వాడుకరి చర్చ:NEDUNURI SRINIVASA RAO

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం

[మార్చు]
NEDUNURI SRINIVASA RAO గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

NEDUNURI SRINIVASA RAO గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 00:24, 26 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందనలు

[మార్చు]

శ్రీనివాస్ నేదునూరి గారు, అభినందనలు, SANDHYARAGAM (2013 TELUGU FILM) ఈ పేజీ చాలా బాగారాశారు, 1951లో సంధ్యారాగం సినిమా తీసినట్టు ఇంగ్లీష్ వికీపీడియాలో నమోదై ఉంది. మీరు 2013లో మీరు తీసినట్లు నిర్మాత, దర్శకత్వం, కధ అన్ని మీరే అన్నట్లు మీ పేరు చేర్చారు. ఇది సరైన సమాచారంలా లేదు. కావున తొలగింపు మూస పెడుతున్నాను. దీని నిర్వాహకులు పరిశోధించి తొలగించాలా లేదా అనేది నిర్ణయిస్తారు లేదా మీరు సరైన ఆధారాలు, మూలాలు, సమాచారం ఆధారాలు చేర్చగలరు. తొలగింపునకు గురి కాకముందే మీరు ఈ సమయం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ లోగా సమాచారాన్ని చేర్చండి. ధన్యవాదాలు. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 16:32, 8 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఎవరైనా రాయొచ్చండి

[మార్చు]

ఈ దిద్దుబాటు సారాంశంలో మీరు నేనైనా రాయొచ్చా అని అడిగారు. రాయొచ్చండి. చిన్నచిన్న నిబంధనలను పాటిస్తే చాలు. అవేంటంటే..

  • ఎవరైనా రాయొచ్చండి.
  • ఏ విషయం గురించైనా రాయొచ్చండి - వికీలోకి ఎక్కేంత ప్రాముఖ్యత, వికీయోగ్యత దానికి ఉంటే చాలు
  • ఏ సమాచారాన్నైనా చేర్చవచ్చండి - ఆ సమాచారం సందర్భోచితంగా ఉండాలి. ఈసరికే ఏదైనా విశ్వసనీయమైన చోట (ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ వంటి వార్తా పత్రికలు, ఇతర పత్రికలు, విశ్వసనీయమైన పుస్తకాలు వగైరా) ప్రచురితమై ఉండాలి. బ్లాగులు, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాఅధ్యమాలు పనికిరావు. ఆ సమాచారం ఎక్కడ ప్రచురితమైందో ఆ మూలాన్ని ఇక్కడ ఉదహరించాలి.

సందేహాలేమైనా ఉంటే అడగండి సార్. నాకు చేతనైనంతలో సాయపడగలను. __చదువరి (చర్చరచనలు) 08:08, 9 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

సంధ్యారాగం సినిమా వ్యాసం

[మార్చు]

రవిచంద్ర గారికి నమస్సులు. నా పేరు నేదునూరి శ్రీనివాస రావు . సంధ్యారాగం 2013 తెలుగు ఫిలిం పేరిట వికీపీడియా లో ఓ సినిమా గురించి ప్రచురించాలని ఉద్దేశ్యంతో ఉన్నాను. ఈ చిత్రం 2013 ఏప్రిల్ 26 న విడుదలయింది. ఇండియా టుడే లాంటి పత్రికలు టైటిల్ చాలా బాగుందని ఓ ఆర్టికల్ రాసారు. వృద్ధ తల్లిదండ్రులపై నేటి జనరేషన్ ప్రవర్తిస్తున్న తిరుతెన్నులను ఇతివృత్తంగా తిసుకుని స్వియ రచన , నిర్మాణ .దర్శకత్వంలో చేయడం జరిగింది. చిత్రం విడుదలైన తరువాత కూడా ఆశించ ఆర్ధిక ఫలితానివ్వకపోయినా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం గురించి వికీపీడియా లో ప్రచురించాలని అనుకుంటున్నాను, ఫెయిల్ అవుతున్నాను. దయ చేసి ఓ సందేశాత్మక చిత్ర కథాకమామిషు అందరికి తెలియాలనే నా తపనను అర్ధం చేసుకుంటారని కోరుతున్నాను. NEDUNURI SRINIVASA RAO (చర్చ) 10:19, 9 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

NEDUNURI SRINIVASA RAO గారు, ఎవరికి సంబంధించిన అంశాలను వికీపీడియాలో వ్యాసాలుగా రాయటం సొంత ప్రచారంగా భావించపడుతుంది, మరల అలా వ్రాసేటప్పుడు ప్రయోజన వివాదానికి (Conflict of Interest)అస్కారం వుంటుంది, కావున అలా చేయకూడదు. తెవికీలో చాలా సభ్యులు చురుకుగా సినిమాల వ్యాసాలు రాస్తుంటారు. ఈ విషయం తెలిపారు కాబట్టి వారు ఆ వ్యాసం చేర్చవచ్చు. తెవికీలో నేరుగా వ్యాసాలు వ్రాయకుండా, తొలి 500 దిద్దుబాట్లు వున్న వ్యాసాల్లో సవరణలు చేస్తే మీకు వికీపీడియా గురించి అవగాహన మెరుగవుతుంది. --అర్జున (చర్చ) 05:39, 11 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]