విధివిలాసం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విధివిలాసం
(1970 తెలుగు సినిమా)
Vidhi Vilasam (1970)-Song Booklet.jpg
సినిమా పోస్టర్
దర్శకత్వం తాపీ చాణక్య
తారాగణం కృష్ణ,
విజయనిర్మల
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
భాష తెలుగు

విధివిలాసం ‘ప్రగతి పిక్చర్స్’ బ్యానర్‌పై సి.వి.ఆర్.ప్రసాద్ నిర్మించిన తెలుగు చిత్రం. ఈ సినిమా 1970,మార్చి 12న విడుదలయ్యింది[1].

సాంకేతిక వర్గం[మార్చు]

నటీనటులు[మార్చు]

కథ[మార్చు]

ఆస్తిపరుడు, రిటైర్డ్ ఇంజనీరు నాగయ్య. అతని నౌకరు గోవిందు. భార్య చనిపోగా, నాగయ్య కుమార్తె ఆరేళ్ల నిర్మల దేవుని ఉత్సవంలో తప్పిపోతుంది. ఆ బెంగతో నాగయ్య కుమిలిపోతుంటాడు. ఓ నర్సు సంరక్షణలో పెరిగిన నిర్మల పెంచిన తల్లి మరణించటంతో, ఓ మెస్ నడిపే శేషమ్మ ఆశ్రయం పొందుతుంది. అక్కడ ఇంజనీరింగు చదివే కృష్ణతో పరిచయం ప్రేమగా మారుతుంది. అదే ఊరిలోని కాంట్రాక్టర్ కామేశం, అతని కుమార్తె లలిత డ్యాన్సర్. లలిత కృష్ణను ఇష్టపడుతుంది. కాని కృష్ణ, నిర్మలను వివాహం చేసుకొని ఉద్యోగం నిమిత్తం మరో ఊరువెళ్తాడు. అక్కడ స్నేహితుడు రామారావు, అతని భార్య రాధలతో నివసిస్తూంటారు. రాధ, నిర్మల ఒకేసారి గర్భవతులు కావటం, వారి ప్రసవ సమయానికి కృష్ణ, రామారావులు వేరే ఊరువెళ్లటం జరుగుతుంది. అనుకోకుండా సంభవించిన తుఫాను కారణంగా రాధ ఓ పాపకు జన్మనిచ్చి మరణిస్తుంది. ఆ పాపే తన కుమార్తె అని, భార్య నిర్మల మరణించిందని భావించి పాపను జ్యోతి పేరుతో పెంచుతుంటాడు కృష్ణ. మరోచోట మగబిడ్డను ప్రసవించిన నిర్మల భర్త జాడ తెలియక అనుకోకుండా గోవిందు ఆశ్రయం పొంది పడరాని పాట్లు పడుతుంది. కృష్ణ కూతురు జ్యోతి, నిర్మల కొడుకు రాము ఆరేళ్ల వయసుకు వస్తారు. అదే ఊరికి వచ్చిన లలిత తిరిగి కృష్ణకు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తుంటుంది. కృష్ణ, నిర్మల పెంపుడు కుక్క టామీ, జ్యోతి, రామూలవల్ల భార్యాభర్తలు తిరిగి కలుసుకుంటారు. నిర్మలను అంతం చేయబూనిన లలిత -వారిని క్షమాపణ కోరటంతో కథ సుఖాంతమవుతుంది[1].

పాటలు[మార్చు]

  1. మంచి వాళ్లు ఈ బాబులు మామంచి (గానం: విజయలక్ష్మీశర్మ, పుష్పలత)
  2. విధి విలాసమేలే అంతా విధి విలాసమేలే (గానం: కె.బి.కె.మోహన్ రాజు)
  3. కాలానికి హృదయం లేదు కన్నీటికి విలువ లేదు (గానం: కె.బి.కె.మోహన్ రాజు)
  4. ముసురేసిందంటే పైన అసలేమతి (గానం: కె.బి.కె.మోహన్ రాజు, విజయలక్ష్మీశర్మ)
  5. వల్లరి బాబోయి కావురోరయ్యా (గానం: కె.బి.కె.మోహన్ రాజు, విజయలక్ష్మీశర్మ)
  6. బాపూజీ మన బాపూజీ జిందాబాద్ (గానం: చిత్తరంజన్ బృందం)

విశేషాలు[మార్చు]

  • ఈ చిత్రం పూర్తిగా హైదరాబాదులో చిత్రీకరించబడింది.
  • ఇది తాపీ చాణక్య దర్శకత్వంలో కృష్ణ నటించిన తొలిచిత్రం.
  • ఈ చిత్రంలో బాలనటి, కృష్ణ కూతురిగా నటించిన బేబి శ్రీదేవి తరువాతి కాలంలో హీరోయిన్‌గా కృష్ణ సరసన పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది.
  • మాస్టర్ వేణు ఈ చిత్ర సంగీతదర్శకుడైనా, చిత్రానికి నేపథ్యసంగీతం ది హైదరాబాద్ ఫిల్మ్ టాలెంట్ గిల్ట్ సభ్యులు అందించారు.
  • చిత్రంలో సాబు అనే కుక్క చేత చేయించిన విన్యాసాలు ప్రేక్షకులను అలరించాయి.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి (7 March 2020). "ఫ్లాష్ బ్యాక్ @ 50 విధి విలాసం". ఆంధ్రభూమి దినపత్రిక. Archived from the original on 5 జూన్ 2020. Retrieved 5 June 2020.

బయటి లింకులు[మార్చు]