శత్రుచర్ల విజయరామరాజు
శత్రుచర్ల విజయరామరాజు | |||
| |||
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 1978-1989, 1999-2004 | |||
తరువాత | సవరపు జయమణి | ||
---|---|---|---|
నియోజకవర్గం | నాగూరు | ||
పదవీ కాలం 1989-1995, 1998-1999 | |||
నియోజకవర్గం | పార్వతీపురం | ||
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 2004-2009 | |||
నియోజకవర్గం | పార్వతీపురం | ||
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు
| |||
పదవీ కాలం 2017-2023 | |||
నియోజకవర్గం | శ్రీకాకుళం స్థానిక సంస్థల నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | చినమేరంగి, ఆంధ్రప్రదేశ్ | 1948 ఆగస్టు 4||
రాజకీయ పార్టీ | తెలుగు దేశం | ||
జీవిత భాగస్వామి | శశికళాదేవి | ||
బంధువులు | శత్రుచర్ల చంద్రశేఖరరాజు (సోదరుడు) |
శత్రుచర్ల విజయరామరాజు (ఆంగ్లం: Satrucharla Vijayarama Raju), విజయనగరం జిల్లాలోని చినమేరంగి సంస్థానాదిపతి.
ఇతడు ఆగష్టు 4, 1948 సంవత్సరంలో చినమేరంగిలో జన్మించాడు. ఇతడు బొబ్బిలి రాజా కళాశాలలో చదువుకున్నాడు. రాణీ శశికళాదేవిని 1973 జూన్ 28లో వివాహం చేసుకున్నాడు.[1]
రాజకీయరంగం
[మార్చు]ఇతడు రాజకీయాలలో ప్రవేశించి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యునిగా నాగూరు శాసనసభ నియోజకవర్గం నుండి 1978లో జనతాపార్టీ తరఫున సభ్యుడిగా ఎన్నికయ్యాడు. తరువాత 1983, 1985 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి ఎన్నికైనాడు. తరువాత పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి 1989లో తొమ్మిదవ లోక్‌సభకు, 1991లో పదవ లోక్‌సభకు, 1998లో తెలుగు దేశం తరఫున 12వ లోక్‌సభకు ఎన్నికైనాడు. 1999లో తిరిగి నాగూరు శాసనసభ నియోజకవర్గం నుండి గెలిచి ఎం.ఎల్.ఎ.గా పనిచేశాడు. తిరిగి 2004లో పార్వతీపురం నుండి శాసనసభకు ఎన్నికైనాడు. ఇతడు వై.ఎస్.రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో అడవులు, పర్యావరణ శాఖ, సాంకేతిక శాఖ మంత్రిగా, రోశయ్య మంత్రివర్గంలో రవాణా శాఖామంత్రిగా పనిచేశాడు. 2017లో శ్రీకాకుళం జిల్లా స్థానికసంస్థల నియోజకవర్గం నుండి తెలుగు దేశం పార్టీ తరఫున నిలబడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎన్నికై ప్రస్తుతం మండలి సభ్యునిగా కొనసాగుతున్నాడు[2].
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Biographical Sketch SATRUCHARLA, SHRI VIJAYARAMA RAJU". PARLIAMENT OF INDIA LOK SABHA HOUSE OF THE PEOPLE. National Informatics Centre (NIC). Retrieved 2 June 2020.
- ↑ విలేకరి (27 February 2017). "శ్రీకాకుళం టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్ధిగా శత్రుచర్ల విజయరామరాజు." ప్రజాశక్తి. Retrieved 2 June 2020.[permanent dead link]