వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/నేతకారుడు
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం 2007 అక్టోబరులో సృష్టించబడింది.అప్పట నుండి ఇప్పటివరకు ఎటువంటి మూలాలు లేవు.వ్యాసం శీర్షిక తప్పుగా ఉంది.నేతకాడు అని ఉండాలి.అసలు వ్యాసంలో శీర్షికకు సంబందించిన విషయసంగ్రహం సంపూర్ణంగా లేదు. ఇది ఎవరినో విమర్శించినట్లుగా ఉంది.వికీ శైలిలో లేదు.వర్గీకరణ లేదు.10 రోజులలో లోపు వికీశైలిలో, తగిన మూలాలతో విస్తరించనియెడల తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 09:17, 14 మార్చి 2022 (UTC)
- పైన చూపిన విధంగా మెరుగుపరచి, విస్తరించకపోతే, ఈ వ్యాసాన్ని చేనేత వ్యాసంలో కలిపేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అయితే చేనేత వ్యాసాన్ని కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది. అందులో పాఠ్యం తక్కువ బొమ్మలు ఎక్కువా ఉన్నాయి. మగ్గం అనే మరొక వ్యాసం కూడా ఉంది. అయితే దీన్ని విడిగానే ఉంచాలని నా అభిప్రాయం. __చదువరి (చర్చ • రచనలు) 10:42, 14 మార్చి 2022 (UTC)
- చేనేత కాని కాని అనుభంద వ్యాసాల్లో కాని సమాచారం తక్కువగా ఉంది. అలాఅని అన్నిటినీ తొలగించుకుంటూపోతే ఎలా..?, నిర్వహణలో భాగంగా అని జవాబు ఉంది కానీ, నిర్వహణలో తొలగి,పు కంటే దానిలో సమాచారం చేర్చగల అవకాశం ఉందా లేదా, మూలాలు ఉన్నాయ లేదా అని పరిశీలించడం ఒకటి, అలా పరిశీలించినపుడు కొంత వ్యాస విస్తరణ ఆటొమెటిగ్గా జరిగిపోతుంది. తరువాత అలాంటి వాటిని విస్తరణ మూస తగిలించి వదిలేస్తే ఎపుడో అపుడు జరుగుతుంది. ఖచ్చితంగా అది అవసరం లేని వ్యాసం అనుకుంటే తొలగించవచ్చు, నాకు అభ్యంతరం లేదు. అయితే నిర్వహణ అంటే వ్యాసాలను తొలగించుకుంటూ పోవడం మాత్రం కాదు.అని ఆయా నిర్వహకులు గమనిస్తే బావుంటుంది. ధన్యవాదాలు..B.K.Viswanadh (చర్చ)
- B.K.Viswanadh గారు "అన్నిటినీ తొలగించుకుంటూపోతే ఎలా" అని అడిగారు. ఇక్కడ యర్రా రామారావు గారు ప్రతిపాదించినది ఒక పేజీ తొలగింపు గురించి. నేను చెప్పినది ఆ పేజీ విలీనం గురించి. చర్చ జరుగుతున్నది ఒకే ఒక్క పేజీ తొలగింపు గురించి మాత్రమే కాగా, "అన్నిటినీ తొలగించుకుంటూపోతే" అని వ్యాఖ్యానించడానికి సందర్భం ఏమిటి అనేది అర్థం కాలేదు. __చదువరి (చర్చ • రచనలు) 01:02, 27 మార్చి 2022 (UTC)
- చదువరి గారు నేనన్నదీ సమాచారం తక్కువగా ఉన్న పేజీలు అన్నీ "సమాచారం తక్కువగా ఉంది. అలా అని అన్నిటినీ తొలగించుకుంటూపోతే ఎలా..?," అని. తొలగింపు కోసం ముందుగా చూసేది తక్కువ సమాచారం ఉందా అని. దానికి మూలాలు లభ్యమఔతున్నాయా?, సమాచారం లభ్యమఔతుందా అని కాదు.. లభ్యత లేనపుడు తప్పక వేరే వ్యాసం లో విలీనం చేయవచు, చివర్లో తెలిపాను. తొలగించుటకు నాకు అభ్యంతరం లేదూ అని..ధన్యవాదాలు..B.K.Viswanadh (చర్చ)
- B.K.Viswanadh గారూ, "సమాచారం తక్కువగా ఉంది. అలా అని అన్నిటినీ తొలగించుకుంటూపోతే ఎలా..?" ఈ మాటలు అన్నీ తెలిసిన మీరే అంటే ఎలా సార్? కింది అంశాలు చూదండి. బహుశా ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి, కానీ ఇక్కడ రాయాల్సి వస్తోంది:
- ఈ వ్యాసాన్ని సృష్టించింది 15 సంవత్సరాల కిందట. మూలాలు అవసరమైన కంటెంటు చేరి ఏడేళ్ళైంది. ఇప్పుడు ఈ చర్చ లేవదీయడంలో తొందర పడిందేమీ లేదు. నిజానికి ఆలస్యమైందని చెప్పాలి.
