Jump to content

ఆముదం చెట్టు

వికీపీడియా నుండి

ఆముదము చెట్టు
ఆముదపు పుష్పాలు, ఫలాలు.
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Subfamily:
Tribe:
Subtribe:
Ricininae
Genus:
Ricinus
Species:
R. communis
Binomial name
Ricinus communis

ఆముదం ఒకరకమైన నూనె చెట్టు. ఆముదం చెట్టులలో ఎరుపు, తెలుపు, పెద్దాముదం అను మూడు రకములు ఉన్నాయి. తెలుపు, ఎరుపు రంగులు గల పుష్పాలను బట్టి, పెద్దవైన ఆకులను బట్టి వీటిని గుర్తించాలి. చిన్న ఆకులు కలిగిన చిట్టాముదపు చెట్టు మిక్కిలి శ్రేష్ఠమైనది. ఆముదపు గింజల నుండి ఆముదము నూనె తయారుచేస్తారు.

ఈజిప్ట్ దేశంలో క్రీ.పూ. 4000 సంవత్సరాలుగా ఉపయోగంలో ఉన్నట్లు ఆధారాలున్నాయి. గ్రీకు ప్రయాణీకులు ఆముదపు నూనెను దీపాలు వెలిగించుకోడానికి, లేపనముగా ఉపయోగించారు.

