వికీపీడియా చర్చ:తెలుగు వికీపీడియా సామాజిక వేదికల మార్గదర్శకాలు
తెలుగు వికీపీడియా సామాజిక మాధ్యమాల నిర్వహణపై పాలసీ చర్చ
[మార్చు]గమనిక: ఈ పాలసీ చర్చ మార్గదర్శకాల ఏర్పాటుకు మూలం. దీన్ని రచ్చబండ నుంచి కాపీ పేస్ట్ చేశాను. --పవన్ సంతోష్ (చర్చ) 13:09, 10 అక్టోబరు 2017 (UTC)
ఫేస్ బుక్, ట్విట్టర్ మాధ్యమాల్లో తెలుగు వికీపీడియాకు ఖాతాలు ఉన్నాయి. ఈ ఖాతాలను ఆసక్తి కలిగిన వికీపీడియన్లు సృష్టించి, వికీపీడియాను విస్తృత ప్రచారానికి తెచ్చేందుకు వీలు అవుతుందని భావించిన విధంగా నడిపారు. ముఖ్యంగా మన ఫేస్ బుక్ పేజీకి ఇప్పుడు (2017 సెప్టెంబరు 1 నాటికి) 6936 మంది అనుసరిస్తున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల ప్రభావం విస్తృతమవుతున్న నేపథ్యంలో ఈ ఖాతాల నిర్వహణలో క్రమాన్ని తెలుగు వికీపీడియా సముదాయం తీసుకువస్తే బావుంటుందని భావిస్తున్నాను. దీనికి కొన్ని ఆలోచనలు, ఈ కింది ఆలోచనలు నా తొలి ప్రతిపాదనలుగా భావించండి, దీనిపై సముదాయ సభ్యులు ఎలాంటి సవరణలు అయినా సూచించవచ్చును, చర్చించి నిర్ణయించుకుందాం:
- సామాజిక మాధ్యమాల్లో వికీపీడియా నిర్వహణకు తెలుగు వికీపీడియాలో ఓ ప్రత్యేకమైన పేజీ రూపొందించుకోవాలి.
- ఈ కృషికి ఏయే ఫలితాలను ఆశిస్తున్నామో మనం నిర్ణయించుకోవాలి: నా వరకూ నేను తెలుగు వికీపీడియాలోని సమాచారం, దాని నాణ్యత, వైవిధ్యం, సముదాయం వంటివాటిని ప్రాచుర్యంలో పెట్టేందుకు (రీచ్) ప్రాథమిక లక్ష్యంగా, సామాజిక మాధ్యమాల్లో అనుసరించేవారు తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల వరకూ వచ్చి రాయడం అన్నది ద్వితీయ లక్ష్యంగా భావిస్తున్నాను.
- ఇక్కడ సామాజిక మాధ్యమాలకు సంబంధించి ఏయే అంశాలపై ఎలాంటి పోస్టులు పెట్టవచ్చో సూత్రప్రాయంగా చర్చించి నిర్ణయించుకుంటే అది ఆ పేజీలో ప్రముఖంగా కనిపించాలి. పాలసీలో సామాజిక మాధ్యమాల పేజీల్లో, హ్యాండిళ్ళలో ఎలాంటి సమాచారాన్ని ప్రచురించవచ్చు, ఎలాంటి సమాచారాన్ని ప్రచురించరాదు, ఎవరైనా వికీపీడియా ఫేస్ బుక్ పేజీలోనో, ట్విట్టర్ హ్యాండిల్ ద్వారానో ఓ సమాచారాన్ని పంపదలుచుకుంటే ఎక్కడ కోరాలి, మనం ప్రచురించిన సమాచారంపై వచ్చే అనుబంధ ప్రశ్నల కామెంట్లకు సమాధానం ఇవ్వొచ్చా మొదలు ముఖ్యమైన సామాజిక మాధ్యమ నిర్వహణ పాలసీలు ఉండాలి. వేరే పేజీల నుంచి సమాచారాన్ని పున:ప్రచురించదలిస్తే ముఖ్యమైన నిబంధన ఏమిటి వంటి విషయాలను కూడా నిర్ధారించాలి.
- తెలుగు వికీపీడియా సామాజిక ఖాతాలను నిర్వహించే ఆసక్తి ఉన్నవారు ఇక్కడే తమ పేర్లతో సైన్-అప్ అవుతారు, ఇక్కడ సైనప్ అయినవారికే సామాజిక మాధ్యమాల్లో నిర్వహణ అప్పగిస్తాం.
