కరక్కాయ
కరక్కాయ | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | T. chebula
|
Binomial name | |
'టెర్మినాలియా చెబుల్లా | |
Synonyms[1] | |
Walp.
|
కరక్కాయ శాస్త్రీయ నామం టెర్మినాలియా చెబుల్లా. చెబ్యులిక్ మైరోబాలన్, హరిటాకి, హారార్డ్ అనేవి ఇతర పేర్లు. ఇది 6-20 మీటర్ల ఎత్తువరకు పెరిగే వృక్షం. పత్రాలు కణుపు ఒకటి లేదా రెండు చొప్పున పొడవుగా, దాదాపు కోలగా ఉంటాయి. పుష్పాలు తెలుపు లేదా లేతాకుపచ్చ రంగులో సన్నని కంకులపై నక్షత్రాలవలె వస్తాయి. ఫలాలు కోలగా ఉండి, ఎండితే నిడుపాటి నొక్కులను కలిగి ఆగస్టు నుంచి అక్టోబరు వరకు లభిస్తాయి. ఇది విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కరక్కాయ లేదా కరక ఔషధ జాతికి చెందిన మొక్క. కరక్కాయత్రిఫలాలలో ఒకటి. ఇది జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది.
లక్షణాలు
[మార్చు]- నలుపు గోధుమ రంగు బెరడుతో పెరిగే పెద్ద వృక్షం.
- అండాకారం నుండి విపరీత అండాకారం గల సరళ పత్రాలు.
- శాఖాయుతమైన కంకులలో అమరిన ఆకుపచ్చతో కూడిన పసుపు రంగు పుష్పాలు.
- నొక్కులున్న ఆకుపచ్చతో కూడిన పసుపురంగు ఫలాలు.
- దగ్గుతో బాధపడుతున్న పిల్లలకు పెద్దలకు కరక్కాయ రసం తాగిస్తుంటారు. కరక్కాయలోని ఔషధ గుణాలు దగ్గుతో పాటు పలురకాల జబ్బులను నయం చేస్తాయి. గొంతులోని శ్లేష్మాన్ని హరించి కంఠ సమస్యలను నివారిస్తుంది. అందుకే ప్రతి తెలుగింట్లో కచ్చితంగా కరక్కాయ ఉంటుంది.
ఔషధ గుణాలు
[మార్చు]కరక్కాయలు విలువైన జౌషధ గుణాలను కలిగివుంటాయి. వీటిలో యంత్రాక్వినోన్లు, టానిన్లు, ఛెబ్యులిక్ ఆమ్లం, రెసిన్, స్థిర తైలం మొదలనవి ఉంటాయి. అన్ని రకాల జీర్ణకోశ వ్యాధులు, అస్తమా, దగ్గు, వాంతులు, కంటి వ్యాధులు, గుండె జబ్బుల నివారణకు ఉపయోగపడుతుంది. దగ్గు నివారణకు కరక్కాయ వాడటం ప్రముఖ గృహ వైద్యం. ఆయుర్వేద వైద్యంలో దీన్ని విరివిగా వాడతారు.
ఉపయోగాలు
[మార్చు]- కరక్కాయ చూర్ణాన్ని రోజువారీగా మోతాదుకు టీ స్పూన్ చొప్పున రెండు పూటలా సమాన భాగం బెల్లంతోగాని, అర టీస్పూన్ శొంఠి పొడితో గాని, పావు టీ స్పూన్ సైంధవ లవణంతో గాని కలిపి తీసుకుంటే ఆకలి పెరుగుతుంది.
- కరక్కాయలు, పిప్పళ్లు, సౌవర్చలవణం వీటిని సమానంగా తీసుకొని విడివిడిగా పొడిచేసి, అన్నీ కలిపి నిల్వచేసుకొని మోతాదుగా అర టీ స్పూన్ చొప్పున అర కప్పు నీళ్లతో కలిపి తీసుకుంటే ఆకలి పెరుగుతుంది.
