వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/ప్రభాకర్ గౌడ్ నోముల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రభాకర్ గౌడ్ నోముల[మార్చు]

మీ మద్దతు ఇక్కడ తెలుపుము (డిసెంబరు 11, 2020 15:48) ఆఖరి తేదీ : (డిసెంబరు 18, 2020 15:47])
ప్రభాకర్ గౌడ్ నోముల (చర్చదిద్దుబాట్లు) - ప్రభాకర్ గౌడ్ నోముల గారు 2015 ఏప్రిల్ 1న తెలుగు వికీపీడియాలో ప్రవేశించి ఇప్పటి వరకు 89 వ్యాసాలను రాసారు. ప్రస్తుతం తెవికీలో విశేషమైన కృషి చేస్తున్నారు. ఆయన అనేక వ్యాసాలను తెవికీకి అందించడమేకాక నిరంతరం ఇటీవలి మార్పులను పరిశీలిస్తూ ఇతరులు రాసిన వ్యాసాలలో ఉపయుక్తమైన మార్పులు చేస్తూ వ్యాస నాణ్యతకు తోడ్పడుతున్నారు. దిద్దుబాట్లు చేయటమే కాకుండా వికీ నియమాలు, పద్ధతులు తెలుసుకొని నిర్వహణ కార్యక్రమాలలో క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. కొత్తసభ్యులను ఆహ్వానించడం, సహాయం కావలసిన సభ్యులకు సత్వర సహాయాన్నందించడం, కొత్తవాడుకరులకు దిశానిర్దేశం చేయడం. తెవికీ వ్యాస నాణ్యతను పెంచడంలో కృషి, వివిధ కార్యక్రమాలను నిర్వహించడం ఇప్పటికే నిర్వహిస్తున్న పనుల్లో కొన్ని ఉదాహరణలు మాత్రమే. వివిధ వ్యాసాలను పరిశీలించి ఆ వ్యాసాలలో నిర్వహణా మూసలు చేర్చడం, కొన్ని వ్యాసాలలో మార్పులు చేసి వ్యాస నాణ్యతను పెంచడం వంటి కార్యక్రమాలను చేస్తున్నారు. కొత్త వ్యాసాలను నిరంతరం పరిశీలిస్తూ అనామక వాడుకరులు సృష్టించిన చెత్తరాతల వ్యాసాలను గుర్తించడం, అందులో తొలగింపు మూసలు చేర్చడం చేస్తున్నారు. అనామక వాడుకరులు చేసిన దుశ్చర్యలను గమనించి వారు చేసిన మార్పులను తిప్పికొట్టడం వంటి కార్యక్రమాలను చేస్తూ తెవికీ నాణ్యత పెంచే దిశగా కృషి చేస్తున్నారు. అదే విధంగా వివిధ ప్రాజెక్టులలో పాల్గొనడమే కాక రచ్చబండ, వివిధ వ్యాసాల చర్చా కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటున్నారు. మొలకల విస్తరణ ఋతువు 2020లో విశేష కృషి చేసారు. తెవికీ అభివృద్ధి కోసం చేస్తున్న పాలసీల విషయంలో కూడా తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ పనులన్నీ తెలుగులో ప్రామాణికంగా అనేక చక్కని వ్యాసాలు వ్రాస్తూనే నిర్వహించారు. నిజానికి ఇప్పటికే నిర్వహణా పనులు చేస్తున్న నోముల ప్రభాకర్ గౌడ్ గారికి ఈ నిర్వాహకహోదా కేవలం ఆ పనులు నిర్వహించడంలో సౌలభ్యం కొరకే. ఇక ముందు కూడా తెవికీని చక్కగా నిర్వహిస్తూ, ముందుకు నడిపించగలరని ఆశిస్తూ, ఈయన్ను నిర్వహకత్వానికి ప్రతిపాదిస్తున్నా. వికీపీడియాలో అతని గణాంకాలను ఇక్కడ చూడండి.  – K.Venkataramana  – 15:48, 11 డిసెంబరు 2020 (UTC)

ప్రభాకర్ గౌడ్ నోముల గారు తమ అంగీకారము ఇక్కడ తెలియ చేయవలెను.

