వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/అక్టోబరు 1
స్వరూపం
- ప్రపంచ వృద్ధుల దినోత్సవం, చైనా జాతీయదినోత్సవం, నైజీరియా జాతీయదినోత్సవం.
- ప్రపంచ శాఖాహార దినోత్సవం
- 1847: హోమ్రూల్ ఉద్యమకర్త అనీ బిసెంట్ జననం (మ.1933).(చిత్రంలో)
- 1862: సంఘసంస్కర్త రఘుపతి వెంకటరత్నంనాయుడు జననం (మ.1939).
- 1869: ప్రపంచములో తొలిసారిగా పోస్టుకార్డును ఆస్ట్రియా దేశంలో విడుదల చేశారు.
- 1922: తెలుగు సినిమా హాస్యనటుడు అల్లు రామలింగయ్య జననం (మ.2004).
- 1926: భారతదేశంలో బ్రిటీష్ ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమీషన్ నెలకొల్పింది.
- 1928: దక్షిణ భారత సినిమా నటుడు శివాజీ గణేశన్ జననం (మ.2001).
- 1935: భారత సుప్రీంకోర్టు నెలకొల్పబడింది.
- 1946: సినిమా దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం మరణం (జ.1902).
- 1951: భారతదేశ లోక్సభ సభ్యుడు జి.ఎం.సి.బాలయోగి జననం (మ.2002).
- 1953: కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ.
- 1958: భారతదేశంలో మెట్రిక్ కొలతల పద్ధతి ప్రవేశపెట్టబడింది.