- పేగుల్లోనూ, ఛాతి భాగంలోనూ, గొంతు భాగంలోనూ మంటగా అనిపిస్తుంటే కరక్కాయ చూర్ణాన్ని ఎండు ద్రాక్షతో కలిపి నూరి తేనె, చక్కెర చేర్చి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
- అజీర్ణంతో ఇబ్బంది పడుతున్నప్పుడు, పరిపూర్ణమైన బలంతో ఉన్నవారు ఆహారానికి గంట ముందు కరక్కాయ చూర్ణాన్ని, శొంఠి చూర్ణాన్ని సమభాగాలుగా కలిపి టీ స్పూన్ మోతాదుగా, అర కప్పు నీళ్లతో తీసుకోవాలి.
- కరక్కాయలు, పిప్పళ్లు, శొంఠి వీటిని త్రిసమ అంటారు. వీటిని సమాన భాగాలుగా చూర్ణంగాచేసి తీసుకుంటే ఆకలి పెరగటమే కాకుండా అతి దప్పిక నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
- కరక్కాయ చూర్ణాన్ని, వేపమాను బెరడు చూర్ణాన్ని సమాన భాగాలుగా కలిపి మోతాదుగా అర టీ స్పూన్ చొప్పున అర కప్పు నీళ్లతో కలిపి రెండుపూటలా తీసుకుంటే ఆకలి పెరగటంతోపాటు చర్మంమీద తరచూ తయారయ్యే చీముగడ్డలు, చర్మ సంబంధమైన ఫంగల్ ఇనె్ఫక్షన్లు, తామరచర్మ రోగాలూ వీటన్నిటినుంచీ ఉపశమనం లభిస్తుంది.
- అజీర్ణం, ఆమ దోషం, అర్శమొలలు, మలబద్ధకం సమస్యలతో రోజువారీగా కరక్కాయ చూర్ణాన్ని అర చెంచాడు చొప్పున సమాన భాగం బెల్లంతో కలిపి తీసుకుంటే హితకరంగా ఉంటుంది.
- అధిక లాలాజలస్రావంతో ఇబ్బందిపడేవారు కరక్కాయ చూర్ణాన్ని భోజనం తరువాత అర టీ స్పూన్ మోతాదుగా అర కప్పు నీళ్లతోగాని, చెంచాడు తేనెతోగాని కలిపి తీసుకోవాలి.
- వికృతి చెందిన త్రిదోషాలను తిరిగి సమస్థితికి తెచ్చి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందాలంటే కరక్కాయ, సైంధవ లవణం, పిప్పళ్లు, శొంఠి ఈ నాలుగింటి చూర్ణాలనూ సమాన భాగాలు కలిపి నిల్వచేసుకొని మోతాదుకు అర టీ స్పూన్ చొప్పున నీళ్లతో జారుడుగా కలిపి రెండు పూటలా తీసుకోవాలి. ఈ ఔషధ యోగం ఆకలిని, అరుగుదలను ఏక కాలంలో వృద్ధిపరుస్తుంది.
- కరక్కాయలను నేతిలో వేయించి దంచి పొడిచేయాలి. దీనిని సమాన భాగం బెల్లంతోనూ, సమాన భాగం పిప్పళ్ల చూర్ణంతోనూ కలిపి మోతాదుకు అర టీ స్పూన్ చొప్పున రెండు పూటలా తీసుకుంటే అరుగుదల పెరిగి అర్శమొలల వ్యాధినుంచి ఉపశమనం లభిస్తుంది, మూలవ్యాధి వల్ల మలబద్ధకం ప్రాప్తించినట్లైతే కరక్కాయల చూర్ణాన్ని తెల్లతెగడ వేరు చూర్ణం, శుద్ధిచేసిన నేపాళం గింజల చూర్ణంతో కలిపి పావు టీస్పూన్ మోతాదులో తీసుకోవాలి. ఇది ఉగ్ర ఔషధం. జాగ్రత్తగా ఉండాలి. తీవ్ర స్థాయిలో విరేచనాలవుతాయి.