సభ్యుని అంగీకారం/అభిప్రాయం[మార్చు]

 • నాకు ఉన్న అనుభవం సరిపోతుందని నిర్వహకులు స్వరలాసికగారు, అదికారులు రాజశేఖర్ గారు, ప్రతిపాదకులు రమణ సార్ తో సహా ముగ్గురు నన్ను సమర్థించారు. వీరికి నా హృదయ పూర్వకంగా వందనాలు ముగ్గురు నిర్వాహకులు వ్యతిరేకించారు. వీరి అభిప్రాయం మరి కొంతకాలం ఆగాలన్నరు దానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేను నా ప్రతిపాదన వెనక్కి తీసుకుంటున్నాను. ఒక అధికారి ఇద్దరు నిర్వాహకుల మనసు గెలుచుకున్నాను, అంటే నేను విజయం సాధించినట్టే అనుకుంటున్నాను సంఖ్యాపరంగా కాకపోవచ్చు. మిగతా వారి హృదయాలను కూడా తొందరలోనే గెలుచుకుంటాను అన్న నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే నేను మీ ప్రేమకై మరి ఇంత శ్రమ విక్కీ కోసం తీసుకోవాలి అనుకుంటున్నాను. మీకు నేను ఏ అంశంలో వెనకబడి ఉన్నానో తదుపరి విషయాలలో తెలియజేయండి, అవి అన్ని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నా ప్రియ మిత్రులు మీరు మీ పని భారం నేను కొంత పంచుకుందామని అనుకున్నాను, నా కోసం వెచ్చించిన సమయానికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూన్నాను. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 16:08, 16 డిసెంబరు 2020 (UTC)

మద్దతు[మార్చు]

 1. --స్వరలాసిక (చర్చ) 15:38, 12 డిసెంబరు 2020 (UTC)
 2. తెవికీ నిర్వాహకుల కొరత మరియు చేయాల్సిన చాలా ఉన్నాయి. నాలాంటి కొంతమంచి అంత క్రియాశీలంగా లేనికారణంగా ప్రభాకర్ గౌడ్ నిర్వహణ బాధ్యతలను మరింతగా చేపట్టి తెవికీ అభివృద్ధికి కృషిచేస్తారని భావిస్తాను.--Rajasekhar1961 (చర్చ) 16:08, 12 డిసెంబరు 2020 (UTC)

వ్యతిరేకత[మార్చు]

