అక్షాంశ రేఖాంశాలు: 15°16′08″N 76°23′27″E / 15.2689°N 76.3909°E / 15.2689; 76.3909

హోస్పేట్

వికీపీడియా నుండి
(విజయనగర నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Hosapete
City
Vijayanagara
Tungabadhra Dam near Hospet
Tungabadhra Dam near Hospet
Nickname(s): 
Steel City, Back Door of Vijayanagara
Hosapete is located in Karnataka
Hosapete
Hosapete
Location in Karnataka, India
Coordinates: 15°16′08″N 76°23′27″E / 15.2689°N 76.3909°E / 15.2689; 76.3909
Country India
StateKarnataka
DistrictVijayanagara
Established1520 (504 సంవత్సరాల క్రితం) (1520)
Founded byKrishnadevaraya
Named forNagalapura
Government
 • TypeCity Municipal Council
 • BodyCMC
విస్తీర్ణం
 • City70.12 కి.మీ2 (27.07 చ. మై)
Elevation
479 మీ (1,572 అ.)
జనాభా
 (2011)[1]
 • City2,06,167
 • Rank224th India, 14th Karnataka
 • జనసాంద్రత2,900/కి.మీ2 (7,600/చ. మై.)
 • Metro
2,44,048
Languages
 • OfficialKannada
Time zoneUTC+5:30 (IST)
PIN
583 201, 02, 03, 11, 23, 25
Telephone code08394
Vehicle registrationKA-35

హోస్పేట్ లేదా విజయనగర భారతదేశం, కర్ణాటక రాష్ట్రంలోని విజయనగర జిల్లా లోని నగరం.ఇది విజయనగర జిల్లాకు ప్రధాన కార్యాలయం.ఈ నగరం తుంగభద్ర నది ఒడ్డున ఉంది.హంపి నుండి 13 కి.మీ. దూరంలో ఉంది.ప్రస్తుత హంపి పట్టణం విజయనగర సామ్రాజ్యానికి రాజధాని.ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. హోసపేట ఉత్తర, దక్షిణ కర్ణాటకల మధ్య అనుసంధాన మార్గం ఉంది.ఇది రాష్ట్ర రాజధాని బెంగళూరు నుండి 333 కిమీ దూరంలో ఉందింది.

చరిత్ర

[మార్చు]

హోసపేట నగరాన్ని సా.శ. 1520 లో విజయనగర సామ్రాజ్య ప్రముఖ పాలకులలో ఒకరైన శ్రీ కృష్ణ దేవరాయలు నిర్మించాడు.అతను తన తల్లి నాగలాంబిక గౌరవార్థం ఈ నగరాన్ని నిర్మించాడు.ఈ నగరానికి మొదట నాగలాపుర అని పేరు పెట్టారు.అయినప్పటికీ, ప్రజలు నగరాన్ని హోసా పేట్ అని పిలుస్తారు.దీని అర్థం "కొత్త నగరం" అని సూచిస్తుంది.హంపి, హోసపేట మధ్య ప్రాంతాన్ని ఇప్పటికీ నాగలాపుర అని పిలుస్తారు.పశ్చిమతీరం నుండి వచ్చే ప్రయాణికులకు విజయనగర నగరానికి ఇది ప్రధాన ద్వారం.

రాజకీయాలు

[మార్చు]

ఈ ప్రాంతానికి ప్రస్తుత శాసనసభ సభ్యుడు ఆనంద్ సింగ్.[2] అక్టోబరు 2014లో నగరం పేరు మార్చాలనే అభ్యర్థనను ప్రభుత్వం ఆమోదించింది. 2014 నవంబరు 1న హోస్పేట్ పేరు "హోసపేట"గా మార్చింది [3]

నగర విశేషాలు

[మార్చు]

ప్రస్తుతం దేశంలోనే ఎత్తైన జెండా స్తంభం ఈ నగరంలో ఉంది.2022 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హోసపేటలో 405 అడుగుల ఎత్తైన స్తంబంతో జాతీయ జెండాను ఎగురవేశారు. [4]

తుంగభద్ర ఆనకట్ట

నగరం గురించి

[మార్చు]

హోసపేట భారతదేశంలోని అనేక ముఖ్యమైన నగరాలతో రహదారి మార్గాలు ద్వారా చక్కగా అనుసంధానించబడి ఉంది. దీనికి బళ్లారి సుమారు 60 కిమీ దూరంలో ఉంది.హోసపేట జంక్షన్ రైల్వే స్టేషన్ హుబ్లీ - గుంతకల్ రైలు మార్గంలో ఉంది. [5] హోసపేట నగరానికి సమీప విమానాశ్రయం జిందాల్ విద్యానగర్ విమానాశ్రయం (బళ్లారి విమానాశ్రయం). హోసపేట నుండి సుమారు 3౦ కిమీ దూరంలో ఉంది.ఇది ప్రతిరోజూ బెంగళూరు, హైదరాబాద్ నుండి విమానాలను అందిస్తుంది.అదనంగా నగరంలో బాగా అభివృద్ధి చెందిన వ్యాపార కూడలి ప్రాంతం ఉంది. హంపి, తుంగభద్ర ఆనకట్టలుకు సమీపంలో ఉండటం వల్ల హోసపేట ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందింది.

పురపాలక మైదానం సాయంత్రం నడవడానికి,ఆటలకు అప్పుడప్పుడు వ్యాపార ప్రదర్శనలకు అనుకూలంగా ఉంటుంది.దాని చుట్టూ తినుభండారాల కేంద్రాలు కూడా ఉన్నాయి.

జనాభా శాస్త్రం

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం,హోస్పేట్ మొత్తం జనాభా 2,06,167, ఇందులో పురుషులు 1,02,668 మందికాగా,స్త్రీలు 1,03,499 మంది ఉన్నారు. పట్టణంలో సగటు అక్షరాస్యత రేటు 79.30% శాతం ఉంది. పురుషుల అక్షరాస్యత 85.95% శాతం ఉండగా,స్త్రీల అక్షరాస్యత 72.74%. శాతం ఉంది. హోస్పేట్‌ జనాభాలో 13.46% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు .

హోస్పేట్‌లోని మతాల ప్రకారం జనాభా
మతం శాతం
హిందూ
  
71%
ఇస్లాం
  
20%
క్రైస్తవులు
  
3.3%
జైనులు
  
5%
ఇతరులు†
  
0.7%
మతాలు ప్రకారం శాతం
Includes సిక్కులుs (0.2%), బౌధ్దులు (<0.2%).

2011 జనాభా లెక్కలు ప్రకారం హోస్పేట్ నగరలో భాషలు

  కన్నడ (38.50%)
  తెలుగు (26.32%)
  ఉర్థూ (25.04%)
  ఇతరభాషలు (10.14%)

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "District Census Handbook – Guntur" (PDF). Census of India. The Registrar General & Census Commissioner. p. 22. Retrieved 6 November 2016.
  2. "Mine lessees slug it out in Vijayanagar". The Hindu.
  3. New City, Names to Karnatka. "New name for cities". The Hindu. Retrieved 1 November 2014.
  4. "Karnataka: Tricolour to be hoisted on 405-foot pole on Independence Day | Hubballi News - Times of India". The Times of India.
  5. Hubballi, Hospet To. "Hospet to Hubballi Train Timings". Hospet.xyz. Archived from the original on 27 జూన్ 2019. Retrieved 27 June 2019.

వెలుపలి లంకెలు

[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=హోస్పేట్&oldid=3946598" నుండి వెలికితీశారు