కాకతీయ కాలువ
18°57′53″N 78°21′02″E / 18.96472°N 78.35056°E
కాకతీయ కాలువ | |
---|---|
విశేషాలు | |
పొడవు | 284 కి.మీ. (176 మైళ్లు) |
భౌగోళికం | |
మొదలైన స్థానం | శ్రీరాంసాగర్ ప్రాజెక్టు |
ముగిసిన స్థానం | దిగువ మానేరు డ్యామ్ |
కాకతీయ కాలువ అనేది తెలంగాణ రాష్ట్రంలోని ఒక నీటి పారుదల కాలువ. 1091అడుగుల (90టీఎంసీ)ల పూర్తిస్థాయి నీటిమట్టం కలిగిన[1] ఈ కాలువ ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి దిగువ మానేరు డ్యామ్ వరకు నీరు తరలించబడుతుంది. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో 4.73 లక్షల ఎకరాల నీటిపారుదలకు, ప్రధాన నగరాలకు తాగునీటి అవసరాలకు ఈ కాలువ ఉపయోగపడుతోంది.
కాలువ వివరాలు
[మార్చు]ఈ కాకతీయ కాలువ అనేది సుమారు 284 కిమీ పొడవు 9,700 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల గుండా వెళుతోంది.[2] ఈ కాలువ గోదావరి నది నీటిని వరంగల్, ఖమ్మం జిల్లాలలోని కృష్ణా నది పరీవాహక ప్రాంతాలకు నీరు అందించేందుకు అంతర్ నదీ పరీవాహక మార్గంగా ఉంది. 36 మెగావాట్ల ఉత్పత్తికి 9 మెగావాట్ల 4 యూనిట్లు కూడా కాలువలోకి నీటిని పోయడానికి ఏర్పాటు చేయబడ్డాయి.
పునరుద్దరణ
[మార్చు]గతంలో పూడికతో నిండిపోయిన ఈ కాలువను తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేయగా, ప్రస్తుతం చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందుతోంది. ఎండాకాలంలో ఎస్సారెస్పీ అధికారులు విడుతల వారీగా నీటిని విడుదల చేస్తుంటారు.[3]
బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని మెండోరా మండలం సోన్‌పేట్ – పోచంపాడ్ గ్రామాల మధ్య కాకతీయ కెనాల్ జీరో పాయింట్ వద్ద 1.24 కోట్ల రూపాయలతో, మెండోర – దూద్గావ్ వద్ద కాకతీయ కెనాల్ పై 1.38 కోట్ల రూపాయలతో వంతెనలు నిర్మించబడ్డాయి.
నీటి విడుదల
[మార్చు]2022 జూలై 20న ఉదయం మొదట 500 క్యూసెక్కులు, సాయంత్రం వరకు విడుతల వారీగా మూడు వేల క్యూసెక్కుల నీరు విడుదలచేయబడింది. ఈ నీటితో మైలారం జలాశయం నింపి, అక్కడినుండి సూర్యాపేట జిల్లా వరకు నీటిని అందించారు.[4]
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ ABN (2022-12-17). "కాకతీయ కాలువకు నీటి విడుదల". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-06-27. Retrieved 2023-06-27.
- ↑ "Sri Ram Sagar Project, Stage-I". Retrieved 19 July 2015.
- ↑ telugu, NT News (2022-04-02). "వేసవిలోనూ నిండుగా కాకతీయ కాలువ". www.ntnews.com. Archived from the original on 2022-04-03. Retrieved 2023-06-27.
- ↑ telugu, NT News (2022-07-21). "కాకతీయ కాలువకు నీటి విడుదల". www.ntnews.com. Archived from the original on 2022-07-21. Retrieved 2023-06-27.