వాడుకరి చర్చ:Ramakrishnadeekshit
Ramakrishnadeekshit గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao 17:25, 3 ఫిబ్రవరి 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #5 |
వికీపీడియాలో వ్యాసాలను వెతికేటపుడు ఒక పేరును టైప్ చేసి వెళ్ళు బటన్ నొక్కితే అదే పేరుతో వ్యాసం కనుక ఉంటే అది తెరుచుకుంటుంది లేకపోతే ఒక ఎర్రటి లింకు ఇచ్చి, దానిని సృష్టించమని సలహా ఇస్తుంది. వెతుకు బటన్ మీద నొక్కితే ఆ పదం పేరుతో కలిగిన వ్యాసాల జాబితాను మీముందుంచుతుంది.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
సహాయ అభ్యర్ధన
[మార్చు]సభ్యుల గురించిన వివరాలు ఎక్కడ టైప్ చేయాలి. ఉదాహరణ కు నా గురంచి ఇతర సభ్యుల వలె వివరములు ఉంచవలెనన్న అది ఎక్కడ చేయాలి. దయచేసి త్వరగ ప్రతిస్పందిచగలరు. ఇట్లు అర్చకం రామకృష్ణ దీక్షితులు తిరుమల
- [ఇక్కడ] చేర్చండి. మీగురించిన సమాచారం మాత్రం మీ సభ్య పేజీలో చేర్చండి.విశ్వనాధ్. 13:08, 4 ఫిబ్రవరి 2008 (UTC)
తిరుమల గురించి
[మార్చు]మంచి ఆలోచన. తిరుమల గురించి, వెంకటేశ్వరుని గురించి మీకు తెలిసిన విశేషాలతో తిరుమల విశేషాలు అనే వ్యాసం ప్రారంభించండి. తరువాత దానిని తిరుమల వర్గంలో చేర్చవచ్చు. లేదా ైప్పటికే ఉన్న తిరుమల వ్యాసంలో చేర్చవచ్చు.విశ్వనాధ్. 05:37, 5 ఫిబ్రవరి 2008 (UTC)
హిందూమతం మరియు ధర్మం
[మార్చు]మీలాంటి సభ్యులకోసమే ఎదురుచూస్తున్నామండీ! ఒక్క తిరుమల గురించే కాక హిందూ మతం, ధర్మం, తిరుమల చరిత్ర, పురాణాలు, గురించి మీకు తెలిసే ఉంటుంది. వాటి గురించి కూడా రాయగలరు. రవిచంద్ర 12:34, 5 ఫిబ్రవరి 2008 (UTC)
వేంకటేశ్వర స్వామి వారి గురించి మరిన్ని విశేషాలు
[మార్చు]త్వరలో స్వామి వారి గురించి మరిన్ని విశేషాలు రాయలని నా సంకల్పం. మీరు చూపించిన అభిమానాని కి కృతజ్ఞతలు. నేను రోజు నా అర్చకత్వ విధులను నిర్వర్తించడానికి తిరుపతి నుండి తిరుమల కు వెళ్ళి వస్తుంటాను. కాబట్టి సమయం చిక్కినప్పుడు స్వామి వారి గురించిన విశేషాలు తెల్పుతాను.రామకృష్ణ దీక్షితులు
తిరుమల గర్భగుడిలో పిల్లి గురించి
[మార్చు]రామకృష్ణ దీక్షితులుగారూ, తిరుమల వ్యాస చర్చాపేజీలో మీరు వెలిబుచ్చిన సందేహానికి నా అభిప్రాయాన్ని తెలిపాను. ఒక సారి చూడండి. అలాగే చర్చా పేజీలలో నాలుగు టిల్డేలు (~~~~) చేరిస్తే ప్రస్తుత తేదీ సమయంతో సహా మీ సంతకం వచ్చేస్తుంది. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 07:15, 8 ఫిబ్రవరి 2008 (UTC)
తెలుగులో చాలా చక్కగా వ్రాస్తున్నారు
[మార్చు]తెలుగులో చాలా చక్కగా వ్రాస్తున్నారు, మీరు కంప్యూటరులో తెలుగు వ్రాయడంలో చాలా అనుభవం ఉన్న వారివలే తప్పులు లేకుండా వ్రాస్తున్నారు. వికీలో వ్రాస్తున్నందుకు అభినందనలు, వికీ విజ్ఞాన సర్వస్వము కాబట్టి ఇందులో వ్రాసే విషయాలకు కొన్ని లిమిటేషన్లు ఉన్నాయి. ఉదాహరణకు మూలాలు లేనివి, అనగా ఇంతకు ముందు ఏ పత్రికలోనూ, పుస్తకంలోనూ చెప్పనివి, నిర్దారించుకోలేనివీ, ఇప్పుడు పరిశోధనలో ఉన్న విషయాలనూ, స్వంత అభిప్రాయములను ఇక్కడ వ్రాయడం నిషేదం. కానీ ఇటువంటి విషయాలను పంచుకోవడానికి మనకు బ్లాగులు తోడుగా ఉంటాయి. మీరు ఒక స్వంత బ్లాగు కూడా ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుంది. http://oremuna.com/blog/?p=1322 ఈ లింకు చూడండి, బ్లాగు ఎలా మొదలుపెట్టాలో సహాయంగా ఉంటుంది. వికీలో మీ ప్రస్థానం ఇలాగే కొనసాగించండి. అభినందనలతో Chavakiran 13:27, 9 ఫిబ్రవరి 2008 (UTC)
బొమ్మ:Balaji_mulavirat.jpg లైసెన్సు వివరాలు
[మార్చు]Ramakrishnadeekshitగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:Balaji_mulavirat.jpg అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.
మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.
ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.
- ఉపయోగకరమైన లింకులు
- బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలి — బొమ్మలు వాడే విధానం — బొమ్మల కాపీహక్కు పట్టీల గురించి — లైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో అడగండి.
ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 14:36, 13 ఫిబ్రవరి 2008 (UTC)
పునస్వాగతం
[మార్చు]రామక్రిష్ణ దీక్షితులు గారూ, చాలా కాలం తర్వాత మళ్ళీ మంచి మార్పులు చేపడుతున్నారు. మీ సహకారంతో తిరుమల గురించిన సమగ్ర సమాచారం రూపుదాలుస్తుందని ఆశిస్తున్నాను.--రవిచంద్ర (చర్చ) 05:53, 9 మార్చి 2010 (UTC)
ధన్యవాదాలు
[మార్చు]రవిచంద్ర గారు, నమస్కారం! మీ ఆహ్వానానికి కృతఘ్నతలు. నేను ఇంకా ఎన్నో విషయాలు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి విశేషాలతో వ్రాయాలనుకుంటున్నాను. కాని స్వామి వారి సేవా కైంకర్యాల పనులలో నిరంతరం నిమగ్నమై ఉండటం వల్ల తక్కువ సమయమే కేటాయించగలుగుతున్నాను. కాని నా శాయశక్తులా కృషి చేసి తప్పక మంచి విశేషాలను చేరుస్తాను.