 • ప్రభాకర్ గౌడ్ గారు, వికీ మీద చాలా అభిమానం ఉన్న వ్యక్తి.ఏదో చేయాలనే తాపత్రయంకూడా ఎక్కువే. నిర్ధుష్టమైన విధి విధానాలమీద ఇంకా పూర్తి అవగాహనరాలేదని నా అభిప్రాయం.వికీలో తను చెప్పదలచుకున్న సంగతులు పూర్తి సృష్ఠంగా చేప్పే స్థాయికి ఎదగ లేదని అనుకుంటున్నాను.పై కారణాలు రీత్యా నేను ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 17:07, 14 డిసెంబరు 2020 (UTC)
 • ప్రభాకర్ గౌడ్ గారు ఇటీవలి మార్పులు గమనించడం, అనవసరమైన వ్యాసాలను తొలగింపునకు ప్రతిపాదించడం లాంటి కొన్ని నిర్వహణాపరమైన పనులు చేయడానికి ముందుకు రావడం సంతోషకరం. అయితే కొన్ని వికీ విధానాలపై ఆయనకు ఇంకా అవగాహన రావాల్సి ఉంది. ఉదాహరణకు మూలాలనుంచి సమాచారాన్ని సేకరించి దాన్ని వికీ శైలిలో రాయడం, చర్చల్లో పరిణతి కనబరచడం లాంటివి. అలాగే ఆయన సృష్టించిన సమస్యాత్మక వ్యాసాలు కొన్ని ప్రస్తావిస్తున్నాను. లిలింఫీ లోయ - అనువాద దోషాలు చాలా ఉన్నాయి. గోసంగి కులం - మూలాల నుంచి చాలా వాక్యాలు యధాతథంగా చేర్చబడ్డాయి. కాపీరైటు విషయంలో వికీ నిర్వాహకులకు ప్రాథమిక పరిజ్ఞానం చాలా అవసరం. కానీ ప్రభాకర్ గౌడ్ గారు ఈ విషయాలు ఇంకా నేర్చుకోవలసిన అవసరం ఉంది. ప్రస్తుతం ఆయన చేస్తున్న పనులు నిర్వహక పదవి లేకపోయినా చేయగలరనే ఉద్దేశ్యంతో నేను ఈ నిర్ణయాన్ని సమర్థించలేను. - రవిచంద్ర (చర్చ) 05:14, 14 డిసెంబరు 2020 (UTC)
 • నోముల ప్రభాకర్ గౌడ్‌ గారి అభ్యర్థిత్వాన్ని నేను ఈ రెండు కారణాల ఆధారంగా వ్యతిరేకిస్తున్నాను.
 1. వికీపీడియాలో చర్చించడంలో ఆయనకు స్పష్టత లోపిస్తోంది. కింది చర్చలోనే "వందకు పైగా అనువదించాను. అవి అన్ని ఎలాంటి ఆంగ్లపదాలు లేకపోయినా 40 - 60 అనువాద శాతం మధ్యలో ఉన్నాయి. మరికొన్ని వ్యాసాలు 71కి పైగా 90 మధ్యలో అనువాద శాతంగా ఉన్నాయి. ఇందులో ఆంగ్ల పదం అనేది లేదు, అయినా కూడా అనువాద యంత్రం ప్రచురణకు అంగీకరించడం లేదు. చాలా వ్యాసాలు అనుభవం ఉన్నవారికి కూడా యంత్రం అడ్డు పడటం వలన ప్రచురణ చేయలేక ఆగిపోతున్నాయి" అని మొదట రాశారు, చదువరి గారు ఇంగ్లీషు వ్యాసాల పేర్లు ఇస్తే సమస్య ఏమిటన్నది పరిశీలించి దిద్దుదామని ముందుకు వచ్చాకా "చదువరిగారు, సుమారు 100 వ్యాసలకు పైన ప్రచురించకపోవడం ఇబ్బందులు ఒక్కటి కూడా లేదండి, అనువదించి పెట్టాను, కాని నేనే కావాలని ప్రచురించలేదు." అన్నారు. నిజానికి, ఆయన చెప్పదలిచిన విషయమూ కొంత కొంత మారిపోతోంది, లేదూ చదివేవారికి అర్థం కావట్లేదు. ఏదైనా మంచి సంగతి కాదు. వికీపీడియా నిర్వహణలో నిర్ణయాలు, అమలు ఖచ్చితంగా తీసుకుని చేస్తూ ఉండాలి. స్పష్టమైన అవగాహనతో స్పష్టమైన వ్యక్తీకరణతో నిర్ణయాలు వెలువరించకపోతే వాడుకరులు, వికీపీడియా కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది.
 2. వికీపీడియా విధానాల అమలు విషయంలో నిర్వాహకులది కీలకమైన పాత్ర. ఆయన రాస్తున్న వ్యాసాల్లో పలు విధాలైన సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకు కాపీహక్కులు, వికీపీడియా శైలి వంటివాటికి తోడుగా అసలు ఆంగ్లంలో నది వ్యాసాన్ని తెలుగులో లోయగా అనువదించి రెంటినీ కలపడం వంటివి కూడా ఉన్నాయి. ఈ నది వ్యాసాన్ని లోయగా అనువదించి, వికీడేటా ఐటంలో దాన్ని కలపడం అన్నది నిన్ననే జరిగిన సమస్య.
మొత్తంగా చూస్తే, నోముల ప్రభాకర్ గౌడ్ గారు విధానాల గురించి వాడుకరిగా మరింత నేర్చుకుంటూ పనిచేయడమూ, వారికి ఇతరులు సహాయపడి నేర్పడమూ, ఆపైన చర్చల్లోనూ పరిణతి సాధించడమూ, తర్వాత నిర్వాహకునిగా పునః ప్రతిపాదించడమూ విధాయకమని అభిప్రాయపడుతున్నాను. ఈ ప్రతిపాదన అలా కొంత కాలం పాటు నేర్చుకున్నాకా చేయడం మంచిదని నా విశ్వాసం. --పవన్ సంతోష్ (చర్చ) 11:11, 15 డిసెంబరు 2020 (UTC)

తటస్థం[మార్చు]

ప్రభాకర్ గౌడ్ గారు క్రియాశీలకంగా పని చేస్తున్నారని తెలుసు. నిర్వహణపరమైంజ మార్పులు, చర్చల్లో మరికొంత నేర్చుకొంటూ కొంతకాలం ఆగి అప్పుడు ప్రతిపాదిస్తే బావుంటుందనుకుంటాను. నఇది ఆయనను నిరుత్సాహపరచడంలా అనుకోకుండా, మరింత తెలుసుకోడానికి ఒక అవకాశంగా అనుకుంటారని భావిస్తాను..B.K.Viswanadh (చర్చ) 16:30, 14 డిసెంబరు 2020 (UTC)
దీనిని బట్టి చూస్తే ప్రభాకర్ గౌడ్ గారు , ఈ మధ్య మాత్రమే చాలా క్రియాశీలంగా ఉన్నారు , అయితే వారు ఇతరుల వ్యాసాలు , చర్చా పేజీలలో కొంచెం తక్కువ గానే పాలు పంచుకున్నట్లు తెలుస్తోంది , కాబట్టి మరికొన్ని నిర్వాహక అంకాలతో సంబంధం వున్న నాన్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ ల ఉదాహరణ వికీ నిబంధనలు , వేరే వారికి తోర్పాటు అందచేయటం , వారి చర్చా పేజీలలో అభిప్రాయం చెప్పటం వికీపీడియా యొక్క విధానాలు మరియు పద్ధతుల గురించి మరింత తెలుసుకొవటం, వాండలిజమ్ , అనవసరం అయినవి తీసివేయటం , మొదలైన వాటిలో పాల్గొని అప్పుడు ప్రతి పాదిస్తే బాగుటుంది అని నా అభిప్రాయము. నాకు తెలిసి ఇతర సంస్థల , ప్రాజెక్టు లో పనిచేయాలి అనుకున్నపుడు నిర్వాహక హోదా ప్రతిబంధకం అవుతుంది. మీరు నిర్వాహక హోదాకై స్వీయ ప్రతిపాదన చేసుకోలేదు , ఇంకా మీ వాడుకరి పేజీలో వర్గం:నిర్వహణ పట్ల ఆసక్తి లేని వాడుకరులు లో మీ పేరు చేర్చారు , కాబట్టి నా అభిప్రాయం తటస్థం ! Kasyap (చర్చ) 07:23, 16 డిసెంబరు 2020 (UTC)

