వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మే 10
స్వరూపం
- 1787 : ఇంగ్లీషు భౌతిక శాస్త్రవేత్త విల్లియం వాట్సన్ మరణం (జ. 1715).
- 1857 : భారత స్వాతంత్ర్యోద్యమమం: మీరట్ లో సిపాయిల తిరుగుబాటు తో మొదటి స్వాతంత్ర్య యుద్ధం మొదలైన రోజు.
- 1908 : మాతృదినోత్సవం మొట్ట మొదటి సారిగా అమెరికాలోని పడమటి వర్జీనియాలోని గ్రాఫ్టన్ అనే ఊరిలో జరిగింది.
- 1922 : నటుడు, దర్శకుడు, శతాధిక నాటకకర్త కొర్రపాటి గంగాధరరావు జననం (మ. 1986).
- 1926 : సురవరం ప్రతాపరెడ్డి హైదరాబాద్ స్టేట్లో గోల్కొండ పత్రికను ప్రారంభించాడు.
- 1980 : తెలుగు సినిమా నటీమణి నమిత జననం.
- 1986 : ఆంద్రప్రదేశ్ కు చెందిన చదరంగం క్రీడాకారుడు పెండ్యాల హరికృష్ణ జననం.
- 1993 : రెండుసార్లు ఎవరెస్టు పర్వతాన్ని ఎక్కిన మొదటి స్త్రీ సంతోష్ యాదవ్ రెండోసారి ఎక్కిన రోజు.
- 1994 : నెల్సన్ మండేలా దక్షిణ ఆఫ్రికా మొట్ట మొదటి నల్లజాతి అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేసాడు.(చిత్రం లో)
- 2002 : తెలుగు, తమిళ, మలయాళ సినిమా నటి దేవిక మరణం (జ. 1943).