హేమ ఉపాధ్యాయ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హేమ ఉపాధ్యాయ
Hema Upadhyaydream a wish wish a dream Ivam.jpg
Upadhyay with Dream a wish-wish a dream, 2006
జననం
హేమ హిరాని

1972
మరణం2015 డిసెంబరు 11(2015-12-11) (వయసు 42–43)
విద్యమహారాజా సయాజీరావ్ యూనివర్శిటీ ఆఫ్ బరోడా నుంచి 1997లో పెయింటింగ్‌లో బి.ఎఫ్. ఎ, ముద్రణ తయారీలో ఎమ్.ఎఫ్. ఎ

హేమ ఉపాధ్యాయ ( 1972 - డిసెంబర్ 11, 2015 ) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన కళాకారిణి, ఫోటోగ్రాఫర్, శిల్పకళా సంస్థాపకురాలు.[1]

తొలినాళ్ళ జీవితం[మార్చు]

ఈమె 1972 న గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నగరంలో జన్మించింది.[2]

మ్యూజియం ప్రదర్శనలు[మార్చు]

ఈమె 2004 నుంచి అనేక చిత్ర ప్రదర్శనలను అంతర్జాతీయంగా చేశారు. అందులో చైనా లోని ఉల్లెన్స్ సెంటర్ ఫర్ కాంటెంపరరీ ఆర్ట్ బీజింగ్‌, నేషనల్ పోర్ట్రెయిట్ గ్యాలరీ, కాన్బెర్రా, ఆస్ట్రేలియా. సెంటర్ పాంపిడో, పారిస్, ఫ్రాన్స్. మ్యూజియం ఆన్ ది సీమ్, జెరూసలేం, ఇజ్రాయెల్. మాక్రో మ్యూజియం, రోమ్, ఇటలీ. ఐ.వి.ఎ.ఎమ్ (IVAM), వాలెన్సియా, స్పెయిన్. మార్ట్ మ్యూజియం, ఇటలీ. మోరి ఆర్ట్ మ్యూజియం, టోక్యో, జపాన్. హ్యాంగర్ బికోకా, మిలన్, ఇటలీ. చికాగో కల్చరల్ సెంటర్, చికాగో, అమెరికా. ఎకోల్ నేషనల్ సూపరియర్ డెస్ బ్యూక్స్ ఆర్ట్స్, పారిస్, ఫ్రాన్స్. ఫుకుయోకా ఏషియన్ ఆర్ట్ మ్యూజియం, ఫుకుయోకా, జపాన్. జపాన్ ఫౌండేషన్, టోక్యో.  హెనీ ఆన్‌స్టాడ్ కున్‌సెంటర్, ఓస్లో, నార్వే. ఈమె మరణించిన దానికంటే కొన్ని నెలల తరువాత, 2016 లో, బోస్టన్‌లోని మ్యూజియం ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో "మెగాసిటీస్ ఆసియా" అనే థీమ్‌తో ఆమె చేసిన చిత్రాలను ప్రదర్శించారు.

సోలో ప్రదర్శనలు[మార్చు]

 1. 2012లో ఎక్స్‌ట్రా ఆర్డినరీ, ఫ్యాకల్టీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ బరోడా, వదేహ్రా ఆర్ట్ గ్యాలరీ, న్యూఢిల్లీ.
 2. 2012లో మ్యూట్ మైగ్రేషన్, ఆర్ట్ గ్యాలరీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్, సిడ్నీ, ఆస్ట్రేలియా
 3. 2011–12లో ప్రిన్సెస్ రస్టెడ్ బెల్ట్, స్టూడియో లా సిట్టా, వెరోనా, ఇటలీ
 4. 2011 ఆధునికీకరణ, ఎస్పేస్ టోపోగ్రఫీ డి ఎల్ ఆర్ట్, ఫెస్టివల్ డ ది ఆటోమ్నే ఎ పారిస్, పారిస్
 5. 2009 తేనెటీగలు ఎక్కడతేనేను పీల్చుకుంటాయి, మాక్రో మ్యూజియం, రోమ్ ఇటలీ
 6. 2008-09 యువర్స్ సిన్సియర్లీ, గ్యాలరీ నేచర్ మోర్టే, న్యూ ఢిల్లీ
 7. 2008 యూనివర్స్ రివల్వ్ ఒన్, సింగపూర్ టైలర్ ప్రింట్ ఇన్స్టిట్యూట్, సింగపూర్.
 8. 2004 అండర్ నీత్ గ్యాలరీ కెమోల్డ్, ముంబయి
 9. 2001-02 ది నిమ్ఫ్ అండ్ ది అడల్ట్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మోడరన్ ఆర్ట్, బ్రిస్బేన్
 10. 2001 స్వీట్ అండ్ స్వేట్, గ్యాలరీ కెమోల్డ్, ముంబై
 11. 2001 ది నిమ్ఫ్ అండ్ ది అడల్ట్, ఆర్ట్ స్పేస్, సిడ్నీ