- నిర్వహణా బాధ్యతలు చేసేవారు దుర్వినియోగపరిస్తే ఆ విషయాన్ని తెలుగు వికీపీడియాలోని సామాజిక మాధ్యమాల పేజీలో నమోదు చేసి, వారిని హెచ్చరించి, హెచ్చరిక ఫలించకుంటే తొలగించాలి.
మూడవ పాయింట్లో చెప్పిన మార్గదర్శకాల విషయమై ఇదిగో ఇలా ప్రతిపాదిస్తున్నాను:
- ప్రస్తుతం చరిత్రలో ఈరోజు, మీకు తెలుసా వంటివాటిని ప్రణయ్ చాలా చక్కగా క్రమం తప్పకుండా వికీపీడియా యాప్లో వచ్చే "షేర్-ఎ-ఫ్యాక్ట్" టూల్ ఉపయోగించి పోస్ట్ చేస్తున్నారు. ఇది కొనసాగించాలి.
- నెలకు ఒక వికీపీడియన్ చేసిన కృషిని గుర్తించి వారి గురించి కథనం, ఏవీ లాంటివి ఉపయోగించి ప్రాచుర్యం కల్పించాలి. ఈ కృషిలో ప్రధానంగా వారిని గౌరవించుకోవడం అన్న లక్ష్యం కన్నా, వారిలాంటి వృత్తిలో, వయసులో, సామర్థ్యంతో ఉన్నవారికి అరె మనమూ చేయొచ్చు కదా అన్న భావన కల్పించడం ముఖ్యం. కాబట్టి ప్రధానంగా ఒక టీచర్ ఏ సమయాన్ని ఉపయోగించుకుని వికీపీడియా ద్వారా ఏయే లక్ష్యాలను సాధిస్తున్నారు, కుటుంబ బాధ్యతలు పూర్తిచేసుకున్న ఒక జంట తమ సమయాన్ని దీనికి వెచ్చించి ఎంతటి కృషిచేస్తున్నారు, ఎలా భావితరాలకు ఆదర్శప్రాయులయ్యారు, ఒక ఉద్యోగి తనకు ఆసక్తి అయిన సినిమా రంగం గురించి సరదాగా రాయడం ద్వారానే ఎలా వికీపీడియాలో గొప్ప కృషిచేసినవారయ్యారు అన్న కోణంలో ఉండాలి. అసాధ్యమైన పనిలా మాత్రం ఎట్టిపరిస్థితిలోనూ అనిపించేలా రాయరాదు.
- తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల్లో జరుగుతున్న కృషిని - ఉదాహరణకు తెలంగాణ తేజోమూర్తులు ప్రాజెక్టు, వికీసోర్సులో ఆసక్తికరమైన చిన్ననాటి ముచ్చట్లు దిద్దుబాట్లు, అక్షరదోషాల సవరణ ఇలాంటి విషయాలపై ఫోకస్ చేసి ప్రతీ శుక్రవారం ఒక్కో కథనం అందించవచ్చు. తద్వారా జరుగతున్నదేంటో - జరగాల్సింది ఏంటో, దానిలో వారెలా పాలుపంచుకోవచ్చో తెలియజేయవచ్చు.
- తెలుగు వికీపీడియా మొదటి పేజీ శీర్షికలను వీలువెంబడి పోస్టులుగా ప్రచురిస్తూండవచ్చు.
- తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల గురించి అవుట్-రీచ్ కార్యక్రమాలు జరిగినా, వికీపీడియన్ల గురించి ఏదైనా పత్రికలో కవరేజి వచ్చినా, ఏ విధంగానైనా వికీపీడియాకు సంబంధించిన ఆసక్తికరమైన సమాచారం పంచుకున్నా దాన్ని పంచుకోవడాన్ని అనుమతించవచ్చు
చేయకూడనివి:
- సంబంధం లేని, కేవల ప్రచారపరమైన పోస్టులను ప్రచురించకూడదు.
- తటస్థ వైఖరిని తప్పకూడదు.
- వివాదాస్పదమైన ఏ పోస్టునూ చేయకూడదు.
- వికీపీడియాకు సంబంధం లేని వ్యక్తిగతమైన పోస్టులు వేయకూడదు.
