అక్షాంశ రేఖాంశాలు: 13°32′9.672″N 79°5′37.932″E / 13.53602000°N 79.09387000°E / 13.53602000; 79.09387000

కావేటిగారిపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కావేటిగారిపల్లె
పటం
కావేటిగారిపల్లె is located in ఆంధ్రప్రదేశ్
కావేటిగారిపల్లె
కావేటిగారిపల్లె
అక్షాంశ రేఖాంశాలు: 13°32′9.672″N 79°5′37.932″E / 13.53602000°N 79.09387000°E / 13.53602000; 79.09387000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాచిత్తూరు
మండలంపులిచెర్ల
విస్తీర్ణం8.42 కి.మీ2 (3.25 చ. మై)
జనాభా
 (2011)[1]
3,073
 • జనసాంద్రత360/కి.మీ2 (950/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు1,518
 • స్త్రీలు1,555
 • లింగ నిష్పత్తి1,024
 • నివాసాలు866
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్517172
2011 జనగణన కోడ్596187

కావేటిగారిపల్లె ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన పులిచెర్ల నుండి 14 కి.మీ. దూరం లోను, సమీప పట్టణమైన తిరుపతి నుండి 36 కి.మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 866 ఇళ్లతో, 3073 జనాభాతో 842 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1518, ఆడవారి సంఖ్య 1555. షెడ్యూల్డ్ కులాల జనాభా 471 కాగా షెడ్యూల్డ్ తెగల జనాభా 81. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 596187[2].

గ్రామ గత విశేషాలు చరిత్ర

[మార్చు]

