వికీపీడియా:భవిష్యత్తులో తెలుగు వికీమీడియా పురోగతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సభ్యులందరూ మన తెలుగు వికీపీడియా అభివృద్ధి ఎలా ఉండాలి, ఏమేవి పనులకు, ప్రాజెక్టులకు ప్రాధాన్యత నివ్వాలి, కమ్యూనిటీని అభివృద్ధిచేయడానికి ఇంకా ఏవేవి పనులు చేయాలి, ఫండింగ్ విషయంగా వాని వినియోగం మన నియంత్రణలోనే ఉండాలా లేదా, వికీమీడియా ఫౌండేషన్ మన అభివృద్ధికోసం ఇంకా ఎలా మనకు తోడ్పడవచ్చు, వికీసోర్సులో లిప్యంతరీకరణకు ఉపకారవేతనం చెల్లించి ముఖ్యమైన పుస్తకాలను పూర్తిచేయడం, కొన్ని డిక్షనరీలను సాంకేతిక సహాయం ద్వారా విక్షనరీలో చేర్చడం, మొదలైన విషయాలపై సభ్యుల అభిప్రాయాలను ప్రత్యేకంగా ప్రారంభించిన ఈ పేజీలో వ్యక్తపరచండి.Rajasekhar1961 (చర్చ) 09:33, 31 ఆగష్టు 2014 (UTC)

వికీ దశాబ్ధి ఉత్సవాల సంధర్భంగా చర్చించిన అంశాలు[మార్చు]

తెలుగు వికీ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా హోటల్ ఐలాపురంలో జరిగిన చర్చల సారాంశం ఈ దిగువన ఇవ్వబడింది

  • తెవికీలో వ్యాసాల నాణ్యత పెరగాలి
  • తెవికీతో పాటుగా సోదర ప్రాజెక్టులైన వికీసోర్స్, వికీవ్యాఖ్య, వికీపుస్తకాలు, విక్షనరీలకు ప్రాధాన్యతనివ్వాలి
  • మహిళలతో సహా అందరికీ సహాయం, సహకారం మరియు శిక్షణనివ్వాలి
  • రెండు రకాలుగా తెవికీలో పని జరగాలి, ఒక రకం వారు పూర్తి స్థాయిలో వ్యాసాలు రాస్తూ పోవాలి, రెండవ రకం వారు మొదటి రకం వారు రాసిన వ్యాసాలను వికీకరించడం, శుద్ధి చేయడం లాంటివి చేయాలి
  • వికీ శిక్షణా శిబిరాలలో వయోవృద్ధులపై ఎక్కువ శ్రద్ధ ఉండాలి.
  • చరిత్రలో ఈ రోజు సరిగా నిర్వహించాలి.
  • తెలుగు వికీపీడియాలో ఎడిటింగ్ పై వీడియో ట్యుటోరియల్స్ రూపొందించాలి
  • పాఠ్యం నుండి మాట - మాట నుండి పాఠ్యం (Text to speech, Speech to text) వికీపీడియా వేదికగా పరిశోధన జరిపి అభివృద్ధి పరచాలి.
  • వికీపీడియా వ్యాసాలలో వీలైనన్ని చలన చిత్రాలు (గిఫ్ యానిమేషన్) చేర్చాలి.
  • తెలుగు వికీ ట్రెండ్స్ ఆధారంగా మార్పులు జరగాలి
  • మొలకలను అభివృద్ధి పరిచి, నాణ్యతా పరంగా మంచి వ్యాసాలను అభివృద్ధి పరచాలి.
  • వ్యాసాల నాణ్యతకు ఒక ప్రణాళిక రూపొందించాలి.
  • మొలకలు సృష్టించిన వాడుకరిని అనుసరించి, అతని చర్చా పేజీలో ఆయా మొలకల పేజీలను అభివృద్ధి పరచమని కోరాలి
  • వికీలో కచ్చితంగా ఉండాల్సిన వెయ్యి వ్యాసాల జాబితా రూపొందించి వాటిని పూర్తి స్థాయి వ్యాసాలుగా తీర్చిదిద్దాలి.
  • పోటీ పరీక్షలకు అవసరమయ్యే అంశాలను వ్యాసాలలో చేర్చాలి
  • మండల స్థాయిలో వికీపీడియా అవగాహనా సదస్సులు నిర్వహించి, విద్యార్థులకు మరింత చేరువగా వికీపీడియాను తీసుకుపోవాలి
  • 366 రోజులు - 366 ప్రాదేశిక వ్యాసాలు
  • విద్యా వ్యవస్థలోకి వికీపీడియాను అనుసంధానం చేయాలి
  • సమాచార పెట్టెల గురించి అభివృద్ధి - అవగాహన జరగాలి
  • ప్రముఖుల చిత్రాలు వికీపీడియాకు రావాలి
  • తెలుగువారు తప్పక చదవాల్సిన వంద పుస్తకాల గురించిన వ్యాసాలు తెవికీలో రావాలి
  • వికీ ప్రాజెక్టుగా సాహిత్యం ప్రాజెక్టును చేపట్టాలి.


