Jump to content

అనితా గుహ

వికీపీడియా నుండి
అనితా గుహ
ఛూమంతర్ సినిమాలో అనితా గుహ
జననం(1939-01-17)1939 జనవరి 17
మరణం2007 జూన్ 20(2007-06-20) (వయసు 68)
క్రియాశీలక సంవత్సరాలు1953–1989
భార్య / భర్తమాణిక్ దత్
బంధువులుప్రేమా నారాయణ్ (మేనకోడలు)

అనితా గుహ (17 జనవరి 1939 - 20 జూన్ 2007) భారతీయ నటి. ఈమె ఎక్కువగా పౌరాణిక పాత్రలను ధరించింది. జై సంతోషి మా (1975)లో ప్రధాన పాత్ర పోషించినందుకు ఈమె పేరు తెచ్చుకుంది. అంతకుముందు, ఈమె ఇతర పౌరాణిక చిత్రాలలో సీతగా నటించింది; సంపూర్ణ రామాయణం (1961), శ్రీ రామ్ భారత్ మిలాప్ (1965), తులసి వివాహం (1971). ఇవి కాకుండా ఈమె గూంజ్ ఉఠీ షెహనాయ్ (1959), పూర్ణిమ (1965), ప్యార్ కి రహెన్ (1959), గేట్‌వే ఆఫ్ ఇండియా (1957), దేఖ్ కబీరా రోయా (1957), లుకోచూరి (1958), సంజోగ్ (1961). వంటి చిత్రాలలో కూడా ప్రముఖ పాత్రలు పోషించింది.

వృత్తి

[మార్చు]

ఈమె 1950లలో తన 15వ ఏట అందాల పోటీలలో పాల్గొనడానికి ముంబైకి వచ్చింది. [1] ఈమె అక్కడ నటిగా టోంగా-వాలి (1955) చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. తరువాత ఈమె దేఖ్ కబీరా రోయా (1957), శారద (1957), [2] గూంజ్ ఉఠీ షెహనాయ్ వంటి హిట్ చిత్రాలలో నటించింది. గూంజ్ ఉతి షెహనాయ్ చిత్రంలోని పాత్రకు ఈమె ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయ నటి విభాగంలో నామినేట్ అయ్యింది. ఇది ఆమె జీవితంలో ఏకైక నామినేషన్. [3] 1961లో, ఆమె బాబూభాయ్ మిస్త్రీ తీసిన సంపూర్ణ రామాయణంలో సీతగా కనిపించింది, అది ఈమె ఇంటి పేరుగా మారింది. [4] కానీ జై సంతోషి మా (1975)లో ప్రధాన పాత్ర ఈమెకు అత్యంత కీర్తిని తెచ్చిపెట్టింది. [5] ఈమె ఆ పాత్రను అంగీకరించే వరకు సంతోషి దేవత గురించి వినలేదు. ఇది చాలా చిన్న పాత్ర మాత్రమే. ఈమె నటించిన సన్నివేశాలు 10-12 రోజులలో చిత్రీకరించబడ్డాయి. షూటింగ్ సమయంలో ఆమె నిష్టతో ఉపవాసం ఉంది. ఈ తక్కువ-బడ్జెట్ చిత్రం ఆశ్చర్యకరంగా భారీ విజయాన్ని సాధించింది. బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. సంతోషిమాత ఇప్పుడు ప్రసిద్ధ దేవతగా మారింది, భారతదేశం అంతటా స్త్రీలకు ఆరాధ్య దేవత అయ్యింది. సినిమా థియేటర్లను ప్రజలు గుడిగా భావించి జై సంతోషి మా అని జపిస్తూ, ప్రసాదాలు తెచ్చి, తలుపుల వద్ద చెప్పులు విడిచిపెట్టి సినిమాను చూసేవారు. ప్రజలు ఈమెను నిజమైన దేవతగా భావించి తమను ఆశీర్వదించమని కోరుతూ తన వద్దకు వచ్చేవారని గుహ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నది. అయితే, ఈమె తాను సంతోషీమాత భక్తురాలిని కాదని కాళీ దేవి భక్తురాలినని చెప్పుకుంది .


