సత్యవతి దేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సత్యవతి దేవి
జననం1904
మరణం1945 (aged 40–41)
జాతీయతభారతీయురాలు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
స్వాతంత్ర్య సమరయోధురాలు. రచయిత్రి

సత్యవతి దేవి (1904-1945) భారత స్వాతంత్ర్య సమరయోధురాలు. రచయిత్రి. జోన్ ఆఫ్ ఆర్క్ ఆఫ్ ఇండియాగా పేర్కొనబడింది.

కుటుంబం[మార్చు]

సత్యవతి 1904లో ఢిల్లీలో జన్మించింది. ఈమె స్వామి శ్రద్ధానంద్ మనవరాలు, న్యాయవాది ధని రామ్ - వేద్ కుమారి దంపతుల కుమార్తె.[1] ఢిల్లీ క్లాత్ మిల్స్ అధికారిని వివాహం చేసుకుంది.

ఉద్యమం[మార్చు]

సత్యవతి ఢిల్లీలోని జాతీయవాద మహిళలకు నాయకత్వం వహించింది. అరుణ అసఫ్ అలీ జాతీయవాద ఉద్యమంలో చేరడానికి ప్రేరేణనిచ్చింది.[2] గ్వాలియర్, ఢిల్లీలోని టెక్స్‌టైల్ మిల్లులలో కార్మికుల ఆధ్వర్యంలో సామాజిక సేవను ప్రారంభించిన సత్యవతి, కాంగ్రెస్ మహిళా సమాజ్, [3] కాంగ్రెస్ దేశ్ సేవికాదళ్, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలను కూడా స్థాపించింది. శాసనోల్లంఘన ఉద్యమంలో చురుకుగా పాల్గొనడంతోపాటు ఆ ఉద్యమ సమయంలో ఢిల్లీలో కాంగ్రెస్ మహిళా విభాగానికి నాయకురాలిగా నాయకత్వం వహించింది. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా ఢిల్లీలో ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలకు ఉప్పు ప్యాకెట్లను తయారుచేసి పంపిణీ చేసింది. దాంతో సత్యవతిని పోలీసులు అరెస్టు చేసి, 1932లో రెండేళ్ళ జైలు శిక్ష విధించారు. జైలులో ఉన్నపుడు ప్లూరిసి, క్షయవ్యాధి సోకింది.[4] రాజకీయ కార్యకలాపాల నుండి వైదొలగుతుందని తను హామీ ఇవ్వడంతో చికిత్స కోసం సత్యవతిని విడుదల చేశారు.[5]

రచనలు[మార్చు]

జైలులో ఉన్న మహిళా రాజకీయ స్వాతంత్ర్య సమరయోధులు కవితలు, జాతీయవాద పత్రాలను రచించారు, వీటిని అక్రమంగా తరలించి ప్రచురించారు. 'బాహిన్ సత్యవతి కా జైలు సందేశం' (సోదరి సత్యవతి జైలు సందేశం) పేరుతో సత్యవతి దేవి రచనలు చేసింది.[6]

మరణం[మార్చు]

1945లో 41 సంవత్సరాల వయస్సులో క్షయవ్యాధితో మరణించింది.

గుర్తింపు[మార్చు]

  1. 1972లో ఢిల్లీ ప్రభుత్వం స్థాపించిన కళాశాలకు సత్యవతి కళాశాల (ఢిల్లీ యూనివర్సిటీ) అనే పేరు పెట్టబడింది.[7]
  2. మహాత్మా మహాత్మా గాంధీ ఆప్యాయంగా ఆమె తూఫానీ లేబుల్ (వంటి సుడిగాలి/ ఆందోళనకరమైన) బెహన్ (సోదరి) అని పిలిచేవాడు.[8]

మూలాలు[మార్చు]

  1. Taneja, Anup (2005). Gandhi, Women, and the National Movement, 1920–47. Har-anand Publications Pvt Ltd. p. 153. ISBN 9788124110768.
  2. Taneja, Anup (2005). Gandhi, Women, and the National Movement, 1920–47. Har-anand Publications Pvt Ltd. p. 154. ISBN 9788124110768.
  3. "CONGRESS SOCIALIST PARTY (CSP) AT A GLANCE AND SHORT PROFILES WORKS OF ITS LEADERS" (PDF). lohiatoday.com. p. 91. Archived from the original (PDF) on 23 నవంబరు 2015. Retrieved 11 September 2021.
  4. Geraldine Forbes (1999). Women in Modern India, Volume 4. Cambridge University Press. p. 148. ISBN 978-0521653770.
  5. "Toofani Satyawati An Unsung Heor of Freedom Struggle" (PDF). www.manushi.in. Manushi – Forum for Women's Rights & Democratic Reforms. Archived from the original (PDF) on 2 అక్టోబరు 2015. Retrieved 11 September 2021.
  6. Thapar-Björkert, Suruchi (20 December 2006). "Gender, nationalism and the colonial jail: a study of women activists in Uttar Pradesh". Women's History Review. 7 (4): 583–615. doi:10.1080/09612029800200182.
  7. "About Us". satyawati.du.ac.in/.
  8. "Satyawati College". The Hindu. 25 July 2009. Retrieved 11 September 2021.