34వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

34వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన (హైదరాబాద్ బుక్ ఫెయిర్) ప్రదర్శన హైదరాబాద్‌, దోమల్‌గూడలోని తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్‌ స్టేడియం) ప్రాంగణంలో జరిగింది. ఈ పుస్తక ప్రదర్శన 18 డిసెంబర్‌ 2021 నుంచి 28 డిసెంబర్‌ 2021 వరకు జరిగింది.[1][2]

నిర్వహణ

[మార్చు]

34వ జాతీయ పుస్తక ప్రదర్శన డిసెంబర్ 18 నుంచి 28 వరకు మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు, శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో మధ్యాహ్నం 12.30 నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించారు. ఈ పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి మిమిక్రీ కళాకారుడు నేరెళ్ళ వేణుమాధవ్ పేరిట, సాహిత్య వేదికకు చిందు భాగవత యక్షగాన సంప్రదాయాన్ని అంతర్జాతీయస్థాయి వరకూ తీసుకెళ్లిన చిందు ఎల్లమ్మ పేరిట నామకరణం చేశారు. 270 స్టాళ్లతో ఏర్పాటు చేసిన ఈ పుస్తక ప్రదర్శనను రాష్ట్ర సాంస్కృతిక & పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్‌ ప్రారంభించగా, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ అధ్యక్ష, కార్యదర్శులు జూలూరు గౌరీశంకర్, కోయ చంద్రమోహన్‌, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.[3][4] పిల్లలకు, ఐడీ కార్డుతో వచ్చిన విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించారు. సాహితీ సభలు, పుస్తకావిష్కరణలు, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. [5]

ఈ పుస్తక ప్రదర్శనలో తెలుగుకు సంబంధించి విశాలాంధ్ర, నవ తెలంగాణ, నవ చేతన, ఎమెస్కో, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలుగు వికీపీడియా, తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలుగు అకాడమీ, తెలంగాణ జాగృతి తదితర ప్రచురణ సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ పుస్తక ప్రదర్శనలో బాలల సాహిత్యం, ఆధ్యాత్మికం, వ్యక్తిత్వ వికాసం, వైద్యం, ఆరోగ్యం వంటి అన్ని రంగాలకు చెందిన పుస్తకాలతో పాటు, చరిత్ర, సాహిత్యం, ప్రముఖుల జీవిత చరిత్ర గ్రంధాలు అందుబాటులో ఉన్నాయి.[6] ఈ పుస్తక ప్రదర్శనలో తెలుగు, ఉర్దూ, హిందీ, ఆంగ్ల భాషల్లో సుమారు రెండున్నర లక్షలకుపైగా వివిధ రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచారు. తెలుగు రాష్ట్రాలతోపాటు ముంబయి, దిల్లీ, కోల్‌కతా, మద్రాసుకు చెందిన పలువురు పబ్లిషర్లు ఈ ప్రదర్శనలో పుస్తకాలు విక్రయించారు.[7]

పలు కార్యక్రమాలు & పుస్తక ఆవిష్కరణలు

[మార్చు]
  • ఆంగ్లేయుల యేలుబడిలో అంతులేని దోపిడీ
  • రష్యా విప్లవంలో రైతాంగం [8]
  • ఈజీ వే టు లెర్న్ మ్యాథమెటిక్స్ పుస్తకావిష్కరణ
  • భాషా సాంస్కృతిక శాఖ, ప్రభుత్వ సిటీ కళాశాల తెలుగు విభాగం సంయుక్తాధ్వర్యంలో 'ఆకుపచ్చని అక్షరం' కవి సమ్మేళనం [9]
  • అన్వీష్కిక పబ్లికేషన్స్‌లో యువ రచయిత బాలాజీ రచించిన యోధ పుస్తకాన్ని సినీ దర్శకుడు రాహుల్‌ సాంకృత్యన్‌ ఆవిష్కరించాడు
  • దళిత్ స్టోరీస్ పుస్తకావిష్కరణ [10]
  • అమ్మ జ్ఞాపకాలు
  • తొండెం బొక్కెన దళిత కథ పుస్తకావిష్కరణ
  • నేను సైతం పుస్తకావిష్కరణ
  • నాయిస్ క్యాన్సిలేషన్ పుస్తకావిష్కరణ
  • రెప్ప వాల్చని కాలం పుస్తకావిష్కరణ
  • తెలుగెత్తి జై కొట్టు పుస్తకావిష్కరణ [11]
  • ట్యాంకుబండ్ మైసమ్మ గుడి నుండి హైదరాబాద్‌ తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్‌ స్టేడియం) ప్రాంగణం వరకు పుస్తక నడక కార్యక్రమం [12]
  • కవిసేన మేనిఫెస్టో ఆధునిక కావ్య శాస్త్రమ్ పుస్తకావిష్కరణ (26-12-2021)
  • మిలింద్ ప్రకాషన్ వారి భీష్మ సంతాప్, ది పవర్ ఆఫ్ ప్రెజెంట్ పుస్తకాలవిష్కరణ (26-12-2021)
  • అనురాగమూర్తులు పుస్తకావిష్కరణ [13]
  • డబుల్ ధమాకా రచయిత్రి ఇందిరా పరిమి తో ఇష్టాగోష్టి (26-12-2021)
  • ఇగురం (కథా సంపుటి) ఆవిష్కరణ (26-12-2021)[14]
  • జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వండర్స్ సైన్స్ షో కార్యక్రమం (26-12-2021)
  • నీలం రంగు - ఎరుపు పుస్తకావిష్కరణ (27-12-2021)
  • పాలకురి సోమనాథుని కృతులు - పరిశీలన (27-12-2021)
  • సమాంతర సినిమా సదస్సు (27-12-2021)

