విజయ మెహతా
విజయ మెహతా | |
---|---|
జననం | విజయ జయవంత్ 1934 నవంబరు 4 |
జీవిత భాగస్వామి | హరీన్ ఖోటే (మరణం) ఫరోఖ్ మెహతా |
పిల్లలు | అనాహిత ఉబెరాయ్ |
పురస్కారాలు | 1975 సంగీత నాటక అకాడమీ అవార్డు 1985 ఆసియా పసిఫిక్ ఫిల్మ్ ఫెస్టివల్: ఉత్తమ నటి: పార్టీ 1986 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సహాయ నటి: రావ్ సాహెబ్ |
విజయ మెహతా గుజరాత్ కు చెందిన నాటకరంగ, సినిమా నటి, దర్శకురాలు.[1] మరాఠీ సినిమాలు, నాటకరంగంలో పనిచేసింది. ముంబైకి చెందిన రంగయాన్ అనే నాటక సంస్థ వ్యవస్థాపక సభ్యురాలు, నాటక రచయిత విజయ్ టెండూల్కర్, నటులు అరవింద్ దేశ్‌పాండే, శ్రీరామ్ లాగూలతో కలిసి సనిచేసింది. పార్టీ (1984) సినిమాలో నటించడంతోపాటు రావ్ సాహెబ్ (1986), పెస్టోంజీ (1988) సినిమాలకు దర్శకత్వం వహించి గుర్తింపు పొందింది. 1960లలో ప్రయోగాత్మక మరాఠీ నాటకరంగ ప్రముఖురాలిగా ఎదిగింది.[2]
జననం, విద్య
[మార్చు]విజయ మెహతా 1934, నవంబరు 4న గుజరాత్ రాష్ట్రంలోని బరోడా పట్టణంలో జన్మించింది.[3] ముంబై విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలైన విజయ, ఢిల్లీలో ఇబ్రహీం అల్కాజీ వద్ద నాటకరంగంలో శిక్షణ పొందింది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]నటి దుర్గా ఖోటే కుమారుడు హరిన్ ఖోటేతో విజయ మెహతా వివాహం జరిగింది. అతను చిన్న వయస్సులోనే మరణించాడు. ఆ తర్వాత, ఫరోఖ్ మెహతాను వివాహం చేసుకుంది.[4]
కళారంగం
[మార్చు]60వ దశకంలో మరాఠీ ప్రయోగాత్మక నాటకరంగంలో కీలక భూమిక పోషించింది. నాటక రచయిత విజయ్ టెండూల్కర్, అరవింద్ దేశ్‌పాండే, శ్రీరామ్ లాగూలతో కలిసి రంగయాన్ అనే నాటక సంస్థను ప్రారంభించింది.[5] సిటి ఖనోల్కర్ ఏక్ శూన్య బాజీరావు అనే నాటకం సమకాలీన భారతీయ నాటకరంగంలో ఒక మైలురాయిగా పరిగణించబడుతోంది. ది కాకేసియన్ చాక్ సర్కిల్ (అజబ్ న్యాయ్ వర్తులాచా ), ఐయోనెస్కో విత్ చైర్స్‌ల అనుసరణతో ఆమె బెర్టోల్డ్ బ్రెచ్ట్‌ను మరాఠీ నాటకరంగంలోకి పరిచయం చేసింది. జర్మన్ దర్శకుడు ఫ్రిట్జ్ బెన్నెవిట్జ్‌తో ఇండో-జర్మన్ నాటక ప్రదర్శనలకు సహకారం అందించింది. ఇందులో జర్మన్ నటీనటులతో భాసుడి ముద్రరాక్షస సంప్రదాయ నాటక ప్రదర్శన కూడా ఉంది. 1975 సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకుంది. 1986లో రావ్ సాహెబ్ సినిమాలోని తన పాత్రకు ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.
సినిమాలు
[మార్చు]- కలియుగ్ (1981) - నటి
- స్మృతి చిత్రే (1982, టివి సినిమా) - దర్శకురాలు, నటి
- శాకుంతలం (1986, టివి సినిమా) - దర్శకురాలు
- పార్టీ (1984) - నటి
- రావు సాహెబ్ (1985) - దర్శకురాలు, స్క్రీన్ ప్లే రచయిత, నటి
- హవేలీ బులుంద్ థీ (1987, టివి సినిమా) - దర్శకురాలు
- హమీదాబాయి కి కోఠి (1987, టివి సినిమా) - దర్శకురాలు
- పెస్టోంజీ (1988) - దర్శకురాలు, స్క్రీన్ ప్లే రచయిత
- లైఫ్‌లైన్ (1991, టివి సిరీస్) - దర్శకురాలు
- క్వెస్ట్ (2006) - నటి
అవార్డులు
[మార్చు]- 1975 సంగీత నాటక అకాడమీ అవార్డు
- 1985 ఆసియా పసిఫిక్ ఫిల్మ్ ఫెస్టివల్: ఉత్తమ నటి: పార్టీ[6]
- 1986 ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం: రావు సాహెబ్ [7]
- 2009 తన్వీర్ సన్మాన్ [8]
- 2012 సంగీత నాటక అకాడమీ ఠాగూర్ రత్న
మరింత చదవడానికి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Abhijit Varde: Daughters of Maharashtra: Portraits of Women who are Building Maharastra : Interviews and Photographs, 1997, p. 87
- ↑ "The return of Desdemona". Mumbai Mirror. 25 January 2014. Retrieved 2023-01-12.
- ↑ A space of her own : personal narratives of twelve women. 2005.
- ↑ Shanta Gokhale (26 November 2012). "Life at play". Pune Mirror. Archived from the original on 17 February 2013.
- ↑ "Shantata! Awishkar Chalu Aahe". Mumbai Theatre Guide. August 2008.
- ↑ Awards IMDb.
- ↑ "33rd National Film Awards". International Film Festival of India. pp. 28, 36. Archived from the original on 5 May 2014. Retrieved 2023-01-12.
- ↑ "तन्वीर सन्मान सोहळा - २००९ | Maayboli".
- ↑ A space of her own : personal narratives of twelve women. 2005.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో విజయ మెహతా పేజీ