- ప్రస్తుతం వ్యాసంలో మూలాలు అవసరమైన వాక్యాలు ఒక 10 దాకా ఉన్నాయి. వాటిలో కొన్నైతే మూలాల్లేందే వ్యాసంలో అసలు మనలేవు.
- వ్యాసంలో ఒక దృక్కోణాన్ని ప్రతిబింబించే వాక్యాలు/రచయిత అభిప్రాయాలూ ఉన్నాయి.
- వ్యాసంలో మూలాల్లేని వాక్యాలను తీసేస్తే అందులో విషయం నాలుగైదు వాక్యాలే మిగులుతాయి. కాబట్టి, వ్యాసాలను తొలగించుకుంటూపోతున్నారనడం సరికాదు.
- ఇంకో సంగతి.. ఈ వ్యాసాన్ని రాసినవాళ్ళలో మీరూ ఒకరు. మీరే సృష్టించిన వ్యాసం ఇది. గత వారంగా మీరు కూడా ఈ వ్యాసంపై చర్చ చేస్తున్నారే తప్ప, మూలాలను చేర్చే ప్రయత్నం చెయ్యలేదు. మరి, ప్రతిపాదించిన వాళ్ళను తొలగించుకుంటూపోతున్నారు అనే ఆరోపణ చెయ్యవచ్చా? వ్యాసంలో ఉన్న దోషాలను గమనించకుండా, ఆ లోపాలను ఎత్తిచూపిన వారిపై ఆరోపణలు చెయ్యడం సబబా?
- ఇంకొకటేంటంటే మొలక వ్యాసాలను విస్తరించాలని సంకల్పించి ఒక ప్రాజెక్టుకు శ్రీకారం దిద్ది, దాదాపు 3000 వ్యాసాల విస్తరణలో చురుకైన పాత్ర పోషించిన వ్యక్తి ఈ ప్రతిపాదన తీసుకువచ్చారు. ఆ ప్రాజెక్టులో మీరూ పాల్గొన్నారు. ఆ నేపథ్యంలో చూస్తే తొలగించుకుంటూపోతున్నారు అనే వ్యాఖ్య ఇక్కడ నప్పుతుందా? ఆలోచించండి. నమస్కారం.