గతంలో ఇక్కడ జరిగే మహాభారత ఉత్సవాలకు ఇది ప్రసిద్ధి. గతంలో గతి తప్పకుండా ప్రతి ఏడు మహా భరత ఉత్సవాలు పద్దెనిమిది రోజుల పాటు చాల వైభోవోపేతంగా జరిగేవి. దీని కొరకు ఊరి బయట ఒక మైదానం ఉంది. ఆ మైదానం పేరు "భారతం మిట్ట." అక్కడే ఒక పూరి పాకలో ద్రౌపది సమేత పంచ పాండవుల విగ్రహాలున్నాయి.పద్దెనిమిది రోజులపాటు జారిగే ఈ ఉత్సవ కాలంలో ప్రతి రోజు భారతం లోని ఒక ఘట్టం పగలు హరికథ రూపంలో చెప్ప బడేది. అదే ఘట్టాన్ని రాత్రి నాటక రూపంలో ప్రదర్శించేవారు. ఆ సందర్భంగా, ఆక్కడ చాల దుఖాణాలు, పిల్లల వినోదార్థం, తోలు బొమ్మలాటలు, రంగుల రాట్నం లాంటివి వచ్చేవి. ఈ ఉత్సవంలో ముఖ్యమైన దినాలు 1) ప్రారంభం రోజు, 2. బక్కాసుర వధ, 3) అర్జునుడు తపస్సు మాను ఎక్కుట, 4) ద్రౌపది వస్త్రాపహరణ, 5) చివరగా ధుర్యోధన వధ. ఈసందర్భంగా ఆ చుట్టు పక్కలా చాల దూరం నుండి ప్రజలు తండోప తండాలుగా వచ్చేవారు. 1) బక్కాసుర వధ నాడు భీముని వేష దారి ఒక ఎద్దులబండి పై కూర్చొని ఆ చుట్టు పల్లెల్లో తిరుగుతాడు. ఆ పల్లె ప్రజలు ప్రతి ఇంటి వారు అన్నం, పిండి వంటలు మొదలగు వాటిని ఆ బండిలో వేస్తారు. చివరగా బండి భారతం మిట్టకు వస్తుంది. ఆ రాత్రే బక్కసుర వధ నాటకం చాల రసవత్తరంగా జరుగు తుంది. 2. అర్జునుడుడు తపస్సు మాను ఎక్కుట. ఈ రోజు భారతం మిట్టన చాల పొడవైన ఒక అసోక వృక్షాన్ని అక్కడ పాతతారు. అర్జున వేష దారి పద్యాలు పాడుతు ఒక్కో మెట్టు ఎక్కుతూ చివరకు వెళ్లతాడు. ఆ సందర్భంలో కొంత మంది స్త్రీలు ఆ స్తంభం చుట్టు వరానికి పడి వుంటారు. అనగా పిల్లలు పుట్టాలని కోరుకున్నావారు ఆ మాను చుట్టు సాష్టాంగ ప్రమాణం పడి వుంటారు. ఆ చుట్టు చూసే వాళ్లు వుంటారు. అర్జున వేష దారి, పైనుండి, తనాతో బాటు తీసుకెళ్లిన పండ్లు, పూలూ, మొదలైన వాటిని జనం పైకి విసురుతూ పద్యాలు పాడు తుంటాడు. అతను విసిరే వస్తువులు ఎవరి పైన పడితే వారి కోరిక నెరవేరి నట్లే. ఇదంతా పగలే జరిగే కార్యక్రమం. 3. ధుర్యోధన వధ: ఇది కూడా పగలే జరిగే కార్యక్రమం. అక్కడ ఒక భారి ధుర్యోధనుడు వెల్లకిలా పడుకొని వున్నట్టున్న బారి విగ్రహాన్ని మట్టితో నిర్మిస్తారు. ధుర్యోధన వేషహాదారి, ఆ విగ్రహం మీద నిలబడి పద్యాలు పాడు తుంటాడు. భీమ వేషదారి ఆ విగ్రహం చుట్టు తిరుగుతూ పద్యాలు పాడుతుంటాడు. అప్పుడప్పుడు ధుర్యోధన వేష ధారి విగ్రహం పై నుండి కిందికి దిగి కొంత సేపు భీమునితో గదా యుడ్డం చేస్తాడు. తిరిగి విగ్రహం పైకెళ్లి పొతాడు. భీముడు మాత్రం ఆ విగ్రహం పైకి వెళ్ల కూడదు. ఇలా పద్యాలు పాడుతూ యుద్ధం చేస్తూ చాల సేపు నాటకాన్ని రక్తి కట్టిస్తారు. చివరగా భీముడు తన గదతో ధుర్యోధనుని విగ్రహం తొడలో అదివరకే పాతి పెట్టిన కుంకుం కలిపిన గుమ్మడి కాయను తన గదతో కొట్టతాడు, అప్పుడు ధుర్యోధన వేషదారి ఆ విగ్రహం పై పడిపోతాడు. అప్పుడు ఆ చుట్టు తిలకిస్తున్న ప్రజలు ధుర్యోధనుని చేసిన మట్టిని తీసుకోడానికి ఎగబడతారు. ఎందుకంటే ఆ మట్టిని తమ గాదెల్లో వేస్తే తమకు ధాన్యం సంవృద్ధిగా వుంటుందని పొలాల్లో చల్లితే పంటలు పుష్కలంగా పండతాయని నమ్మకం ఎక్కువ. ఈ రోజునే ప్రజలు అత్యధికంగా వాస్తారు. ఆ రాత్రికి ధుర్యోధన వధ నాటకం జరుగుతుంది.