తెలుగు వికీమీడియా పురోగతికి మరిన్ని సలహాలు[మార్చు]

తెలుగు వాళ్ళకు వేరుగా ఒక చాప్టర్ అవసరమా[మార్చు]

  • అవసరం అని అనుకుంటున్నాను. నాకు తెలిసిన విషయాల ఆధారంగా వికీ ఇండియా చాప్టర్ ద్వారా తెలుగు వికీపీడియాకు లేదా తెలుగు సముదాయానికి రావల్సిన, కావల్సిన సహాయ సహకారాలు అందటంలేదు. కనుక తెలుగు వాళ్ళకు తెలుగు ఇండియా చాప్టర్ కావాలనేది నా అభిప్రాయ్ం. అయితే దాని ఏర్పాటుకు కావల్సిన చెయ్యవలసిన కార్యాచరణ గురించిన ఆలోచనలు నా దగ్గర లేవు. తెలిసిన సభ్యులు దీనిని గురించి చర్చించగలరు..విశ్వనాధ్ (చర్చ) 11:20, 2 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
చక్కని ఆలోచన. కానీ ఇప్పుడు భారతదేశం చాప్టర్ పరిస్థితిని గమనించే ఉంటారు. చాప్టర్ వళ్ళ వనరులతో పాటూ బాధ్యతలు కూడా పెరుగుతాయి. చాప్టర్ వళ్ళ వచ్చే మంచి చెడులను బేరీజును వేసుకొని ముందుకు దూకటం మంచిది. తెలుగు ఇండియా అనకుండా తెలుగు చాప్టర్ అంటే బాగుంటుంది అప్పుడు దానికి విస్తృత పరిధి వస్తుంది, చాప్టర్ ప్రారంభించడానికి ఒక చక్కని హేతువు అవుతుంది. --వైజాసత్య (చర్చ) 06:20, 22 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు చాప్టర్ ద్వారా ఏం చేయచ్చు, ఎలా చేయచ్చు?[మార్చు]

ఒకసారి ఇక్కడ చూడండి[మార్చు]

తెలుగు వికిపీడియా కొన్ని వాస్తవాలు[మార్చు]

  • డిసెంబరు 2013 నాటికి ;
10 కి.బై. కంటే పైబడి వ్యాసాలు = 2907
5-10 కి.బై.ల మధ్య వ్యాసాలు = 2134
2-5 కి.బై.ల మధ్య వ్యాసాలు = 6210
2 కి.బై. పైబడిన మొత్తం వ్యాసాలు = 11251
తెవికీలో మొత్తం వ్యాసాల సంఖ్య (సెప్టెంబరు 2014 నాటికి) = 58876
2 కి.బై. పైబడిన మొత్తం వ్యాసాలు = 11251
2 కి.బై. కంటే తక్కువ వ్యాసాలు = 47625

(ఇందులో గ్రామాలు, సినిమాల వ్యాసాలకు మినహాయింపు ఉండవచ్చు). ఈ డేటా ఆధారంగా తెవికీ ప్రణాళికలు సిద్ధపరచుకోవాలి. అలాగే విజయవాడలో జరిగిన చర్చల అంశాలూ దృష్టిలో పెట్టుకోవాలి. మనకున్న మానవవనరులు బహుస్వల్పం. అధికారులు 4 (ఆక్టివ్=2), నిర్వాహకులు 17 (ఆక్టివ్=8), ఇతర ఆక్టివ్ సభ్యులు 10 మంది. ఈ టీం మొత్తం ప్రాజెక్టులను త్వరితగతిన పరిపూర్ణం చేయడం అసంభవం.

