వెంకటపతి రాజు

వికీపీడియా నుండి
(వెంకటపతిరాజు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వెంకటపతి రాజు
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సాగి లక్ష్మీ వెంకటపతి రాజు
పుట్టిన తేదీ (1969-07-09) 1969 జూలై 9 (వయసు 55)
ఆలమూరు, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్
మారుపేరుమసిల్స్, లచ్చి
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుఎడమచేతి స్లో ఆర్థడాక్స్
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 189)1990 ఫిబ్రవరి 2 - న్యూజీలాండ్ తో
చివరి టెస్టు2001 మార్చి 11 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 75)1990 మార్చి 1 - న్యూజీలాండ్ తో
చివరి వన్‌డే1996 మే 26 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డే ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 28 53 177 124
చేసిన పరుగులు 240 32 1,952 109
బ్యాటింగు సగటు 10.00 4.00 13.18 5.45
100లు/50లు 0/0 0/0 0/2 0/0
అత్యుత్తమ స్కోరు 31 8 54 22
వేసిన బంతులు 7,602 2,770 42,710 6430
వికెట్లు 93 63 589 152
బౌలింగు సగటు 30.72 31.96 27.72 29.98
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 5 0 31 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 1 0 5 0
అత్యుత్తమ బౌలింగు 6/12 4/46 7/82 6/39
క్యాచ్‌లు/స్టంపింగులు 6/– 8/– 71/– 26/–
మూలం: CricInfo, 2006 ఫిబ్రవరి 4

1969 జూలై 9న జన్మించిన వెంకటపతి రాజు (Sagi Lakshmi Venkatapathy Raju) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. కుడి చేతితో బ్యాటింగ్ చేసిననూ బౌలింగ్ మాత్రం ఎడమచేతితో చేసేవాడు. అతను దేశీయ సీజన్‌లో 32 వికెట్లు తీసిన తర్వాత 1989-90లో భారత జట్టులోకి వచ్చాడు. న్యూజిలాండ్ పర్యటనలో టెస్టు, వన్డే అంతర్జాతీయ పోటీల్లో ప్రవేశించాడు. అతని మొదటి టెస్టు ఇన్నింగ్స్‌లో నైట్-వాచ్‌మెన్‌గా పంపినప్పుడు, అతను రెండు గంటల కంటే ఎక్కువసేపు బ్యాటింగ్ చేసి, 31 పరుగులు చేసాడు. మరోవైపు ఆరు వికెట్లు పడిపోయాయి. 1990లో ఇంగ్లండ్‌లో పర్యటించిన భారత జట్టులో భాగమయ్యాడు. అయితే గ్లౌసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో కోర్ట్నీ వాల్ష్ వేసిన బంతి తగిలి చేత అతని ఎడమ చేతి వేళ్ళ మెజ్టికలు విరిగిపోవడంతో అతని పర్యటన ముగిసింది.

భారత్‌లో స్వదేశానికి తిరిగి వచ్చిన అతను చండీగఢ్‌లోని సెక్టార్ 16 స్టేడియంలో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంకపై విజయం సాధించడంలో తోడ్పడ్డాడు. ఆ టెస్టుకు రాజు ఎంపిక ఆఖరి నిమిషంలో జరిగింది. రెండో రోజు, అతను 39 బంతుల్లో రెండు పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసి శ్రీలంక మిడిల్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. మరుసటి రోజు 17.5 ఓవర్లలో 12 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు, నలుగురు బ్యాట్స్‌మన్లు ఖాతా తెరవనే లేదు. అతని మ్యాచ్ గణాంకాలు 53 ఓవర్లలో 37 పరుగులకు 8 వికెట్లు. అతని అంతర్జాతీయ కెరీర్‌లో వచ్చిన ఏకైక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అది. [1] అతను 1992, 1996 లో భారతదేశం తరపున రెండు ప్రపంచ కప్‌లు ఆడాడు.

కలకత్తాలో ఆస్ట్రేలియాతో చివరి టెస్టు మ్యాచ్ ఆడిన రాజు, మార్క్ వా వికెట్‌ను తీశాడు.

రాజు చాలా సంవత్సరాలు హైదరాబాద్ తరపున ఆడాడు. 1999-2000 రంజీ ట్రోఫీలో ఫైనల్‌కు చేరిన జట్టులో ఆడాడు, 2004 డిసెంబరులో ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత ఫస్ట్-క్లాస్ క్రికెట్ నుండి రిటైరయ్యాడు.

రాజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషనుకు మాజీ వైస్ ప్రెసిడెంట్.[2] అంతకుముందు, అతను 2007-2008 సమయంలో MS ధోని కెప్టెన్సీలో భారతదేశం ICC వరల్డ్ T20 గెలిచినప్పుడు సౌత్ జోన్ నుండి భారత క్రికెట్ జట్టుకు సెలెక్టరుగా పనిచేసాడు. అతను 2019 ప్రపంచ కప్ సమయంలో హాట్‌స్టార్‌కు తెలుగు వ్యాఖ్యాతగా పనిచేశాడు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Wisden reports of Sri Lanka's tour of India, 1990–91
  2. "Venkatapathy Raju: The man who changed his fortunes by switching over from a right-arm off-spinner to a left-arm spinner!". 9 July 2013. Retrieved 23 April 2014.

బయటి లింకులు

[మార్చు]