- ఇక, ఈ చర్చను నావైపు నుండి ముగిస్తూ, నా అభిప్రాయం మరింత వివరంగా: చేనేత వ్యాసాన్ని తగువిధంగా అభివృద్ధి చేసినందుకు ప్రణయ్ రాజ్ గారికి ధన్యవాదాలు. ఇక పోతే, చర్చకు మూలమైన నేతకారుడు లో మూలాల్లేని వాక్యాలను తీసేస్తే అందులో విషయం నాలుగైదు వాక్యాలే మిగులుతాయి. ఈ ప్రతిపాదన వచ్చి వారం దాటిపోయింది. పేజీని మెరుగుపరచే ఆలోచన ఎవరికీ ఉన్నట్టు లేదు. అందుచేత ఈ పేజీలో పనికొచ్చే సమాచారాన్ని చేనేత లో విలీనం చెయ్యాలి. ఆంధ్రభారతి నిఘంటువులో "నేతకారుడు" లేదు, నేతకాడు అనేది ఉంది. అంచేత నేతకారుడు పేజీని తొలగించి, "నేతకాడు" అనో లేదా మరేదైనా సరైన పేరుతోనో దారిమార్పు పేజీని (చేనేతకు) సృష్టించాలని నా అభిప్రాయం.__చదువరి (చర్చ • రచనలు) 16:25, 29 మార్చి 2022 (UTC)
- నేను నేతగాడు (అచ్చ తెలుగు మాండలికం) లో వినేవాడిని, నేతగాడు లేదా నేతకాడు అని మార్చితే బాగుంటుంది. తెలుగులో ప్రతి దానికి మూలాలు అవసరం లేదు అని నా అభిప్రాయము.Pkraja1234 (చర్చ) 17:02, 29 మార్చి 2022 (UTC)
- @Pkraja1234 గారూ, ఇక్కడ మీరు చేస్తున్న పనులను బట్టి మీకు వికీ నియమాల గురించి కొంత అవగాహన ఉందని నాకు అనిపించింది. కానీ, "తెలుగులో ప్రతి దానికి మూలాలు అవసరం లేదు.." అని అభిప్రాయపడడంతో నా ఊహ సడలింది. మీ అభిప్రాయం తప్పు, మూలాలు లేని సమాచారానికి - తెలుగే కాదు - ఏ వికీలోనూ ఉండే అర్హత లేదండి. మీరు వికీ మూలస్థంభాల గురించి చదవండి. __ చదువరి (చర్చ • రచనలు) 13:48, 1 ఏప్రిల్ 2022 (UTC)
- వ్యాసానికి వివిధ మూలాలు ఉపయోగించి తగిన మార్పులను చేసాను , నేతగాడు గా మార్పు చేసి [1] మూసను తెసివేస్తాను. Pkraja1234 (చర్చ) 16:49, 30 మార్చి 2022 (UTC)
- Pkraja1234 గారూ, వ్యాసానికి తగిన మార్పులను చేస్తుంన్నందుకు ధన్యవాదాలు. అయితే, ఈ వ్యాసం గురించి పైన చదువరి గారు చాలా విషయాలు చర్చలోకి తీసుకువచ్చారు. వ్యాసంలో ఒక దృక్కోణాన్ని ప్రతిబింబించే వాక్యాలు/రచయిత అభిప్రాయాలూ ఉన్నాయని, ఇది ఎవరినో విమర్శించినట్లుగా ఉందని పైన ప్రస్తావించారు. కాబట్టి, వాటన్నింటిని సరిచేయాల్సిన అవసరం ఉంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఒక వ్యాసానికి తొలగింపు మూసపెట్టి, తొలగింపు ప్రతిపాదించిన తరువాత, వ్యాసాన్ని ఉంచాలో తొలగించాలో నిర్ణయం అయిన తరువాతనే తొలగింపు మూసను తీసేయాలి. గమనించగలరు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 17:02, 30 మార్చి 2022 (UTC)
- ముఖ్యమైన నిస్సానుతులు తమ విలువైన సమయాన్ని వృధా చేయకూడదు అనే, ఈ మూస ను తీస్తాను అని రాసాను దయచేసి మరోలా అనుకోవద్దు. నాకు విలీనంత సమాచారం తో తగిన మార్పులు చేశాను, మిగిలనవారు అలాగే చేయచ్చు లేదా చర్చ్ పేజీ లో డిస్కస్ చేయచ్చు. Pkraja1234 (చర్చ) 02:31, 31 మార్చి 2022 (UTC)
