వేలాల గట్టు మల్లన్న జాతర
వెలాల గట్టు మల్లన్న జాతర తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని వెలాల్ గ్రామంలో ఈ జాతర జరుగుతుంది.ఇది ప్రసిద్ధ శైవ క్షేత్రము.కొండమీద వెలసిన మల్లికార్జున స్వామి గట్టు మల్లన్న గా ప్రసిద్ధుడు.ఇచట ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మూడు రోజుల పాటు జాతర నిర్వహిస్తారు. [1][2].
| వెలాల గట్టు మల్లన్న జాతర | |
|---|---|
శ్రీ వేలాల గట్టు మల్లన్న
స్వామి ఆలయం వేలాల జైపూర్ | |
తెలంగాణ లో ప్రాంతం | |
| భౌగోళికాంశాలు : | 18°30′53″N 78°51′43″E / 18.514772°N 78.861809°E |
| పేరు | |
| ఇతర పేర్లు: | గట్టు మల్లన్న శైవ క్షేత్రం వేలాల క్షేత్రంగా |
| ప్రధాన పేరు : | వేలాల్ మల్లికార్జునస్వామి ఆలయం |
| దేవనాగరి : | वेलाल गट्टु मल्लना |
| ప్రదేశం | |
| దేశం: | భారత దేశం |
| రాష్ట్రం: | తెలంగాణ |
| జిల్లా: | మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలంలోని |
| ప్రదేశం: | వెలాల్ (యాలాల) |
| ఆలయ వివరాలు | |
| ప్రధాన దైవం: | గట్టు మల్లన్న స్వామి (శివుడు) |
| ప్రధాన దేవత: | శివలింగం నంది విగ్రహాలు |
| ఉత్సవ దైవం: | గట్టు మల్లన్న స్వామి |
| ముఖ్య_ఉత్సవాలు: | మహాశివరాత్రి |
| నిర్మాణ శైలి, సంస్కృతి | |
| వాస్తు శిల్ప శైలి : | హిందూ దేవాలయాల నిర్మాణ శైలి |
| దేవాలయాలు మొత్తం సంఖ్య: | రెండు |
జాతర
[మార్చు]
ఈ వెలాల్ గట్టు మల్లన్న జాతర మహా శివరాత్రి పండుగ సందర్భంగా మల్లికార్జున స్వామి ఆలయంలో మూడు రోజులు పాటు జాతర డిసెంబర్, జనవరి నెలలో జరుగుతుంది. భక్తులు స్వామి వారిని దర్శించుకొని బోనాలు సమర్పించి మొక్కులు చెల్లిస్తారు.శివరాత్రి పర్వదినం నాడు ఈ ప్రాంతంలో అశేష భక్త జనులతో ఆలయం కిటకిటలాడుతోంది. [3][4].
విశేషాలు
[మార్చు]ఇక్కడ లింగ రూపంలోని శివునికి ఉన్న నీటి చెలిమెలో ఏ కాలంలోనైనా నీరు ఉబుకుతూ ఉంటుంది. ఈ నీటినే భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు.వెలాల్ అనే పదం కాలక్రమేణా యాలాలగా పరిణమించింది.
భక్తుల తాకిడి
[మార్చు]ఈ వేలాల గట్టు మల్లికార్జునస్వామి దర్శించుకోవడానికి భక్తులు పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, నిజామాబాద్, తో పాటు మహారాష్ట్ర నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి గోదావరిలో స్నానమాచరించి మల్లన్న స్వామి మొక్కలు చేర్పించి జాతరలో పాల్గొంటారు[5].
మూలాలు
[మార్చు]- ↑ Rao, Rama (2022-02-24). "Mancherial: మంచిర్యాల జిల్లాలో ఘనంగా గట్టుమల్లన్న స్వామి జాతర". www.hmtvlive.com. Retrieved 2024-11-01.
- ↑ Today, Telangana (2021-03-07). "Arrangements made for Velala Jatara of Mancherial". Telangana Today (in ఇంగ్లీష్). Retrieved 2024-11-01.
- ↑ Rao, Rama (2022-02-24). "Mancherial: మంచిర్యాల జిల్లాలో ఘనంగా గట్టుమల్లన్న స్వామి జాతర". www.hmtvlive.com. Retrieved 2024-11-01.
- ↑ Rao, Rama (2022-02-24). "Mancherial: మంచిర్యాల జిల్లాలో ఘనంగా గట్టుమల్లన్న స్వామి జాతర". www.hmtvlive.com. Retrieved 2024-11-01.
- ↑ Bharat, E. T. V. (2020-02-21). "వేలాల జాతరకు పోటెత్తిన భక్తులు". ETV Bharat News. Retrieved 2024-11-01.