వికీపీడియా:వికీప్రాజెక్టు/క్రికెట్ 2023/సమీక్ష
Jump to navigation
Jump to search
112 రోజుల పాటు సాగిన ప్రాజెక్టు ముగిసింది. విజయవంతంగా ముగిసింది. అనుకున్న లక్ష్యానికి రెండుంబాతిక రెట్లు సాధించి తెవికీ ప్రాజెక్టుల చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ ప్రాజెక్టులో పాల్గొన్నవారంతా తమ అనుభవాలను, దీని రూపకల్పన, నిర్వహణ లోని బాగోగులనూ కలబోసుకుంటే భవిష్యత్తు ప్రాజెక్టులకు ప్రయోజనకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ సమీక్ష.
- ప్రణయ్‌రాజ్ వంగరి
- చదువరి
- యర్రా రామారావు
- కె.వెంకటరమణ
- Kasyap
- V.J.Suseela
- Nskjnv
- పవన్ సంతోష్
- Divya4232
- V Bhavya
- KINNERA ARAVIND
- Pravallika
- Rajasekhar1961
మీరంతా మీమీ అభిప్రాయాలను ఒక ప్రత్యేక విభాగంగా పెట్టి రాయవలసినది. ప్రాజెక్టు నిర్వహణలో బాగున్నవి ఏంటి, బాగులేనివి ఏంటి అనేది నిర్మొహమాటంగా రాయవలసినది. ఇకపై చెయ్యాల్సిన పనుల గురించి, మీరు ఏయే పనులు చెయ్యదలచారు వంటివి కూడా రాయండి.
ప్రాజెక్టు పేజీలో ఈసరికే రాసినవి ఇవి. ఇవి రాయకూడదని కాదు, మీకు తోచినవన్నీ రాయండి. అవి ఈ జాబితాలో ఉన్నా పర్లేదు, ఇతరులు రాసి ఉన్నా పర్లేదు. మళ్ళీ రాయండి.
- ప్రాజెక్టు ఎక్కువమంది వాడుకరులు పాల్గొనేలా ఆకర్షించలేకపోయింది. మరో పది మందైనా పాల్గొని ఉంటే బాగుండేది. ప్రాజెక్టు జరుగుతున్న కాలం లోనే కొందరు క్రికెట్ వ్యాసాలు రాసినప్పటికీ, వాళ్ళు ప్రాజెక్టులో భాగం కాలేదు, ఆ వ్యాసాలను ప్రాజెక్టులో భాగం చెయ్యలేదు. కారణం తెలీదు. అది ప్రాజెక్టు నిర్వాహకుల వైఫల్యమే.
- ప్రాజెక్టు మొదలైనపుడు ఒక సమావేశం పెట్టుకుని ఉంటే బాగుండేది.
- ఒక ప్రత్యేక లక్ష్యంతో తలపెట్టిన ప్రాజెక్టులలో ఏకరూపత ఉండేలా కొన్ని నియమాలు, సంప్రదాయాలను నెలకొల్పుకోవాలి. ఈ ప్రాజెక్టులో అలా కొన్ని చేసి ఉండాల్సింది. ఉదాహరణకు
- అనువాద సంప్రదాయాలు: బ్యాట్స్‌మన్ ను బ్యాటరు అనడం వంటి సర్వసాధారణ విషయాలను ముందే చెప్పుకుని ఉండాల్సింది.
- డూప్లికేషను: ఒకరి కంటే ఎక్కువ మంది ఒకే పేజీలో పనిచేయకుండా ఉండేదుకు ముందే తగు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అది అంత ఖచ్చితంగా అమలైనట్లు కనిపించదు. కొన్ని సందర్భాల్లో ప్రాజెక్టు సభ్యులు ఇబ్బంది పడి ఉండవచ్చు.
- చాలా పేజీలు అనాథ పేజీలుగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం, వాటికి మూలంగా ఉండే ప్రధాన పేజీలు (జాబితా పేజీలు, జట్టు పేజీలు వంటివి) లేకపోవడం. ప్రాజెక్టులో భాగంగా ఆ పేజీలను సృష్టించడంపై ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఉంటే ఇన్ని అనాథలుండేవి కావు.
- భాషా నాణ్యత పరంగా కొన్ని లోటుపాట్లున్నాయి. వాటిని సవరించాల్సి ఉంది. ఉదాహరణకు తేదీ ఆకృతి.