వైన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూస:Infobox beverage

వైన్ అనేది పులియబెట్టిన ద్రాక్ష నుండి తయారు చేయబడిన మద్య పానీయం. ఈస్ట్ అనే బ్యాక్టీరియా ద్రాక్షపండ్లలోని చక్కెరను ఇథనాల్, కార్బన్ డయాక్సైడ్‌గా మారుస్తుంది. రైస్ వైన్, ప్లం, చెర్రీ, దానిమ్మ, ఎండుద్రాక్ష, ఎల్డర్‌బెర్రీ వంటి ఇతరాలతో కూడా వైన్ తయారచేస్తారు. అయితే వైన్ వివిధ పండ్ల నుండి అనేక విధాలుగా తయారు చేయబడుతుంది, ద్రాక్ష అత్యంత సాధారణమైనది.

16వ శతాబ్దపు వైన్ ప్రెస్

కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ వైన్ అనేది తయారు చేయబడుతోంది. జార్జియా (6000 BCE), పర్షియా (5000 BCE), ఇటలీ, అర్మేనియా (4000 BCE) లోని కాకసస్ ప్రాంతం నుండి వైన్ ప్రారంభమయిందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. న్యూ వరల్డ్ వైన్ అనేది అమెరికా స్థానిక ప్రజలచే తయారు చేయబడిన మద్య పానీయాలకు కొంత సంబంధాన్ని కలిగి ఉంటుంది.[1] నేడు వైన్ ఉత్పత్తి ప్రాంతాలతో ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్, చైనా ముందువరుసలో ఉన్నాయి.[2]

హాన్ రాజవంశం సమాధి ఇటుకలు మద్యం తయారు చేస్తున్న కార్మికులను చూపుతున్నాయి

చరిత్ర[మార్చు]

వైన్ అనేది జార్జియా (సుమారు 6000 BCE),[1][3] ఇరాన్ (పర్షియా) (సుమారు 5000 BCE),[3][4] అర్మేనియా (c. 4100 BCE),[5] సిసిలీ ( సుమారు 4000 BCE)[6] లలో ప్రారంభయింది. 4500 నాటికి బాల్కన్‌లకు చేరుకుంది. పురాతన గ్రీస్, థ్రేస్, రోమ్‌లలో కూడా వినియోగించబడింది. మత్తు ప్రభావాల కోసం ఈ వైన్ ఉపయోగించబడింది.[7][8][9]

6000–5800 BCE నాటి ద్రాక్ష వైన్, వినికల్చర్‌కు సంబంధించిన తొలి పురావస్తు, ఆర్కియోబొటానికల్ ఆధారాలు ఆధునిక జార్జియా భూభాగంలో కనుగొనబడ్డాయి.[3][10] పురావస్తు, జన్యుపరమైన ఆధారాలు రెండూ ఇతర చోట్ల వైన్ ప్రారంభ ఉత్పత్తి సాపేక్షంగా తరువాత జరిగిందని సూచిస్తున్నాయి, బహుశా దక్షిణ కాకసస్ (ఇది అర్మేనియా, జార్జియా, అజర్‌బైజాన్‌లను కలిగి ఉంది) లేదా తూర్పు టర్కీ, ఉత్తర ఇరాన్ మధ్య ఉన్న పశ్చిమాసియా ప్రాంతంలో జరిగింది.[11][12]

వైన్ రకాలు[మార్చు]

  • రెడ్ వైన్: తొక్కలతో నీలిరంగు ద్రాక్ష నుండి
  • వైట్ వైన్: ఆకుపచ్చ ద్రాక్ష లేదా నీలిరంగు ద్రాక్ష నుండి
  • రోజ్ వైన్: నీలిరంగు ద్రాక్షతో నుండి
  • మెరిసే వైన్: ఆకుపచ్చ - నీలం ద్రాక్షతో నుండి
  • హార్డ్ వైన్: ఇతర రకాల కంటే ఎక్కువ ఆల్కహాల్ కంటెంట్ ఉన్న వైన్.
  • ఐస్ వైన్: తీపి రుచి, తక్కువ ఆల్కహాల్ కంటెంట్ కలిగిన వైన్.
  • డెజర్ట్ వైన్: సాధారణంగా డెజర్ట్‌తో వడ్డించే తీపి వైన్‌లు

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Georgia made 'world's oldest wine'". BBC News. 13 November 2017.
  2. Johnson, H. (1989). Vintage: The Story of Wine. Simon & Schuster. pp. 11–6. ISBN 978-0-671-79182-7.
  3. 3.0 3.1 3.2 Error on call to Template:cite paper: Parameter title must be specified
  4. Ellsworth, Amy (18 July 2012). "7,000 Year-old Wine Jar". University of Pennsylvania Museum of Archaeology and Anthropology.
  5. "National Geographic: Earliest Known Winery Found in Armenian Cave". 12 January 2011.
  6. Tondo, Lorenzo (30 August 2017). "Traces of 6,000-year-old wine discovered in Sicilian cave". The Guardian.
  7. "B.A.C. Per Drink". 6 October 2018.
  8. "Effects at Specific B.A.C. Levels". Archived from the original on 7 June 2017. Retrieved 2023-01-05.
  9. "wine-serving-size". American Institute for Cancer Research. 3 March 2014. Retrieved 2023-01-05.
  10. "'World's oldest wine' found in 8,000-year-old jars in Georgia". BBC News. 13 November 2017.
  11. Tucker, Abigail (August 2011). "The Beer Archaeologist". Smithsonian Magazine. Retrieved 2023-01-05.
  12. McGovern, Patrick E. "Grape Wine". University of Pennsylvania Museum of Archaeology and Anthropology. Retrieved 2023-01-05.
"https://te.wikipedia.org/w/index.php?title=వైన్&oldid=4076396" నుండి వెలికితీశారు