ఆర్.ఆర్.ఆర్. (సినిమా)

వికీపీడియా నుండి
(ఆర్.ఆర్.ఆర్ సినిమా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఆర్.ఆర్.ఆర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు చిత్రం. ఎస్.ఎస్ రాజమౌళి రచించి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్.టి.రామారావు, రామ్ చరణ్ తేజ ,అలియా భట్ , మరియు అజయ్ దేవగన్ లలో నటిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధులు, అల్లూరి సీతారామరాజు మరియు కొమరం భీమ్ జీవితాల ఆధారంగా నిర్మిస్తున్న చిత్రం.ఈ చిత్ర బడ్జెట్ సుమారు 300 కోట్ల రూపాయలు ధ్రువీకరించబడింది.[1]

తారాగణం[మార్చు]

  • నందమూరి తారక రామారావు - కోమరం భీమ్
  • రామ్ చరణ్ - అల్లూరి సితారామ రాజు
  • అలియా భట్
  • అజయ్ దేవ్గన్
  • ఒలీవియా మోరిస్

చిత్ర నిర్మాణం[మార్చు]

హైదరాబాద్ లో 19 నవంబరు 2018 న ఈ చిత్రం యొక్క ప్రధాన ఫోటోగ్రఫీ ప్రారంభమైంది. తొలి షెడ్యూల్ హైదరాబాద్, అల్యూమినియం కర్మాగారంలో ఏర్పాటు చేసిన సెట్స్ లో చిత్రీకరించారు. మెదటి యాక్షన్ సీక్వెన్స్లో నందమూరి తారక రామారావు, రామ్ చరణ్ పాల్గొన్నారు.[2]

మూలాలు[మార్చు]  1. "RRR budget revealed. The amount of Jr NTR and Ram Charan film will blow your mind". India Today. 14 March 2019. Retrieved 8 May 2019.
  2. "సితార - 'ఆర్ ఆర్ ఆర్' కోసం 1920 నాటి కార్లు - కొత్త కబుర్లు - అవి ఇవి". సితార. Retrieved 2019-11-29.