హిందుస్తాన్ ఫోటో ఫిలింస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హిందుస్తాన్ ఫోటో ఫిలింస్ మ్యాన్యుఫాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ (ఆంగ్లం: Hindustan Photo Films) భారతదేశం లోని ఊటీ కేంద్రంగా ఫోటోగ్రఫిక్, సినీ, ఎక్స్-రే, గ్రాఫిక్ ఆర్ట్ ఫిలిం, ఫోటోగ్రఫిక్ కాగితం, రసాయనాలను తయారు చేసే ప్రభుత్వ సంస్థ. ఈ సంస్థచే తయారు చేయబడే ఫిలిం ఇందు అనే బ్రాండుతో వ్యవహరించబడేవి. సంస్కృతంలో ఇందు అనగా వెండి అని అర్థం. ఫిలిం లో వాడబడే సిల్వర్ హాలైడ్ అనే రసాయనాన్ని ఉద్దేశించి ఈ ఫిలిం కు ఆ పేరు పెట్టబడింది.

31 మార్చి 2012 నాటికి 714 ఉద్యోగులను నియామకం చేసిన హిందుస్తాన్ ఫోటో ఫిలింస్ ను 1996 లో నే BIFR (Board for Industrial and Financial Reconstruction) ఈ సంస్థను నష్టాలలో కూరుకుపోయినట్లు గుర్తించింది. మార్చి 2013 నాటికి VRS క్రింద ఉద్యోగులను తొలగించింది.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]