వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఎగురుట
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి. ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 17:19, 10 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
మూలాలు లేని ఏక వాక్య వ్యాసం. లింకులు లేవు. ఒక వారం రోజులలో విస్తరించనిచో తొలగించాలి.➠ కె.వెంకటరమణ⇒చర్చ 16:11, 10 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- ఏక వాక్యం. వ్యాకరణ పరంగా తప్పు వాక్యం. తప్పు అర్థమున్న వాక్యం. మూలాల్లేని వాక్యం. తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 17:22, 10 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- తొలగించాలి అనే అమంగళము ప్రతి హతంబయ్యెడిన్ YVSREDDY (చర్చ) 06:19, 12 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం సృష్టించబడిన తేది: 20:24, 24 సెప్టెంబరు 2016 YVSREDDY
ఈ వ్యాసంలో ఉన్న సమాచారం:
ఎగురుట (Flight - ఫ్లైట్) అనగా ఏ ఉపరితలం నుండి ప్రత్యక్ష మద్దతు లేకుండా వాతావరణం (భూమి విషయంలో గాలి) లేదా దాని అవతల (అంతరిక్షయానము సందర్భంలో వలె) గుండా వస్తువు కదలిక ప్రక్రియ.
[[వర్గం:వాయుగతిశాస్త్రం]
[[వర్గం:ఎగురుట]
ఈ వ్యాసం సృష్టించబడిన తేది, వ్యాసంలో ఉన్న సమాచారం భద్రపరచుచున్నాను.YVSREDDY (చర్చ) 06:26, 12 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- YVSREDDY గారూ, ఆ పేజీలో ఏముందో చూడాలంటే ఆ పేజీకి వెళ్తే సరిపోతుంది. దానిలో ఉన్న సమాచారం అంతటినీ తెచ్చి ఇక్కడ పెట్టడం వలన చర్చ గందరగోళంగా మారుతుంది. గమనించగలరు. __చదువరి (చర్చ • రచనలు) 08:06, 12 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- YVSREDDY గారూ, మీరు రాసిన మొలక వ్యాసాల తొలగింపు చర్చలన్నింటిలో కూడా "మంగళము ప్రతి హతంబయ్యెడిన్" అనే వాక్యం చేర్చుతున్నారు. అది ఏమిటో ఎవరికీ అర్థం కాదు. మీరు అర్థమయ్యే రీతిలో చర్చ చేయరు. అన్ని తొలగింపు వ్యాసాల చర్చలలో వ్యాసాన్ని పూర్తిగా చేర్చుతున్నారు. చర్చ గందర గోళంగా ఉంది. ఈ వ్యాసాన్ని విస్తరిస్తారా? లేదా తొలగించాలా ? అనే విషయంపై చర్చించండి.➠ కె.వెంకటరమణ⇒చర్చ 08:18, 12 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- నేను చేర్చుతున్న వాక్యం ""తొలగించాలి అనే అమంగళము ప్రతి హతంబయ్యెడిన్"" - సరి చూసుకోండి.
