Jump to content

అల్యూమినియం డైబోరైడ్

వికీపీడియా నుండి
(AlB2 నుండి దారిమార్పు చెందింది)
అల్యూమినియం డైబోరైడ్
పేర్లు
IUPAC నామము
aluminium diboride
ఇతర పేర్లు
aluminium boride
aluminum diboride
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [12041-50-8]
యూరోపియన్ కమిషన్ సంఖ్య 234-923-7
SMILES B1=B[Al]1
ధర్మములు
AlB2
మోలార్ ద్రవ్యరాశి 48.604 g/mol[1]
స్వరూపం Copper-red solid
సాంద్రత 3.16 g/cm³[2]
ద్రవీభవన స్థానం 1,655 °C (3,011 °F; 1,928 K)
insoluble
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
Hexagonal, hP3
P6/mmm, No. 191
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
-151 kJ/mol
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
34.7 J/mol K
విశిష్టోష్ణ సామర్థ్యం, C 43.6 J/mol K
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

అల్యూమినియం డైబోరైడ్ లేదా అల్యూమినియం బోరైడ్ ఒక రసాయన సంయోగపదార్థం. ఇది ఒక అకర్బన సమ్మేళనపదార్థం. అల్యూమినియం డైబోరైడ్ రసాయన సంకేతపదం (AlB2).[1] ఈ సంయోగ పదార్థం అల్యూమినియం లోహమూలకం, ఉపధాతువు బోరాన్ మూలకముల సంయోగము వలన ఏర్పడినది. అల్యూమినియం లోహం, బోరాన్ ల సమ్మేళనం వలన ఏర్పడిన రెండు సంయోగపదార్థాలలో అల్యూమినియం డైబోరైడ్ ఒకటికాగా, మరొకటి అల్యూమినియం డోడెకాఅల్యూమినియం బోరైడ్ (AlB12). ఈ రెండు అల్యూమినియం సంయోగపదార్థాలను సాధారణంగా అల్యూమినియం బోరైడ్ అని వ్యవహరిస్తారు.

భౌతిక ధర్మాలు

[మార్చు]

అల్యూమినియం డైబోరైడ్ రాగి (లోహం) వంటి ఎరుపు రంగులో ఉండు ఘనపదార్థం. అల్యూమినియం డైబోరైడ్ అణుభారం 48.604 గ్రాములు/మోల్.[1] 25 °C ఉష్ణోగ్రత వద్ద అల్యూమినియం డైబోరైడ్ సాంద్రత 3.16 గ్రాములు/సెం.మీ3.[2] ఈ సంయోగపదార్థం ద్రవీభవన స్థానం 1,655 °C (3,011 °F;1,928 K). అల్యూమినియం డైబోరైడ్ నీటిలో కరుగదు.

నిర్మాణం

[మార్చు]

నిర్మాణ పరంగా అల్యూమినియం డైబోరైడ్‌లో బోరాన్ పరమాణువులు గ్రాఫైట్ వంటి పలకల వలె ఉండి, వాటి మధ్యలో అల్యూమినియం పరమాణువులు ఉండును. ఈ అణు నిర్మాణం ఒకవిధంగా మెగ్నిషియం డైబోరైడ్ నిర్మాణపోలిక కలిగి ఉంది. అల్యూమినియం డైబోరైడ్ ఒంటరి స్పటికాలు లోహవాహకతత్వం ప్రదర్శించును[3] .స్పటికసౌష్టవం షట్భుజాకారం (Hexagonal).

ఆరోగ్యపరమైన ఇబ్బందులు

[మార్చు]

అల్యూమినియం డైబోరైడ్ ను ప్రమాదకర మైన రసాయనంగానే పరిగణిస్తారు. ఇది ఆమ్లాలు, హైడ్రోజన్తో చర్య వలన విషవాయువులను ఉత్పత్తి చేయును. ఉదాహరణకు హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య వలన బోరెన్ (Borane), అల్యూమినియం క్లోరైడ్ను విడుదల చేయును.

ఉపయోగం

[మార్చు]

అల్యూమినియం డైబోరైడ్ ఎక్కువ నిరోధకగుణం, కఠినత్వం కలిగిఉండటం వలన దీని చూర్ణాన్ని పలు లోహ, అలోహ వస్తువులను గ్రైండింగు చేయుటకు, పాలిష్ చేయుటకు ఉపయోగిస్తారు.[4]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు/ఆధారాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Aluminum diboride". sigmaaldrich.com. Retrieved 2015-10-12.
  2. 2.0 2.1 "ALUMINUM BORIDE". chemicalbook.com. Retrieved 2015-10-12.
  3. "On the electronic and structural properties of aluminum diboride Al0.9B2" Burkhardt, Ulrich; Gurin, Vladimir; Haarmann, Frank; Borrmann, Horst; Schnelle, Walter; Yaresko, Alexander; Grin, Yuri Journal of Solid State Chemistry 177 (2004) 389-394
  4. "Aluminum boride". britannica.com. Retrieved 2015-10-12.