వికీపీడియా చర్చ:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/ప్రభాకర్ గౌడ్ నోముల
స్వరూపం
వారం రోజుల వ్యవధి సరిపోదు
[మార్చు]నిర్వాహక హోదా అన్నది చాలా ముఖ్యమైనది. దీని వల్ల సభ్యునికి పలు అధికారాలు, బాధ్యతలు వస్తాయి. అలాంటి సందర్భంలో అభ్యర్థి చేసిన గత కార్యకలాపాలను పరిశీలించడం, విధానాలపై వారి అవగాహనను గమనించడం వంటివి అవసరం. వాడుకరులు ప్రశ్నలు వేయడం, అభ్యర్థి సమాధానం రాయడం, దానిపై ఆధారపడి సమర్థత, వ్యతిరేకత రాయడం - ఇదంతా జరగడం ఆరోగ్యకరం. అలాంటిది కేవలం ఒక వారం రోజుల వ్యవధిలో ఇవన్నీ జరగడం అన్నది కష్టం కనుక వారం రోజుల వ్యవధిని కనీసం మరో వారానికి పెంచమని ప్రతిపాదకులైన వాడుకరి:K.Venkataramana గారిని కోరుతున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 04:31, 14 డిసెంబరు 2020 (UTC)
- పవన్ సంతోష్ గారూ, ఇది వరకు నిర్వాహకత్వ విజ్ఞప్తులు ఒక వారం జరిగినందున అలా కాలపరిమితి విధించాను. ప్రస్తుతం విధానాలపై వారికున్న అవగాహన, గత కర్యకలాపాలపై వివరణ ఇవ్వవలసిన అవసరం ఉంది. నిర్వాహకునిగా వికీ విధానాల పట్ల అవగాహన ఎంత ఉన్నది పరిశీలించడం అవసరం ఉంది. కనుక ఈ విజ్ఞప్తిని మరొక వారం రోజులు పొడిగించడానికి నాకు అభ్యంతరం లేదు. కానీ వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి లో "ఏకాభిప్రాయం రానప్పుడు దీనిని పెంచే అధికారం అధికారులకు వుంది" అని ఉంది. వారంలో ఏకాభిప్రాయం రానపుడు ఈ కాల వ్యవధిని అధికారులు పొడిగిస్తారని భావిస్తున్నాను. ప్రదిపాదకుడు ఈ కాల వ్యవధిని పెంచవచ్చా? తెలియజేయగలరు. – K.Venkataramana – ☎ 04:47, 14 డిసెంబరు 2020 (UTC)
- వెంకటరమణ గారూ అధికారులకే పెంచే అధికారం ఉండడమూ, ప్రతిపాదకులు సాధారణంగా వారం రోజులే ప్రతిపాదన చేసే వీలే ఉండడమూ అన్నది సవ్యంగా లేవండీ. సమస్య అన్నది విధానంలోనే ఉంది కనుక నేను విధానపు చర్చా పేజీలో దీన్ని సవరించాలని ప్రతిపాదించాను. ఆ ప్రతిపాదన ఒకవేళ విజయవంతమైతే రెండువారాల గడువు తర్వాతి ప్రతిపాదనలకు ఆటోమేటిగ్గా రావాల్సి ఉంటుంది. మీ సందేహం సమంజసమే, నాకూ ఏమీ తట్టట్లేదు. దీనిపై ఎవరైనా అనుభవజ్ఞులు సమాధానం చెప్తారేమో చూద్దాం. --పవన్ సంతోష్ (చర్చ) 05:04, 14 డిసెంబరు 2020 (UTC)
- విధానాన్ని సవరించడానికి ప్రస్తుతం సమయం పడుతుంది కాబట్టీ, ఈ ప్రతిపాదనపై చర్చ, నిర్ణయం జరిగే లోపు అది జరక్కపోవచ్చు కాబట్టీ..,
- ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనపై చర్చ వారం లోపు ముగియని పక్షంలో దీన్ని పొడిగించుకుందాం.__ చదువరి (చర్చ • రచనలు) 06:56, 14 డిసెంబరు 2020 (UTC)