రాజశేఖర్ గారు ప్రస్తావించిన అతిముఖ్య విషయాలు 1.తెవికీ సముదాయానికి ఫండింగ్ విషయం, 2. ఉపకారవేతనాలు చెల్లించి కొన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడం. అలాగే విశ్వనాథ్ గారు ప్రస్తావించిన తెలుగు చాప్టర్ విషయం. ఈ విషయాల గూర్చి చర్చలు అతి ప్రాముఖ్యం గలిగినవి.

అలాగే;

మనము కొన్ని ప్రాజెక్టులను ప్రపోజ్ చేసుకోవాలి, వాటిని తొందరగా అమలు చేయుటకు ఫండింగ్ అతి ముఖ్యం, ఉదాహరణకు;

  1. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా కోటలు : ఈ ప్రాజెక్టును సమగ్రంగా పూర్తి చేయాలంటే, ఒక టీంను తయారు చేసి, రాష్ట్రాలలో (ఆం.ప్ర. & తెలంగాణా) కోటలు గల ప్రదేశాలను గుర్తించి వాటిపై విస్తృత పరిశోధనలు చేయించి, వాటి చిత్రాలను, చరిత్రను తెవికీ కొరకు వ్రాయిన్చుకోవాలి.
  2. ఆంధ్ర ప్రదేశ్ నదులు అనే వ్యాసానికి పోతే కేవలం ఐదారు వాక్యాలు గల వ్యాసం వున్నది. దీని కొరకు ఓ ప్రాజెక్ట్, దాని కొరకు ఫీల్డ్ వర్క్, డేటా కలెక్షన్, చిత్రాల తీయుట అతి ముఖ్యం. దీనికీ ఫండింగ్ అతి ముఖ్యం. తెవికీ సముదాయానికి ఒక ఫండింగ్ విధానము, ఒక కమిటీ వుంటే ఇలాంటి ప్రాజెక్టులు త్వరిత గతిన పూర్తి చేసే అవకాశాలు వున్నాయి. లేదంటే ఇలాంటి ప్రాజెక్టులు సమగ్రతకు నోచుకోవాలంటే ఓ రెండు దశాబ్దాలు పట్టవచ్చు. వీటిపైనా సభ్యులు చర్చించ వలసినదిగా మనవి. అహ్మద్ నిసార్ (చర్చ) 21:13, 2 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  3. -పైన నిసార్ గారు చెప్పినట్టు ఏపి,తెలంగాణా కోటలు, చారిత్రక ప్రదేశాలు, ముఖ్య సందర్శనా ప్రదేశాల యొక్క సమగ్ర వివరణాత్మక విశేషాల కొరకు ధనం అవసరం అవుతుంది. ఖర్చుతో అయ్యే పనులు కాబట్టి వాటికి ఫండింగ్ అవసరం.విశ్వనాధ్ (చర్చ) 05:17, 3 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  4. వికీపీడియా అభివృద్ధి చేయడానికి క్రియాశీలక సభ్యులు కలిసి చెర్చించుకోవడం అవసరం. సమైఖ్యంగా ప్రాజెక్టు పనులలో కలిసి పనిచేయడానికి సభ్యులు సమావేశాలు అవసరం. ఇప్పటివరకు ఉగాది ఉత్సవం, దశాబ్ధి ఉత్సవం, వుమన్స్ డే వంటి మీటింగులు జరుగాయి. అయినా ఇందులో పబ్లిక్ మీటింగ్ మరియు ఇతర కార్యక్రమాలకు సమయం సరిపోయింది కనుక వికీపీడియాను గురుంచి ప్రాజెక్టులను గురుంచి తగినంత చర్చ జరగలేదు. సభ్యులు మాత్రమే పాల్గొనేలా ప్రజెక్టు గురించి చర్చించుకునేలా కొన్ని సమావేశాలు జరిగితే బాగుంటుంది. 3 మాసాలకు ఒకమారు అయినా సభ్యులు కలిసి చర్చించుకుంటే బాగుంటుంది. ఇందుకు అవసరమైన నిధి సాహాయం ఉంటే బాగుంటుందని భావిస్తున్నాను. అంతేకాక విశ్వనాధ్ మరియు అహ్మద్ నిసార్ మరియు Rajasekhar1961 గారి అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను. --t.sujatha (చర్చ) 03:11, 22 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