- మసిలే గోమూత్రంలో కరక్కాయలను వేసి ఉడికించి అరబెట్టి, దంచి పొడిచేసి నిల్వచేసుకోవాలి. దీనిని ప్రతిరోజూ ఉదయం అర టీ స్పూన్ మోతాదుగా లేదా ఎవరి బలాన్నిబట్టి వారు మోతాదును నిర్ణయించుకొని గాని, తేనెతో కలిపి తీసుకుంటే మొలల వ్యాధినుంచి ఉపశమనం లభిస్తుంది.
- కరక్కాయల చూర్ణాన్ని, బెల్లాన్ని కలిపి భోజనానికి ముందు చెంచాడు మోతాదుగా రెండు పూటలా తీసుకుంటూ ఉంటే పైల్స్ తగ్గుతాయి.
- పైల్స్‌వల్ల మలద్వారం వద్ద దురద తయారై ఇబ్బంది పెడుతుంటే కరక్కాయ చూర్ణాన్ని అర చెంచాడు మోతాదుగా సమాన భాగం బెల్లంతో కలిపి ఉండచేసి తినాలి.
- అర్శమొలలు మొండిగా తయారై ఇబ్బంది పెడుతున్నప్పుడు కరక్కాయల చూర్ణం, బెల్లం సమంగా కలిపి అర చెంచాడు మోతాదులో వాడాలి. తరువాత ఒక గ్లాసు మజ్జిగ తాగాలి. ఇలా రెండు పూటలా చేయాలి.
- కరక్కాయలు, వెల్లుల్లి ఒక్కోటి ఒక్కో భాగం గ్రహించాలి. నల్లేరు తీగ చూర్ణం 2 భాగాలు గ్రహించాలి. వీటిని కలిపి నిల్వచేసుకొని మోతాదుకు అర టీ స్పూన్ చొప్పున రెండు పూటలా సైంధవ లవణం, నువ్వుల నూనె కలిపి తీసుకుంటూ ఉంటే అర్శమొలలు ఎండిపోయి పడిపోతాయి.
- కరక్కాయలు, నల్ల ద్రాక్ష వీటిని పచ్చిగా ఉన్నప్పుడు ముద్దుచేసి గాని లేదా ఎండబెట్టి, పొడిచేసి గాని పూటకు టీ స్పూన్ చొప్పున రెండు పూటలా తీసుకుంటే శరీరాంతర్గతంగా జరిగే రక్తస్రావాలు, పెరుగుదలలు, దీర్ఘకాలపు జ్వరం వంటివి తగ్గుతాయి.
- కరక్కాయ చూర్ణాన్ని అర టీ స్పూన్ చొప్పున సమాన భాగం తేనెతో కలిపి తీసుకుంటే శరీరాంతర్గతంగా జరిగే రక్తస్రావాలు ఆగటంతోపాటు కడుపునొప్పి, ఆమాతిసారం వంటివి తగ్గుతాయి.
- కరక్కాయ చూర్ణాన్ని ముచ్చటి మాత్రలో తేనెతో కలిపి అవసరానుసారం మూడునాలుగుసార్లు తీసుకుంటే వాంతులు, వికారం వంటివి సమసిపోతాయి.
