వేంపెంట

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
వేంపెంట
—  రెవిన్యూ గ్రామం  —
వేంపెంట is located in ఆంధ్ర ప్రదేశ్
వేంపెంట
అక్షాంశరేఖాంశాలు: 15°46′29″N 78°31′19″E / 15.774760°N 78.52207°E / 15.774760; 78.52207
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కర్నూలు
మండలం పాములపాడు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,692
 - పురుషుల సంఖ్య 2,379
 - స్త్రీల సంఖ్య 2,313
 - గృహాల సంఖ్య 1,216
పిన్ కోడ్ 518 533
ఎస్.టి.డి కోడ్ 08517

వేంపెంట, కర్నూలు జిల్లా, పాములపాడు మండలానికి చెందిన గ్రామము.[1]. పిన్ కోడ్ నం. 518 533., యస్.టీ.డీ.కోడ్ నం. 08517.

గ్రామ చరిత్ర[మార్చు]

1830లో వ్రాసిన యాత్రాచరిత్రలో గ్రామాన్ని గురించిన ప్రస్తావనలు దొరుకుతున్నాయి. 1830 సంవత్సరం జూన్ నెలలో యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రలో భాగంగా ఈ గ్రామంలో మజిలీ చేశారు. ఈ గ్రామం అప్పట్లో కందనూరు నవాబు పరిపాలనలో ఉండేది. వేల్పనూరు గ్రామం నుంచి ఈ గ్రామానికి వచ్చిన ఆయన దారిలో అడవి ఎక్కువగా ఉండేదని, మృగభయము ఉండేదని వ్రాశారు. దారి గులకరాయి, రేగడిమన్ను కలిసిన భూమి యన్నారు[2].

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

వేంపెంట గ్రామాన్ని 19వ శతాబ్దికి చెందిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య వెంపెంటగా ప్రస్తావించారు. 1830ల్లో గ్రామానికి వెంపెంట అనే నామాంతరమే బలీయంగా ఉండేదని చెప్పుకోవచ్చు.[2]

గ్రామ భౌగోళికం[మార్చు]

ఈ గ్రామ బస్టాండు సమీపములో నిప్పులవాగు మరియు శ్రీశైలం రిజర్వాయరు ఎడమ కాలువ కలుస్తాయి. వేంపెంట మధ్యలో ఈ వాగు ప్రవహిస్తున్నది. వాగుపై చిన్న వంతెన నిర్మించబడింది. వాగు అవతల ఇందిరా నగర్ ఉంది. వాగు ఇవతల కృష్ణా జిల్లా (శ్రీరామ్ నగర్) కొట్టాలు, సుంకులమ్మ కొట్టాలు మరియు నడి ఊరు ఉన్నాయి. ఈ గ్రామ పొలాలలో అలవాగు, బండలాగు అను రెండు పిల్ల కాలువలు ప్రవహిస్తాయి. వ్యవసాయానికి కె.సి.కెనాల్ ప్రధాన నీటి వనరు.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

ఈ గ్రామం దగ్గరలో వెలుగోడు పట్టణం ఉంది. అక్కడ డిగ్రీ మరియు ఇంటర్ కళాశాలలు ఉన్నాయి. విద్యాపరంగా ఈ గ్రామము.[1] బాగా అభివృద్ధి చెందుతున్నది.

గ్రామము.[1] లో మౌలిక వసతులు[మార్చు]

ఈవూరిలోని నిప్పుల వాగు పై 2013 జూన్ 21 నాడు ఒక జలవిద్యుత్ కేంద్రం నిర్మాణం ప్రారంభమయినది. దీని నిర్మాణానికి 40 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా. దీని ద్వారా 7.2 మెగావాట్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుంది. దీని నిర్మాణం 30 నెలలో పూర్తి కాగలదని అంచనా. రాంకీ కంపెనీవారు దీనిని నిర్మాణం చేస్తున్నారు. [1]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