అభ్యర్థికి ప్రశ్నలు[మార్చు]

పవన్ సంతోష్

నోముల ప్రభాకర్ గౌడ్ గారూ, నిర్వాహక పనుల రూపేణా తెవికీ అభివృద్ధికి బాధ్యతలు చేపట్టడానికి ఆసక్తి కనబరుస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ అభ్యర్థికి ప్రశ్నలు వేసి వారి గురించి తెలుసుకుని మద్దతు/వ్యతిరేకత/తటస్థత నిర్ణయించుకోవడం అన్న ఆరోగ్యకరమైన సంప్రదాయం ఇతర వికీలతో పాటు తెవికీలో కూడా ఉంది. ఉదాహరణకు ఈ పేజీ చూడండి. ఇక్కడ అడుగుతున్న ప్రశ్నలు మీకు వికీపీడియా విధానాల గురించి ఉన్న అవగాహన, మీ గత వికీపీడియా చరిత్రలో చర్యల విషయమై మీ వైపు నుంచి స్పష్టత తెలియబరిచి నాకూ, తోటి సభ్యులకు నిర్ణయం తీసుకోవడానికి సహాయకరంగా ఉంటుందన్న ఉద్దేశంతో అడుగుతున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 04:21, 14 డిసెంబరు 2020 (UTC)

1) మీరు కొన్ని నెలల క్రితం రాసిన గోసంగి కులం వ్యాసాన్ని సృష్టించిన వాడుకరిగా కాక ఒక నిర్వాహకుని దృష్టితో చూడండి. ఈ వ్యాసంలో సమస్యలు ఉంటే ఏమిటో చెప్పండి, దీనిపై నిర్వాహకునిగా ఉండి ఉంటే మీరు ఏ చర్యలు తీసుకుంటారు?


2) వికీపీడియా అనువాద ఉపకరణం వాడి యాంత్రిక అనువాదం చేస్తున్నప్పుడు యాంత్రికానువాద స్థాయి 30 శాతంలోపే ఉండేలా, లేకుంటే ప్రచురణను అడ్డుకునేలా ఉన్న ప్రస్తుత నిబంధన ఉంచాలా తీసేయాలా అన్న విషయంపై ఒక చర్చ, ఒక ఓటింగ్ జరిగాయి. నియంత్రణ ఉండాలనీ, అది కేవలం 30 శాతం కాదు ఇంకా ఎక్కువే ఉండాలని, ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీరు చర్చలో సుస్పష్టమైన అభిప్రాయాన్ని వెలువరించారు. నెల తర్వాత అందుకు విరుద్ధంగా ఉన్న ప్రతిపాదనకు (జంట ప్రతిపాదనలు) అనుకూలంగా ఓటువేశారు. అభిప్రాయాన్ని మార్చుకోవడం అన్నది చర్చల్లో సహజమైన ప్రక్రియే కానీ మీరు అందుకుఇచ్చిన కారణం నన్ను విస్మయపరిచింది. "అర్జున గారు, ఎందుకు అంత పట్టుపడుతున్నారు. అనేది అర్థం కాని విషయం పూర్తిగా వ్యతిరేకించాను. అయిన గురువు గారికి ఓటు అనుకూలమే, అందరూ వ్యతిరేకించిన అనుభవజ్ఞులు అంత పట్టుబట్టడం వెనక ఏదో ఉంది, ఓటింగ్ కు మందు విషయం చెప్పకపోయినా ఓటింగ్ గడువు తర్వాత వివరిస్తారా ఆశిస్తూ... ఓటింగ్ విఫలమైతే 70శాతం యధావిధి సఫలమైతే చూడాలి అక్షర కాలుష్యం ఆరంభమవుతుందా లేక మంచి వ్యాసాలు కొత్తగా తేవి లోనికి చేరుతాయా... కాలచక్రం నిర్ణయం చేస్తుంది... (...) గురువుగారికి విధేయత చూపించవలసిన సమయం తరుణం ఇదే కావచ్చు...నా ఓటు అనుకూలమే." (లింకు)- అని మీరు రాసిన కారణాలపై మీరు ఇప్పుడు ఏ విధంగా భావిస్తున్నారు? వీటిని మీరు సమర్థిస్తున్నారా? లేదా? మీ వివరణ తెలపండి.

