క్రైస్తవ మతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యేసు క్రీస్తు

ఏసు క్రీస్తు బోధనల ప్రకారం జీవించేవారిని క్రైస్తవులు అని అంటారు. పరిశుద్ధ గ్రంథం (హోలీ బైబిల్) క్రైస్తవుల పవిత్ర గ్రంథం.

చరిత్ర

[మార్చు]

యూదుల మతం (Judaism) సుమారు samanya s kam పూర్వం 2000 సంవత్సరాల్లో (భారతదేశంలో వేద కాలం నడుస్తున్న కాలంలో) ఆవిర్భవించింది. బైబిలు పాత నిబంధనలో మొదటి ఐదు అధ్యాయాలైన ఆది కాండం, నిర్గమ కాండం, లేవీయకాండం, ద్వితియోపదేశకాండం, సంఖ్యాకాండం వంటి పుస్తకాలు యూదులు (Jews) కు పవిత్రమైనవి. వీటిని ధర్మశాస్త్ర గ్రంథాలని యూదులు నమ్ముతారు. అయితే కాల క్రమేణా విగ్రహారాధన ఊపందుకొని యూదుల ఆచార వ్యవహారాలు చాలా మార్పులకు లోనయ్యాయి. ఆ కాలంలో యూదులు పాప పరిహారార్ధ జంతు బలులు అర్పించేవారు, కాలక్రమేణా యూదుల ఆచారాలు వెర్రి తలలు వేశాయి. ధనిక - పేద, యజమాని - బానిస వంటి అసమానతలు, వ్యాధి గ్రస్తుల పట్ల చిన్న చూపు, మూడ నమ్మకాలు ఏర్పడ్డాయి. ఫలితంగా ధర్మశాస్త్రాన్ని కాలానికి అనుగుణంగా సులభతరం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

యోషయా గ్రంథం రచించబడిన 700 సంవత్సరాల తర్వాత యూదుల కులంలో కన్య,, యేసేపు లకు యేసు క్రీస్తు జన్మించాడు. యేసు జన్మ గురించి క్రొత్త నిబంధనలోని మత్తయి సువార్త 1:18-25, లూకా సువార్త 1:26 లో వ్రాయబడిఉంది. అయితే యేసు క్రీస్తు కాలానికి ఇశ్రాయేలు (Israel) దేశం అంతా రోమన్స్ (Romans) పరిపాలనలోకి వెళ్ళిపోయింది.

బాల్యంనుండే ఆధ్యాత్మిక చింతన అలవర్చుకొన్న ఏసు క్రీస్తు సమాజంలో అణగద్రొక్కబడినవారిని అక్కున చేర్చుకొన్నాడు. సంఘ సంస్కర్తగా అప్పటి సమాజంలో మంచి మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాడు, రాజ్యాంగం వంటి యూదుల పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని సులభతరం చేసి క్రొత్త నిబంధనగా బోధించాడు. [యేసుక్రీస్తు] బోధనలకు పలు యూదులు, ఇతర జాతుల వారు ప్రభావితులయ్యారు. రోమా సామ్రాజ్యపు రాజులకు, యూదుల్లో మత చాందసులకు ఏసుక్రీస్తు బోధనలు నొప్పి కలిగించాయి. యూదుల్లో కొంతమంది మత చాదస్తులు యేసుక్రీస్తును దైవ ద్రోహిగా, దేశ ద్రోహిగా చిత్రీకరించి, చివరికి రోమా సామ్రాజ్యపు రాజులకు అప్పగించారు. యూదుల కోరిక ప్రకారం రోమన్ రాజు ఏసు క్రీస్తును అత్యంత కిరాతకంగా సిలువ వేయించారు. తర్వాత శిలువ కారణంగా Death చెందిన ఏసు క్రీస్తును దైవ కుమారుడని యూదులు, రోమన్స్ అంగీకరించారు. ఆనాటినుండి క్రైస్తవం అనే మార్గం వాడుకలోకి వచ్చింది. ప్రపంచమంతా విస్తరించసాగింది. క్రీస్తు సమాకాలిక శిష్యులు, భక్తులు క్రొత్త నిబంధన రచించారు.