ఆమె నటించిన ఇతర పౌరాణిక చిత్రాలలో కవి కాళిదాస్ (1959), జై ద్వారకాదేశ్ (1977), కృష్ణ కృష్ణ (1986) ఉన్నాయి. పౌరాణిక నటిగా ముద్ర పడినందుకు ఈమె సంతోషించలేదు. ఆమె ప్రారంభ చిత్రాలలో సంగీత సామ్రాట్ తాన్సేన్ (1962), కన్ కాన్ మే భగవాన్ (1963), వీర్ భీంసేన్ (1964) వంటివి ఉన్నాయి. ఆరాధన (1969) చిత్రంలో ఈమె రాజేష్ ఖన్నా పెంపుడు తల్లిగా నటించింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఈమె నటుడు మాణిక్ దత్‌ను వివాహం చేసుకుంది; వీరికి సంతానం లేక పోవడంతో ఒక ఆడపిల్లను దత్తత తీసుకున్నారు. తన భర్త మరణం తరువాత, ఈమె ముంబైలో ఒంటరిగా జీవిస్తూ, 20 జూన్ 2007న గుండెపోటుతో మరణించింది. అనితా గుహ నటుడు ప్రేమ నారాయణ్‌కి మేనత్త. ప్రేమ ఆమె సోదరి అనురాధ గుహ కుమార్తె.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర విశేషాలు
1953 బన్‌సేర్ కెల్లా
1955 టాంగా వాలీ తొలి చిత్రం
దునియా గోల్ పై దేవీ దియా కుమారి
1956 యాహుదీ కీ బేటీ
ఆంఖ్ కా నషా ఆశాదేవి
చిరకుమార్ సభ బెంగాలీ సినిమా
ఛూ మంతర్ రత్నావళి
1957 హర్‌జీత్
ఉస్తాద్ మిసెస్ రోజీ
శారద పద్మ
పవన్ పుత్ర హనుమాన్
గేట్ వే ఆఫ్ ఇండియా కిషోర్ స్నేహితురాలు
ఏక్ ఝలక్
దేఖ్ కబీరా రోయా రేఖ
1958 కల్ క్యా హోగా
లకోచురి గీత బెంగాలీ సినిమా
స్టాండ్
మాయాబజార్ సురేఖ వీర ఘటోత్కచ పేరుతో తెలుగులోనికి డబ్ చేయబడింది.
ఫరిస్తా రాణి
భలా ఆద్మీ
1959 టిప్పు సుల్తాన్
సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ కర్ణాటకి రాజనర్తకి
మహారాణి పద్మిని
ప్యార్ కీ రాహే
కవి కాళిదాస్ పుష్పవల్లి
గూంజ్ ఉఠీ షెహనాయ్ రామ్‌కలీ ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయనటి పురస్కారానికి ప్రతిపాదించబడింది.
చాచా జిందాబాద్ రేణు
1960 రిక్షావాలా
ముడ్ ముడ్‌కే న దేఖ్ అనితా సింగ్
అంగుళిమాల్ గురుమాత
1961 సంజోగ్ లాలి
సంపూర్ణ రామాయణ సీత
1962 సంగీత్ సమ్రాట్ తాన్‌సేన్ హంస తాన్‌సేన్ బాల్యస్నేహితురాలు
1963 నాగజ్యోతి
కణ్ కణ్‌మే భగవాన్ రూప
దేవకన్య
1964 వీర్ భీమ్‌సేన్
రూపసుందరి
మహాసతి అనసూయ
1965 షాహీ రకస
సంత్ తుకారామ్
శ్రీ రామ్‌ భరత్ మిలన్ సీత
శంకర్ సీత అనసూయ సీత
సతి నారి రాజకుమారి మాళవతి
పూర్ణిమ వందనా మెహ్రా
మహారాజా విక్రమ్
జహా సతి వహా భగవాన్ మందాకిని/ గంధర్వ కన్య
1966 లవ్ కుష్
1969 హనుమాన్ చాలీసా
ఆరాధన మిసెస్ ప్రసాద్ సక్సేనా ఈ చిత్రంలో ఈమె పేరు అనితా దత్‌గా పేర్కొనబడింది
సతీ సులోచన నాగకుమారి సులోచన
1971 తులసీ వివాహ్ లక్ష్మీదేవి
1972 అనురాగ్ రాజేష్ తల్లి అనురాగాలు పేరుతో తెలుగులో పునర్మించబడింది.
1973 ఝూమ్ ఉఠా ఆకాశ్
గరీబీ హటావో
1974 జబ్ అంధేరా హోతాహై మిసెస్ మనోరమా భరద్వాజ్
1975 మహాపవన్ తీర్థ్ యాత్ర
జై సంతోషి మా సంతోషి మాత పేరు తెచ్చిపెట్టిన పాత్ర
బీవీ కిరాయా కి
బద్నామ్
1976 లడ్‌కీ భోలీ భాలీ రాజు తల్లి
నాగిన్ సునీత తల్లి
జై మహాలక్ష్మి మా'
దో ఖిలాడి మమతా సింగ్
1977 ఆనంద్ ఆశ్రమ్ చంద్రముఖి
సోలా శుక్రవార్ కౌసల్య
జై ద్వారకాదీశ్ రేవతి
జై అంబె మా
1978 తుమ్హారే లియే శీలాదేవి
1979 గురూ హోజా షురూ షీలా తల్లి
1981 సంఫూర్ణ సంతోషి మా కీ మహిమ
ఫిఫ్టీ ఫిఫ్టీ రాణీ మా
1983 నవరాత్రి
సతీ నాగకన్య సతీ అనసూయ
1984 ప్రార్థన
1986 కృష్ణ - కృష్ణ రేవతి
1989 సోచా నా థా
1991 లఖ్‌పతి రంభ చివరి సినిమా

అవార్డులు, నామినేషన్లు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Santoshi Maa Anita Guha dead". The Times of India. 20 June 2007. Archived from the original on 26 January 2013.
  2. "Anita Guha, 70s, actress – Entertainment News, Obituary, Media – Variety". Variety. Archived from the original on 9 July 2010. Retrieved 20 April 2020.
  3. "1st Filmfare Awards 1953" (PDF). Archived from the original (PDF) on 12 June 2009. Retrieved 13 December 2007.
  4. "Anita Guha dead". The Hindu. Chennai, India. 20 June 2007. Archived from the original on 25 January 2013. Retrieved 14 December 2012.
  5. Kahlon, Sukhpreet. "Anita Guha, a different 'Maa' in Indian cinema – Death anniversary special". Cinestaan.com. Archived from the original on 25 June 2018. Retrieved 20 June 2018.

బాహ్య లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=అనితా_గుహ&oldid=4293322" నుండి వెలికితీశారు