కానూరు (పెరవలి)
కానూరు (పెరవలి) | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 16°50′9.204″N 81°43′32.556″E / 16.83589000°N 81.72571000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తూర్పు గోదావరి |
మండలం | పెరవలి |
విస్తీర్ణం | 10.31 కి.మీ2 (3.98 చ. మై) |
జనాభా (2011)[1] | 6,659 |
• జనసాంద్రత | 650/కి.మీ2 (1,700/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 3,311 |
• స్త్రీలు | 3,348 |
• లింగ నిష్పత్తి | 1,011 |
• నివాసాలు | 1,802 |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 534329 |
2011 జనగణన కోడ్ | 588528 |
కానూరు, పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలానికి చెందిన గ్రామం.ఇది మండల కేంద్రమైన పెరవలి నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నిడదవోలు నుండి 10 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1802 ఇళ్లతో, 6659 జనాభాతో 1031 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3311, ఆడవారి సంఖ్య 3348. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1239 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 101. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588528.[2]
కానూరులో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని 2022 ఆగష్టు 18న గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ఎంపీ మార్గాని భరత్ రామ్, ఎంఎల్‌ఎ జి.శ్రీనివాస్ నాయుడు, మేకా శేషుబాబులతో కలిసి ఆవిష్కరించాడు.[3]
గ్రామ చరిత్ర
[మార్చు]కానూరు వశిష్ట గోదావరికి పశ్చిమ దిశలో ఉంటుంది. ఈ గ్రామం గోదావరి సమీపలో ఉండుట వలన పచ్చని పంటపొలాలతో అందంగా ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా చెరకు సాగు చేయడం వలన బెల్లం బట్టీలు ఎక్కువ కనిపిస్తాయి. ఇవే కాక కూరగాయలు కూడా ఎక్కువగా పండిస్తారు.
విద్యా సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల ఉంది. సమీప వైద్య కళాశాల ఏలూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు, సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల తణుకు లోను, అనియత విద్యా కేంద్రం పెరవలి లోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఏలూరు లోనూ ఉన్నాయి.
విద్యా సంస్థలు
[మార్చు]కానూరు గ్రామం విద్యాపరంగా మంచి వనరులు కలిగిఉంది. చక్కని పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. వాటిలో
- వాసవి ఇంజనీరింగ్ కళాశాల:ఈ కళాశాల చుట్టుప్రక్కల గ్రామాలలో ప్రసిద్ధి చెందింది. పెరవలి నుండి నిడదవోలు వరకూ అనేక గ్రామాలనుండి విద్యార్థులు కలశాల చదువుకునేందుకు వస్తున్నారు. కాలేజీ విశాల ప్రాంగణము కలిగి ఉంది. అత్యాధునిక సౌకర్యాలు, వస్తు సముదాయము కలిగిన ప్రయోగశాల కాలేజీలో ఉంది. విద్యార్థులు ఆడుకొనేందుకు దాదాపు రెండు ఎకరాల మేర క్రీడా స్థలము ఉంది. దీనిలో టెన్నిస్ కోర్టులు, రెండు బాస్కట్ బాల్ కోర్టులు, రెండు వాలీబాల్ కోర్టులు, లాంగ్ జంప్, హైజంప్ కొరకు ఇసుక కోర్టులు ఉన్నాయి. ఒక గదిలో అన్ని పుస్తకాలతో, వార్తాపత్రికలతో చిన్న గ్రంథాలయం వంటి సౌకర్యాలు ఉన్నాయి. కాలేజి గ్రామానికి దగ్గరగా ఉండుట వలన ఇళ్ళ అద్దె తక్కువగా సరుకుల సౌకర్యాల ఖర్చులు తక్కువగా అయ్యే వీలుకలుగును. మరొక ఎకరం స్థలంలో విద్యార్థుల, ఉపాద్యయుల వాహనాల కొరకు పొడవైన షెడ్లు ఉన్నాయి.
- బొండాడ వెంకట రంగనాయకమ్మ జూనియర్ కళాశాల:ఈ కళాశాల కానూరుకు తూర్పున మార్కెట్ ప్రక్కన ఉంది. దీనిని 1996లో స్థాపించారు. ఈ కళాశాలకు తీపర్రు, కానూరు అగ్రహరం, నడిపుడి, పరిసర గ్రామాల నుండి విద్యార్థులు చదువుకునేందుకు వస్తారు. విద్యార్థులుకి కావలసిన అన్ని సౌకర్యాలు ఈ కళాశాలలో కల్పించారు.అన్ని సౌకర్యాలు కలిగిన ప్రయోగశాల ఈ కాలేజీలో ఉంది. విద్యార్థులు అడుకొవడానికి తగినంత స్థలము ఉంది.
- అక్కిన చంద్రయ్య ఉన్నత పాఠశాల:అక్కిన చంద్రయ్య పరిషత్ ఉన్నత పాఠశాలలో ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఉంది. ఈ పాఠశాలకు కానూరు అగ్రహరం, ఉసులుమర్రు గ్రామల నుండి నుండి విద్యార్ధులువస్తారు.