- ఈ వ్యాసాన్నే కాదు నేను ప్రారంభించిన ప్రతి వ్యాసాన్ని నేను విస్తరిస్తాను. నేను ప్రారంభించని వ్యాసాలను కూడా నేను విస్తరించాను. ఉదాహరణకు పంపు వ్యాసం నేను ప్రారంభించలేదు. ఈ పంపు వ్యాసాన్ని నేను విస్తరించే సమయానికి ఆ వ్యాసంలో ఒక తెలుగు అక్షరం కూడా లేదు. ఏదైనా వ్యాసం తొలగించబడితే ఆ వ్యాసం ఎప్పుడు, ఎవరు ప్రారంభించారు. ఆ వ్యాసంలో ఏమి సమాచారం ఉంది అనే విషయాలు తెలియవు. కాబట్టి నేను మీరు తొలగించక ముందే ఆ సమచారాన్ని ఇక్కడ భద్రపరచుచున్నాను. తొలగించబడే వ్యాసం యొక్క సమాచారం భద్రపరచడం వలన ఆ వ్యాసాన్ని తిరిగి ఎప్పుడైనా నేను ప్రారంభించాలనుకుంటే (లేదా ఇతరులు ఎవరైనా ప్రారంభించాలనుకుంటే) తొలగించబడిన వ్యాసంలో ఉన్న ఉపయోగపడే సమాచారాన్ని తిరిగి నేను (లేదా ఇతరులు) ప్రారంభించేటప్పుడు ఉపయోగించుకోవచ్చు. తొలగించబడే వ్యాసంలో ఉన్న సమాచారం భద్రపరచడం వలన నాకు లేదా ఇతర రచయితలకు లేదా పాఠకులకు లాభమే తప్ప నష్టం లేదు. YVSREDDY (చర్చ) 15:51, 12 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- @YVSREDDY గారూ, విస్తరిస్తానని ఎట్టకేలకు చెప్పినందుకు ధన్యవాదాలు. 17 వ తేదీ లోపు ఈ పేజీని తగు మూలాలతో విస్తరించండి. తొలగింపును ఆపేద్దాం.
- పోతే, మీరు కింది అంశాలను గమనించగలరు:
- "కాబట్టి నేను మీరు తొలగించక ముందే ఆ సమచారాన్ని ఇక్కడ భద్రపరచుచున్నాను." అని రాసారు. దాన్ని భద్రపరచే స్థలం ఇది కాదు. మీ వాడుకరి పేజీకి అనుబంధంగా ఉప పేజీలను సృష్టించి అక్కడ భద్రపరుస్తున్నారు కదా. ఇప్పటికి కొన్ని వందల ఉప పేజిలను సృష్టించారు. ఆ పేజీల వలన ఎవరి పనులకూ ఆటంకం కలుగదు. ఇక్కడ రాస్తే ఇక్కడి చర్చ గందరగోళమై ఆటంకం కలుగుతుంది.
- చర్చలో రాసే సంగతులు చర్చను ముందుకు తీసుకుపోయేలా ఉండాలి. అంతేతప్ప చర్చను గందరగోళపరచేలా ఉండకూడదు.
- వ్యాసాలను విస్తరిస్తాను అని మీరు చెప్పదలిస్తే అదే సంగతినే స్పష్టంగా (ఈ వ్యాఖ్యలో మొదటి వాక్యంలో చెప్పినట్టు) చెప్పండి. అంతే గానీ, ప్రతి హతంబయ్యెడిన్ అంటూ అర్థం కాని వాక్యాలను రాయడం, తొలగింపు ప్రతిపాదనలో ఉన్న పేజీ లోని సమాచారాన్ని తెచ్చి ఇక్కడ పెట్టడం చెయ్యకండి. దాని వలన 1. మీరు ఏం చెప్పదలచుకున్నారో అర్థం కావడం లేదు, 2. ఈ చర్చ గందరగోళమౌతోంది. ఇప్పటికే ఇలాంటి పనులు మీరు ఐదారు చర్చల్లో చేసినట్లుగా గమనించాను. ఇక అలా రాయడం ఆపండి. ఇకముందు కూడా అలాగే రాస్తే, చర్చను గందరగోళపరచే ఉద్దేశంతో, వికీపీడియాను అడ్డుకునే ఉద్దేశంతో కావాలనే అలా చేస్తున్నారని భావించే అవకాశం ఉంది.
