిజామాబాద్ జిల్లా సాహిత్యం
డా.కాసర్ల నరేశ్ రావు రచించిన పుస్తకములు - గుండె గాయాలు 2005;
లలితతరంగాలు 2008; కాలస్పర్శ 2010; కాలగంధం 2012; కాగడా 2015;
వానచుక్క శతకం 2019; కట్టడి 2020;జై విజ్ఞాన్ 2023