ఈ నాటకాలన్నింటిలో స్థానికులు కొన్ని వేషాలు వేసినా, ఈ నాటకాలు ఆడడమే వృత్తిగా వున్న వారు నాటకాలు వేస్తుంటారు. కంగుందికుప్పం వారు వేషాలేస్తే అదొక ప్రత్యేకత. జనం విపరీతంగా వస్తారు. ప్రస్తుతం ఈ మహా భారత ఉత్సవాలు ప్రతి ఏడాది జరగడం లేదు. అప్పుడప్పు జరుగు తాయి. కాని ఇటు వంటి మహాభారత ఉత్సవాలు ప్రక్కనున్న మొగరాల, దమలచెరువు, లలో ఈ మధ్యనుండి పాకాలలో మొదటినుండి కూడా జరుగు తున్నాయి.. అక్కడ కాని ఇక్కడ జరిగినంత వైభవంగా వుండదు. ప్రస్తుతం కొమ్మిరెడ్డిగారి పల్లి భారతం మిట్టన పాండవులకు శాశ్వత ఆలయం కట్టించాలని గత దశాబ్దం కాలం నుండి కొంత మేర గుడి కట్టి ఉన్నారు. అదింకా అసంపూర్తిగానే ఉంది. ఈ కొమ్మిరెడ్డి గారి పల్లి ఈ భారత ఉస్తవాలతోనే ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రతి శుక్రవారం సంత కూడా జరుగు తుంది. ఈ సంతకు కూడా గతంలో వచ్చినంత జనం రావడంలేదు.

గ్రామజనాబా

[మార్చు]

2001 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా - మొత్తం 3, 485 - పురుషులు1, 757 - స్త్రీలు 1, 728 - గృహాల సంఖ్య 817 విస్తీర్ణం 842 హెక్టార్లు, సముద్రమట్టానికి ఎత్తు. 467 మీటర్లు

సమీప గ్రామాలు

[మార్చు]

రాయవారి పల్లి. 4 కి.మీ. పెద్దరామ పురం. 5 కి.మీ. మొగరాల 5 కి.మీ. గానుగపెంట 5 కి.మీ దూరంలో ఉన్నాయి. ఈ గ్రామం క్రింద వున్న ఉప గ్రామాలు, కొమ్మిరెడ్డిగారి పల్లె, చెన్నుపాటివారి పల్లె, బేరి పల్లె,

విద్యా సౌకర్యాలు

[మార్చు]

ఈ గ్రామంలో 1 ప్రైవేటు బాలబడి, 1 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల, 1 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల, ఉన్నాయి. సీనియర్ మాధ్యమిక పాఠశాల (కొత్తపేట లో), ఈ గ్రామానికి 5 కి.మీ. లోపు ఉంది. ఆర్ట్స్, సైన్స్, కామర్సు డిగ్రీ కళాశాల, వృత్తి విద్యా శిక్షణ పాఠశాల పాకాల లో, ఇంజనీరింగ్ కళాశాలలు అగ్రహారం లో, వైద్య కళాశాల, మేనేజ్మెంట్ సంస్థ, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల తిరుపతిలో, అనియత విద్యా కేంద్రం (పులిచెర్ల లో, పాలీటెక్నిక్ పీలేరులో ఈ గ్రామానికి 10 కి.మీ కన్న దూరంలో ఉన్నాయి.

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

ఈ గ్రామంలో 1 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం, 1 సంచార వైద్య శాల ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం., ఈ గ్రామానికి 5 కి.మీ. లోపు ఉంది. సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణా కేంద్రం, టి.బి వైద్యశాల, అలోపతీ ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, పశు వైద్యశాల, కుటుంబ సంక్షేమ కేంద్రం ఈ గ్రామానికి 10 కి.మీ కన్న దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో 2 అవుట్-పేషెంట్ వైద్య సౌకర్యాలు ఉన్నాయి. గ్రామంలో 1 ఇన్, అవుట్-పేషెంట్ వైద్య సౌకర్యం ఉంది. అలాగే 1 డిగ్రీలు లేని వైద్యుడు, 1 సంప్రదాయ వైద్యుడు, 1 నాటు వైద్యుడు ఉన్నారు.

త్రాగు నీరు

[మార్చు]

గ్రామంలో రక్షిత మంచి నీరు లేదు. మంచినీటి అవసరాలకు చేతిపంపుల నీరు, గొట్టపు బావులు / బోరు బావుల చెరువు/కొలను/సరస్సు నుంచి నీటిని వినియోగిస్తున్నారు.

