వీర్నపల్లి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వీర్నపల్లి మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో రాజన్న సిరిసిల్ల, వీర్నపల్లి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రాజన్న సిరిసిల్ల, వీర్నపల్లి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రాజన్న సిరిసిల్ల, వీర్నపల్లి మండలం స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రాజన్న సిరిసిల్ల
మండల కేంద్రం వీర్నపల్లి
గ్రామాలు 06
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 108 km² (41.7 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 13,363
 - పురుషులు 6,597
 - స్త్రీలు 6,766
పిన్‌కోడ్ 505305


వీర్నపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఒక మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] దానికి ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం సిరిసిల్ల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 6  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు. వీర్నపల్లి, ఈ మండలానికి కేంద్రం.

నూతన మండల కేంద్రంగా ఏర్పాటు[మార్చు]

లోగడ వీర్నపల్లి, కరీంనగర్ జిల్లా, సిరిసిల్ల రెవెన్యూ డివిజను పరిధిలోని ఎల్లారెడ్డిపేట్ మండలానికి చెందిన గ్రామం. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా వీర్నవల్లి గ్రామం కేంద్రంగా, (1+05) ఆరు గ్రామాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ కొత్త మండలాన్ని ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది. ఈ మండల వైశాల్యం 108 చ.కి.మీ. కాగా, జనాభా 13,363. జనాభాలో పురుషులు 6,597 కాగా, స్త్రీల సంఖ్య 6,766. మండలంలో 3,106 గృహాలున్నాయి.[4]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. వీర్నపల్లి
  2. వనపల్లి
  3. గర్జనపల్లి
  4. అడవిపదిర
  5. కంచర్ల
  6. మద్దిమళ్ళ

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 228 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "రాజన్న సిరిసిల్ల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "రాజన్న సిరిసిల్ల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు[మార్చు]