శివదేవునిచిక్కాల

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
శివదేవునిచిక్కాల
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం పాలకొల్లు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,555
 - పురుషుల సంఖ్య 1,777
 - స్త్రీల సంఖ్య 1,778
 - గృహాల సంఖ్య 1,001
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

శివదేవుని చిక్కాల - పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలమునకు చెందిన గ్రామము.[1]. పాలకొల్లు మరియు భీమవరం పట్టణాల ప్రధాన రహదారిపై భీమవరము నకు పది కిలోమీటర్ల దూరములో ఉంది.ఇక్కడ గల శివాలయము ద్వారా ఈ గ్రామము బహు ప్రసిద్దము.

శ్రీ శివదేవుని దేవాలయము.
శివదేవుని చిక్కాల దేవుని చెరువులో కల తాండవ కృష్ణుని విగ్రహం
శివదేవుని చిక్కాల శివాలయం ముందు శివకేశవ విగ్రహం

ఈ ఊరి శివాలయం ఒక ప్రత్యేకతకలిగి ఉంది.దేవాలయములోని లింగము మూడున్నర అడుగుల పొడవు అడుగు వ్యాసార్ధము కలిగి తలభాగమునుండి చీల్చబడినట్లుగా చీలికతో ఉండును.

రామాయణ కాలంలో లంకతో యుద్ధానికి ముందు శ్రీరాముడు శివపూజ చేసి తరువాత లంకకు పయనమవుట మంచిదని పెద్దలు చెప్పుటచే హనుమంతుని శివలింగమును తీసుకొని రమ్మని పంపుతాడు. హనుమంతుడు హిమాలయములనుండి ప్రతిష్ఠకు కావలసిన అన్ని గుణములు కలిగిన శ్రేష్టమైన తెల్లని శిలను తీసుకొని బయలుదేరుతాడు. చిక్కాల ప్రాంతమునకు వచ్చేసరికి సాయంత్రం అగుటచే సంద్యావందనమొనరించుటకొరకై ఆ శిలను కాళింది మడుగు అను సరోవరం తీరాన కల చిన్న గుట్టపైన దించు ప్రయత్నమున చేయిజారి సరస్సులో పడిపోతుంది. వెలుపలికి తీసిన తరువాత శిల తల భాగమునుండి సగము వరకూ పగిపోయి ఉండుట గమనించి అయ్యొ ఇట్లయ్యినదేమి అని ఆ శిలను ఆగుట్టపైనే ఉత్తమముగా తలచిన ప్రదేశమందు ప్రతిష్ఠించి మరొక శిల కొరకు తిరుగు ప్రయాణమయ్యాడు. హనుమ ఎంతకూ తిరిగి రాకుండుటచే రాముడు ఇసుకతో లింగమును తయారు చేసి పూజ పూర్తి చేస్తాడు తరువాత హనుమంతుడు తీసుకెళ్ళిన లింగాన్ని రామేశ్వరంలో ప్రతిష్ఠించారు. ఇలా ప్రతిష్ఠించబడిన లింగమే శివదేవుని చిక్కాలలోనిది. ఇప్పటికీ దాదాపు మూడున్నర అడుగులతో తెలుపు గోధుమ వర్ణాల ఈ శివలింగం అలాగే సగం పగులుతో రెండు ముక్కలుగా కనిపిస్తుంది.దీని ప్రక్కనే ఉన్న కాళింది మడుగులో ఉన్న పెద్దతాండవ కృష్ణుడి శిల్పం సందర్శకులకు ఆనందంకలిగిస్తుంది. శివరాత్రి ఐదురోజులు ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 3,555 - పురుషుల సంఖ్య 1,777 - స్త్రీల సంఖ్య 1,778 - గృహాల సంఖ్య 1,001

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3430.[2] ఇందులో పురుషుల సంఖ్య 1754, మహిళల సంఖ్య 1676, గ్రామంలో నివాస గృహాలు 877 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]
  2. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; ReferenceA అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు