సమాజం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సమాజం
(1960 తెలుగు సినిమా)
Samajam.jpg
దర్శకత్వం అడ్డాల నారాయణరావు
తారాగణం జగ్గయ్య,
గిరిజ,
గుమ్మడి,
సి.ఎస్.ఆర్,
నాగయ్య
సంగీతం అశ్వత్థామ
నృత్యాలు పసుమర్తి
ఛాయాగ్రహణం మల్లీ.ఎ.ఇరానీ
కళ సోమనాథ్
కూర్పు యం.బాబు
నిర్మాణ సంస్థ తిరుమల పిక్చర్స్
భాష తెలుగు

సమాజం 1960, జూన్ 10వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. తిరుమల పిక్చర్స్ నిర్మాణ సంస్థ మీద నిర్మించబడిన ఈ సినిమాకు అడ్డాల నారాయణరావు దర్శకత్వం వహించాడు.

తారాగణం[మార్చు]

సంక్షిప్త చిత్రకథ[మార్చు]

ఒకానొక డాక్టర్ తాను చదువుకొనే రోజుల్లో తప్పి పోయిన తన కూతురు క్రమంగా వెంకటాచలం అనే ఒక సజ్జనుడి వద్ద గౌరి అనే పేరుతో అల్లారు ముద్దుగా పెరుగుతుంది. గౌరిని జమీందారు కుమారుడైన శంకర్ పేమించి పెళ్ళి చేసుకుంటాడు. పెళ్ళికి ముందు వెంకటాచలం తనకు బిడ్డను ఇచ్చినవారు ఆపదలో ఉన్నారని వెళ్లి అక్కడ ప్రాణం కోల్పోయిన అభాగిని ఉత్తరక్రియలకు గౌరి వద్ద ఉన్న నెక్లెస్‌ను సింహాలుకు ఇస్తాడు. పెళ్ళి అయిన తర్వాత గౌరికి శంకర్ బహుమతిగా ఇచ్చిన ముప్పై అయిదు వేల రూపాయల నెక్లెస్‌ను కూడా సింహాలు దొంగిలించి, అంతకు ముందు ఇచ్చిన నెక్లెస్ తానే ఇచ్చినట్లు గౌరి చేత ఉత్తరం వ్రాయించుకుంటాడు. రెండో నెక్లెస్ దొంగతనం కేసులో సింహాలు పట్టుబడగానే అతడు గౌరి అమాయకంగా వ్రాసి ఇచ్చిన ఉత్తరాన్ని చూపిస్తాడు. దానితో గౌరి అగ్ని పరీక్షకు గురి అవుతుంది. పరిస్థితులన్నీ గౌరికి ప్రతికూలం కాగా, అంతస్తులూ, అంతరాలూ బలపడి జమీందారు కోడలిని ఇంటినుండి వెళ్లగొడతాడు. భర్త కూడా ఆమెను అనుమానిస్తాడు. దిక్కులేని గౌరిని మళ్ళా సింహాలు బంధించి వ్యామోహం కొద్దీ పెళ్ళి చేసుకోవాలని నర్తకి ముత్యం ఇంటిలో దాస్తాడు. ఆమె గౌరి చెర విడిపిస్తుంది. ముత్యం సహాయంతో జమీందారు గుమాస్తా రమణయ్య నిజాలు సేకరిస్తాడు. ఇంతలో దీపావళి రోజు ప్రమాదంలో శంకర్ కళ్లు పోతాయి. చివరకు శంకర్ అనుమానాలు తొలగిపోయి గౌరిని స్వీకరిస్తాడు[1].

పాటలు[మార్చు]

ఈ చిత్రంలోని పాటలను మల్లాది రామకృష్ణశాస్త్రి, దైతా గోపాలం, కొసరాజు రాఘవయ్య చౌదరి వ్రాయగా అశ్వత్థామ వాటికి బాణీలను కూర్చాడు. ఈ సినిమాలోని పాటల వివరాలు[2]:

 1. అందమంటే నన్నడగరాదా బాలరాజో బంగారుసామి - జిక్కి, పిఠాపురం - రచన: కొసరాజు
 2. నిన్నే నిన్నే ఏయ్ ఏయ్ వన్నెల చిన్నెల చిన్నారి - పిఠాపురం,కె.రాణి - రచన: కొసరాజు
 3. ఎందుకీ కన్నుమూత కానరాని దేనిపైన మమత - జిక్కి - రచన: మల్లాది
 4. కనబడకుంటే నేమే వినబదకుంటే నేమే - పి.బి.శ్రీనివాస్ - రచన: కొసరాజు
 5. కనుల నిదుర రాకపోతే పడ్డావనుకో ప్రేమలో - జిక్కి, పి.బి. శ్రీనివాస్ - రచన: ఆరుద్ర
 6. గౌరీదేవి పెళ్ళండోయి కన్యల్లార రారండోయి - మనోహరి బృందం - రచన:దైతా గోపాలం
 7. చక్కని చుక్కా చిక్కాలంటే రాత వుండాలోయి - జిక్కి, పి.బి. శ్రీనివాస్ - రచన: కొసరాజు
 8. జయ జయ సీతారామ రామా జయ జయ - పి.సుశీల, నాగయ్య - రచన: దైతా గోపాలం
 9. సమాజమిదియేనా మానవ సమాజమిదియేనా - పి.బి. శ్రీనివాస్ - దైతా గోపాలం

ఇతర విశేషాలు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "చిత్రసమీక్ష - సమాజం". ఆంధ్రపత్రిక దినపత్రిక. 12 June 1960. Retrieved 23 October 2016. CS1 maint: discouraged parameter (link)
 2. కొల్లూరి, భాస్కరరావు. "సమాజం - 1960". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 23 October 2016. CS1 maint: discouraged parameter (link)[permanent dead link]