- వెంకటరమణ గారూ అధికారులకే పెంచే అధికారం ఉండడమూ, ప్రతిపాదకులు సాధారణంగా వారం రోజులే ప్రతిపాదన చేసే వీలే ఉండడమూ అన్నది సవ్యంగా లేవండీ. సమస్య అన్నది విధానంలోనే ఉంది కనుక నేను విధానపు చర్చా పేజీలో దీన్ని సవరించాలని ప్రతిపాదించాను. ఆ ప్రతిపాదన ఒకవేళ విజయవంతమైతే రెండువారాల గడువు తర్వాతి ప్రతిపాదనలకు ఆటోమేటిగ్గా రావాల్సి ఉంటుంది. మీ సందేహం సమంజసమే, నాకూ ఏమీ తట్టట్లేదు. దీనిపై ఎవరైనా అనుభవజ్ఞులు సమాధానం చెప్తారేమో చూద్దాం. --పవన్ సంతోష్ (చర్చ) 05:04, 14 డిసెంబరు 2020 (UTC)
- పవన్ సంతోష్ గారూ, ఇది వరకు నిర్వాహకత్వ విజ్ఞప్తులు ఒక వారం జరిగినందున అలా కాలపరిమితి విధించాను. ప్రస్తుతం విధానాలపై వారికున్న అవగాహన, గత కర్యకలాపాలపై వివరణ ఇవ్వవలసిన అవసరం ఉంది. నిర్వాహకునిగా వికీ విధానాల పట్ల అవగాహన ఎంత ఉన్నది పరిశీలించడం అవసరం ఉంది. కనుక ఈ విజ్ఞప్తిని మరొక వారం రోజులు పొడిగించడానికి నాకు అభ్యంతరం లేదు. కానీ వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి లో "ఏకాభిప్రాయం రానప్పుడు దీనిని పెంచే అధికారం అధికారులకు వుంది" అని ఉంది. వారంలో ఏకాభిప్రాయం రానపుడు ఈ కాల వ్యవధిని అధికారులు పొడిగిస్తారని భావిస్తున్నాను. ప్రదిపాదకుడు ఈ కాల వ్యవధిని పెంచవచ్చా? తెలియజేయగలరు. – K.Venkataramana – ☎ 04:47, 14 డిసెంబరు 2020 (UTC)
- వాడుకరి:రవిచంద్ర ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు చేసినపుడు అది ఏదైనా సరే మొదట ఆలోచించుకొని వేయాలి. దానికి కట్టుబడి ఉండాలి. కానీ తరువాత మన ఓటును మార్చుకొనే అవకాశం ఉందా? పరిశీలించగలరు. – K.Venkataramana – ☎ 23:49, 14 డిసెంబరు 2020 (UTC)
- తమ నిర్ణయాన్ని ఎవరైనా మార్చుకుంటే మొదటి నిర్ణయాన్నే పరిగణనలోకి తీసుకోవాలని నా అభిప్రాయం--స్వరలాసిక (చర్చ) 02:45, 15 డిసెంబరు 2020 (UTC)
- వెంకటరమణ గారూ, అభిప్రాయాన్ని మార్చుకోవచ్చని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అలా మార్చుకోకూడదని ఏదైనా నిబంధన ఉంటే అందుకు నేను కట్టుబడి ఉంటాను. రవిచంద్ర (చర్చ) 03:37, 15 డిసెంబరు 2020 (UTC)
- రవిచంద్ర గారూ, అభిప్రాయాలు మార్చుకునే నిబంధన ఉందో లేదో నాకు తెలియదు. కానీ మనం మొదట చెప్పిన విషయానికి కట్టుబడి ఉండాలి కదా. నా ఉద్దేశ్యంలో మార్చుకోకూడదనుకుంటాను. ఈ నిర్వాహక పేజీ విజ్ఞప్తిలో కూడా నిర్వాహకునిగా ప్రతిపాదిత వ్యక్తి గతంలోని ఒక ఓటింగులో ప్రతిపాదనకు వ్యతిరేకంగా ముందుగా వాఖ్యానించి తర్వాత ఓటింగులో అనుకూలంగా ఓటు చేసారనేదే కదా చర్చకు వచ్చింది. – K.Venkataramana – ☎ 03:57, 15 డిసెంబరు 2020 (UTC)