ఇది వ్యవసాయక గ్రామం.[1] ఈ గ్రామం నల్లమల అడవి సమీపాన ఉంది. ఈ గ్రామము.[1]లో వరి ప్రధాన పంట

గ్రామజనాబా[మార్చు]

జనాభా (2011) - మొత్తం 4,692 - పురుషుల సంఖ్య 2,379 - స్త్రీల సంఖ్య 2,313 - గృహాల సంఖ్య 1,216

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,290.ఇందులో పురుషుల సంఖ్య 2,211, మహిళల సంఖ్య 2,079, గ్రామంలో నివాస గృహాలు 961 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

[3]

  • ఇది మండలములోనే అతి పెద్ద గ్రామము.[1]. 2005 సర్వే ప్రకారం, గ్రామంలో 955 కుటుంబాలు నివసిస్తున్నాయి. పూర్తి జనాభా 4857. అందులో ఓటర్ల సంఖ్య 3525. గుంతకందాల, మద్దూరు, మిట్టకందాల, బనకచర్ల మరియు వెలుగోడు సరిహద్దు గ్రామాలు. .
వేంపెంట మధ్యలో ప్రవహిస్తున్న వాగు

చరిత్ర[మార్చు]

పెద్దల ప్రకారం, ఒకప్పుడు రెడ్డిపెంటగా ఉన్న గ్రామం ఇప్పుడు వేంపెంటగా మారింది. రెడ్డిపెంట నుండి గ్రామ ప్రజలు వేంపెంటకి మకాం మార్చారు. ఇప్పుడు రెడ్డిపెంట నిర్జన గ్రామము.[1]. అక్కడ పురాతన జనావాసపు ఆనవాళ్ళు ఇప్పటికీ కనిపిస్తాయి.

గ్రామ శోభ[మార్చు]

ఈ గ్రామంలో మూడు ప్రాథమిక పాఠశాలలు, ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల[4], ఒక పశువైద్యశాల ఉన్నాయి. ఈ గ్రామము.[1] పచ్చని పంటపొలాలతో అందంగా ఉంటుంది. ఇక్కడ పురాతన దేవాలయాలు (శివాలయం, రామాలయం, నాగమయ్య, సుంకులమ్మ, ఎల్లమ్మ, నాగుల కట్ట), చర్చిలు (మరియమ్మ, యేసు), మసీదులు మరియు పురాతన బావులు ఉన్నాయి. దసరా, సంక్రాంతి, పీర్ల పండగ, క్రిస్టమస్ మరియు శ్రీరామ నవమి పండగలు ఘనంగా జరుపుకుంటారు. కాని ఈ మధ్య కాలములో, నక్సలైట్ల కలహాల వల్ల ఈ గ్రామము.[1] తరచుగా పత్రికలకు ఎక్కినది. ఎన్నో జీవితాలు నాశనము అయినవి. దాని పూర్వ వైభవము కూడా కోల్పోయింది.ఇంకా ఈ వూరు ఆదర్శ గ్రామంగ ఎన్నో సార్లు ఎంపిక అయ్యింది.విద్యా పరంగా ఈగ్రామం బాగా అభివృద్ధి చెందింది. ఆచుట్టు ప్రక్కల గ్రామాలకు ఇదే విద్యా కేంద్రగా ఉంది. ఊరి మధ్యలో ఒడుపుగా పారే ఏరు వలన ఇది అప్పుడప్పుడు వరదలకు గురైతూ ఉంటుంది.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. 2.0 2.1 వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014. 
  3. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21
  4. http://projects.cgg.gov.in/dsemis/School.do?&mgtcode=1&schlcode=1314603&count=2


[1] ఈనాడు కర్నూలు 2013 జూన్ 22., 7వ పేజీ.
"https://te.wikipedia.org/w/index.php?title=వేంపెంట&oldid=2141703" నుండి వెలికితీశారు