పారిశుధ్యం

[మార్చు]

తెరిచిన డ్రైనేజీ గ్రామంలో ఉంది. డ్రెయినేజీ నీరు నేరుగా నీటి వనరుల్లోకి వదిలివేయబడుతోంది. పూర్తి పారిశుధ్య పథకం కిందకు ఈ ప్రాంతం వస్తుంది.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

ఈ గ్రామంలో టెలిఫోన్ (లాండ్ లైన్) సౌకర్యం, పబ్లిక్ ఫోన్ ఆఫీసు సౌకర్యం, మొబైల్ ఫోన్ కవరేజి, పబ్లిక్ బస్సు సర్వీసు, ఆటో సౌకర్యం, ట్రాక్టరు ఉంది.ఈ గ్రామానికి 5 కి.మీ. లోపు ఉన్నాయి.ప్రైవేట్ బస్సు సర్వీసు, రైల్వే స్టేషన్ (వల్లివేడు లో) ఈ గ్రామానికి 5 నుండి 10 కి.మీ దూరంలో ఉన్నాయి.పోస్టాఫీసు సౌకర్యం, ఇంటర్నెట్ కెఫెలు / సామాన్య సేవా కేంద్రాల సౌకర్యం, ప్రైవేటు కొరియర్ సౌకర్యం, టాక్సీ సౌకర్యం, ఈ గ్రామానికి 10 కి.మీ కన్న దూరంలో ఉన్నాయి. సమీప జాతీయ రహదారి గ్రామానికి 5 నుంచి 10 కిలోమీటర్ల లోపు ఉంది. సమీప రాష్ట్ర రహదారి గ్రామానికి 5 నుంచి 10 కిలోమీటర్ల లోపు ఉంది.. గ్రామంప్రధాన జిల్లా రోడ్డుతో అనుసంధానమై ఉంది. గ్రామంఇతర జిల్లా రోడ్డుతో అనుసంధానమై ఉంది.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

ఈ గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ ఋణ సంఘం, స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారీ సంత ఉన్నాయి. సమీప ఏటియం, సహకార బ్యాంకు, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ, ఈ గ్రామానికి 10 కి.మీ కన్న దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

ఈ గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం (పోషకాహార కేంద్రం), జనన మరణాల నమోదు కార్యాలయం, ఇతర (పోషకాహార కేంద్రం), వార్తాపత్రిక సరఫరా, ఆశా కార్యకర్త (గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్త), అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, ఉన్నాయి. సినిమా / వీడియో హాల్, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం, ఈ గ్రామానికి 5 నుండి 10 కి.మీ దూరంలో ఉన్నాయి. ఏకీకృత బాలల అభివృద్ధి పథకం (పోషకాహార కేంద్రం), ఆటల మైదానం, ఈ గ్రామానికి 10 కి.మీ కన్న దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు

[మార్చు]

ఈ గ్రామంలో విద్యుత్ సరఫరా విద్యుత్తు ఉంది.

భూమి వినియోగం

[మార్చు]

గ్రామంలో భూమి వినియోగం ఇలా ఉంది (హెక్టార్లలో) :

* అడవి: 0
* వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 41
* వ్యవసాయం సాగని, బంజరు భూమి: 62
* శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 8
* తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 2
* వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 49
* సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 64
* నికరంగా విత్తిన భూ క్షేత్రం: 616
* నీటి సౌకర్యం లేని భూ క్షేత్రం: 516
* నీటి వనరుల నుండి నీటి పారుదల లభిస్తున్న భూ క్షేత్రం: 164 

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో వ్యవసాయానికి నీటి పారుదల వనరులు ఇలా ఉన్నాయి (హెక్టార్లలో) :

బావులు/గొట్టపు బావులు: 164

తయారీ

[మార్చు]

ఈ గ్రామం ఈ కింది వస్తువులను ఉత్పత్తి చేస్తోంది (పై నుంచి కిందికి తగ్గుతున్న క్రమంలో) :

వరి, బెల్లం వేరుశనగ, చెరకు

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు

[మార్చు]