- వెంకటరమణ గారూ, జాగ్రత్తగా పరిశీలిస్తే నేను నా వ్యాఖ్యను తటస్థం నుంచి వ్యతిరేకతకు మార్చాను కానీ నా అభిప్రాయాన్ని మార్చుకోలేదు. నిర్వాహకత్వ నిర్ణయాన్ని నా ముందు వ్యాఖ్యలో కూడా సమర్ధించలేదు. నేను మార్చుకున్నది వ్యతిరేకత మీద. నాకు ముందు సరైన ఉదాహరణకు దొరకలేదు. ఉదాహరణలు దొరికాక అభిప్రాయం మార్చుకున్నాను. ప్రతిపాదిత వ్యక్తి గతంలోని ఒక ఓటింగులో ఎందుకు అభిప్రాయం మార్చుకున్నారు అనే ప్రశ్న అడగడంలో ఆయన ఆలోచనా విధానాన్ని తెలుసుకునేందుకు. ఆయన సరైన కారణంతో నిర్ణయాన్ని మార్చుకున్నారా లేదా తెలుసుకునేందుకు. అలాగే నేను కూడా ఎందుకు నా అభిప్రాయాన్ని మార్చుకున్నానో వివరించాను. అది సరైన కారణం కాదు అని ఎవరైనా అనుకుంటే. నా ఓటును చెల్లని ఓటింగుగానో, ముందు అభిప్రాయమే పరిగణనలోకి తీసుకుంటారో నిర్ణయం చేసేవారికే వదిలేస్తున్నాను. రవిచంద్ర (చర్చ) 04:06, 15 డిసెంబరు 2020 (UTC)
- రవిచంద్ర గారూ, అభిప్రాయాలు మార్చుకునే నిబంధన ఉందో లేదో నాకు తెలియదు. కానీ మనం మొదట చెప్పిన విషయానికి కట్టుబడి ఉండాలి కదా. నా ఉద్దేశ్యంలో మార్చుకోకూడదనుకుంటాను. ఈ నిర్వాహక పేజీ విజ్ఞప్తిలో కూడా నిర్వాహకునిగా ప్రతిపాదిత వ్యక్తి గతంలోని ఒక ఓటింగులో ప్రతిపాదనకు వ్యతిరేకంగా ముందుగా వాఖ్యానించి తర్వాత ఓటింగులో అనుకూలంగా ఓటు చేసారనేదే కదా చర్చకు వచ్చింది. – K.Venkataramana – ☎ 03:57, 15 డిసెంబరు 2020 (UTC)
- వాడుకరి:రవిచంద్ర ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు చేసినపుడు అది ఏదైనా సరే మొదట ఆలోచించుకొని వేయాలి. దానికి కట్టుబడి ఉండాలి. కానీ తరువాత మన ఓటును మార్చుకొనే అవకాశం ఉందా? పరిశీలించగలరు. – K.Venkataramana – ☎ 23:49, 14 డిసెంబరు 2020 (UTC)
- అభిప్రాయం మార్చుకోవచ్చని నేను భావిస్తున్నాను. ఒకసారి అభిప్రాయం వెల్లడించాక, మారిన పరిస్థితుల కారణం గానో, పరిస్థితుల పట్ల తనకున్న ఆలోచన మారినందునో మరో కారణం వల్లనో తన అభిప్రాయాన్ని మార్చుకోవాలని అనిపించవచ్చు. ఉదాహరణకు, ఇక్కడ అడిగిన ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానాలను గమినించాక గానీ, ఈ ప్రతిపాదన వచ్చాక అభ్యర్థి వేరే పేజీల్లో చేసిన దిద్దుబాట్ల వల్ల గానీ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన అవసరం కనిపించవచ్చు.