కొన్ని సూక్తులు

[మార్చు]
  • హృదయశుద్ధి కలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు (మత్తయి 5:8)
  • నీతికోసం హింసింపబడువారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది (మత్తయి 5:10)
  • నరహత్య చేయరాదు. ఒకరిని మానసికంగా బాధపెట్టడంకూడా నరహత్యే.
  • నీ పొరుగువాని ఇల్లు (దేనినైనా) ఆశింపకూడదు. (నిర్గమకాండం 20:16)
  • వ్యభిచరింపరాదు. పరాయి స్త్రీని కామంతో చూసినా వ్యభిచరించినట్లే (మత్తయి 5:28)
  • మిమ్మల్ని హింసించినవారి కోసం దేవుణ్ణి ప్రార్థించండి. (మత్తయి 5:44, లూకా 6:27,28)
  • నీవైతే ధర్మము చేయునప్పుడు, నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియకయుండవలెను. (మత్తయి 6:3)
  • మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకండి; అప్పుడు అవన్నీ మీకు లభిస్తాయి. (మత్తయి 6:33)
  • నాశనమునకు పోవు మార్గం వెడల్పును, ఆ దారి విశాలమైఉంది., దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవంనకు పోవు ద్వారం ఇరుకును, సంకుచితమైయున్నది, దానిని కనుగొనువారు కొందరే. (మత్తయి 7:13)
  • ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే, తన కోరికలను కాదనుకొని శిలువనెత్తుకొని వెంబడించాలి. (లూకా 9:23)
  • మొదట నీ కంటిలో ఉన్న నలుసుని తీసివేస్తే, నీ సోదరుని కంటిలో ఉన్న నలుసుని తీసివేయడం సులభం (మత్తయి 7:5)
  • వినుట వలన విశ్వాసం, విశ్వాసం వలన స్వస్థత కలుగుతుంది. ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండను కూడా కదిలించవచ్చు. నీవు విశ్వసించగలిగితే విశ్వాసమున్నవానికి ఏదైనా సాధ్యమౌతుంది.
  • నేను నీతిమంతులకోసం రాలేదు, పాపులను రక్షించడానికి వచ్చాను. (లూకా 5:32)
  • నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన దేవుణ్ణి స్వీకరించినట్లే.
  • చూచి నమ్మినవారికంటే చూడక నమ్మినవారు ధన్యులు
  • దేవుడు మీరడిగినవి ఇస్తాడని విశ్వసించి ప్రార్థించండి.
  • నేనే మార్గమును, సత్యమును, జీవమును
  • క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి

బాప్తిస్మము, బల్ల

[మార్చు]

బాపీస్మం (Baptism) అనగా ఒక వ్యక్తి తాను చేసిన పాపాలు దేవుడి ఎదుట ఒప్పుకొని అప్పటినుండి పరిశుద్ధంగా జీవిస్తానని, తీర్మానించుకొని దేవుడికి ప్రమాణం చేయుట. దీన్నే మారు మనస్సు అని బైబిలు పరిభాషలో అంటారు. గ్రామాల్లో అయితే కాలువల్లోను, చెరువుల్లోను, నగరాల్లో అయితే వాటర్ ట్యాంకుల్లోను బాప్తిస్మం ఇస్తారు. ఒక విశ్వాసి బాప్తిస్మం తీసుకోవాలనుకుంటే దేవుడు చెప్పిన ప్రకారం జీవిస్తానని ఆత్మీయంగా సిద్ధపడాలి. బాప్తిస్మము గురించి క్రొత్త నిబంధనలో కొరింధీయులకు వ్రాసిన పత్రికలోను, మత్తయి సువార్తలోను ప్రస్తావించబడినది . బాపిస్మం తీసుకొన్న వారు అనగా రక్షింపబడినవారు . ఒక వ్యక్తి బాప్తిస్మము తీసుకొంటేనే రక్షణ లభిస్తుంది అని క్రైస్తవుల నమ్మకం. బాప్తిస్మం తీసుకొన్నవారు మాత్రమే చర్చిల్లో రొట్టె - ద్రాక్ష రసం (సంస్కారం / బల్ల) స్వీకరించాలి. రొట్టె క్రీస్తు శరీరానీకి, ద్రాక్షరసం క్రీస్తు రక్తానికి సాదృశ్యం. బల్ల గురించి మత్తయి 26, యోహాను 6 లో వ్రాయబడియున్నది.

చీలికలు

[మార్చు]

మధ్య యుగంలో కొన్ని రాజకీయ సామాజిక కారణాల వల్ల మధ్య యుగంలో క్రైస్తవులు సంప్రదాయాల ననుసరించి రోమన్ కాథలిక్కులు, సనాతన తూర్పు సంఘం, ప్రొటెస్టెంట్ లు, యాంగ్లికాన్, అమిష్, బాప్తిష్టు, లూధరన్, పెంతికోస్తు, ప్రెస్బిటేరియన్, క్వాకర్సు, ఏడవరోజు ఆరోహణ సంఘం అనే ప్రధాన వర్గాలుగా చీలిపోయారు.