దయచేసి పై ప్రతిపాదనలకు, మీ ఆలోచనలు జోడించి చర్చించవలసిందిగా కోరుతున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 09:46, 1 సెప్టెంబరు 2017 (UTC)
- అన్ని మంచి ఆలోచనలు పవన్. మనం ఎంత సమాచారం పోగుచేస్తున్నామో దాన్ని నలుగురికీ చేరేలా చేయడంలో ఎంతమాత్రం తప్పు లేదు. కాకపోతే పైన చెప్పినట్లుగా వికీ నియమాలు అన్నీ అనుసరించిన వ్యాసాలు (అంటే స్వంత రచనలు, సరైన మూలాలు, తటస్థ దృక్కోణం మొదలైనవి) మాత్రమే బయటకు వెళితే మనం చేస్తున్న పని నాణ్యమైనదని తెలిసే వీలుంది. ఇప్పటికే తెవికీ అంటే కాపీ పేస్టులనే అభిప్రాయంతో ఉన్నారు కొంతమంది.--రవిచంద్ర (చర్చ) 12:46, 1 సెప్టెంబరు 2017 (UTC)
- ఫేస్‌బుక్ పేజీలో కేవలం వ్యాసాలు మాత్రమే కాక అప్పుడపుడూ కొన్ని సాంకేతిక విషయాలు రాసి వాటిపై కొన్ని చర్చలు జరగాలి. ఇలాంటివి ఫాలోవర్స్ ను ఆకర్షిస్తాయి. వ్యాస విషయాలు కాక కొన్ని మంచి అత్యుత్తమమైన వికీ ఫొటోస్ అప్లోడ్ చేయాలి. తరచుగా అవగాహనా పరమైన కొన్ని టపాలుండాలి..అలా జనంలో వికీలో రాసేదానికి ఆశక్తి కలగొచ్చు..--Viswanadh (చర్చ) 04:12, 2 సెప్టెంబరు 2017 (UTC)
- అన్ని మంచి ఆలోచనలు పవన్. మనం ఎంత సమాచారం పోగుచేస్తున్నామో దాన్ని నలుగురికీ చేరేలా చేయడంలో ఎంతమాత్రం తప్పు లేదు. కాకపోతే పైన చెప్పినట్లుగా వికీ నియమాలు అన్నీ అనుసరించిన వ్యాసాలు (అంటే స్వంత రచనలు, సరైన మూలాలు, తటస్థ దృక్కోణం మొదలైనవి) మాత్రమే బయటకు వెళితే మనం చేస్తున్న పని నాణ్యమైనదని తెలిసే వీలుంది. ఇప్పటికే తెవికీ అంటే కాపీ పేస్టులనే అభిప్రాయంతో ఉన్నారు కొంతమంది.--రవిచంద్ర (చర్చ) 12:46, 1 సెప్టెంబరు 2017 (UTC)
నమస్కారం పవన్ సంతోష్ గారు. ముఖపుస్తకంలో తెలుగు వికీపీడియా సముదాయానికి సంబంధించి ఒక సమూహం, ఒక పుట ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా వీటినే తెవికీ సముదాయ ప్రధాన సామాజిక మాధ్యమ ప్రచార సాధనాలుగా ఉపయోగిస్తున్నాము. వాటిలో నేను తెలుగు వికీపీడియాకు సంబంధించినవి టపా చేస్తూ వస్తున్నాను. నాతోపాటు మరికొందమంది తెవికీ సభ్యులు వాటికి నిర్వాహకులుగా ఉన్నారు.అయుతే, ఒకటిరెండుసార్లు ముఖపుస్తక వికీపీడియా పుట, సమూహాల్లో తెవికీకి సంబంధంలేని టపాలు చేయబడ్డాయి. ఆ విషయం ఇతర సభ్యులకు తెలియజేసి, వెంటనే ఆ టపాలను తొలగించాను. అలాంటివి మళ్లీ జరగకూడదని, తెలుగు వికీపీడియా సామాజిక మాధ్యమాల నిర్వహణపై ఒక పాలసీ చర్చ జరగాలని భావించాను. ఆ చర్చను మీరు మొదలుపెట్టినందుకు మీకు ధన్యవాదాలు. మీ సూచనలు చాలా బాగున్నాయి. వాటికి తోడుగా నేను కొన్ని సూచనలు చేస్తున్నాను.
- తెలుగు వికీపీడియా ముఖపుస్తక సమూహా, పుటల్లో తెవికీకి సంబంధించినవే టపాచేయాలి.
- తెవికీ సభ్యులు అంగీకరించిన, తెవికీ అభివృద్ధికి ఉపయోగపడే మరియు తెవికీ సోదర ప్రాజెక్టులకు సంబంధించిన ముఖపుస్తక సమూహా, పుటలతోనే తెవికీ తెలుగు వికీపీడియా ముఖపుస్తక సమూహా, పుటలను లింక్ చేయాలి.