- మీరు అనుమతిస్తే ఈ మూసను ఇంకో రెండు రోజుల్లో తీసివేస్తాను. Pkraja1234 (చర్చ) 11:06, 1 ఏప్రిల్ 2022 (UTC)
- @Pkraja1234 గారూ ఇక్కడ చర్చ జరుతుఓంది. దీనిపై ఒక నిర్ణయం వచ్చేంత వరకు ఆగండి. తొందరపడి తీసివెయ్యకండి. __ చదువరి (చర్చ • రచనలు) 13:43, 1 ఏప్రిల్ 2022 (UTC)
- @చదువరి గారు, మీ విజ్ణప్తిని అనుసరిస్తాను. ధన్యవాదములు. Pkraja1234 (చర్చ) 01:57, 2 ఏప్రిల్ 2022 (UTC)
- B.K.Viswanadh గారూ, "సమాచారం తక్కువగా ఉంది. అలా అని అన్నిటినీ తొలగించుకుంటూపోతే ఎలా..?" ఈ మాటలు అన్నీ తెలిసిన మీరే అంటే ఎలా సార్? కింది అంశాలు చూదండి. బహుశా ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి, కానీ ఇక్కడ రాయాల్సి వస్తోంది:
- చదువరి గారు నేనన్నదీ సమాచారం తక్కువగా ఉన్న పేజీలు అన్నీ "సమాచారం తక్కువగా ఉంది. అలా అని అన్నిటినీ తొలగించుకుంటూపోతే ఎలా..?," అని. తొలగింపు కోసం ముందుగా చూసేది తక్కువ సమాచారం ఉందా అని. దానికి మూలాలు లభ్యమఔతున్నాయా?, సమాచారం లభ్యమఔతుందా అని కాదు.. లభ్యత లేనపుడు తప్పక వేరే వ్యాసం లో విలీనం చేయవచు, చివర్లో తెలిపాను. తొలగించుటకు నాకు అభ్యంతరం లేదూ అని..ధన్యవాదాలు..B.K.Viswanadh (చర్చ)
- B.K.Viswanadh గారు "అన్నిటినీ తొలగించుకుంటూపోతే ఎలా" అని అడిగారు. ఇక్కడ యర్రా రామారావు గారు ప్రతిపాదించినది ఒక పేజీ తొలగింపు గురించి. నేను చెప్పినది ఆ పేజీ విలీనం గురించి. చర్చ జరుగుతున్నది ఒకే ఒక్క పేజీ తొలగింపు గురించి మాత్రమే కాగా, "అన్నిటినీ తొలగించుకుంటూపోతే" అని వ్యాఖ్యానించడానికి సందర్భం ఏమిటి అనేది అర్థం కాలేదు. __చదువరి (చర్చ • రచనలు) 01:02, 27 మార్చి 2022 (UTC)
- @చదువరి గారు తొలగింపు కొరకు మూస తగిలించాక సదరు వాడుకరితో "కలిసి వ్యాసాన్ని మెరుగుపరుద్దాం" అని చెప్పిన దానిపై స్పందనకొరకు ఎదురు చూసాను. కానీ ఆయన నుండి ఎటువంటి స్పందన రాలేదు. " గత వారంగా మీరు కూడా ఈ వ్యాసంపై చర్చ చేస్తున్నారే తప్ప, మూలాలను చేర్చే ప్రయత్నం చెయ్యలేదు" అనే మీ వాఖ్యకు జవాబు వచ్చింది అనుకుంటాను. ఇపుడు వ్యాసం అభివృద్ది చేస్తున్నాను ఒకసారి [[2]] పరిశీలించండి. ధన్యవాదాలు..B.K.Viswanadh (చర్చ) 05:13, 3 ఏప్రిల్ 2022 (UTC)
- "నేతకారుడు" కి ప్రత్యేక వ్యాసం అవసరం లేదు. చేనేత వ్యాసంలో విలీనం చేయాలి. "చేనేత" వ్యాసంలో నేతకారుల గూర్చి ఒక విభాగంగా చేర్చవచ్చు. ఈ వ్యాసంలో ఈ వెసైట్ నుంఛి చేనేత గూర్చి సమాచారాన్ని యదాతథంగా చేర్చారు. కాపీహక్కుల నియమాలను ఉల్లంఘించినట్లు అనిపిస్తుంది. ఆ వెబ్ సైట్ లో కూడాఅ చేనేత పరిశ్రమ గూర్చి సమాచారం ఉంది. కనుక ఈ వ్యాసాన్ని తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 14:44, 29 మే 2022 (UTC)