Jump to content

వికీపీడియా చర్చ:కొత్తవారికి సహాయం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

చురుగ్గా పనిచేసే కొత్త వాడుకరులను తయారుచెయ్యడం- కొన్ని ఆలోచనలు

[మార్చు]

ఉద్దేశం

[మార్చు]

వికీపీడియాలో చురుగ్గా రాస్తూ ఉండే కొత్త వికీయులను తయారు చెయ్యడం: కొత్త వాడుకరులు నిరంతరం చేరుతూనే ఉన్నారు. రోజుకు సగటున 20 మంది దాకా చేరుతున్నారు. కానీ వాళ్ళలో నిలబడేవారు చాలా తక్కువ. అసలు లేనట్లే. చేరిన వాళ్లకు వికీ పట్ల ఆసక్తి కలిగించి, చురుగ్గా రాసే వికీయులుగా తయారుచేసేందుకు మనం కృషి చెయ్యాలి.

లక్ష్యం: 2019 మార్చి 31 నాటికి కొత్తగా 50 మంది చురుకైన వాడుకరులను తయారుచేసుకోవడం.

కొత్త వాడుకరులు వికీలో రాయక పోవడానికి కారణాలు

[మార్చు]
  1. ఇక్కడ మనమూ రాయొచ్చనే సంగతి తెలియకపోవడం.
  2. చదవడమే గానీ రాయడంలో ఆసక్తి ఉండి ఉండకపోవడం.
  3. ఆసక్తి ఉన్నా ఎలా రాయాలో ఎక్కడ రాయాలో తెలియకపోవడం, ఏం రాస్తే ఏమవుతుందో ననే బెరుకు ఉండడం.
  4. కొరవడిన ప్రోత్సాహం: కొత్తవారికి ప్రోత్సాహం సరిగ్గా ఇవ్వడం లేదు. స్వాగత సందేశం ఒకటి పెట్టేసి, ఊరుకుంటున్నామంతే.
  5. వికీ ఆకృతి: కొత్తవారికి వికీ ఒక ప్రహేళిక, ఈ పేరుబరులేంటో, ఈ లింకులేంటో.. అంతా తికమక. నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అనుభవం కలిగిన వికీ వాడుకరులు నేర్పిస్తే త్వరగా అలవాటౌతుంది.
  6. సాంకేతికత: వికీ సాంకేతికత ఇతర ఇంటరాక్టివ్ సైట్లతో పోలిస్తే, సంక్లిష్టంగా ఉంటుంది. ముందు నేర్చుకోవాల్సింది కొంత ఉంది. కొత్తవారు స్వయంగా నేర్చుకునే కంటే, ఎవరైనా పూనుకుని నేర్పిస్తే తొందరగా నేర్చుకుంటారు.

మనమేం చెయ్యాలి

[మార్చు]
  1. పాత వాడుకరులు ముందుకు వచ్చి కొత్తవారికి చురుగ్గా సాయం చెయ్యాలి.
  2. స్వాగత సందేశం: స్వాగత సందేశాన్ని సంస్కరించాలేమో చూడాలి.
  3. ప్రతి ఒక్కరికీ విడివిడిగా ఈమెయిలు రాయాలి. మెయిల్లో ఉండాల్సినవి:
    1. ఇక్కడ మీరూ రాయవచ్చు.
    2. రాసేందుకు మీకు అన్ని విషయాలూ తెలిసి ఉండకపోవచ్చు. తెలిసిన విషయాన్నే రాయండి. లేదా తెలుసుకొని రాయండి.
    3. మీకు ఇక్కడ రాయడంలో సాయపడేందుకు ఫలానా వాడుకరి సిద్ధంగా ఉన్నారు. మీ సందేహాలను వారితో చర్చించండి
  4. పాత వాడుకరులు ఒక్కొక్కరు కొందరు కొత్తవారిని దత్తత తీసుకుని వారితో కలిసి పని చెయ్యాలి. గురువాడుకరిలా మారి తమ శిష్యులకు నేర్పించాలి. ఒక్కొక్కరూ ఐదుగురి వరకూ దత్తత తీసుకోవచ్చనుకుంటాను.
  5. కొత్తవారు తప్పులు చేసినపుడు సదరు గురు వాడుకరి మాత్రమే సరిదిద్దాలి.
  6. అలా ఒక యాభయ్యో వందో దిద్దుబాట్లు చేస్తే కొత్తవారికి అలవాటౌతుంది. కొనసాగుతారు. ఆ తరవాత వాళ్ళు మరిన్ని వికీ నియమాలను నిబంధనలనూ నేర్చుకుంటారు.

