వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/స్వరలాసిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇక్కడ వోటు వెయ్యండి (5/0/0) ముగింపు తేదీ :07:35 07:34, 4 సెప్టెంబర్ 2017 (UTC) స్వరలాసిక (చర్చదిద్దుబాట్లు) - మీ ప్రతిపాదన/సభ్యుని గురించి వివరణ --స్వరలాసిక (చర్చ) 07:35, 28 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

అభ్యర్ధికి ప్రశ్నలు[మార్చు]

నిర్వాహక అభ్యర్ధి గారూ, వికీపీడియా నిర్వాహణా పనులు చేయటానికి చొరవచూపి ముందుకువచ్చినందుకు ధన్యవాదాలు. ఈ ప్రతిపాదనలో చర్చకై పాల్గొనే సభ్యులకు తోడ్పడేందుకు దయచేసి ఈ దిగువ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.

1. మీరు ఎటువంటి నిర్వహణా పనులలో పాల్గొన్నారు లేదా పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు?
జ: ప్రత్యేకమైన ఆసక్తి అంటూ ఏమీ లేదు. ఎటువంటి నిర్వహణ పనులలోనైనా పాల్గొనగలను.
2. వికీపీడియాలో మీ అత్యుత్తమ కృషి ఏమిటి? ఎందుకు?
జ: సాహిత్యానికి సంబంధించిన వ్యక్తుల పేజీలను సృష్టించడం, అభివృద్ధి చేయడం.
3. మీరు ఏదైనా విషయంపై దిద్దుబాట్ల విషయంలో ఘర్షణకు గురయ్యారా? లేదా, ఇతర సభ్యులెవరైనా మిమ్మల్ని ఒత్తిడికి గురిచేసిన సందర్భాలున్నాయా? అలాంటి సందర్భాలలో ఎలా వ్యవహరించారు మరియు ఇకముందు అలాంటి సందర్భాలు వస్తే ఎలా ఎదుర్కొని పరిష్కరిస్తారు?
జ: లేదను కుంటాను. సందర్భాన్ని బట్టి పరిష్కారం ఆలోచిస్తాను.

వాడుకరుల ప్రశ్నలు[మార్చు]
చదువరి
4.నిర్వాహకత్వం కోరే అభ్యర్ధులు వికీపీడియా నిర్వహణకు సంబంధించిన చర్చల్లో పాల్గొంటూ తమ అభిప్రాయాలను చురుగ్గా వెల్లడిస్తూండాలి. మీరు నిర్వహణకు సంబంధించిన చర్చల్లో పెద్దగా పాల్గొన్నట్లుగా నేను చూళ్ళేదు. 30 వేల మీ దిద్దుబాట్లలో వికీపీడియా పేరుబరిలో ఉన్నవి, చర్చా పేజీల్లోనూ ఉన్నవీ అన్నీ కలిపితే 3 శాతమే అవుతున్నాయి. అవి కూడా ఎక్కువగా ప్రాజెక్టు పనుల మీదనే. (ప్రాజెక్టు పనులు కూడా ముఖ్యమైనవేననే విషయంలో నా కేవిధమైన సందేహమూ లేదు.) కానీ రచ్చబండలో జరిగిన చర్చల్లో వ్యక్తిగత నిందలు జరుగుతున్నపుడు, అటువంటి వాడుకరుల ప్రవర్తన గురించి చర్చలు జరిగినపుడూ ఆ చర్చల్లో కలగజేసుకుని మీ అభిప్రాయాలు చెప్పిన దాఖలాలు గాని, వోటింగుల్లో పాల్గొని వోటేసిన దాఖలాలు గానీ నాకు కనబడలేదు. ఎందుకని మీరు అలా పట్టించుకోకుండా ఉండిపోయారు? వాడుకరులంతా అలాంటి సందర్భాల్లో చురుగ్గా పాల్గొనాలి కదా! __చదువరి (చర్చరచనలు) 17:48, 28 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
జ. నిజమే. రచ్చబండలో జరిగిన చర్చలలో నేను చురుకుగా పాల్గొనడంగానీ, వోటింగులలో పాల్గొనడం గానీ చేయలేదు. ముఖ్యంగా వివాదాలలో తల దూర్చడం నా స్వభావానికి విరుద్ధం. అయినా నిర్వాహకుల విధులేవో నాకు పూర్తిగా తెలియవు. తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాను. ఇకపై చర్చలలో చురుకుగా పాల్గొనడానికి ప్రయత్నిస్తాను.--స్వరలాసిక (చర్చ) 00:09, 29 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

మద్దతు[మార్చు]