రవాణా సౌకర్యాలు
[మార్చు]కానూరు పాలకొల్లు, నిడదవోలు రోడ్డులో ఉంది.
- నర్సాపురం నుండి నిడదవోలు బస్సులు ఉన్నాయి.
- తణుకు నుండి రాజమండ్రికి కానూరు నుండి బస్సులు ఉన్నాయి.
- కానురు నుండి పడమరగా ఉండ్రాజవరం మీదుగ తణుకు చేరుకోవచ్చు
- మెయిన్‌రోడ్ మీద ఉండటం వలన ఎప్పుడూ ఆటోలు లాంటివి తిరుగుతాయి
నీళ్ళు
[మార్చు]వ్యవసాయం
[మార్చు]కానూరు, చుట్టుపక్కల ప్రాంతాలలో చెరకు, మరియువరి ఎక్కువగా పండిస్తారు. గోదావరి దగ్గరగా ఉండుటం వల్ల అంతర పంటలుగా కూరగాయలు, పసుపు, కంద, పండ్లు, పూల మొక్కలు పెంచుతారు. చెరకు ముఖ్య పంట ఉంది కాబట్టి ఎక్కువగా రైతులు దానితో ఉపాది పొందుతరు. బట్టీల ద్వారా బెల్లం తయారీకి ఎక్కువగా కూలీలు ఉపాది పొందుతున్నారు.
మరికొన్ని సౌకర్యాలు
[మార్చు]కానురులో ఆంధ్రాబ్యాంకు ఉంది వ్యవసయ ప్రాథమిక సహకార సంఘం ఉంది.
దేవాలయాలు
[మార్చు]కానూరులో చాలా దేవాలయాలు ఉన్నాయి.
- కోదండ రామాలయం
- ప్రధాన కూడలిలో సాయి బాబా గుడి
- వినాయకుని గుడి
- కొడాలమ్మ గుడి, చర్చి ఉన్నాయి.
కొండాలమ్మదేవాలయం
[మార్చు]ఇక్కడ కల కోండాలమ్మ ఆలయం చాలా ప్రసిద్ధి చెందినది. మహిమ కల దేవతగా ఇక్కడ అంతా కొలుస్తారు. దూర ప్రాంతాల నుండి ఎందరో భక్తులు వస్తుంటారు.ప్రతి రోజూ భక్తులతొ కిటకిటలాడుతు ఉంటుంది. రోడ్డుపై ప్రయాణించే ప్రతి వాహనం ఇక్కడ ఆగుతుంది. ఈ గుడి తణుకు,నిడదవోలు కానూరు సెంటర్ లో ఉంది.
ఇసుక రవాణా
[మార్చు]గోదావరి నది ఇక్కడకు బాగా దగ్గర. ఇక్కడ ఉన్న ఇసుక క్వారీల నుండి చాలా ప్రాంతాలకు లారీల ద్వారా, ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా జరుగుతుంది.
గ్రామ పెద్దలు
[మార్చు]గ్రామానికి మేలు చేసిన పలు మంది పెద్దలు ఉన్నారు. ప్రస్తుత గ్రామ సర్పెంచ్ శ్రీమతి అంబటి లక్ష్మి గారు గ్రామాన్ని మంచి దారిలో నడిపిస్తునారు. ముందు సర్పంచిగా పనిచేసిన అనపర్థి రామారావు గారు కుడా తోడ్పడుతున్నారు.
వైద్య సౌకర్యం
[మార్చు]ప్రభుత్వ వైద్య సౌకర్యం
[మార్చు]కానూరులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. నలుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉంది. ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, పశు వైద్యశాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
[మార్చు]గ్రామంలో4 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు ఉన్నారు. ఐదు మందుల దుకాణాలు ఉన్నాయి.
తాగు నీరు
[మార్చు]గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. తాగునీటి కోసం చేతిపంపులు, బోరుబావులు, కాలువలు, చెరువులు వంటి సౌకర్యాలేమీ లేవు.కానూరుకు ఊరిలో ప్రధాన చెరువులు మంచి నీరు చెరువులు రెండు ఉన్నాయి. విజ్జేశ్వరం నుండి వచ్చే పెద్ద కాలువ కానూరు ప్రక్కగా వెళుతుంది.
పారిశుధ్యం
[మార్చు]మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
[మార్చు]కానూరులో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్, ట్రాక్టరు సౌకర్యం మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
[మార్చు]గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.
విద్యుత్తు
[మార్చు]గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
[మార్చు]కానూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 220 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 811 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 811 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
[మార్చు]కానూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- కాలువలు: 398 హెక్టార్లు
- బావులు/బోరు బావులు: 282 హెక్టార్లు
- ఇతర వనరుల ద్వారా: 129 హెక్టార్లు
ఉత్పత్తి
[మార్చు]కానూరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
[మార్చు]గణాంకాలు
[మార్చు]2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6575. ఇందులో పురుషుల సంఖ్య 3296, మహిళల సంఖ్య 3279, గ్రామంలో నివాసగృహాలు 1697 ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
- ↑ Prajasakti (18 August 2022). "సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.