1825
Jump to navigation
Jump to search
1825 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1822 1823 1824 - 1825 - 1826 1827 1828 |
దశాబ్దాలు: | 1800లు 1810లు - 1820లు - 1830లు 1840లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- మార్చి 1: 1924 నాటి ఆంగ్లో డచ్చి ఒప్పందం ప్రకారం భారతదేశం లోని డచ్చి స్థావరాలన్నీ బ్రిటిషు వారి వశమై, డచ్చి వారి ఉనికి లేకుండా పోయింది.
- జూలై 18: బ్రెజిల్ నుండి ఉరుగ్వే విడిపోయింది.
- ఆగస్టు 6: బొలీవియా, స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం సాధించుకుంది.
- ఆగస్టు 18: గ్రెగర్ మెక్‌గ్రెగర్ అనే స్కాటిష్ సాహసికుడు అసలు ఉనికిలోనే లేని "పొయాయిస్" అనే దేశానికి, లండను లోని థామస్ జెంకిన్స్ అండ్ కంఫెనీ బ్యాంకు ద్వారా 3 లక్షల పౌండ్ల ఋణాన్ని మంజూరు చేసాడు. దీంతో ప్రపంచపు మొట్టమొదటి స్టాక్ మార్కెట్ పతనం జరిగింది. లండన్‌లో 6 బ్యాంకులు, మిగతా ఇంగ్లాండులోమరో 60 బ్యాంకులూ మూత పడ్డాయి.
- సెప్టెంబరు 27: ప్రపంచపు తొట్తతొలి ఆధునిక రైల్వే ఇంగ్లాండులో మొదలైంది
- డిసెంబరు 26: రష్యా చక్రవర్తిగా నికోలస్ 1 గద్దెనెక్కడాన్ని నిరసిస్తూ రష్యా సైన్యం లోని కొందరు అధికారులు సెంట్ పీటర్స్ బర్గ్ లో తిరుగుబాటు చేసారు. ప్రభుత్వం దాన్ని అణచివేసింది.
- తేదీ తెలియదు: భీమిలి రేవు పట్టణం బ్రిటిషు వారి వశమైంది.
- తేదీ తెలియదు: బీజింగ్‌ను త్రోసిరాజని లండన్, ప్రపంచపు అతిపెద్ద నగరమైంది.[1]
- తేదీ తెలియదు: లండన్‌లో గుర్రాలు లాగే బస్సులను ప్రవేశపెట్టారు
- తేదీ తెలియదు: మిన్హ్ మాంగ్, వియత్నాంలో క్రైస్తవం బోధించడాన్ని నిషేధించాడు.
జననాలు
[మార్చు]- మే 19: నానా సాహెబ్, పీష్వా రెండో బాజీరావు దత్తపుత్రుడు (మ. 1859)
- సెప్టెంబర్ 4: దాదాభాయి నౌరోజీ, భారత జాతీయ నాయకుడు. (మ.1917)
మరణాలు
[మార్చు]- ఫ్రాన్సుకు చెందిన పియరి చార్లెస్ లీ ఎన్పేంట్ ప్రసిద్ధి పొందిన సివిల్ ఇంజనీరు, ఆర్కిటెక్ట్. (వాషింగ్టన్ డి.సి. లోని వీధులను ప్రణాళిక ప్రకారం అత్యంత మనోహరంగా రూపు దిద్దిన వాడు) (జ.1754)
పురస్కారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Rosenberg, Matt T. "Largest Cities Through History". About.com. Archived from the original on 2007-07-14. Retrieved 2012-09-25.