చర్చ:ఆరావళి పర్వత శ్రేణులు
ఆరావళి పర్వత శ్రేణులు పేజీని 2020 ఏప్రిల్ వ్యాసాల అభివృద్ధి ఉద్యమం లో భాగంగా విస్తరించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
పర్వతాల పొడవు సవరణ
[మార్చు] సహాయం అందించబడింది
ఆరావళి పర్వతాల పొడవు 300 మైళ్ళు అని ఆంగ్ల వికీలో ఉంది. ఈ వ్యాసంలో 300 కి.మీ.అని వ్రాశారు. అంతేకాకుండా ఈ పర్వతాలు ఈశాన్యం నుంచి నైరుతి వరకు వ్యాపించినట్లు ఆంగ్ల వికీలో ఉండగా ఇక్కడ వాయువ్యం నుంచి నైరుతి దిశగా అని ఉంది. వీటిలో ఏది సరైనది పరిశీలించి సరిచేయగలరు. -- C.Chandra Kanth Rao(చర్చ) 20:32, 8 మే 2008 (UTC)
- సభ్యుడు:C.Chandra Kanth Rao గారు, ప్రస్తుత ఆంగ్ల వ్యాసంలో Southwest అని వుంది కావున నైరుతి అని మాత్రమే అనువాదం సరిగానే వుంది. వాయవ్య భారతదేశంలో వున్నందున వాయవ్య అనే పదం వాడారు. ఇక పొడవు కూడా ఆంగ్ల వ్యాసం ననుసరించి సవరించాను. --అర్జున (చర్చ) 09:39, 17 మే 2021 (UTC)
వ్యాసం పేరు
[మార్చు]ఆరావళి పర్వతశ్రేణులా? అరావలి పర్వత శ్రేణులా? పాఠ్యపుస్తకాల్లో ఆరావళి అనే చదివినట్లు గుర్తు. హిందీ వాళ్ళేమో అరావలి అనే రాసినట్లున్నారు. దానిని Reo Kwan అనే సభ్యుడు, అరావలి అన్నపదమే హిందీ పదానికి సరైన అక్షరక్రమమని ఈ పేరుకి దారిమార్పు చేశారు. కన్నడవాళ్ళు అరావళి అని రాశారు. గూగుల్ శోధనలో ఆరావళి (1,60,00,000), అరావలి (66), అరావళి (4,41,000) ఇలా ఫలితాలు చూపిస్తున్నాయి. దీని ప్రకారం అయితే ఆరావళి అనే పదమే సరైంది. పాఠ్యపుస్తకాల్లో కూడా ఇదే పేరుంటే వ్యాసానికి అదే పేరు పెట్టాలి అని నా అభిప్రాయం. సభ్యులు తమ అభిప్రాయాలు చెప్పగలరు. - రవిచంద్ర (చర్చ) 00:59, 22 మే 2022 (UTC)
- ఆరావళి అనేది సరైన పేరు. కారణాలు:
- హిందీలో "ళ" కారం లేదు. "ళ" పలకాల్సిన చోట్ల వాళ్ళు "ల" అనే పలుకుతారు. ఉదాహరణకు "కళ"ను "కల" (కలా) అంటారు. తెలుగులో అది ఒదగదని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అలానే, "కళ్యాణి"ని "కల్యాణి" అని, "దీపావళి"ని "దీపావ్‌లి" అనీ "దివాలీ" అనీ అంటారు. కొన్ని ఉత్తర భారత పేర్ల కోసం హిందీ ఉచ్చారణను అనుసరించడంలో తప్పు లేదు. కానీ, గుడ్డిగా అనుసరించరాదు.
- తెలుగులో ఆరావళి అనే రాస్తూ వస్తున్నాం. గూగుల్ ఫలితాలు తెలుపుతున్నదీ అదే.
- ప్రజా బాహుళ్యంలో ఏది ఎక్కువగా ప్రచారంలో ఉందో ఆ పేరే పేజీకి పెట్టాలనే వికీ నియమం ఉండనే ఉంది.
- అంచేత ఆరావళి అనేదే సరైనది. ఆ పేరుకే తరలించాలి. __ చదువరి (చర్చ • రచనలు) 04:28, 22 మే 2022 (UTC)
- పై అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 07:01, 22 మే 2022 (UTC)
- చర్చకు స్పందించిన చదువరి, రామారావు గార్లకు ధన్యవాదాలు. వ్యాసం పేరును ఆరావళి పర్వతశ్రేణులు అని మార్చాను. - రవిచంద్ర (చర్చ) 13:22, 24 మే 2022 (UTC)