Jump to content

వాడుకరి చర్చ:JVRKPRASAD/పాత చర్చ 5

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ప్రసాద్ గారు 2013 కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారము పొందినదులకు హార్దిక శుభాకాంక్షలు. --విష్ణు (చర్చ)08:21, 3 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
2013 కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారమునకు ఎంపికైన సందర్భముగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు..విశ్వనాధ్ (చర్చ) 08:32, 3 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రసాద్ గారికి

2003 డిసెంబర్ 10న ప్రారంభమైన తెలుగు వికీపీడియా ప్రస్థానం నిరంతరాయంగా సాగుతూ ఇప్పటికి పది సంవత్సరాలను పూర్తిచేసుకున్నది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాను అనేక రూపాలలో అభివృద్ధి పరుస్తున్న మీలాంటి ఎందరో మహానుభావులు. అలాంటి మహానుభావులను ఒక చోట చేర్చి, సత్కరించాలనీ, ఆనంద పరచాలనీ, మేమానందించాలనీ సదుద్దేశంతో విశిష్ట వికీపీడియన్ పేరుతో 10 మంది సభ్యులను ఎన్నుకొనడం జరిగింది. వారిలో ఒకరిగా మిమ్ము ఈ సత్కారాన్ని అందుకొనేటందుకు తప్పక విచ్చేసి మీ యొక్క అనుభవాలను, సూచనలను, సలహాలను మాతో పంచుకోవాలని తద్వారా కొత్త తరానికి మీ యొక్క స్పూర్తిని అందించాలని మా ఆకాంక్ష.. శ్రమ అయినా పని ఉన్నా మా కొరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి రాగలరని మా ఆశ...

అభినందనలతో... కార్యవర్గం

మరిన్ని వివరాలు ఈ పేజీలలో

వికీప్రాజెక్టు సలహా

[మార్చు]

మీరు తెవికీలో విస్తారంగా కృషి చేస్తున్నందులకు సంతోషం. మీరు వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీట్రెండ్స్_ఆధారిత_నాణ్యతాభివృద్ధి లో చేరి మెళకువలు తెలుసుకొని వికీపీడియాలో వ్యాసాల నాణ్యత పెంచడానికి కృషి చేస్తే బాగుంటుంది.--అర్జున (చర్చ) 06:11, 13 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదం

[మార్చు]

JVRKPRASAD గారు, నా అనారోగ్యం(టైపాయిడ్)కారణంగా మీ అభినందనలకు ధన్యవాదాలు ఆలస్యంగా తెలుపుతున్నందులకు మన్నించండి.08:38, 22 జనవరి 2014 (UTC)

దశాబ్ధి ఉత్సవాలకు స్వాగతం

[మార్చు]

తెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం

2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. వీరిలో విశేష కృషిచేసిన కొందరిని సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.

ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియన్లుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.ఎన్ కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటు నోటీసు ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.

ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక

......దశాబ్ది ఉత్సవ కార్యవర్గం, సహాయమండలి

తెలుగు వికీపీడియా దశాబ్ది ఉపకార వేతనము

[మార్చు]

నమస్కారం JVRKPRASAD గారు,

తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాలకు మీరు చేసుకున్న ఉపకార వేతన అభ్యర్థన మాకందినది.
మీరు ఉపకార వేతనము కు అర్హత సాధించారని తెలిపేందుకు సంతోషిస్తున్నాము.
శుభాకాంక్షలు!
మరిన్ని వివరాలు మీకు మెయిల్ ద్వారా పంపటం జరిగింది - గమనించగలరు.
తమరి రాకకై 15-16 తేదీల్లో విజయవాడలో వేచి ఉన్నాము.

ఇట్లు
Pranayraj1985 (చర్చ) 07:37, 12 ఫిబ్రవరి 2014 (UTC), కార్యదర్శి, తెవికీ దశాబ్ది కార్యవర్గం[ప్రత్యుత్తరం]

కొలరావిపు ప్రశంసాపత్రం

[మార్చు]
కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013)
జె.వి.ఆర్.కె.ప్రసాద్ గారూ, తెలుగు వికీపీడియా మరియు విక్షనరీలలో కొత్త సభ్యులను ఆహ్వానిస్తూ ప్రోత్సహించిన కృషి అభినందనీయం. విక్షనరీలో అనేక వేల పదాలు చేర్చి, బ్రౌణు నిఘంటువుల పదాలకు సవరణలు చేసి విశేష కృషి చేశారు. 2011 లో వికీపీడియాలో వ్యాస మరియు వ్యాసేతరములలో టాప్ 10 లో ఒకరుగా నిలచి, ఆంధ్రప్రదేశ్ జిల్లాల ప్రాజెక్టులో భాగంగా మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.
మీ అందరికి ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 16:08, 17 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

భారతీయ రైల్వేలు - వివరాలు

[మార్చు]