ప్రపంచ ఆముదపు గింజల ఉత్పత్తి సంవత్సరానికి ఒక మిలియను టన్నులు. వీనిలో భారతదేశం, చైనా, బ్రెజిల్ ముఖ్యమైనవి. ఆముదం ఒకరకమైన నూనె చెట్టు . ఆముదం చెట్లలో తెలుపు, ఎరుపు, పెద్దాముదం అనే మూడు జాతులన్నాయి. చిన్న ఆకులు గల ఆముదం చెట్టునే చిట్టాముదపు చెట్టు అంటారు. ఇది పెద్దాముదము చెట్టుకన్న శ్రేష్ఠమైనది. పొడవైన అయిదు కొనలు కలిగి అరచేయిలాగా ఆకు ఉంటుంది. ఆరోగ్యాన్ని అందివ్వటంలో మాదెప్పుడూ పై చేయి అన్నట్లుగా ఈ చెట్ట ఆకులు ఎల్లప్పుడూ పైకి ఎత్తుకునే ఉంటాయి. క్రిందికి వాలవు. ఆముదము చెట్టు లక్షణాలు * బహువార్షిక పొద. * 6-10 నొక్కులు గల హస్తాకార సరళ పత్రాలు. ఆకులకు పొడవైన కాడలుండును. * అగ్రస్థ శాఖాయుత అనిశ్చిత విన్యాసంలో అమరిన పసుపు రంగు పుష్పాలు. * ఫలం 3 నొక్కులు గల రెగ్మా. కాయ లోపల మూడు గింజలుండును. కాయపైన మృదువైన ముండ్లుండును. గుణాలు... ఇది కారం, చేదు రుచులతో వేడి చేసే స్వభావం కలిగి ఉంటుంది. సమస్త వాతరోగాలనూ పోగొట్టడంలో అగ్రస్థానం దీనితే. కడుపులోను, పొత్తికడుపులోను వచ్చే నొప్పులను, రక్తవికారాలను నివారింప చేస్తుంది. మొలలు హృద్రోగము, విషజ్వరము, కుష్ఠు, దురద, వాపు, నులిపురుగులు, మలమూత్ర బంధము మొదలైన సమస్యలను కూడా సులువుగా పోగొడుతుంది. శరీరంలో పేరుకుపోయిన దుష్ట విష పదార్థాలను కరిగించి బయటకు తోసివేస్తుంది. నరాలకు సత్తువ కలిగిస్తుంది. కడుపు నొప్పిని తగ్గించటంలో ఇంత నాణ్యమైనది మరొకటి లేదని కూడా చెప్పవచ్చు. ఆముదం వల్ల ఉపయోగాలు : * భారతదేశంలో ఆముదము నూనె క్రీ.పూ. 2000 నుండి ఉపయోగంలో ఉంది. దీనిని దీపాలు వెలిగించడానికి, ఆయుర్వేదంలో విరేచనకారిగా ఉపయోగించారు. ఆముదపు ఆకుల రసం పచ్చకామెర్లు వ్యాధిని కొన్ని రోజులలో నయం చేస్తుందని నమ్మకం. * చైనా వైద్యంలో గాయాలకు కట్టిన పట్టీలలో కొన్ని తరాలనుండి ఉపయోగిస్తున్నారు. * దీపావళి రోజు భారతీయులు ఆముదపు కాడలకు నూనె దీపాలుగా చేసి వెలిగించడం వల్ల పరలోకాలలో పిత్రుదేవతలను ప్రార్ధిస్తారు. ఆరోగ్య పరంగా : చెవిపోటుకు... ఆముదపు ఆకులను నిప్పులపైన వెచ్చచేసి దంచి రసం తీసి, దానితో సమానంగా అల్లం రసం, నువ్వుల నూనె, అతి మధు రం, ఉప్పు కలిపి తైలం మిగిలేవరకు చిన్న మంట మీద మరగబెట్టి వడపోసి, ఆ నూనె చెవిలో పది చుక్కలు వేస్తే వెంటనే చెవిపోటు తగ్గిపోతుంది. శరీరంపై నల్ల మచ్చలకు... ఆముదపు గింజలు 225 తీసుకొని పై పెచ్చులు తీసివేసి, లోపలి పప్పులో 12 గ్రాముల శొంఠి పొడి కలిపి మెత్తగా నూరి, కుంకుడు గింజలంత మాత్రలు చేసి నిలువ ఉంచుకొని, పూటకు ఒక మాత్ర చొప్పున రెండు పూటలా మంచి నీళ్ళతో వేసుకొంటూ ఉంటే రెండు లేక మూడు నెలల్లో నల్లమచ్చలన్నీ సమసిపోతాయి. బోదకాళ్ళకు... ఆముదం వేళ్ళు, ఉమ్మెత్త వేళ్ళు, వావిలి చెట్టు వేళ్ళు, తెల్ల గలిజేరు వేళ్ళు, మునగ చెట్టు వేళ్ళు, ఆవాలు వీటిని సమానంగా తీసుకొని మంచి నీటితో దంచి రసాలు తీసి, ఆ రసం ఎంత ఉంటే అంత ఆముదం కలిపి, నూనె మాత్రమే మిగిలే వరకు మరగబెట్టి, వడపోసి, ఆ నూనెలో సగభాగం తేనె మైనం కలిపి ఆయింట్‌మెంట్‌లాగా తయారు చేసుకొని నిలువ ఉంచి, బోదకాల మీద లేపనం చేస్తూ ఉంటే కాలు యధాస్థితికి వచ్చే అవకాశం ఉంది. దగ్గుకు... ఆముదంలో తాలింపు వేసిన చామదుంపల కూర తింటూ ఉంటే దగ్గులు తగ్గిపోతాయి. మూత్రపిండ వ్యాధులకు... మంచి ప్రశస్తమైన ఆముదాన్ని రోజూ రాత్రి పడుకోబోయే ముందు పది గ్రాముల మోతాదుగా నియమబద్ధంగా శారీరక శక్తిని బట్టి సేవిస్తూ ఉంటే మూత్రపిండాలు బాగుంటాయి. మూత్ర బంధం విడిపోతుంది. మూత్ర కోశంలోని రాళ్ళు కరిగిపోతాయి. అరికాళ్ళ మంటలకు... ఆముదము, కొబ్బరి నూనె సమానంగా కలిపి అరికాళ్ళకు బాగా మర్దనా చేస్తూంటే, అతిత్వరగా అరికాళం్ళ మంటలు అణగిపోతాయి. కీళ్ళ నొప్పులకు... ఆముదము చెట్టు చిగురాకులు, ఉమ్మెత్త చిగురాకులు, జిలేే్లడు చిగురాకులు, పొగాకు చిగురాకులు వీటిని భాగాలుగా తీసుకొని మెత్తగా నూరి శనగ గింజలంత మాత్రలు చేసి గాలికి ఆరబెట్టి నిలువ ఉంచుకొని, పూటకొక మాత్ర మంచినీళ్ళతో సేవిస్తూ ఉంటే కీళ్ళ నొప్పులు హరించి పోతాయి. సుఖనిద్రకు... ఎర్రాముదం చెట్టు వేరు 10 గ్రాములు మోతాదుగా తీసుకొని నలగ్గొట్టి పావు లీటర్‌ నీటిలో వేసి సగం నీళ్ళు మిగిలేలా మరగబెట్టి, వడపోసి త్రాగితే సఖంగా నిద్ర పడుతుంది. అతి నిద్రకు... ఆముదపు చెట్టు పూవులను పాలతో నూరి కణతలకు పట్టువేసి, తల పైన కూడా వేసి కట్టుకడితే అతి మగతగా ఉండి ఎక్కువగా నిద్ర వచ్చే సమస్య నివారణ అవుతుంది. రేచీకటికి... మంచి వంటాముదాన్ని ప్రతి రోజూ క్రమం తప్పకుండా తలకు పెడుతూ ఉంటే, రెండు మూడు నెలలలో రేచీకటి తగ్గి పోతుంది.