ప్రభాకర్ గౌడ్ నోముల
 • గోసంగి కులం గనిశెట్టి రాములుగారు, రాసిన ఒక కులం గురించి రాసిన ఒక పుస్తకం దాన్ని కాఫి ఫెస్టులా ఉంది. ఇది చర్చ:మిడుతల దాడి, బోధి చెట్టు కిందకు బుద్ధుడు రాకముందుకు అన్నట్లు ఉంది సార్. అప్పటికి నాకు ఏమీ తెలియదు. వికీ కోసం తిప్పి వ్యాఖ్యలు రాయాలి అనే అంశం.
 • పవన్ సంతోష్ గురువు గారు, మీకు, చదువరి గార్కి, ఓటు అనూకులంగా వేసిన విషయం గురించి సవివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అర్జునరావు గారు అనుభవం ఉన్న అధికారి 70 శాతం తగ్గించమని ఎందుకు అంతగా అడుగుతున్నారు. అని ఒక యాభై వ్యాసాలను ఆ నెల రోజుల్లో అనువదించడానికి ప్రయత్నం చేశాను. వాటిలో కొన్ని అనుభవాలు.
 • అనువాదయంత్రంతో మొదటి వ్యాసం లిలిన్ఫీ లోయ అనువాదం చేశాను.(అప్పుడు ప్రచురించ లేదు.), కేవలం 4 శాతం యాంత్రికం ద్వారా అనువాదం చేసింది.
 • (ఇంకా ప్రచురించలేదు) వందకు పైగా అనువదించాను. అవి అన్ని ఎలాంటి ఆంగ్లపదాలు లేకపోయినా 40 - 60 అనువాద శాతం మధ్యలో ఉన్నాయి. మరికొన్ని వ్యాసాలు 71కి పైగా 90 మధ్యలో అనువాద శాతంగా ఉన్నాయి. ఇందులో ఆంగ్ల పదం అనేది లేదు, అయినా కూడా అనువాద యంత్రం ప్రచురణకు అంగీకరించడం లేదు.
 • సారాంశం ఏమిటంటే చాలా వ్యాసాలు అనుభవం ఉన్నవారికి కూడా యంత్రం అడ్డు పడటం వలన ప్రచురణ చేయలేక ఆగిపోతున్నాయి, అని అర్థమైంది. అర్జునరావు గారు కూడ ఇలాంటి అనుభవంతో ఇబ్బంది పడ్డారని అనుభవం ఉన్న వారికి కూడా యంత్రం ఇబ్బంది పెడుతుందని అర్థమై ఆ నెల రోజుల్లో అనుభవపూర్వకంగా నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను. 90 శాతం అనుభవం ఉన్న వారికి అనుమతివ్వాలని అన్నాను, ఓటు అనుకూలం వేశాను. అలా అని చపల చిత్తం ఉన్న వ్యక్తిత్వం కాదండి. తెలియని విషయం పైన అలాకాదు అని ఎవరైనా వివరిస్తే నా అభిప్రాయాన్ని మార్చుకుంటాను కానీ, తెలిసిన విషయం మీద ఓకే విధమైన అభిప్రాయం కలిగి ఉంటానండి, అని తెలియజేస్తున్నాను.
గత 4, 5 సంవత్సరాలు 30 వ్యాసాలు అటుఇటుగా రాశాను, అంతకుమించి ఏం చేసే వాడిని కాదు, చర్చలలో పాల్గొనే వాడిని కాదు, చూసి వదిలేసే ఒకడిని కరోనా వలన ఎక్కువగా సమయం లభించి మార్పులు చేర్పులు చేస్తూ చదువరి గారి, రవిచంద్ర గారి, మీరు(పవన్ సంతోష్) హెచ్చరికలు, సూచనలు, ముఖ్యంగా మీ గురువు గారు రాజశేఖర్ సార్ వేలు పట్టి నడిపించిన వారిపట్ల కూడా వికీనియమాల ప్రకారం ఒక వ్యాసంలో మీరు చేర్చిన హెచ్చరిక నన్ను వికి నిర్వహణ పట్ల ఎలా ఉండాలి అనేది. మరింత అప్రమత్తతగా చేసింది అనుకుంటున్నాను. వికీలో నా పనుల పట్ల అప్పటికీ ఇప్పటికీ తేడా చూసి గురువుగారు వెంకటరమణ గారు. నిర్వహణ బాధ్యత నిర్వర్తించ గలరని ఈ ప్రతిపాదన చేశారని భావిస్తున్నాను. ధన్యవాదాలు సార్. ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 08:24, 14 డిసెంబరు 2020 (UTC)
