సున్నం రాజయ్య

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సున్నం రాజయ్య
Sunnam rajaiah.jpg
గిరిజన నాయకులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్,మల్లు దొర, గంటం దొర ల విగ్రహాలను ఖమ్మం జిల్లా, చింతూరు లో ఆవిష్కరిస్తున్న సున్నం రాజయ్య
శాసనసభ సభ్యుడు
నియోజకవర్గం భద్రాచలం
వ్యక్తిగత వివరాలు
జననం (1960-08-08) 8 ఆగస్టు 1960 (వయస్సు: 57  సంవత్సరాలు)
సున్నంవారిగూడెం,
వి.ఆర్. పురం మండలం,
ఖమ్మం జిల్లా,
ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)
నివాసం సున్నంవారిగూడెం
మతం హిందూ

సున్నం రాజయ్య ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)కు చెందిన ప్రముఖ రాజకీయనాయకుడు. 2004 లో భద్రాచలం శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యారు. 2009 లో సి.పి.ఎం పార్టీ తరపున భద్రాచలం స్థానం నుండి పార్లమెంటుకు పోటీ చేసి 6956 ఓట్ల తేడాతో ఓడిపోయారు[1]. 2014 లో భద్రాచలం నుండి తిరిగి శాసనసభకు ఎన్నికయ్యాడు.

వార్తలలో రాజయ్య[మార్చు]

శాసనసభకు వస్తున్న రాజయ్యను గుర్తు పట్టని పోలీసులు[మార్చు]

ఇతడు చాలా నిరాండబరుడు. ఇందుకు నిదర్శనం 2015 ఏప్రిల్ 9 గురువారం జరిగిన సంఘటన. ఆర్భాట రాజకీయాలు ఇంకా వంటబట్టని గిరిజన నాయకుడిగా, సీపీఎం శాసనసభా పక్ష నేతగా సుపరిచితుడైన ఖమ్మం జిల్లా భద్రాచలం శాసన సభ్యులు సున్నం రాజయ్యను సచివాలయం ద్వారం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కారణం.. ఆయన సామాన్యులు ప్రయాణించే ఆటోలో వెళ్ళడమే! గేటు బయటే రాజయ్యను అడ్డుకున్న పోలీసులు.. ఆటోలో వచ్చావ్.. నువ్వు శాసన సభ్యులువంటే మేము నమ్మం అనడంతో తన గుర్తింపు కార్డు తీసి పోలీసులకు చూపారు రాజయ్య. కార్డును క్షుణ్ణంగా పరిశీలించిన మీదట గానీ శాసన సభ్యులు రాజయ్యను పోలీసులు లోనికి అనుమతించలేదు[2]

ఇవికూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

మూలాల జాబితా[మార్చు]