Jump to content

బాదేపల్లి

అక్షాంశ రేఖాంశాలు: 16°45′10″N 77°56′16″E / 16.7528097°N 77.9379126°E / 16.7528097; 77.9379126
వికీపీడియా నుండి
బాదేపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
బాదేపల్లి is located in తెలంగాణ
బాదేపల్లి
బాదేపల్లి
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°45′10″N 77°56′16″E / 16.7528097°N 77.9379126°E / 16.7528097; 77.9379126
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్ జిల్లా
మండలం జడ్చర్ల
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 32,598
 - పురుషుల సంఖ్య 16,329
 - స్త్రీల సంఖ్య 16,269
 - గృహాల సంఖ్య 6,957
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

బాదేపల్లి, తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, జడ్చర్ల మండలం లోని గ్రామం. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [1] 2015లో బాదేపల్లి పురపాలకసంఘంగా ఏర్పడింది. ఈ పట్టణం జడ్చర్లకు జంట పట్టణంగా కొనసాగుతుంది. పేరుకు రెండూ వేర్వేరుగా ఉన్ననూ భౌగోళికంగా కల్సే ఉన్నాయి. విద్య, వ్యాపారం పరంగా ఇది బాగా అభివృద్ధి చెందింది. జడ్చర్ల పేరుతో రైల్వే స్టేషను ఇక్కడే ఉంది.

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం

[మార్చు]

శ్రీ కన్యకా పరమేశ్వరీ మాత ఆలయం:- ఈ ఆలయం మహిమాన్వితాలకు నెలవుగా భాసిల్లుతోంది. సర్వసంపదలకూ అధిపతియైన కుబేరుడే, తనకు ఒక పుత్రిక కావాలని తపస్సుచేయడం, పెనుగొండరాజు కుసుమగుప్తుడిగా కుబేరుడు జన్మించి, పార్వతీదేవినే పుత్రికగా పొంది, ఆ తల్లి వాసవీ దేవిగా పెరిగి పెద్దదై, భౌతికసుఖదుఖాలకు, దుర్మార్గులకు తలవంచనని నిరూపిస్తూ, కలియుగంలో ధర్మ సంరక్షణా ప్రయత్నంలో, ఆత్మార్పణం చేసుకున్న పవిత్రురాలు ఈజగన్మాత. ఆతల్లి వైశ్యుల కులదేవతగా, భక్తుల పూజలందుకుంటుంది.[2]

విద్యాసంస్థలు

[మార్చు]
  • విశ్వవికాస్ జూనియర్ కళాశాల ( స్థాపన: 1996-1997 )
  • డాక్టర్ బి.ఆర్.ఆర్.ప్రభుత్వ డిగ్రీ & పోష్టు గ్రాడ్యేట్ కళాశాల.

మూలాలు

[మార్చు]
  1. "మహబూబ్ నగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
  2. ఈనాడు 29 నవంబరు,2013. తీర్ధయాత్ర పేజీ

వెలుపలి లింకులు

[మార్చు]