గౌరవనీయులు, పెద్దలు జలసూత్రం వెంకట రామకృష్ణ ప్రసాద్ గారికి,
కుశలమనే భావిస్తున్నాను. భారతీయ రైల్వే వారు ప్రచురించే పుస్తకాలలోని వివరాలు తెవికీలో చేరిస్తే బాగుంటుదని అనుకుంటున్నాను. ఈ విషయంలో మీ అమూల్య అభిప్రాయాన్ని కోరుతున్నాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 16:26, 17 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

సుల్తాన్ ఖాదర్ గారికి, తప్పకుండా చేయగలనని ఆశిస్తున్నాను. JVRKPRASAD (చర్చ) 12:45, 18 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

నా వివరాలు

[మార్చు]
  • [1]ఆర్కుట్
  • [2]] ఫేస్‌బుక్
  • [3] బ్లాగ్
  • [4] నా వంశవృక్షం

(ఇంకా కావాలంటే ఇస్తాను)

రైల్వే మార్గాల పటాలు

[మార్చు]

ప్రసాద్ గారూ, రైల్వే మార్గాల పటాలు మరియు మార్గాల వ్యాసాలు చక్కగా అభివృద్ధి చేస్తున్నారు. చాలా బావుంది. ఏదైనా సాంకేతిక సహకారం కావాలంటే తప్పకుండా అడగండి. వ్యాస విషయం గురించి మీకంటే నాకు పెద్దగా తెలియదు. మీరు ఈ పటాలకై మూసలను ఆంగ్లవికీ నుండి తెచ్చారని చూశాను. మీకూ తెలుసో లేదో ఒక మూస యొక్క ఉపమూసలు, ఆధారిత మూసలన్నింటిని ఏకకాలంలో వేరే వికీనుండి దిగుమతి చేసుకోవటానికి ప్రత్యేక:దిగుమతి పేజీని ఉపయోగించివచ్చు. ఒక్కొక్కటి కాపీచేయటం కంటే ఇది చాలా సులభమైన మార్గం. మీకు ఇది ముందే తెలిసి ఉంటే ఇక నే చెప్పేదేమీ లేదు --వైజాసత్య (చర్చ) 06:11, 5 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వైజాసత్య గారూ, మీకు ముందుగా నా ధన్యవాదములు. నాకు సాంకేతిక సహకారం ఎల్లప్పుడూ మీరందరూ అందించాలని కోరుకుంటాను. నాకు వేరే వికీనుండి దిగుమతి చేసుకోవచ్చును అనే అటువంటి వంటి విషయము తెలియదు. దయచేసి మీరు, తెలిసిన వారు ఎవరయిననూ సాంకేతిక సహకారం అందించగలరు. నేను వ్యాసములు వ్రాయగలను. JVRKPRASAD (చర్చ) 06:19, 5 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఝాడూ అభియాన్

[మార్చు]

గౌరవనీయులైన ప్రసాద్ గారికి, నమస్సులు మరియు సలాములు. ఈ మధ్య మీరు తెవికీలో చేపట్టిన "బూజు-దులుపు" (శుద్ధి) కార్యక్రమం చాలా బాగుంది. నాణ్యత పట్ల మరియు శుద్ధత పట్ల మీరు చూపిస్తున్న శ్రద్ధ అభినందనీయం. అలాగే అనేక విషయాలపట్ల మీ అభిప్రాయాల పట్ల నేనూ నా సంఘీభావం తెలుపుతున్నాను. అహ్మద్ నిసార్ (చర్చ) 11:32, 5 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

అహ్మద్ నిసార్ గారికి, నమస్కారము. కొన్ని విషయాలు మరీ మితిమీరి పోయాయి, మనకు దారి వేరే ఏమీ లేదు, కేవలము చర్చలు తప్ప. ఈ మధ్యన కొన్ని విషయాలలో "చర్చ"లలో మీరు చూసే ఉంటారు. నాకు తెలిసిన విధముగా తెలియ చెప్పాలనుకున్నాను. అంతే. కాని ఎవరికీ నేను మనసులో దూరము కాను. మనము అందరము ఇక్కడ మాత్రము ఒక్క మనసు, మాట మీద ప్రపంచములో "మనము" ఒక్కటే అనే భావము అందరికీ ఉండాలనే ఆశ, ఆశయముతో కొన్ని నా పదాలు అంత తేలికగా అర్థమయ్యే విధముగా వ్రాయను. దానికి ఆ పదాలను చాలా లోతుగా తరచి తరచి చదువుకుంటే ఆ వ్యక్తికి అనేక అర్థాలు ఆ పదాలలో గోచరిస్తాయి. అప్పుడు ఎవరి మనసు మూలల్లో ఏం దాగుందో అక్షర రూపములో మన అందరకు అందిస్తారు. అలాగే తెలుగు ప్రజలు తెలుగు వికీపీడియాలో మాత్రం తెలుగు రాజకీయాలు దరిదాపుల్లో కూడా ఉండకూడదని నా ముఖ్య ఉద్దేశ్యం. మీరు అందించిన ఆనంద సంఘీభావము ఎల్లప్పుడూ (సర్వదా సహస్రధా) ఎల్ల విషయములలో మీ నుండి అందుకోవాలని ఆశిస్తూ మరో మారు మీకు నా ధన్యవాదములతో.........మీ......JVRKPRASAD (చర్చ) 12:51, 5 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రసాద్ గారు,

సూటిగా, నిర్మొహమాటంగా మీరు చేస్తున్న అనేక వ్యాఖ్యల పట్ల నేను కూడా ఏకీభవిస్తున్నాను. తెవికీ నాణ్యత పెంపు కోసం మీరు చేస్తున్న ఈ కృషిని ముందు కూడా కొనసాగించగలరని ఆశిస్తున్నాను.
ఇట్లు,
--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 10:16, 7 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

రైల్వే వ్యాసాలు - మీ కృషి

[మార్చు]

గురుతుల్యులు ప్రసాద్ గారికి నమస్కారములు.
రైల్వే వ్యాసాల నాణ్యతకు మీరు చేస్తున్న కృషి అమోఘము. ముఖ్యంగా మీరు తీర్చిదిద్దిన దక్షిణ మధ్య రైల్వే వ్యాసము చాలా బాగున్నది. అందులో చేర్చిన ఛాయా చిత్రాలు ఇంకా బాగున్నాయి. ముఖ్యంగా తుని రైల్వేస్టేషన్ నుండి తూర్పు కనుమలపై సూర్యాస్తమయం చిత్రము. మీ ఈ కృషిని ఇలాగే కొనసాగించి తెవికీని సమున్నత శిఖరాలకు చేర్చుతారని, ఆ శక్తిని మీకు భగవంతుడు ప్రసాదించాలను కోరుకుంటున్నాను.
ఇట్లు,
భవదీయుడు,
--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 10:13, 7 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

సుల్తాన్ ఖాదర్ గారికి, ముందుగా ఈ వ్యాస వ్యాసుల వారికి నా ధన్యవాద వందనములు. ఒకసారి ఈ మధ్యన కూర్చిన విజయవాడ రైల్వేస్టేషన్ గురించి, ఇతరములు కూడా మీకు వీలయితే చదవండి. తదుపరి, మీ ప్రోత్సాహాకర అభినందన మందార సుమ మాలలకు సుమనస్పూర్తిగా నా సంతోష అభివందన, అభివాద ధన్యవాదములు తెలుపుకుంటూ, మరిన్ని భవిష్య జాబులకై ఎదురు తెన్నులు చూస్తూ........మీ..........JVRKPRASAD (చర్చ) 10:20, 7 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు ఎక్కించిన బొమ్మలు

[మార్చు]

ఇటీవల మీరు ఎక్కించిన బొమ్మలకు WP:FUW వాడినట్లులేదు (ఉదా:దస్త్రం:Gunturhall.JPG). వాటికి తగిన సారాంశం మరియు లైసెన్స్ వివరాలు చేర్చండి. ఉదాహరణకు నేను ఎక్కించిన బొమ్మలు చూడండి. ఇకముందు ఎక్కించేబొమ్మలకు WP:FUWవాడితే తగిన వివరాలు సేకరించబడి సారాంశం మరియు లైసెన్స్ అప్రమేయంగా చేర్చబడతాయి. ఇంకేమైనా సందేహాలుంటే అడగండి. --అర్జున (చర్చ) 05:20, 10 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

  • JVRKPRASAD గారికి, మీరు నేను ఎక్కించిన బొమ్మల పేజీల మూలం చూసినట్లయితే మీకు కొన్ని మూసలువాడినట్లు తెలుస్తుంది. అలాంటి మూసలు తగిన వివరాలతో మీ బొమ్మ పేజీలలో చేర్చాలి. మరింత సమాచారం కొరకుWP:FUWలో సహాయం మరియు మార్గదర్శకాలు (పూర్తిగా అనువాదం కాలేదు) పేజీలు లేక వాటికి అనుసంధానమైన ఆంగ్ల వికీ పేజీలు చూడండి. దీనిని సరిగా అర్థం చేసుకోవాలంటే కొన్ని బొమ్మలు WP:FUW వాడి ఎక్కించడమే మంచిది. --అర్జున (చర్చ) 01:27, 11 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఏప్రిల్ 27, 2014 సమావేశం

[మార్చు]

ఈనెల 27 తేదీన తెవికీ సమావేశం జరుగుతున్నది. మీరు దయచేసి ఇందులో ప్రత్యక్షంగా గాని స్కైప్ ద్వారా పాల్గొని సమావేశాన్ని సఫలీకృతం చేస్తారని కోరుతున్నాను.Rajasekhar1961 (చర్చ) 12:53, 23 ఏప్రిల్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]

రైల్వే వ్యాసాలు

[మార్చు]

నమస్కారం ప్రసాద్ గారు,
కుశలమని భావిస్తాను. ఈ మధ్యన తెవికీలో కొంచెం తక్కువగా రచనలు చేస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన రైల్వే బడ్జెట్ ల వివరాలు ఎక్కడ లభిస్తాయో తెలుపగలరు. అలాగే రైల్వే వ్యాసాలు మరిన్ని రాయగలరని విన్నపము.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 18:17, 15 మే 2014 (UTC)[ప్రత్యుత్తరం]