వికీపీడియా:వికీప్రాజెక్టు/అనువాద ఉపకరణంతో వ్యాసరచన ఋతువు 2020

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంగ్ల వికీపీడియాలో 2020 అక్టోబరు నాటికి 61 లక్షల పైచిలుకు వ్యాసాలు ఉన్నాయి. వాటిలో 32 వేలకు పైగా మంచి వ్యాసాలు, 5 వేల 8 వందలు దాటి విశేష వ్యాసాలూ ఉన్నాయి. మరోపక్క, మనం అభివృద్ధి చేసుకుని వాడుకోవడానికి అనువాద ఉపకరణం ఒకటి ఉంది. ఆ వ్యాసాల్లో కొన్నిటిని ఈ ఉపకరణంతో అనువదిస్తూ పోతే, ఇదీ మెరుగుపడుతుంది, అవీ తెలుగులోకి వస్తాయి.
వర్ష ఋతువులో మన దగ్గర ఉన్న మొలకల్లో రెండు వేలు చకచకా మెరుగుపరిచేశాం, శభాష్ అనిపించుకునేలా. శరదృతువు వచ్చేసింది. ఈ అక్టోబరు నెలలో హాయిగా అనువాద ఉపకరణం వాడి అనువాదాలు చేసుకుందాం. అనువాద ఉపకరణాన్ని వాడుతూ చక్కని నాణ్యమైన అనువాదాలను చేయడానికి ఈ ఋతువే తగిన తరుణం. కాబట్టి, ఉపకరణాన్ని వంటబట్టించుకుందాం, ఉపకరణానికి మెరుగైన అనువాదాన్ని వంట బట్టిద్దాం. భుజంభుజం కలిపి పనిచేస్తూ తెలుగు వికీపీడియాలో చక్కని అనువాదాలు చేద్దాం.

ప్రాజెక్టు లక్ష్యాలు 

[మార్చు]
  • ప్రత్యేక:ContentTranslation ఉపకరణాన్ని ఉపయోగించి అనువదించి భాషాపరంగా నాణ్యమైన, సమాచార పరంగా చక్కని స్థాయిలో ఉన్న వ్యాసాలను తెలుగు వికీపీడియాలో తయారుచేయడం ప్రాజెక్టు లక్ష్యం.
  • ప్రాజెక్టు గరిష్ఠ లక్ష్యం - 300 వ్యాసాలు ఉపకరణం వాడి అనువదించడం.
  • ప్రాజెక్టు కనీస లక్ష్యం - 150 వ్యాసాలు.
  • ప్రాజెక్టు గడువు - భారత ప్రామాణిక సమయం సెప్టెంబర్ 30, సాయంత్రం 4.30 నుంచి నవంబరు 1 ఉదయం 7.30 వరకు చేసిన అనువాదాలు పరిగణనలోకి వస్తాయి. [1]

నియమాలు

[మార్చు]
  • మీరు అనువాద ఉపకరణంతో కొత్త వ్యాసం సృష్టించవచ్చు, లేదంటే ఒక అతి చిన్న వ్యాసాన్ని (2500 బైట్ల కన్నా చిన్నది ఇక్కడ అతిచిన్న అన్నదానికి నిర్వచనంగా పరిగణిద్దాం) తీసుకుని సంబంధిత ఆంగ్ల వ్యాసం నుంచి దానిలోకి అనువాద ఉపకరణం ద్వారా అనువదించిన కంటెంట్ ప్రచురించినా అర్హత ఉన్నదే అవుతుంది. ఐతే, కనీసం 10,000 బైట్లన్నా మీరు చేర్చిన పాఠ్యం ఉండాలి.
  • వ్యాసాన్ని అనువాద ఉపరణం వాడి, అనువాద ఉపకరణంలోనే ముఖ్యంగా అనువదించి, దాని నుంచే కంటెంట్‌లో ఎక్కువ భాగం ప్రచురించి ఉండాలి. స్పష్టంగా చెప్పాలంటే, మీరు సమర్పించే తెలుగు వికీపీడియా వ్యాసంలో కనీసం 80 శాతం అనువాద ఉపకరణం నుంచే అనువదించి ఉండాలి. మిగిలిన 20 శాతం మార్పులు ఉపకరణం నుంచి కాక బయట నుంచి చేసినా ఫర్వాలేదు. అంటే పైన చెప్పినట్టు మీరు 10,000 బైట్ల వ్యాసాన్ని సృష్టించి ఉంటే అందులో 8 వేల బైట్లు ఉపకరణంలోనే అనువదించి అక్కడ నుంచి ప్రచురించి ఉండాలి.
  • వ్యాసంలో వ్యాకరణ దోషాలు, అసహజ అనువాదం, శైలి పరమైన దోషాలు, అక్షర దోషాలు ఉండకూడదు. ఒక్కమాటలో చెప్పాలంటే వ్యాసంలోని భాష సహజమైన తెలుగులోనూ, వికీశైలిలోనూ ఉండాలి.

పాల్గొనేవారు

[మార్చు]

తెలుగు వికీపీడియాలో చురుగ్గా ఉన్న వాడుకరులందరూ ఇందులో పాల్గొని చక్కని అనువాదాలు చేయాలని విజ్ఞప్తి. తాము విస్తరించిన వ్యాసాల వివరాలను "కృషి వివరం" అనే పేజీలో చేర్చగలరు.

  1. --పవన్ సంతోష్ (చర్చ) 13:40, 3 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  2.  – K.Venkataramana  – 13:55, 3 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  3. --యర్రా రామారావు (చర్చ) 14:59, 3 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  4. -- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 19:15, 3 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  5. చదువరి (చర్చరచనలు)
  6. --ప్రభాకర్ గౌడ్ నోముల(చర్చ)06:13, 21 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వివరాలు

[మార్చు]
  1. అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 31 అన్నదే ప్రాజెక్టు గడువు అయినా భారత కాలమాన ప్రకారం కాకుండా ప్రపంచంలో మొదట సూర్యోదయమయ్యే ప్రాంతపు సమయం నుంచి ప్రారంభించి, ఆఖరున సూర్యాస్తమయం అయ్యే సమయం వరకూ దీన్ని విస్తరించాం