  1. స్వరలాసిక గారు చాలా చక్కటి కృషిచేస్తున్నారు. నిర్వహణా బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తారని నమ్ముతున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 10:04, 28 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
  2. స్వరలాసిక (మురళీమోహన్) గారు చాలా కాలంగా అత్యంత నాణ్యమైన సమాచారాన్ని వికీలో చేరుస్తున్నారు. వీరి కృషి వల్ల చాలామంది మరుగున పడిన రచయితలు, సినిమా వ్యాసాలు అభివృద్ధి చెందాయి. ప్రస్తుతం అత్యంత క్రియాశీలకంగా ఉన్న సభ్యుల్లో ఈయనా ఒకరు కాబట్టి ప్రతి రోజు వికీలో జరిగే కార్యకలాపాలై ఒక కన్ను వేసి ఉంచి నిర్వహణకు తోడ్పడగలరని విశ్వసిస్తూ ఆయనకు నా మద్ధతు తెలియజేస్తున్నాను. --రవిచంద్ర (చర్చ) 12:31, 28 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
  3. స్వరలాసిక గారు తెవికీ అభివృద్ధిలో తనదైన పాత్ర పోషిస్తున్నారు. నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తికి నేను మద్దతు తెలుపుతున్నాను.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 17:26, 28 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
  4. స్వరలాసిక (కోడిహళ్లి మురళీ మోహన్) గారు మంచి రచయిత. అనేక మంది రచయితల వ్యాసాలను తెవికీకి అందించారు. తెవికీ వ్యాసాల నాణ్యత పెంచడానికి ఎంతో కృషిచేస్తున్నారు. ప్రస్తుతం అత్యంత క్రియాశీలక సభ్యులలో ఒకరుగా ఉన్న ఆయన నిర్వాహకునిగా మరిన్ని సేవలనందిస్తారని భావిస్తున్నాను. నిర్వాహక హోదాకు మద్దతు తెలుపుతున్నాను. ----కె.వెంకటరమణచర్చ 17:45, 28 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
  5. స్వరలాసిక గారికి, నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తికి నేను మద్దతు తెలుపుతున్నాను. JVRKPRASAD (చర్చ) 02:28, 29 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
  6. స్వరలాసిక (కోడిహళ్ళి మురళీమోహన్) గారి నిర్వాహక హోదా కొరకు నేను మద్దతు తెలుపుతున్నాను. వీరు నిర్వాహకులుగా మరింత బాగా రాణిస్తారని నా అభిలాష.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 17:43, 31 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
  7. చర్విత చర్వణమైతే కావచ్చేమో గానీ, మళ్ళీ చెప్పక తప్పదు. స్వరలాసిక గారు తన కాసక్తి కలిగిన రంగాల్లో చురుగ్గా పనిచేస్తూ ఉన్నారు. మరెవ్వరూ అంతగా పట్టించుకోని రంగమైనప్పటికీ దీక్షతో పనిచేసి, అనాథ వ్యాసాల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు కూడా కృషి చేసారు. అది మామూలు పనులకంటే ఓ మెట్టు పైనుండే పనని నా ఉద్దేశం. ఇకపై చర్చల్లో పాలుపంచుకునే ప్రయత్నం చేస్తానని చెబుతూ వెనువెంటనే దాన్ని ఆచరణలో పెట్టారు కూడాను. నిర్వాహకత్వంలో రాణిస్తూ వికీపీడియా నాణ్యతను మెరుగు పరుస్తారని ఆశిస్తూ వారి ప్రతిపాదనకు నా మద్దతు తెలియజేస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 11:02, 1 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
  8. స్వరలాసిక (మురళీమోహన్) గారు గత కొన్ని సంవత్సరాలుగా విశేషమైన కృషి చేస్తున్నాను. తెలుగు సాహిత్యం పైన, పాత తెలుగు, కన్నడ సినిమా సినిమాలను బాగా అభివృద్ధి చేస్తున్నారు. గొడవలకు దూరంగా ఉంటూ తన పనిని నిబద్ధతతో చేసుకొని పోతున్నవారిగా తెవికీలో ప్రసిద్ధులు. వీరి నిర్వహకత్వానికి నా మద్దతు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.Rajasekhar1961 (చర్చ) 11:50, 1 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
  9. మురళీమోహన్ గారు వయసు తారతమ్యాలతో సంభంధం లేకుండా అందరితో స్నేహపూర్వకంగా ఉంటారు. చర్చల్లో పాల్గొనలేకపోవడానికి బహుసా అయన తరచుగా మీట్స్‌లో మిగతా సభ్యులను కలవడం, ఆయన అనుమానాలను నివృత్తి చేసుకోవడం, ఫోన్‌లో అందరికీ అందుబాట్లో ఉంటూ ఉండటం వలన అయిఉండవచ్చు. నేర్చుకొనే జిజ్నాస వలన నిర్వహణ విషయాల్లో క్రియాశీలకంగా మారగలరని ఆశిస్తూ ఆయనకు నా మద్దతు తెలియచేస్తున్నాను..Viswanadh (చర్చ) 03:48, 2 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యతిరేకత[మార్చు]

తటస్థం[మార్చు]

ఫలితం[మార్చు]

వోటింగులో పాల్గొన్న తొమ్మిది మందీ కూడా ఈ ప్రతిపాదనకు అనుకూలంగా వోటేసారు. స్వరలాసిక గార్ ప్రతిపాదన నెగ్గింది. వారికి నిర్వాహకత్వ పాత్ర ప్రసాదించవచ్చు. __చదువరి (చర్చరచనలు) 05:36, 6 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]