మనం ఇలా చేయవచ్చా?[మార్చు]

సభ్యులు క్రింది విషయాలు చదివి, తమ తమ అభిప్రాయాలు తెలుపేది. ఇది సంభవమేనా అంటే, ప్రస్తుతానికి జవాబు లేదు, సంభవం కాగలదా అంటే, ప్రయత్నం చేయవచ్చు, సామూహిక ప్రాజెక్టుల రూపంలో అడిగే ఆస్కారమున్న యెడల ప్రపోజ్ చేద్దాం, లేదంటే కూడా పరవాలేదు. ఓ మంచి ప్రపోసల్ తెలుగు కమ్యూనిటీ నుండి వికీమీడియాకు వచ్చినట్టే.

వికీ ప్రాజెక్టులు[మార్చు]

ఇంతవరకూ ఏ వికీ కమ్యూనిటీ చేయనటువంటి సామూహిక ప్రాజెక్టుల కార్యక్రమం మనం చేయవచ్చు. వికీమీడియా ఫౌండేషన్ దీనిని ఓ వినూత్న ఐడియా గానూ గుర్తించే అవకాశాలు మెండుగా వున్నాయి. ఇందుకు మనము ఈ ప్రాజెక్టుల గూర్చి ఇక్కడే చర్చించి అప్లై చేసుకునేలా చూడాలి. బహుశా సభ్యులకు ఈ ప్రపోజల్ వింతగా తోచవచ్చు, పెయిడ్ వర్క్ గానూ కనబడవచ్చు. కానీ, తెవికీను వేగవంతంగా ఓ రూపాన్ని ఇచ్చుటకు ఇది ఒక చక్కని కేటలిస్ట్ గా ఉపయోగపడవచ్చు. చర్చించడంలో తప్పు లేదు. వికీమీడియాను ఒప్పించగలిగే సబ్జెక్ట్ మనదగ్గర వుంటే ఈ ప్రాజెక్టులకు ఫండింగ్ అప్రూవ్ కావచ్చేమో.

తెవికీ ప్రాజెక్టులు : సభ్యులు, లీడర్ల పేర్లు ఉదాహరణకు మాత్రమే. సభ్యలు చర్చించి, వారికి అనువైన, ఇష్టమైన విషయాలను కోరుకోవచ్చు.