- మీరు పైన చెప్పినట్టుగా ప్రస్తుతం చరిత్రలో ఈరోజు, మీకు తెలుసా వంటివాటిని టపా చేయడాన్ని కొనసాగిస్తాను.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 04:40, 2 సెప్టెంబరు 2017 (UTC)
పవన్లేవదీసిన చర్చ చాలా బాగున్నది, రవిచంద్ర, విశ్వనాధ్, ప్రణయ్ ల ఆలోచనలు బాగున్నాయి. ప్రణయ్ ముఖపుస్తకంలో చేస్తున్న విధంగా నిబద్ధతతో ఈ వికీ పాలసీలకు అనుగుణంగా నిర్వహించేవారు మనకు అవసరం. నా ఆలోచనలను క్రింది తెలియజేస్తున్నాను>
- తెలుగు వికీపీడియాను నిర్వహిస్తున్న విధంగానే తెలుగు వికీసోర్స్ మరియు తెలుగు విక్షనరీ లను గురించి కూడా ప్రతి రోజూ ముఖపుస్తకంలో ఒక పోస్ట్ చేయాలి.
- తెలుగు విక్షనరీకి అక్కడ పేజీ లేకపోతే సృష్టించాలి. రోజూ ఒకపదం ప్రస్తుతం మొదటి పేజీలో నిర్వహించడం లేదు. అది తిరిగి ప్రారంభించి; అందులోని పదాన్ని ముఖపుస్తకంలో తెలియజేయవచ్చును. బొమ్మలున్న పదాలను చూపిస్తే పిల్లలకు, విద్యార్ధులకు బాగా ఉపయోగపడుతుంది.
- తెలుగు వికీసోర్స్ గురించి కూడా ముఖపుస్తకంలో లేదు. అది ప్రారంభించి, నెలకొక పుస్తకాన్ని అందులోని వివిధ అంశాలను పేజీలవారీగా లేదా ప్రకరణాల వారీగా తెలియజేయవచ్చును. కొందరు రచయితల జీవితచరిత్రలను అందించవచ్చును.
- విక్షనరీ, వికీసోర్స్ లను వారానికి ఒకసారి కాకుండా రోజువారీగానే నిర్వహిస్తే బాగుంటుంది. వీనిలో ఆసక్తి ఉన్నవారికి అవకాశం ఇద్దాము.
- వివిధ విభాగాలలో మంచి కృషిచేస్తున్న వికీపీడియన్లను గురించి కూడా ఈ మాధ్యమాల ద్వారా ప్రచారం చేయవచ్చును. వారిగురించి తెలియజేయడం వలన మరికొంతమంది తెలుగు వికీ విభాగాల్లో పనిచేయడానికి ముందుకు వస్తారని నా భావన.Rajasekhar1961 (చర్చ) 05:56, 12 సెప్టెంబరు 2017 (UTC)
-->ముగింపుకు ముందు నేనో మాట చెప్పాలి. ఆలస్యంగా చెబుతున్నందుకు మన్నించాలని కోరుతున్నాను.. ఇక్కడ వెలిబుచ్చిన ఆలోచనలన్నీ బాగున్నాయి. కానీ, ఫేస్‌బుక్‌లోగానీ, ఇతర సామాజిక మాధ్యమాల్లో గానీ వికీపీడియా కోసం చేపట్టే కార్యక్రమాలు అధికారికంగా వికీపీడియాకు సంబంధం లేనివని నా ఉద్దేశం. దాన్ని మనం స్పష్టంగా ఆయా సైట్లలో స్పష్టంగా, స్ఫుటంగా కనబడేలా ప్రకటించాలి. ఒకవేళ అవి అధికారిక పేజీలే అయితే, ఆ విషయాన్ని ముందుగా ఇక్కడ ప్రకటించగలరు.__చదువరి (చర్చ • రచనలు) 17:05, 14 సెప్టెంబరు 2017 (UTC)
- పాలసీలను అనుసరించి, ఇక్కడ నమోదు చేసుకున్న వాడుకరులు మాత్రమే నిర్వహించినప్పుడు అధికారికంగా నిర్వహించడంలో పొరబాటు ఉందంటారా? ఈ ఆలోచన ఓ సమస్య నేపథ్యంలో వచ్చింది. ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో ఇలా అనధికారికంగా నిర్వహించే అవకాశం (ఇక్కడ ఏ పాలసీ లేకపోవడంతో) ఉండడంతో తోచిన విధంగా ఆయా పేజీల నుంచి వ్యక్తిగతమైన విషయాలు పంచుకుంటూ ఉన్న సందర్భాలు ఎదురైనాయి. అలాంటి సమస్య ఎదురైనప్పుడు ఏం చేయాలన్నది ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో సచేతనంగా ఉన్న సముదాయ సభ్యుల్లో ఆలోచన రాగా, పాలసీ ఉన్నప్పుడే నియంత్రణ, ఫలప్రదమైన