కొన్ని సూచనలు

[మార్చు]
  1. దత్తత తీసుకున్న వాడుకరికి ముందు తన అభిరుచులను స్థాపించుకోమని చెప్పాలి. ముఖ్యంగా విజువల్ ఎడిటరును ఎంచుకోవాలి.
  2. వికీ ఆకృతి గురించి చెప్పాలి. విశ్వనాధ్, పవన్ సంతోష్ గార్లు చెప్పినట్టు దీనికోసం ఒక చక్కటి వీడియో తయారు చేసుకోవాలి.
    1. తెలుగులో రాయడం ఎలాగో చెప్పాలి. ఇందుకు వికీలో ఉన్న సౌకర్యం గురించి చెప్పాలి. ఇంగ్లీషు తెలుగుల మధ్య ఎలా మారాలో చెప్పాలి.
    2. పేరుబరి గురించి చెప్పాలి. రకరకాల పేరుబరులున్నాయనీ, ప్రస్తుతానికి మొదటి పేరుబరిలోను, చర్చ పేరుబరి లోనూ మాత్రమే పనిచెయ్యాలనీ మిగతా వాటిలో నిదానంగా ప్రవేశించవచ్చనీ చెప్పాలి. వాటి ఉద్దేశం, ఆకృతి మొదలైన వాటి గురించి చెప్పాలి.
    3. లింకులివ్వడం ఎలా, విభాగాలను చెయ్యడం ఎలా.. వంటి మౌలిక మైన అంశాల గురించి చెప్పాలి.
  3. వాడుకరికి ఇష్టమైన అంశాలేమిటో తెలుసుకుని సంబంధిత వ్యాసాలను వారికి పరిచయం చెయ్యాలి. వాటిలో అవసరమనుకున్న మార్పులను చెయ్యమని ప్రోత్సహించాలి.
  4. అలాగే సాధారణంగా ఏయే విషయాల గురించి రాయవచ్చో చెప్పాలి. ఉదా:
    1. గ్రామ వ్యాసాలు
    2. సినిమా వ్యాసాలు
    3. ప్రసిద్ధుల వ్యాసాలు
    4. సాహిత్యానికి సంబంధించిన వ్యాసాలు
  5. తనకు ఇష్టమైన విషయాలను గురించి మరింతగా తెలుసుకునేందుకు వీలైన మూలాలను చూపించాలి.

మరిన్ని

[మార్చు]
  1. దీన్ని ఒక ప్రాజెక్టుగా నిర్వహించుదాం.
  2. ప్రస్తుతం చురుగ్గా లేని పాత వాడుకరులను ఈ ప్రాజెక్టుకు దోహదం చెయ్యాలని విజ్ఞప్తి చేద్దాం.
  3. ఎంతమంది శిష్యులను చురుకైన వికీయులుగా తయారు చేసామనే విషయంలో పోటీ కూడా పెట్టుకుందాం.
  4. ప్రతి రెండు మూడు నెల్లకోసారి గొప్ప గురువులను సన్మానించుకుందాం.

__చదువరి (చర్చరచనలు) 06:48, 12 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

చురుకుగా వ్రాయాలని ఆసక్తి కలిగిన సభ్యులు

[మార్చు]

చురుకుగా వికీలో వ్రాయని ఆసక్తి ఉన్న కొత్త సభ్యులు ఇక్కడ సంతకం చేయండి. తరువాత మీరు కోరుకున్న అనుభవం కలిగిన సభ్యులను గురువులా ఎంచుకుని వారిని అభ్యర్ధిస్తూ చర్చాపేజీలో సంప్రదింపులు జరపండి. అంగీకారం కుదిరిన తరువాత ముందుకు సాగండి.

దత్తత తీసుకుని గురువుగా అంగీకారం

[మార్చు]

గురువుగా అంగీకరించి కొత్తసభ్యులను దత్తత తీసుకుని మార్గదర్శకం చేయడానికి అంగీకారం తెలిపే సభ్యులు ఇక్కడ సంతకం చేయండి. అలా చేస్తే కొత్తసభ్యులకు ఎవరితో సంప్రదించాలో తెలుస్తుంది.కొత్త సభ్యులు మీరు కోరుకున్న అనుభవసభ్యుల సంతకం ప్రక్కన సంతం చేయండి. అప్పుడే మీకు సహాయం అవసరమని తెలుస్తుంది.ముందుగా దత్తత తీసుకోవడానికి అంగీకారం తెలియజేస్తూ నేను ఇక్కడ సంతకం చేస్తున్నాను.

  1. T.sujatha (చర్చ) 02:44, 13 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
  2. Ajaybanbi (చర్చ) 08:30, 13 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
  3. Kasyap (చర్చ) 08:51, 13 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
  4. రవిచంద్ర (చర్చ) 09:03, 13 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రాజెక్టు పేజీలోనే సంతకాలు

సుజాత గారూ! ఇక్కడ సంతకాలు చేసినవారి పేర్లను ప్రాజెక్టు పేజీలో చేర్చాను. ఇకపై ఎవరైనా సంతకాలు చేయదలుచుకుంటే ప్రాజెక్టు పేజీలో సాయంపట్టేవారన్న విభాగంలో సంతకాలు చేస్తే సరి. ఈ చర్చ పేజీని చర్చలకే కేటాయిద్దాం. అలానే మరో విషయం ఆసక్తి ఉన్న సభ్యులు ఇక్కడదాకా వచ్చి చూసే వీలు ఉండదు. ఆ పని నేను పెట్టుకుంటాను. గురువులకు, శిష్యులకు మధ్య సంప్రదింపులు మొదలయ్యేవరకూ సమన్వయం నేను (నాలా ఎవరైనా ముందుకు వస్తే వారూను) చేసిపెడతాను. సరేనాండీ! --పవన్ సంతోష్ (చర్చ) 12:36, 13 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

స్వాగతసందేశంలో మార్పులు

[మార్చు]

ఇలా గురువుగా స్వీకరించే అవకాశం ఉందని స్వాగతసందేశంలో సమాచారం చేర్చి ఈ ప్రాజెక్ట్ పేజీ లింకు చేర్చినట్లైతే కొత్త సభ్యులు సులువుగా సంహాయం అందుకోవడానికి వీలుగా ఉంటుంది.