- పోతే.. "ఈ నిర్వాహక పేజీ విజ్ఞప్తిలో కూడా నిర్వాహకునిగా ప్రతిపాదిత వ్యక్తి గతంలోని ఒక ఓటింగులో ప్రతిపాదనకు వ్యతిరేకంగా ముందుగా వాఖ్యానించి తర్వాత ఓటింగులో అనుకూలంగా ఓటు చేసారనేదే కదా చర్చకు వచ్చింది." అని అన్నారు. ఇక్కడ ప్రశ్న మార్చుకోకూడదు గదా అని అడగలేదు.. దానికి ఆయన చూపిన కారణం గురించే ప్రశ్న వేసారు. కావాలంటే ఇది చూడండి: "..అభిప్రాయాన్ని మార్చుకోవడం అన్నది చర్చల్లో సహజమైన ప్రక్రియే కానీ మీరు అందుకుఇచ్చిన కారణం నన్ను విస్మయపరిచింది. అని రాసారు. కానీ రవిచంద్ర గారిని అభిప్రాయం మార్చుకోకూడదని చెబుతున్నారు, ఎందుకు మార్చుకున్నారు అని అడగడం లేదు. ఈ రెండూ ఒకటి కాదు.
- మరొక సంగతి.. ప్రతిపాదనపై నిర్ణయం తీసుకునే వారు, అభిప్రాయం మార్చుకున్న వ్యక్తి చూపించే కారణాన్ని బట్టి దాన్ని పరిగణన లోకి తీసుకోవాలో లేదో నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంటుందని నేను భావిస్తున్నాను. __చదువరి (చర్చ • రచనలు) 04:13, 15 డిసెంబరు 2020 (UTC)
- నేను నా పై అభిప్రాయాన్ని ప్రచురించే సమయంలో, రవిచంద్ర గారు పైన చేసిన దిద్దుబాటుతో ఘర్షణ వచ్చింది. అంచేత నేను రాసినదాన్ని కాపీ చేసుకుని పేజీని మళ్ళీ తెరిచి దాన్ని పేస్టు చేసి ప్రచురించాను. తీరా చూస్తే ఆయన చెప్పిన అభిప్రాయాన్నే నేనూ చెప్పినట్టు గమనించాను. కాకతాళీయంగా జరిగిందిది. __చదువరి (చర్చ • రచనలు) 04:18, 15 డిసెంబరు 2020 (UTC)
- రవిచంద్ర గారూ, మీ మార్పులను పరిశీలించాను. మీరు తర్వాత గుర్తించిన ఉదాహరణలను గుర్తించాను. కాపీహక్కుల నియమాలకు విరుద్ధంగా యదాతథంగా ఒక వెబ్‌సైట్ నుండి కాపీ పేస్టు చేసిన వ్యాసంలో {{copyvio}} కూడా చేర్చాను. మీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను.ధన్యవాదాలు. – K.Venkataramana – ☎ 04:32, 15 డిసెంబరు 2020 (UTC)
- నేను నా పై అభిప్రాయాన్ని ప్రచురించే సమయంలో, రవిచంద్ర గారు పైన చేసిన దిద్దుబాటుతో ఘర్షణ వచ్చింది. అంచేత నేను రాసినదాన్ని కాపీ చేసుకుని పేజీని మళ్ళీ తెరిచి దాన్ని పేస్టు చేసి ప్రచురించాను. తీరా చూస్తే ఆయన చెప్పిన అభిప్రాయాన్నే నేనూ చెప్పినట్టు గమనించాను. కాకతాళీయంగా జరిగిందిది. __చదువరి (చర్చ • రచనలు) 04:18, 15 డిసెంబరు 2020 (UTC)
లోయకు నదికి ఆంగ్లంలో ఒకే పేజీ ఉంది
[మార్చు]గురువు గారు, లోయకు నదికి ఆంగ్లంలో ఒకే పేజీ ఉంది. [[1]] ఈ లింకును గమనించండి సార్. గురువు గారు, పవన్ సంతోష్ గారికి పరిశీలనార్థం. -- ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 15:39, 15 డిసెంబరు 2020 (UTC)
- మీరు ప్రస్తావించింది రీడైరెక్ట్ అండీ. ఒక వ్యాసానికి ఎన్ని రీడైరెక్టులు అయినా ఉండవచ్చు. కానీ, వ్యాస విషయం ఏమిటన్నది ప్రస్తుతం.