- ధన్యవాదాలు __ చదువరి (చర్చ • రచనలు) 16:52, 12 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాసాలను భద్రపరచే స్థలం ఇది కాదు, కాని విస్తరించే అవకాశాలు ఉన్న వ్యాసాలు కూడా తొలగిస్తున్నారు అని తెలియజేప్పే స్థలం ఇది. అందుకే ఇక్కడ ఆ వ్యాసంలోని సమాచారం చేర్చాను. YVSREDDY (చర్చ) 17:10, 12 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- @YVSREDDY గారూ, ఈ వ్యాసాన్ని విస్తరించే అవకాశంలేదని ఎవరూ అనలేదు. నాలుగున్నరేళ్ళ కిందట ఒక్క వాక్యం రాసారు. ఆ తరువాత విస్తరించలేదు అని చెబుతున్నారు అంతే. విస్తరించే అవకాశాలు ఉండడం వేరు, విస్తరించడం వేరు అనే సంగతిని మీరు గ్రహించండి. మీరు ఈ వాసాన్ని తొలగించకూడదని ఆశిస్తే, మీరు చెయ్యవలసినది -తగు మూలాలతో విస్తరించడం, ఉన్న దోషాలను సవరించడం. లేదా, ఇప్పుడున్న స్థితిలో ఎందుకు తొలగించరాదో చెప్పడం. అంతేగానీ, విస్తరించే అవకాశం ఉంది అనేది అసలు వాదనాంశమే కాదు. __ చదువరి (చర్చ • రచనలు) 17:26, 12 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- @YVSREDDY గారూ పంపు వ్యాసాన్ని మీరు విస్తరించినందుకు ధన్యవాదాలు.కానీ ముందు మన ఇల్లు చక్కపెట్టుకుంటే ఇంకా చాలా మంచిది. "వ్యాసాలను భద్రపరచే స్థలం ఇది కాదు, కానీ విస్తరించే అవకాశాలు ఉన్న వ్యాసాలు కూడా తొలగిస్తున్నారు అని తెలియజేప్పే స్థలం ఇది అని" మీకు తెలిసినందుకు కూడా ధన్యవాదాలు, చాలా సంతోషం.తొలగించటానికి చర్చకు పెట్టిన వ్యాసం చర్చలో, మీరు ఆ వాసాన్ని తొలగించకూడదని ఆశిస్తే, తగు మూలాలతో విస్తరించడం, ఉన్న దోషాలను సవరించడం లేదా, ఇప్పుడున్న స్థితిలో ఎందుకు తొలగించరాదో చెప్పడంలాంటి చర్యలను మీరు చేయకుండా,వ్యాసాలను భద్రపరచే స్థలం ఇది కాదు అని మీకు తెలిసికూడా, తొలగించే వ్యాస సమాచారం ఇక్కడ కూర్పు చేయటం ఇది ఒకరకంగా మీరు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని అనుకోవాల్సివస్తుంది.మీరు వికీలో చాలా అనుభవజ్ఞులు.దుశ్చర్యలకు పాల్పడినవారి మీద చర్యలు మీకు తెలియనవి కావనుకుంటాను. "నాకు అన్నీ తెలుసు నేను ఇంతే చేస్తాను" అనే వితండవాదం ఎవరు ప్రవర్తించినా దానికి తగిన మూల్యం ఇంకో రకంగా నేనైనా, మీరైనా,ఇంకొకరైనా చెల్లించుకోవాలిసిందే!అది తప్పించుకోలేంఅని గ్రహిద్దాం. ధన్వవాదాలు. యర్రా రామారావు (చర్చ) 04:26, 13 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- @YVSREDDY గారూ, ఈ వ్యాసాన్ని విస్తరించే అవకాశంలేదని ఎవరూ అనలేదు. నాలుగున్నరేళ్ళ కిందట ఒక్క వాక్యం రాసారు. ఆ తరువాత విస్తరించలేదు అని చెబుతున్నారు అంతే. విస్తరించే అవకాశాలు ఉండడం వేరు, విస్తరించడం వేరు అనే సంగతిని మీరు గ్రహించండి. మీరు ఈ వాసాన్ని తొలగించకూడదని ఆశిస్తే, మీరు చెయ్యవలసినది -తగు మూలాలతో విస్తరించడం, ఉన్న దోషాలను సవరించడం. లేదా, ఇప్పుడున్న స్థితిలో ఎందుకు తొలగించరాదో చెప్పడం. అంతేగానీ, విస్తరించే అవకాశం ఉంది అనేది అసలు వాదనాంశమే కాదు. __ చదువరి (చర్చ • రచనలు) 17:26, 12 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.