Jump to content

వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/అయోమయ నివృత్తి/అయోమయ నివృత్తి పేజీల గణాంకాలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

అయోమయ నివృత్తి పేజీ శీర్షిక

[మార్చు]

చదువరి గారూ, నాకు ఎప్పట్నుంచో ఉన్న అనుమానం. అయోమయ నివృత్తి పేజీ పేరులో ఖచ్చితంగా "(అయోమయ నివృత్తి)" అని ఉండాల్సిందేనంటారా? నాకైతే అవసరం మేరకు ఉండవచ్చు అనిపిస్తుంది. ఉదాహరణకు ఆంగ్లంలో Sachin పేజీని చూడండి. దాని పేరులో (Disambiguation) అని లేదు. - రవిచంద్ర (చర్చ) 08:54, 1 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అయోమయ నివృత్తి అని క్వాలిఫై చేయటం తప్పనిసరి అని నా అభిప్రాయం. అయోమయనివృత్తి అనే మూస కేవలం ఆ పేజీలు అయోమయ నివృత్తి అనే వర్గంలోకి చేరటానికి మాత్రమే పనికివస్తుంది కానీ, అయోమయ నివృత్తి పేజీ అని గుర్తించటానికి అవకాశంలేదు.వేల గ్రామ పేజీలలో సవరణలు చేసిన నా అనుభవం ప్రకారం, అయోమయ నివృత్తి అని క్వాలిఫై చేయనందున జరిగిన లోపం ఒకటి ఇక్కడ ఉదహరిస్తున్నాను.
ఉదాహరణ, వివరణ
దేవీపట్నం మండలం, ఇది తూర్పు గోదావరి జిల్లాలోని మండల వ్యాసం పేజీ. దేవీపట్నం మండల వ్యాసంలోకి వెళ్లి మండలంలోని గ్రామాలు విభాగంలోని 1. గంగవరం 2. పెద్దూరు 3. దమనపల్లి 4.రాయవరం అనే గ్రామాల లింకులు పరిశీలించండి. అవి అన్ని అయోమయనివృత్తి పేజీలకు కలపబడినవి.ఈ పరిస్థితి కలగటానికి కారణం అయోమయ నివృత్తి అని క్వాలిఫై చేయనందున ఇటువంటి పొరపాట్లు జరిగాయి. వాస్తవంగా వరుసగా1. గంగవరం (తూర్పు గోదావరి) 2. పెద్దూరు (దేవీపట్నం), 3. దమనపల్లి (దేవీపట్నం), 4. రాయవరం (తూర్పు గోదావరి జిల్లా) ఈ గ్రామాలకు లింకులు కలవాలి.కానీ అయోమయనివృత్తి పేజీని క్వాలిఫై చేయనందున గ్రామం కనపడగానే లింకులు కలిపిన పరిస్థితి కనపడుతుంది.ఇలాంటివి దాదాపుగా తెలంగాణలో లేకుండా సవరించాను.అలాగే ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు పూర్తిచేసి, ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 30 మండలాలలో ఇతర సవరింపులలో భాగంగా, ఇవి సవరించుట జరుగుతుంది.ఇది ఒక్క గ్రామ వ్యాసాలకే కాదు.ఈ పరిస్థితి అన్ని వ్యాసాలకు వర్తిస్తుంది.అలాంటివి నేను గమనించిన సందర్బాలు లేకపోలేదు. అందువలన అన్ని అయోమయ నివృత్తి పేజీలు క్వాలిఫై చేయటం తప్పనిసరి అని నా అభిప్రాయం. యర్రా రామారావు (చర్చ) 11:50, 1 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@రవిచంద్ర గారూ, పరిస్థితిని బట్టి ఇందులో రెండు విధాలండి -
పరిస్థితి 1: అయోమయం కలిగిస్తున్న పేజీల్లో ఒకటి ప్రధానమైన పేజీ అయి, మిగతావి అంత ప్రధానమైనవి కాకపోతే, అప్పుడు అ.ని. పేజీలో (అయోమయ నివృత్తి) ఉండాలండి. ఉదాహరణకు "గూడూరు" చూస్తే ఆ పేరుతో గూడూరు పట్టణం అన్నిటి కంటే ప్రసిద్ధి చెందినది కాగా మిగతా పేజీలన్నీ చిన్నా చితకా గ్రామాల పేజీలే. ఈ సందర్భంలో "గూడూరు" అనే పేజీ గూడూరు పట్టణానికి పోవాలి, అ.ని. పేజీ పేరు "గూడూరు (అయోమయ నివృత్తి)" అని ఉండాలి. (ఆ విధంగా లేనందువలన ప్రస్తుతం గూడూరు అ.ని. పేజీకి 516 ఇన్‌కమింగు లింకులున్నాయి. నేను ముందుగా సరిచెయ్యబోతున్నది ఈ లింకులనే)
పరిస్థితి 2: అయోమయం కలిగిస్తున్న పేజీలన్నిటికీ ఒకే స్థాయి ప్రాధాన్యత ఉంటే అ.ని. పేజీలో "(అయోమయ నివృత్తి)" అని ఉండనక్కర్లేదు. ఉదాహరణకు వెంకటాపురం అనే పేరుతో అనేక పేజీలున్నై. అన్నీ కూడా గ్రామాల పేజీలే, ఏ ఒక్క దానికీ ప్రత్యేక ప్రాధాన్యత అంటూ లేదు. ఈ సందర్భంలో అ.ని. పేజి పేరు "వెంకటాపురం" అని ఉంటే చాలు, అందులో "(అయోమయ నివృత్తి)" ఉండనక్కర్లేదు. కానీ..
మనం లింకులిచ్చేటపుడు జాగ్రత్తగా చూసుకుని ఇవ్వకపోతే "పరిస్థితి 2" లో అ.ని. పేజీకి లింకు ఇచ్చే ఆవకాశం చాలా ఎక్కువగా ఉంది. పైన @యర్రా రామారావు గారు చెప్పినది దీనికొక ఉదాహరణ. కింది గణాంకాన్ని పరిశీలిస్తే మనకు దాని తీవ్రత అర్థమౌతుంది:
  • 10, అంతకంటే ఎక్కువ ఇన్‌కమింగు లింకులున్న అ.ని. పేజీలు మొత్తం తెవికీలో 906 ఉంటే, వాటిలో - పేరులో "(అయోమయ నివృత్తి)" అని ఉన్న పేజీలు కేవలం 10 (పదే).
దీన్నిబట్టి, పేరులో "(అయోమయ నివృత్తి)" అని ఉంటే దానికి లింకు ఇవ్వడం తగ్గుతుందని భావించి అలా అన్నాను.
దీని విషయంలో చర్చ లేవదీసినందుకు ధన్యవాదాలు. ఇతర సభ్యుల అభిప్రాయాలు కూడా వచ్చాక, సముదాయం నిర్ణయం ఎలా ఉంటే అలా చేద్దామండి. __ చదువరి (చర్చరచనలు) 15:00, 1 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]