ప్రభాకర్ గౌడ్ నోముల గారూ, మీరు చెప్పిన దానిలో కొంత స్పష్టత అవసరం. (ఎందుకంటే ఈమధ్య కాలంలో నేను 200 కు పైగా వ్యాసాలను అనువదించి ప్రచురించాను. నాకు మీరు చెప్పిన అనువాద శాతాల ఇబ్బంది ఏమీ రాలేదు.) కింది విషయాలను పరిశీలించండి..
 1. మీరు వందకు పైగా వ్యాసాలను అనువదించారు. వాటన్నిటికీ అనువాద శాతం సమస్య ఎదురవడంతో ప్రచురించలేకపోయారు. అన్నీ అలాగే ఉండిపోయాయి. ఇది కరెక్టేనా?
 2. పై 100కు పైగా వ్యాసాల్లో కొన్నిటిలో అనువాద శాతం 40-60 మధ్యలో ఉంది. అయినా ప్రచురించ లేకపోయానన్నారు. ఈ "అనువాద శాతం" ఏదో రాయలేదు మీరు. అది యాంత్రిక అనువాదమైనా మానవిక అనువాదమైనా సరే.. ప్రచురించడంలో ఇబ్బంది ఉండకూడదు. ఇబ్బందంటూ ఉంటే వేరే ఏదైనా ఇబ్బంది ఉండి ఉండాలి. మానవిక అనువాద పరిమితి మాత్రం అడ్డం పడకూడదు. ఈ వ్యాసాల జాబితా ఇక్కడ రాయండి (అనువాదం కోసం తీసుకున్న ఇంగ్లీషు వ్యాసం పేరు రాయాలి, తెలుగు పేరు కాదు). ఒక్కొక్కదానిలో సమస్య ఏంటో చూద్దాం. మనకు అర్థం కాకపోతే, డెవలపర్లకు రాద్దాం.
 3. పోతే, మరి కొన్నిటిలో అనువాద శాతం 71-90 మధ్యలో ఉంది. అయినా ప్రచురించ లేకపోయానన్నారు. ఆ శాతం మానవిక అనువాదమా? యాంత్రిక అనువాదమా? యాంత్రిక అనువాదమైతే, ప్రచురించకపోవడంలో తప్పు లేదు. ఎందుకంటే మానవిక అనువాద శాతం 29% దాటనట్లే కదా! ఒకవేళ మీరు చెప్పిన 71-90 అనేది మానవిక అనువాద శాతమైత మాత్రం.., అలా జరక్కూడదు. అది మానవిక అనువాద శాతమే అయితే, ఈ జాబితా కూడా పెట్టండి. సమస్య ఏంటో పరిశీలిద్దాం. స్పష్టత కోసం మరొక్కసారి చెబుతున్నాను సార్.. ఇవ్వాల్సినది "ఇంగ్లీషు వ్యాసం పేరు", తెలుగు వ్యాసం పేరు కాదు. __చదువరి (చర్చరచనలు) 11:52, 14 డిసెంబరు 2020 (UTC)
చదువరిగారు, సుమారు 100 వ్యాసలకు పైన ప్రచురించకపోవడం ఇబ్బందులు ఒక్కటి కూడా లేదండి, అనువదించి పెట్టాను, కాని నేనే కావాలని ప్రచురించలేదు. నా రికార్డుల కోసం మాత్రమే నని మనవి. క్షమించండి, ఈ వాక్యం అప్పుడే రాసి ఉండవలసింది. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 12:48, 14 డిసెంబరు 2020 (UTC)
ప్రభాకర్ గౌడ్ నోముల గారూ, అంటే మానవిక అనువాద శాతంతో మీకు సమస్యేమీ లేదన్నమాట. మరి "సారాంశం ఏమిటంటే చాలా వ్యాసాలు అనుభవం ఉన్నవారికి కూడా యంత్రం అడ్డు పడటం వలన ప్రచురణ చేయలేక ఆగిపోతున్నాయి, అని అర్థమైంది. అర్జునరావు గారు కూడ ఇలాంటి అనుభవంతో ఇబ్బంది పడ్డారని అనుభవం ఉన్న వారికి కూడా యంత్రం ఇబ్బంది పెడుతుందని అర్థమై ఆ నెల రోజుల్లో అనుభవపూర్వకంగా నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను." అని రాసారు కదా.. మీకు ఒక్క దానిలో కూడా ఇబ్బంది ఎదురు కానపుడు ఈ వాక్యాలు ఎందుకు రాసారో అర్థం కాలేదు. వివరించగలరా? __చదువరి (చర్చరచనలు) 13:04, 14 డిసెంబరు 2020 (UTC)