తెలంగాణ ఆర్టీసీ ఆఫర్

[మార్చు]

హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ ప్రదర్శనకు వచ్చే పుస్తక ప్రియులు ఆర్టీసీ బస్సుల్లో T24 టిక్కెట్‌‌లు కొనుగోలు చేస్తే వాటిపై 20 శాతం తగ్గింపును అందిస్తోంది. T24 టిక్కెట్టు టికెట్ కొనుగోలు నుండి 24 గంటల పాటు సిటీ సర్వీస్‌లలో (డీలక్స్ బస్సుల వరకు) ఎన్నిసార్లైనా ప్రయాణించవచ్చు. T24 టిక్కెట్టు అసలు ధర రూ. 100, అయితే బుక్ ఫెయిర్‌ను సందర్శించే ప్రయాణీకులకు టిఎస్ఆర్టీసీ కేవలం 80 రూపాయలకే బహుమతిగా అందజేస్తోంది. ఈ టిక్కెట్టు ముందు రోజు ఏ సమయానికి ఈ టిక్కెట్‌ కొనుగోలు చేస్తే మరుసటి రోజు అదే సమయం వరకు వినియోగించుకోవచ్చు.[15]

ముగింపు

[మార్చు]

34వ హైదరాబాద్‌ జాతీయ పుస్తక మహోత్సవం ముగింపు కార్యక్రమంలో 28 డిసెంబర్ 2021న జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ హాజరు కాగా, రాష్ట్ర సాంస్కృ తిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్, ఆచార్య కూరెళ్ల గ్రంథాలయం వ్యవస్థాపకుడు, దాశరథీ పురస్కార గ్రహీత డాక్టర్‌ కూరెళ్ల విఠలాచార్య, హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ కమిటీ కార్యదర్శి కోయ చంద్రమోహన్, కోశాధికారి పి.రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.[16][17][18]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (16 December 2021). "18 నుంచి 28 వరకు హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌". Archived from the original on 26 December 2021. Retrieved 26 December 2021.
  2. Sakshi (13 December 2021). "18 నుంచి 27 వరకు బుక్‌ఫెయిర్‌". Archived from the original on 26 December 2021. Retrieved 26 December 2021.
  3. Eenadu (19 December 2021). "తెలంగాణ సాధనలో పుస్తకాలే పునాదులు". Archived from the original on 26 December 2021. Retrieved 26 December 2021.
  4. Andhrajyothy (19 December 2021). "పుస్తకాలు మంచిని బోధిస్తాయి". Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021.
  5. Sakshi (19 December 2021). "పుస్తకాలు చదివే కేసీఆర్‌ రాష్ట్రాన్ని సాధించారు". Archived from the original on 19 December 2021. Retrieved 26 December 2021.
  6. Sakshi (19 December 2021). "పుస్తకాల పండుగకు అక్షరాల తోరణం." Archived from the original on 20 December 2021. Retrieved 26 December 2021.
  7. ETV Bharat News (23 December 2021). "కళకళలాడుతున్న పుస్తక ప్రదర్శన." Archived from the original on 26 December 2021. Retrieved 26 December 2021.
  8. Namasthe Telangana (22 December 2021). "సాహిత్య జాతర". Archived from the original on 26 December 2021. Retrieved 26 December 2021.
  9. Namasthe Telangana (23 December 2021). "ఆకుపచ్చని అక్షరంపై విద్యార్థి కవిసమ్మేళనం". Archived from the original on 26 December 2021. Retrieved 26 December 2021.
  10. Eenadu (20 December 2021). "కిటకిటలాడిన పుస్తక ప్రదర్శన". Archived from the original on 26 December 2021. Retrieved 26 December 2021.
  11. Namasthe Telangana (24 December 2021). "జ్ఞానం చిగురిస్తేనే.. పుస్తకం". Archived from the original on 26 December 2021. Retrieved 26 December 2021.
  12. Namasthe Telangana (24 December 2021). "పుస్తక పఠనంతోనే.. పరిపూర్ణత సాధ్యం". Archived from the original on 26 December 2021. Retrieved 26 December 2021.
  13. Eenadu (26 December 2021). "మరపురాని చిత్రాల దర్శకుడు పుల్లయ్య". Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021.
  14. Namasthe Telangana (26 December 2021). "నిత్యస్ఫూర్తి.. చైతన్య దీప్తి.. హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శన". Archived from the original on 26 December 2021. Retrieved 26 December 2021.
  15. Mana Telangana (19 December 2021). "పుస్తక ప్రియులకు టిఎస్‌ఆర్టీసి నుంచి శుభవార్త". Archived from the original on 26 December 2021. Retrieved 26 December 2021.
  16. Andhrajyothy (29 December 2021). "మాతృభాషలో తీర్పుల అనువాదం". Archived from the original on 29 December 2021. Retrieved 29 December 2021.
  17. Sakshi (28 December 2021). "ప్రజల మనిషి నవలను చదివాను: సీజేఐ ఎన్వీ రమణ". Archived from the original on 29 December 2021. Retrieved 29 December 2021.
  18. Namasthe Telangana (28 December 2021). "ప్రజలకు అర్థమయ్యే భాషలోనే తీర్పులుండాలి : సీజేఐ జస్టిస్‌ రమణ". Archived from the original on 29 December 2021. Retrieved 29 December 2021.