Jump to content

ఆలియా భట్

వికీపీడియా నుండి
ఆలియా భట్
2022లో అలియా
జననం
ఆలియా భట్

(1992-03-15) 1992 మార్చి 15 (వయసు 32)
ముంబై, భారతదేశం
వృత్తినటి, రూపదర్శి
జీవిత భాగస్వామిరణబీర్ కపూర్
తల్లిదండ్రులుమహేష్ భట్ (నాన్న)
సోనీ రజ్దాన్ (అమ్మ)
బంధువులునానాభాయ్ భట్ (తాత)
ముఖేష్ భట్ (బాబాయ్)
షాహీన్ భట్ (సోదరి)
పూజా భట్ (సోదరి)
రాహుల్ భట్ (సోదరుడు)

ఆలియా భట్ ఒక భారతీయ సినీ నటి. ఆమె పలు హిందీ చిత్రాలలో నటించింది. ఆర్.ఆర్.ఆర్ అనే చిత్రం తో తెలుగు సినీ పరిశ్రమ లోకి తెరంగేట్రం చేసింది.

హైవే (2014)లో తన పాత్రకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డును గెలుచుకుంది. ఉడ్తా పంజాబ్ (2016), రాజీ (2018), గల్లీ బాయ్ (2019), గంగూబాయి కతియావాడి (2022)లో ఆమె తన పాత్రలకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకుంది.[1][2][3] 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌లో గంగూబాయి కతియావాడికి ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డు (మిమీ సినిమా కోసం కృతి సనన్ తో పంచుకున్నారు) ను కూడా గెలుచుకున్నది.[4]

నేపధ్యము

[మార్చు]

ఈమె ప్రముఖ దర్శకుడు మహేష్ భట్, నటి సోని రజ్దాన్ కుమార్తె. ఈమెకు ఒక సోదరి షహీన్ భట్ ఉంది. ప్రముఖ నటి పూజా భట్, రాహుల్ భట్ ఈమె సవతి సోదరీ సోదరులు.ఈమె పాఠశాల విద్యను ముంబైలోని జమ్నాబాయ్ నర్సీ పాఠశాలలో 2011 మేలో పూర్తి చేసింది.

ఆమె 2022 ఏప్రిల్ 14న ముంబయిలో రణబీర్ కపూర్ ని వివాహం ఆడింది.[5][6] ఆలియా, రణ్‌బీర్‌ లకు 2022 నవంబర్ 6న పాప రాహా జన్మించింది.[7]

నట జీవితం

[మార్చు]

ఈవిడ బాలనటిగా 1999లో విడుదలైన హిందీ చిత్రం సంఘర్ష్ లో నటించింది. 2012 లో విడుదలైన హిందీ చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ లో ప్రధాన నాయిక పాత్రను పోషించింది.

ఇప్పటివరకు నటించిన చిత్రాలు

[మార్చు]
సినిమాలు
సంవత్సరం చిత్రం పాత్ర గమనికలు Ref.
1999 సంఘర్ష్ యువ రీత్ ఒబెరాయ్ బాల నటుడు
2012 స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ షానాయా సింఘానియా
2014 హైవే వీర త్రిపాఠి
2 స్టేట్స్ అనన్య స్వామినాథన్
హంప్టీ శర్మ కీ దుల్హనియా కావ్య ప్రతాప్ సింగ్
అగ్లీ యువతి షాలిని అతిధి పాత్ర
ఇంటికి వెళ్తున్నాను ఆమెనే షార్ట్ ఫిల్మ్
2015 షాందర్ అలియా అరోరా
2016 కపూర్ & సన్స్ తియా మాలిక్
ఉడ్తా పంజాబ్ మేరీ జేన్
ఏ దిల్ హై ముష్కిల్ DJ అతిధి పాత్ర
ప్రియమైన జిందగీ కైరా
2017 బద్రీనాథ్ కీ దుల్హనియా వైదేహి త్రివేది
2018 రాజీ సెహ్మత్ ఖాన్
జీరో ఆమెనే అతిధి పాత్ర
2019 గల్లీ బాయ్ సఫీనా ఫిర్దౌసి
కలంక్ రూప్
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 ఆమెనే "ది హుక్ అప్ సాంగ్" పాటలో ప్రత్యేక ప్రదర్శన
2020 సడక్ 2 ఆర్య దేశాయ్
2022 గంగూబాయి కతియావాడి గంగూబాయి కతియావాడి
ఆర్‌ఆర్‌ఆర్‌ సీత తెలుగు సినిమా
డార్లింగ్స్ బద్రు ఖురేషీ నిర్మాత కూడా
బ్రహ్మాస్త్ర ఇషా ఛటర్జీ
2023 రాకీ ఔర్ రాణి కియీ ప్రేమ్ కహానీ రాణి ఛటర్జీ
హార్ట్ ఆఫ్ స్టోన్ కీ ధావన్ అమెరికన్ సినిమా [8]
2024 జిగ్రా TBA చిత్రీకరణ; నిర్మాత కూడా

మూలాలు

[మార్చు]
  1. "60th Britannia Filmfare Awards 2014: Complete list of winners". The Times of India. 31 January 2015. Archived from the original on 3 February 2015. Retrieved 31 January 2015.
  2. "Winners of 65th Amazon Filmfare Awards 2020". filmfare.com. Archived from the original on 23 March 2021. Retrieved 14 October 2020.
  3. "Winners of the 68th Hyundai Filmfare Awards 2023". Filmfare. 28 April 2023. Retrieved 28 April 2023.
  4. "69th National Film Awards 2023 complete winners list: Rocketry, Alia Bhatt, Kriti Sanon, Allu Arjun, RRR, Gangubai Kathiawadi win big". The Indian Express. 24 August 2023. Retrieved 24 August 2023.
  5. Andhra Jyothy (14 April 2022). "పెళ్లి చేసుకున్న అలియా భట్- రణ్‌బీర్ కపూర్". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  6. "Alia Ranbir: వైభవంగా ఆలియా- రణ్‌బీర్‌ వివాహం". EENADU. Retrieved 2022-04-14.
  7. Andhra Jyothy (24 November 2022). "కుమార్తె పేరును తెలిపిన ఆలియా భట్" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2022. Retrieved 24 November 2022.
  8. A. B. P. Desam (11 August 2023). "ఆలియా భట్ మొదటి హాలీవుడ్ సినిమా ఎలా ఉంది? 'వండర్ వుమన్'ను డామినేట్ చేసిందా?". Archived from the original on 16 October 2023. Retrieved 16 October 2023.

బయటి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఆలియా_భట్&oldid=4323240" నుండి వెలికితీశారు