ఆయుర్వేదము లో ఉపయోగాలు /--డా. చిరుమామిళ్ల మురళీమనోహర్ *
[మార్చు]కరక్కాయలు, శొంఠి, తుంగముస్తలు, వీటిని సమభాగాలుగా గ్రహించి, విడివిడిగా దంచి, పొడిచేసి వస్తగ్రాళితం చేయాలి. తరువాత అన్నీ కలిపి బెల్లం చేర్చుతూ బాగా నూరి చిన్న చిన్న మాత్రలుగా చుట్టి ఆరబెట్టి గాజుసీసాలో నిల్వచేసుకోవాలి. ఈ మాత్రను బుగ్గనుంచుకొని రసం మింగుతుంటే దగ్గులో ఉపశమనం లభిస్తుంది. * కరక్కాయ పెచ్చులను అడ్డసరం (వాసా) ఆకుల స్వరంలో ఏడుసార్లు నానబెట్టి భావన చేసి ఎండబెట్టి పొడిచేసి పూటకు అర టీ స్పూన్ మోతాదులో రెండు పూటలా నేరుగా గాని లేదా పిప్పళ్లు, తేనె మిశ్రమంతో గాని కలిపి తీసుకుంటే శరీరాంతర్గతంగా జరిగే రక్తస్రావం ఆగిపోతుంది. * కరక్కాయ, శొంఠి, తానికాయ, పిప్పళ్లు వీటి చూర్ణాలను సమానంగా కలిపి నిల్వచేసుకొని పూటకు అర టీస్పూన్ చొప్పున మూడుపూటలా తేనెతో గాని లేదా నీళ్ళతో గాని కలిపి తీసుకుంటే దగ్గుతోపాటు ఆయాసం కూడా తగ్గుతుంది. * ఎక్కిళ్లు ఇబ్బంది పెడుతున్నప్పుడు కరక్కాయల చూర్ణాన్ని అర చెంచాడు చొప్పున అరకప్పు వేడినీళ్లతో గాని లేదా తేనె, నెయ్యి మిశ్రమంతోగాని కలిపి తీసుకోవాలి. * ఆయాసం, ఎక్కిళ్లు సతమతం చేస్తున్నప్పుడు బెల్లం పానకంలో కరక్కాయ పలుపును ఉడికించి తీసుకోవాలి. * ఎక్కిళ్లు, ఉబ్బసం, దగ్గు, గుండె జబ్బులు కలిసికట్టుగా హింసిస్తున్నప్పుడు వేడిచేసిన పాత నెయ్యిలో కరక్కాయల పెచ్చుల చూర్ణం, ఇంగువ పొడి, బిడాలవణం చేర్చి కలిపి మోతాదుకు అర టీస్పూన్ చొప్పున రెండుపూటలా తీసుకోవాలి. * కరక్కాయల చూర్ణం, శొంఠి చూర్ణం, పుష్కరమూల చూర్ణం, యవక్షారం, మిరియాల చూర్ణం వీటిని సమాన భాగాలుగా తీసుకొని నీళ్లతోకలిపి జారుడుగా చేసి తీసుకుంటే ఎక్కిళ్లతోపాటు ఉబ్బసంనుంచి కూడా నివృత్తి లభిస్తుంది. * రక్తహీనతతో బాధపడేవారు కరక్కాలను గోమూత్రంలో నానబెట్టి, తరువాత ఎండబెట్టి, పొడిచేసి, పూటకు అర టీస్పూన్ మోతాదులో రెండు పూటలా అర కప్పు నీళ్లతో కలిపి తీసుకోవాలి. * కామెర్లతో బాధపడేవారు లోహభస్మం, కరక్కాయ చూర్ణం, పసుపు వీటిని సమాన భాగాలుగా కలిపి, పూటకు చెంచాడు చొప్పున, అనుపానంగా బెల్లాన్నీ తేనెనూ చేర్చి మూడుపూటలా తీసుకుంటూ ఉండాలి. * కరక్కాయ పెచ్చులను గోమూత్రంతో సహా నూరి లేదా కరక్కాయలను, తానికాయలను, ఉసిరికాయలను కలిపి గోమూత్రంలో ఉడికించి, నూరి టీ స్పూన్ చొప్పున తీసుకుంటే కామెర్లు, రక్తహీనతలు తగ్గుతాయి. * కామెర్లతో బాధపడేవారికి జాగ్రత్తగా వమన విరేచనాలను చేయించి కరక్కాయ చూర్ణాన్ని అర చెంచాడు మోతాదుగా రెండుపూటలా హెచ్చు మొత్తాల్లో