ఆహ్వానాలు[మార్చు]

ఆమెకు అంతర్జాతీయ గ్యాలరీలనుంచి ఆహ్వానాలు వచ్చాయి. అందులో 2010లో అటెలియర్ కాల్డెర్, సాచే, ఫ్రాన్స్. 2008లో సింగపూర్ టైలర్ ప్రింట్ ఇన్స్టిట్యూట్, సింగపూర్. 2007 మెట్రెస్ ఫ్యాక్టరీ, పిట్స్బర్గ్, అమెరికా. 2003లో వాస్ల్ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్స్ రెసిడెన్సీ, కరాచీ. 2001లో ఆర్ట్ స్పేస్, సిడ్నీ.

చిత్ర ప్రదర్శనలు[మార్చు]

ఈమె తన మొదటి సోలో ఎగ్జిబిషన్ ను గ్యాలరీ కెమోల్డ్లో స్వీట్ స్వేట్ మెమోరీస్ పేరుతో ప్రదర్శించింది. ఈ ప్రదర్శనలో ప్రదర్శించిన ఛాయాచిత్రాలు 1998లో ముంబై నుంచి వలసవెళ్లే వారి ఆలోచనలను తెలియజేశాయి. ఈమె తన మొదటి అంతర్జాతీయ సోలో ప్రదర్శనను ఆర్ట్స్పేస్, సిడ్నీ, బ్రిస్బేన్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మోడరన్ ఆర్ట్ ను ప్రదర్శించింది. ఇందులో ది నిమ్ఫ్ అండ్ ది అడల్ట్ అనేపేరుతో 2000 లైఫ్‌లైక్ బొద్దింకలను చిత్రాలను గీశారు. ఈ చిత్రాల ఉద్దేశం సైనిక చర్యల పరిణామాల గురించి ప్రేక్షకులు ఆలోచింపచేసేలా చిత్రీకరించారు. ఈమె చింతన్ ఉపాధ్యాయ సహకారంతో మేడ్ ఇన్ చైనా పేరుతో సామూహిక వినియోగదారులవాదం, ప్రపంచీకరణ, గుర్తింపు కోల్పోవడం గురించి పనిచేశారు. ఈమె 2006 లో తన తల్లి బినా హిరానీతో కలిసి మమ్-మై అనే పేరుతో తన ప్రదర్శనను చికాగో సాంస్కృతిక కేంద్రంలో ప్రదర్శించబడింది.[3]

మరిన్ని విశేషాలు[మార్చు]

ఈమె రోమ్‌ నగరంలో ఉన్న మాక్రో మ్యూజియం పునప్రారంభోత్సవా ప్రారంభ ప్రదర్శనలో భారతదేశం నుంచి పాల్గొన్న ఏకైక కళాకారిణి. ఈ ప్రదర్శనలో ఈమె ఎక్కడ తేనెటీగలు పీలుస్తాయో అక్కడ నేను పీలుస్తాను అనే పేరుతో ప్రదర్శనను చేసింది. ఈమె 1998 లో తోటి కళాకారుడు చింతన్ ఉపాధ్యాయను వివాహం చేసుకుంది. 2010 లో విడాకుల కోసం దాఖలు చేయడానికి ముందు వారు అనేక ప్రదర్శనలను కలసి ప్రదర్శించారు. వీరు 2014 లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు.

మరణం[మార్చు]

ఈమె డిసెంబర్ 11, 2015న ఆర్థిక వ్యవహార విషయంలో హత్యకు గురయ్యారు.[4][5]

మూలాలు[మార్చు]

 1. Gautam Sandip Mengle (16 October 2019). "Artist Hema Upadhyay, her lawyer found dead in drain". The Hindu.
 2. Manish K Pathak (16 October 2019). "Bodies of Mumbai artist Hema Upadhyay, her lawyer found in drain". Hindustan Times.
 3. "Megacities Asia Takes Over Museum of Fine Arts, Boston, and Beyond with Immersive Sculptures and Installations". Museum of Fine Arts, Boston (in ఇంగ్లీష్). 2019-10-16. Retrieved 2018-03-09.
 4. Ankita Sinha (16 October 2019). "Bodies Of Artist Hema Upadhyay, Her Lawyer Found In Mumbai Drain". NDTV.
 5. Ashita Dadheech (16 October 2019). "Hema Upadhyay murder case: Chintan moves court for bail". Asian Age.