సమన్వయ కర్త : వైజా సత్య / రాజశేఖర్ / సుజాత
ప్రాజెక్ట్ డైరెక్టరు : విష్ణు / అహ్మద్ నిసార్ / విశ్వనాథ్
సహాయ డైరెక్టర్లు : వెంకటరమణ (లోహిత్) / సుల్తాన్ ఖాదర్ / పవన్ సంతోష్ / చంద్రకాంతరావు
టెక్నికల్ డైరెక్టర్లు : అర్జున్ రావ్ / రహ్మానుద్దీన్
థింక్ ట్యాంక్ : వైజా సత్య / సుజాత / సుల్తాన్ ఖాదర్ / అహ్మద్ నిసార్ / పవన్ సంతోష్
పి.ఆర్.ఓ. : అర్జున్ రావ్ / విశ్వనాథ్ / కశ్యప్
సంఖ్య ప్రాజెక్టు కవర్ చేయవలసిన విషయాలు ప్రాజెక్టు లీడరు సభ్యులు కవర్ చేయవలసిన జిల్లాలు ప్రదేశాలు బడ్జెట్
1 ఆం.ప్ర. ఓడరేవులు, తీరప్రాంతాలు, ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు లోహిత్ గారు సుల్తాన్ ఖాదర్ గారు (ఇంకా ఇద్దరు)
2 ఆంధ్ర ప్రదేశ్ కోటలు, చారిత్రిక ప్రదేశాలు, పర్యాటక ప్రదేశాలు జిల్లాల వారిగా కోటలు, చారిత్రిక ప్రదేశాలు, దర్శనీయ స్థలాలు, వాటి సమాచారాలు, చిత్రాలు. ఆర్కియోలాజికల్ సర్వ్ ఆఫ్ ఇండియా, టూరిజం శాఖ మరియు రెవెన్యూ శాఖల గెజిటీర్ నుండి సేకరించిన మూలాలు మరియు ఇతర మూలాలు. విశ్వనాథ్ గారు కశ్యప్, అహ్మద్ నిసార్, భాస్కర నాయుడు గారు,
3 తెలంగాణ ప్రభుత్వ పరిపాలన, నదులు, ప్రాజెక్టులు, జిల్లాల వారిగా ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థ, నదులు, ప్రాజెక్టులు, దర్శనీయ స్థలాలు చంద్రకాంతరావు నాయుడిగారి జయన్న మరియు ఇద్దరు
4 ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం జిల్లాల వారిగా ముస్లిం సమూహాలు, సాంస్కృతిక స్థలాలు, కోటలు, చారిత్రిక ప్రదేశాలు, దర్శనీయ స్థలాలు, వాటి సమాచారాలు, చిత్రాలు. ఆర్కియోలాజికల్ సర్వ్ ఆఫ్ ఇండియా, మైనారిటీ శాఖ మరియు రెవెన్యూ శాఖల గెజిటీర్ నుండి సేకరించిన మూలాలు మరియు ఇతర మూలాలు. అహ్మద్ నిసార్ సుజాత గారు, పవన్ సంతోష్, సుల్తాన్ ఖాదర్, రహమతుల్లా గార్లు
5 ఆంధ్ర ప్రదేశ్ నదులు , సరస్సులు, సెలయేర్లు, జలపాతాలు జిల్లాల వారిగా నదులు, ప్రవహించు ప్రదేశాలు, పుట్టుక, కలయికలు, నదీ పరివాహక ప్రాంతాలు, డెల్టాలు, వగైరాలు అర్జున్ రావు లేదా రవిచంద్ర గారు రవిచంద్ర, పాలగిరి, స్వరలాసిక
6 తెలంగాణా కోటలు, చారిత్రిక ప్రదేశాలు జిల్లాల వారిగా కోటలు, చారిత్రిక ప్రదేశాలు, దర్శనీయ స్థలాలు, వాటి సమాచారాలు, చిత్రాలు. ఆర్కియోలాజికల్ సర్వ్ ఆఫ్ ఇండియా, టూరిజం శాఖ మరియు రెవెన్యూ శాఖల గెజిటీర్ నుండి సేకరించిన మూలాలు మరియు ఇతర మూలాలు. రాజశేఖర్ గారు నాయుడు గారి జయన్న, ప్రణయరాజ్, శశి

ఫౌండేషన్ ఫండింగ్ తెవికీ (కమ్యూనిటీ) సమూహానికి డైరెక్ట్ గా వుండాలి. దీనికొరకు, 5-6 ప్రాజెక్టులకు పాజేక్ట్ కో-ఆర్డినేటర్ మరియు కోర్ కమిటీ నియుక్తి చేసుకోవాలి. ప్రస్తుతం వున్న ఆక్టివ్ వికీపీడియనులను భాగస్వామ్యం చేస్తూ ప్రాజెక్టులను డిజైన్ చేసుకోవాలి. వికీ ఫౌండేషన్ కు తెవికీ కమ్యూనిటీ (ఈ నెలలో ఓపెనింగ్స్ వున్నాయి) తరపున సామూహిక ప్రాజెక్టుల కొరకు కన్విన్స్ చేసి ప్రాజెక్ట్ ఫండింగ్ అప్రూవ్ చేసుకోవాలి. 6 నుండి 12 నెలల కాలంలో ఈ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలి. అపుడు తెవికీకి ఓ రూపు రేఖలు తీసుకు రావచ్చు.