తేనెను కలిపి ఇవ్వాలి. * ఉదరంలో నీరు చేరినప్పుడు (ఎసైటిస్) కరక్కాయ చూర్ణాన్ని మోతాదుకు అర టీస్పూన్ చొప్పున గోమూత్రం అనుపానంగా మూడు పూటలా తీసుకోవాలి. తరువాత పాలు మాత్రమే తాగాలి. వారంపాటు బియ్యం, గోధుమ వంటి గింజ ధాన్యాన్ని పూర్తిగా మానేయాలి. (చరక సంహిత చికిత్సా స్థానం, అష్టాంగ సంగ్రహం చికిత్సా స్థానం) * తీవ్రమైన ఉదర వ్యాధులతో బాధపడేవారు వెయ్యి కరక్కాయలను ఔషధంగా తీసుకోవాలి. అలాగే విలాజిత్తును నిర్దేశిత మోతాదులో వాడుతూ కేవలం పాలు మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. * కరక్కాయలు, రోహీతక, యవక్షారం, పిప్పళ్లు వీటితో కషాయం తయారుచేసుకొని అర కప్పు మోతాదుగా ప్రతిరోజూ ఉదయంపూట తీసుకుంటూ ఉంటే ప్లీహం పెరగటం, కాలేయవృద్ధి, అసాధ్య ఉదర వ్యాధుల్లో హితకరంగా ఉంటుంది. * కరక్కాయ చూర్ణం, శొంఠి చూర్ణం, బెల్లం వీటి సమాన భాగాలను కలిపి నిల్వచేసుకొని మోతాదుకు టీస్పూన్ చొప్పున చప్పరించి నీళ్లు తాగాలి. దీంతో మలబద్ధకం తగ్గుతుంది. మలంతోపాటు జిగురు పడటం ఆగుతుంది. ముఖ్యంగా శరీరంలో నీరు పట్టడం తగ్గుతుంది. * కఫదోషంవల్ల శరీరంలో వాపుతయారైనప్పుడు కరక్కాయలను గోమూత్రంలో నానబెట్టి, పొడిచేసి పూటకు 3గ్రాముల మోతాదుగా అర కప్పు వేడినీళ్లతో కలిపి తీసుకోవాలి. * కరక్కాయల చూర్ణం, ఇప్ప పువ్వు లేదా ఇప్ప సారం (మధూకం), పిప్పళ్లు చూర్ణం మూడూ కలిపి పూటకు అరచెంచాడు మోతాదుగా తేనె చేర్చి వేడినీళ్లతో సహా రెండుపూటలా తీసుకుంటే శరీరంలో తయారైన వాపు తగ్గుతుంది. * కరక్కాయ చూర్ణం, శొంఠి చూర్ణం, దేవదారు చూర్ణం మూడు సమభాగాలు కలిపి పూటకు అర టీ స్పూన్ మోతాదుగా, వేడినీళ్లతో రెండుపూటలా తీసుకుంటే శరీరంలో చేరిన నీరు వెళ్లిపోయి వాపు తగ్గుతుంది. * కరక పిందెల చూర్ణాన్ని 3గ్రాముల మోతాదుగా బెల్లంతో కలిపి అర కప్పు నీళ్లతో తీసుకుంటే శరీరంలో చేరిన వాపు తగ్గుతుంది. * నాలుగుచెంచాల శుద్ధిచేసిన గోమూత్రంలో టీ స్పూన్ కరక్కాయ పొడిని కలిపి తీసుకుంటే వాపు తగ్గుతుంది. (గోమూత్రంలో పొటాషియం ఉంటుంది. ఇది మూత్రాన్ని జారీచేసి వాపును తగ్గిస్తుంది. (అష్టాంగ హృదయం) * కరక్కాయ చూర్ణం, శొంఠి పొడి వీటి మిశ్రమాన్ని మోతాదుకు అర చెంచాడు చొప్పున బెల్లంతో కలిపి రెండుపూటలా మజ్జిగ అనుపానంగా తీసుకుంటే శరీరంలో సంచితమైన అదనపు నీరు దిగుతుంది.
సూచికలు
[మార్చు]- ↑ "The Plant List: A Working List of All Plant Species". Archived from the original on 11 సెప్టెంబరు 2017. Retrieved 7 August 2015.
- ↑ దగ్గును తగ్గించే కరక్కాయ