- అలాగే, ఆ River Llynfi వ్యాసం మొత్తం మీద వాలీ ప్రస్తావన ఉన్నదల్లా Llynfi Valley గుండా ప్రవహిస్తుందన్న ఒక్క చోటే. ఆమాత్రానికి అది నదికీ, లోయకీ కలిపి ఒకే వ్యాసం కాబోదు.
- పోనీ మీరు అనువదించిన లిలిన్ఫీ లోయ వ్యాసం ఐనా లిలిన్ఫీ లోయ గురించి వివరిస్తోందా? లేదు. సింపుల్‌గా అక్కడ ఉన్నదే అనువదించారు. (అది తప్పు కాదు, పేరు నది అని పెట్టి ఉంటే) "లిలిన్ఫీ లోయ (ఆంగ్లం: Llynfi Valley) లిలిన్ఫీ నది ఓగ్మోర్ నది మూడు ప్రధాన ఉపనదులలో ఒకటి" అన్నారు. నాకు అర్థం కాలేదు. ఏ రకంగా ఈ వాక్యాన్ని సమర్థించాలి? అది మొదలు ఆ వ్యాస పరిచయమంతా నది గురించే ఉంది. హఠాత్తుగా లిలిన్ఫీ లోయ/నది గురించి విడిచిపెట్టి వివిధ రకాల లోయలు, ప్రపంచంలోని లోయల జాబితా అంతా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు.
- ఇక్కడి సంగతి పక్కనపెడదాం - ఒక వికీడేటా ఐటం అన్నది ఒక విషయానికి ఒకటే ఉంటుంది. River Llynfiకి Q7337600 అన్నది దాని Qid. దాని పేజీలో instance of river అనే ఉంటుంది, ఉంది. ఆ పేజీలో మీరు తీసుకువెళ్లి లిలిన్ఫీ లోయ వ్యాసం కలిపారు. మరి తెలుగు వికీపీడియాలో ఎవరైనా వాస్తవానికి లిలిన్ఫీ నది వ్యాసం రాస్తే దేనికి కలపాలి? అలాగే మనం ఈ విధంగా వికీడేటాకు River Llynfi అంటే లిలిన్ఫీ లోయ అని చెప్తున్నాం.
- అదండీ విషయం! మీరు అడిగారు కాబట్టి వివరంగా చెప్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 12:01, 16 డిసెంబరు 2020 (UTC)
- ఇంతా రాసి, దీని నుంచి ఏం నేర్చుకోవచ్చన్నది రాయకపోతే మీరు నాకిచ్చిన గౌరవం విలువ పోతుంది. కాబట్టి, చూడండి:
- ఒక వ్యాసం ఒక విషయం గురించి ఉండాలి. దాని పరిధి దాటి రాయకూడదు. ఉదాహరణకు, అష్టదిగ్గజాల గురించి వ్యాసం రాసినప్పుడు అందులో తెలుగు సాహిత్యంలో ఇతర కవులు, రచయితలు అందరి పేర్లూ, వివరాల జాబితా ఉండకూడదు. అవసరం అనుకుంటే ఇవి కూడా చూడండి అని విభాగం పెట్టి తెలుగు కవుల జాబితా అన్న పేజీకి కింద లింకు ఇవ్వాలి. ఇక పెట్టిన శీర్షికతో సంబంధం లేకుండా వ్యాసం అసలే రాయకూడదు. మీకు ఈ సూచనలు ఉపయోగపడతాయనే భావిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 12:07, 16 డిసెంబరు 2020 (UTC)