అలాగే ఈ పేజీ కమ్యూనిటీ కన్సల్టేషన్ 2014 చర్చా పేజీలో ఇతర సభ్యులు వ్యక్తపరచిన అభిప్రాయాలను చూస్తే, మేము (తెవికీ సమూహం) ఈ ప్రాజెక్టులను ముందుంచితే, అప్రూవ్ అయ్యే అవకాశాలు మెండుగా వున్నాయి. సభ్యులు చురుగ్గా చర్చలో పాల్గొంటారని ఆశిస్తున్నాను. అహ్మద్ నిసార్ (చర్చ) 12:13, 10 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ సమూహపు అధికారికసిఫారసులు[మార్చు]

"వికీపీడియా:భవిష్యత్తులో తెలుగు వికీమీడియా పురోగతి" కొరకు, కమ్యూనిటీ కన్సల్టేషన్ - 2014 బెంగళూరు సమావేశం కొరకు, మన సమూహం తరపునుండి అధికారికంగా కొన్ని నిర్ణయాలు, రెకమెండేషన్లు చేయాల్సి వుంటుంది. మరియు ఇక్కడ వ్రాయాల్సి వుంటుంది. కావున సభ్యులందరూ ప్రతిస్పందించి తమ సిఫారసులను క్రింద వ్రాయవలసినదిగా మనవి. రాజశేఖర్ గారు, విశ్వనాథ్ గారు నేను తమ తమ అభిప్రాయాలను పైన తెలిపాము. అలాగే మీరునూ నిర్దిష్టమైన సిఫారసులను వ్రాసేది. అహ్మద్ నిసార్ (చర్చ) 12:27, 27 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

పైన జరిగిన చర్చల ఫలితాలుగా కొన్ని సిఫారసు విషయాలు క్రింద వ్రాస్తున్నాను, వాటివల్ల కొంచెం అవగాహన కలగవచ్చు. సభ్యులు ఇంకనూ చేర్చవచ్చు. చేర్చడం పూర్తయిన తరువాత, వాటిని క్రింది ఆంగ్లవిభాగంలో చేరుద్దాం. ఆతరువాత ఆఖరులో వాటిక్రింద సంతకాలు చేద్దాం. అహ్మద్ నిసార్ (చర్చ) 18:20, 27 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  1. స్తబ్దుగా వుండే వికీ సమూహానికి ప్రేరణ కల్పించడానికి, సరైన ప్రచార విధివిధానాలు నిర్వహించుటకు “తెలుగు చాప్టర్” ను ఏర్పాటు చేసి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కల్పించాలి.
  2. తెలుగు వికీ సమూహానికి ప్రత్యేకంగా “తెలుగు చాప్టర్” కావాలి.
  3. పెండింగ్ లో వున్న అనేక ప్రాజెక్టులకు త్వరితగతిన పూర్తిచేయుటకు వికీమీడియా ఫౌండేషన్ మరియు ఇండియా చాప్టర్ నుండి ప్రత్యేక ఆర్ధిక సహాయం కావాలి.
  4. వాడుకరులలో ఉత్సాహం నింపడానికి 3 నెలలకోసారి రిఫ్రెష్ మెంట్ ప్రోగ్రాములు, ఓరియంటేషన్ ప్రోగ్రాములు నిర్వహించాలి.
  5. వివిధ ప్రాజెక్టుల నమూనాలను తయారు చేసి, వాటిని వికీమీడియా ఫౌండేషన్ వనరులద్వారా అమలులోకి తేవాలి.

India Community Consultation 2014[మార్చు]

Telugu community members discussed resolved as follows, and to be considered as

official recommendations of the Telugu community
  1. To inspire and catalyze and to work independently, the Wikimedia shall give full fledged authorities to Telugu community.
  2. Telugu Wikipedia needs a separate “Telugu Chapter”, supported and funded by the Wikimedia.
  3. To complete many pending projects in Telugu Wikipedia such as, Wikisource, Wicktionary, funds are required. To complete them in a given short time, Wikimedia Foundation and India chapter shall come forward for funding to make them update.
  4. To inspire the current Editors and to invite new editors, Wikimedia shall organize refreshment courses and seminars quarterly and regularly at different places of Andhra Pradesh and Telangana with new innovative ideas according to Wikitrends.
  5. To frame new ideas and projects and implement them through Wikimedia.