కృషి సాధ్యమని భావించి ఈ ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ దీన్ని అనధికారికం చేస్తే, ఎవరి ఉత్సాహాన్ని బట్టి వారు, ఎవరి ఉద్దేశాలను బట్టి వారు చెదురుమదురుగా పేజీలు రూపొందించుకుని, ఉన్న పేజీలోనూ కూడా రాసే పరిస్థితి ఏర్పడుతుంది. అదే ఇది అధికారికమనీ, దీనిని తెలుగు వికీపీడియాలో సదరు ప్రాజెక్టు పేజీలో సంతకం చేసి, అక్కడ పాలసీలకు వ్యతిరేకంగా నిర్వహించమని పేర్కొన్నవారికే అడ్మిన్, ఎడిటర్ హక్కులు ఇస్తామని పేర్కొంటే వారిని నియంత్రించడం సాధ్యపడుతుంది అని నా వ్యక్తిగత భావన. --పవన్ సంతోష్ (చర్చ) 17:28, 14 సెప్టెంబరు 2017 (UTC)
- పేజీ అనధికారికంగా ఉంటే, అక్కడ ఏం జరిగినా వికీ నేరుగా ప్రభావితం కాదు. అదే అధికారికమైతే, అక్కడ ఆ పేజీలో జరిగేదాని ప్రభావం ఇక్కడ ఉంటుందని నా ఉద్దేశం. ఉదాహరణకు, దాని గురించి రచ్చబండలో చర్చలూ జరగవచ్చు.__చదువరి (చర్చ • రచనలు) 18:04, 14 సెప్టెంబరు 2017 (UTC)
చర్చ ముగింపు కోరుతూ
[మార్చు]చర్చ ప్రారంభించి రెండు వారాలు కావస్తున్నది. సముదాయ సభ్యులు తగినంతగా స్పందించారు. మొత్తం నాలుగు స్పందనలు, వాటిలో ఒకరు సమర్థించారు, మిగతా వారు సమర్థిస్తూనే మరికొన్ని ప్రతిపాదనలు చేశారు. దీనిపై ముందుకు వెళ్ళేందుకు గాను చర్చ ప్రారంభించిన, పాల్గొన్న సభ్యులను మినహాయించి వేరెవరైనా నిర్వాహకులు క్రోడీకరిస్తూ ముగింపు పలకగరని కోరుతున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 16:24, 14 సెప్టెంబరు 2017 (UTC)
ముగింపు
[మార్చు]సామాజిక మాధ్యమాలలో తెలుగు వికీపీడియా ప్రచారానికై ఖాతాల నిర్వహణకై పవన్ సంతోష్ 5 పాయింట్లతో ఒక పాలసీ చర్చ లేవదీసారు. రవిచంద్ర పై ప్రతిపాదనలను సమర్థిస్తూనే వికీ నియమాలకు అనుగుణంగా వున్న వ్యాసాలకు మాత్రమే ఈ మాధ్యమాలలో ప్రచారం కల్పించాలని సూచించారు. Viswanadh వ్యాసాలతో పాటు సాంకేతిక అంశాలు, అవగాహన కల్పించే విషయాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. Pranayraj Vangari కూడా ఈ ప్రతిపాదనలను సమర్థిస్తూ ఇతర వికీ ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలు కాకుండా తెలుగు వికీపీడియాకు సంబంధించిన టపాలు మాత్రమే వుండాలని ఆశిస్తున్నారు. Rajasekhar1961 తెలుగు వికీసోర్సు, తెలుగు విక్షనరీలకు విడివిడిగా ఖాతాలను తెరచి వాటిని నిర్వహించాలని కోరారు. చదువరి ఈ ఖాతాల నిర్వహణ అధికారికంగానా, అనధికారికంగానా స్పష్టం చేయాలని ఒక వేళ అధికారికమైతే దాని ప్రభావం వికీపీడియాపై ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చర్చలో పాల్గొన్న సభ్యులందరూ పవన్ సంతోష్ ప్రతిపాదనలను మౌలికంగా అంగీకరిస్తున్నారు. కాబట్టి సామాజిక మాధ్యమాల్లో వికీపీడియా నిర్వహణకు తెలుగు వికీపీడియాలో ఓ ప్రత్యేకమైన పేజీ ఏర్పాటుపై పాలసీ నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తూ ఈ చర్చను ఇంతటితో ముగిస్తున్నాను.--స్వరలాసిక (చర్చ) 03:19, 16 సెప్టెంబరు 2017 (UTC)