చదువరిగారు, ఆ నెల రోజులు యాంత్రిక అనువాదం అలా నన్ను కూడా ఇబ్బంది పెట్టింది. మిగతావారు కూడా అలా ఇబ్బంది పడుతున్నారు అనుకున్నాను, అనుకూలంగా ఓటు వేశాను. తర్వాత యంత్రాన్ని ఏవిధంగా వాడాలి అనేది మీరు కొన్ని సూచనలు చేశాక ప్రయత్నించాను నాకు తెలిసి వచ్చింది, ఎంతలా అంటే ఈరోజు ప్రచురించిన వ్యాసం లిలిన్ఫీ లోయ యాంత్రిక అనువాదం కేవలం నాలుగు శాతం మాత్రమే __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 13:23, 14 డిసెంబరు 2020 (UTC)
ప్రభాకర్ గౌడ్ నోముల గారూ,
 • పరిమితిని తీసెయ్యాలనే ప్రతిపాదనపై జరిగిన చర్చలో మీ అభిప్రాయాన్ని స్పష్టంగానే చెప్పినట్లు కనబడింది. అప్పటికి పరికరం వాడానని, అది బాగా పని చేస్తోందనీ, మీకు నచ్చిందనీ కూడా చెప్పారు. ఆ అనుభవం తోటే పరిమితి 50% ఉండాలని కూడా చెప్పారు.
 • కానీ వోటు మాత్రం పరిమితిని తీసెయ్యాలంటూ వేసి, అందుకు కారణం "గురువుగారికి విధేయత చూపించవలసిన సమయం తరుణం ఇదే కావచ్చు...నా ఓటు అనుకూలమే" అని చెప్పారు.
 • ఇప్పుడు.. ఒక వంద వ్యాసాల్లో వివిధ స్థాయిల్లో అనువాద శాతాలు ఉన్నా ప్రచురణలో ఇబ్బందులు కలిగాయని, బహుశా ఆ కారణంగానే అర్జున గారు పరిమితి తీసెయ్యాలని అంటున్నారని అర్థమైందన్నారు
 • ఇబ్బంది కలిగించిన వ్యాసాలు ఏవి అని అడిగితే, లేదు ఇబ్బంది ఏమీ లేదు, ఆ వ్యాసాలన్నీ ప్రచురణకు సిద్ధంగానే ఉన్నాయని చెప్పారు.
 • ఆ మాట చెబుతూ.. మళ్ళీ వేరే కారణం చెప్పారు. వోటింగు సమయంలో (ఆ నెల రోజులు) పరికరం మీకు ఇబ్బందులు కలిగించిందనీ, అందుకే వోటు అలా వేసాననీ చెప్పారు.
వివిధ సందర్భాల్లో మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాలు స్పష్టంగా లేవు, మారుతూ ఉన్నాయి. ఇక.. నేను ఈ చర్చను ముగిస్తున్నాను. (అనువాద పరికరాన్ని వాడడంలో మీకు భవిష్యత్తులో ఇబ్బందులేమైనా ఎదురైతే నాకు చేతనైనంతలో మీకు సాయం చేసేందుకు నేను సిద్ధం.) ధన్యవాదాలు. __చదువరి (చర్చరచనలు) 13:54, 14 డిసెంబరు 2020 (UTC)
చదువరిగారు, వోటింగు సమయంలో (ఆ నెల రోజులు) పరికరం కొన్ని వ్యాసాలు తేలికగాను, మరికొన్ని చాలా ఇబ్బంది పెట్టాయి. అందుకు అలా జరిగింది. మీరు ఓటింగు బహిరంగంగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అక్కడ చూస్తే అనుకూలంగా 11 ఓట్లు అనుకూలంగా వేశారు. క్రియాశీలకంగా ఉన్న వారి సంఖ్య మరో పది మంది లోపే ఉంటుందని వ్యతిరేకంగా ఉన్న వారి సంఖ్య తక్కువగా ఉందని అనిపించి గురువు గారికి ఓటు వేశాను, బహుశా గందరగోళంలో జరిగింది, ఏమో అనిపించింది కానీ 20వ తేదీ పరిస్థితి మారిపోతుందని నేను ఊహించలేకపోయాను. ఓటింగ్లో పాల్గొనడం కూడా పూర్వం అనుభవం లేకపోవడం. నేను ఓటు వేసే సమయానికి ఒక్కటి ఓటు కూడా వ్యతిరేకంగా లేకపోవడం. గుంపులో గోవిందం లా అయిపోయాను. ఏమీ అర్థం కాలేదు. ఎందుకు అంటున్నాను అంటే కొత్తవారికి యాంత్రిక అనువాదం బహుశా తెలియడం తక్కువ అవకాశం ఉంది. దానికి ఉదాహరణ వికీపీడియాలో ఖాతా తీసుకుంటారు కానీ చాలా తక్కువ మంది. రెండవ సారి లాగిన్ కావడం చాలా తక్కువ, ఎక్కువ సార్లు లాగిన్ అయి ప్రవేశించే వారు మార్పుచేర్పులు అనువాద పరికరం వాడితే సరిచేయడానికి నేను కూడా వికీకి ఎక్కువ సమయం ఇస్తున్న కాబట్టి యాంత్రిక కాలుష్యం వస్తుంటే మీ నిర్ణయం వలన ఇలా జరుగుతుందని అర్జున రావు గారి నిర్ణయం పున సమీక్ష చేసుకోమని ఒప్పించి మళ్లీ అనువాద శాతం తగ్గిస్తేతే సరిపోతుంది అనుకున్నాను. నేను అనుకున్నది వేరు జరిగింది వేరు, మీకు చెప్పడం కూడా నాకు రావడం లేదు ఈ విషయం అనుకుంటున్నాను, ధన్యవాదాలు సార్. -- ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 15:11, 14 డిసెంబరు 2020 (UTC)
రచ్చబండలో నోముల ప్రభాకర్ గౌడ్ గారి ఉపసంహరణ సందేశం
గౌరవ సహసభ్యుల అందరికీ నమస్కారం, నేను గత నాలుగు నెలలుగా విక్కీ లో మార్పులు చేర్పులు కొన్ని పనులను చూసి గురువుగారు నిర్వహకులు వెంకట రమణ సార్ నిర్వహణ బాధ్యత తీసుకుంటే మరికొన్ని నాకు మరికొన్ని సౌలభ్యాలు ఉంటాయని సూచించారు. గౌరవ నిర్వాహకులకు కొందరికి ఇటీవల మార్పులు చూడటానికి సమయం చిక్కడం లేదని నేను ఆ బాధ్యతను నిర్వహించాలని అనుకున్నాను. అందుకు నేను కూడా సిద్ధమని తెలియజేశాను. నేను నిర్వాహకుడు అయితే సహా నిర్వాహకులకు ఇబ్బంది ఏమీ ఉండదు. కాకపోయినా నాకు ఏమీ నష్టం ఉండదు, ఏ ఉద్యోగంలో నైనా ట్రైనింగ్ ఇచ్చి బాధ్యతలు ఇస్తారు. నాకు ఉన్న అనుభవం సరిపోతుందని నిర్వహకులు స్వరలాసికగారు, అదికారులు రాజశేఖర్గారు, ప్రతిపాదకులు రమణ సార్ తో సహా ముగ్గురు నన్ను సమర్థించారు. వీరికి నా వందనాలు ఇప్పటికీ ముగ్గురు నిర్వాహకులు వ్యతిరేకించారు. వీరి అభిప్రాయం మరి కొంతకాలం ఆగాలన్నరు దానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే మరికొంతమంది ఓటింగ్ కు పాల్గొనే ముందు నేను నా ప్రతిపాదన వెనక్కి తీసుకుంటున్నాను. నేను దీనికి కారణం ఒకటే చెప్తాను. విక్కీ అంటే ఎంత ప్రేమ ఉందో నాకు మీ మీ అందరి పైన నాకు అంత ప్రేమ ఉంది. నేను కోరుకుంటున్నాను ప్రతిపాదకులు తో సహా అందరూ నాకు అనుకూలంగా ఉన్న రోజే వస్తే నిర్వహణ బాధ్యతలు స్వీకరిస్తాను. అరకొర మెజారిటీతో గెలుపు నాకు ఓటమి తో సమానమే... కాబట్టి మీ మీ ప్రేమ నా పైన దయ కలిగిన రోజున ఒకవేళ నన్ను మళ్లీ నిర్వహణ కొరకు ప్రతిపాదించండి. స్వీయ ప్రతిపాదన నేను చేయను. ధన్యవాదాలు. ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 04:31, 16 డిసెంబరు 2020 (UTC)

ఫలితం[మార్చు]

ఈ ప్రతిపాదన సమయం కొనసాగుతున్న సమయంలో నోముల ప్రభాకర్ గౌడ్ గారు నిర్వాహకత్వ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు రచ్చబండలో తెలియజేసినందున ఈ ప్రతిపాదన విఫలమైంది. ప్రభాకర్ గౌడ్ గారు మరి కొన్నాళ్లు తెవికీలో సమర్ధవంతంగా పనిచేసి ఆ తరువాత నిర్వాహకహోదాకు ప్రయత్నించమని కోరడమైనది. చర్చలో పాల్గొన్న సభ్యులకు ధన్యవాదాలు. – K.Venkataramana  – 14:17, 16 డిసెంబరు 2020 (UTC)