ఆముదము చెట్టు లక్షణాలు

[మార్చు]
  • బహువార్షిక పొద.
  • 6-10 నొక్కులు గల హస్తాకార సరళ పత్రాలు. ఆకులకు పొడవైన కాడలుండును.
  • అగ్రస్థ శాఖాయుత అనిశ్చిత విన్యాసంలో అమరిన పసుపు రంగు పుష్పాలు.
  • ఫలం 3 నొక్కులు గల రెగ్మా. కాయ లోపల మూడు గింజలుండును. కాయపైన మృదువైన ముండ్లుండును.

ఉపయోగాలు

[మార్చు]
  • భారతదేశంలో ఆముదము నూనె క్రీ.పూ. 2000 నుండి ఉపయోగంలో ఉంది. దీనిని దీపాలు వెలిగించడానికి, ఆయుర్వేదంలో విరేచనకారిగా ఉపయోగించారు. ఆముదపు ఆకుల రసం పచ్చకామెర్లు వ్యాధిని కొన్ని రోజులలో నయం చేస్తుందని నమ్మకం.
  • చైనా వైద్యంలో గాయాలకు కట్టిన పట్టీలలో కొన్ని తరాలనుండి ఉపయోగిస్తున్నారు.
  • దీపావళి రోజు భారతీయులు ఆముదపు కాడలకు నూనె దీపాలుగా చేసి వెలిగించడం వల్ల పరలోకాలలో పిత్రుదేవతలను ప్రార్ధిస్తారు.

వంట ఆముదము తయారుచేయు విధానము

[మార్చు]

ఆముదము గింజలను రోట్లోవేసి బాగా దంచగా అది ఒక ముద్ద లాగ తయారవుతుంది. దానిని ఒక పాత్రలోవేసి సగానికి పైగా నీరు పోసి పొయ్యి మీద పెట్టి బాగా మంట పెడతారు. అప్పుడు అందులోని ఆముదపు నూనె నీటిపై ఒక తెరలాగ తేలుతుంది. దానిని ఒక పలచటి గరిటతో తీసి చిన పాత్రలో వేస్తారు. అలా నీటి పైన తేలిన నూనెను వేరుపరుస్తూ ఉడుకుతున్న ఆముదపు పిండిని మాటిమాటికి కలుపుతూ పైకి తేలిన నూనెను తీసుకుంటారు. చివరగా నీటి పై తేలిన నూనె (ఆముదము) గరిటలోకి రాదు. అప్పుడు ఒక గుప్పెడు వెంట్రుకలు తీసుకొని నీటిపై తేలిన నూనెలో ముంచుతారు. ఆముదము మాత్రమే వెంట్రుకలకు అంటుకొని నీరు క్రిందికి జారి పోతుంది. ఆ వెండ్రుకలు ఆముదము గిన్నెలో పిండి మరలా నీటిప అద్ది అక్కడ తేలిన ఆముదాన్ని సేకరిస్తారు. ఆవిధంగా మిగిలిన ఆముదాన్ని కూడా సేకరిస్తారు. నూనె సేకరించిన పాత్రలో ఆముదముతో కలిసిన నీరు కొంత పాత్ర అడుగుకు చేరి వుంటుంది. దానిని కూడా తీసివేసి ఆముదాన్ని మాత్రమే ఒక పాత్రలో సేకరిస్తారు. ఇందులో కూడా అతి కొద్ది శాతం నీరు వుంటుంది. అది కూడా పోవడానికి ఆ ఆముదాన్ని పొయ్యిపై పెట్టి బాగా వేడి చేస్తారు. అప్పుడు అందులోని నీరు ఆవిరైపోయి స్వచ్ఛమైన ఆముదము మాత్రమే మిగులుతుంది. దీనినే వంట ఆముదము అంటారు. దీనిని పిల్లలకు మందుగాను, వారితలలకు వాడుతారు. గానుగలతో తీసిన ఆముదాన్ని ఇందుకు వాడరు. ఆముదాలలో రెండు రకాలు: 1. చిట్టిఆముదాలు. 2. పెద్ద ఆముదాలు. చిట్టి ఆముదాలకు ప్రత్యేక ఉంది.

చిత్రమాలిక

[మార్చు]

ఇవీ చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]