క్రైస్తవులు చేసే ప్రార్థన

[మార్చు]

పరలోకమందున్న మా తండ్రీ! మీ నామం పరిశుద్ధపరచబడును గాక! మీ రాజ్యం వచ్చును గాక! మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమియందునూ నెరవేరును గాక! మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి! మా యెడల అపరాధం చేయువారిని మేము క్షమించులాగున మీరు మా అపరాధాలను క్షమించండి! మమ్మల్ని శోధనలోనికి తేక సమస్త కీడునుండి దుష్టత్వం నుండి తప్పించండి. (మత్తయి 6:10 - 14) రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము మీరైయున్నారు తండ్రీ! ఆమెన్!.

ఇతర విషయాలు

[మార్చు]
  • బైబిలు గ్రంథమును సుమారు 1400 సంవత్సరాల పాటూ వివిధ కాలాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన 40 మంది ప్రవక్తలు దైవ ప్రేరేపణచే వ్రాశారు.
  • సాహిత్య చరిత్ర ప్రకారం బైబిలులోని మొదటి భాగమైన పాత నిబంధనలు పురాతనమైనవి.
  • క్రైస్తవులు బైబిల్ లోని వాక్యాలు దేవుని మాటలుగా భావిస్తారు. ఇది యోహాను సువార్త మొదటి అధ్యాయంలో కపిస్తుంది.
  • బైబిలు ప్రకారం ఏసు క్రీస్తు దైవ కుమారుడు.
  • ఏసు క్రీస్తు నీతిమంతులను లేపి తీసుకువెళడానికి రెండవసారి రానైయున్నాడని క్రైస్తవులు నమ్ముతారు.
  • హల్లెలూయ అనే పదానికి అర్ధం "దేవుడు స్తుతింపబడును గాక!” (God be praised). ఈ పదాన్ని క్రైస్తవులు ఏదైనా మంచి జరిగినప్పుడు వాడతారు.
  • ఆమెన్ అంటే "అలా జరుగును గాక!” (Let it be happen). ఈ పదాన్ని ప్రార్థన ముగింపులో వాడతారు.
  • ఇంగ్లండులో సెయింట్ నికోలాస్ (St. Nicholas) అనే బిషప్, చర్చికి వచ్చిన పిల్లలను ఎంతగానో ప్రేమించి వారికోసం ఎన్నో గిఫ్టులు తెచ్చేవాడు. సెయింట్ నికోలాస్ మరణించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలకు క్రిస్త్మస్ తాతయ్య అయ్యాడు, శాంటా క్లాజ్ (Santa Claus) గా పిలువబడుతున్నాడు. పిల్లల నమ్మకం ప్రకారం శాంటా క్లాజ్ క్రిస్మస్ రోజున ఎన్నో గిఫ్టులు తీసుకొస్తాడు.
  • పాస్టర్ (Pastor) అనగా ప్రొటస్టెంట్ చర్చిలో వాక్యం చెప్పి ప్రార్థన చేసే కాపరి.
  • బిషప్ (Bishop) అనగా కేథలిక్ చర్చిలో వాక్యం చెప్పి ప్రార్థన చేసే కాపరి.
  • పోప్ (Pope) అనగా రోమన్ కేథలిక్ చర్చిలకు అధికారి.
  • క్రొత్తనిబంధనలోని మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మానవాళి పాప పరిహార్ధ నిమిత్తం ఏసు ప్రభువు ఒక అరణ్యంలో 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయడం జరిగింది. దానికి కృతజ్ణతగా కేథలిక్కులు, లూధరన్, బైబిలు మిషను వంటి కొన్ని క్రైస్తవ సంఘాలు శిలువ ధ్యానాలు (Lent Days) అనే పేరుతో ప్రత్యేక ప్రార్థనలు ఆచరిస్తాయి.కాని ఇది వాక్యను కూలమైన ఆచారము కాదు..మనష్యుల పద్ధతులను అనుసరించు భక్తి వ్యర్ధమని వాక్యము తెలుపుచున్నది మత్తయు 15:9

భారత దేశంలో క్రైస్తవ్యం విస్తరించినది క్రీస్తు శకం 52 వ సంవత్సరంలో.యేసు క్రీస్తు శిష్యుడు అయిన సైంట్ థామస్ కెరళలో యేసుక్రీస్తు గురించి ప్రకటించి క్రైస్తవ్యాన్ని భారతదేశానికి పరిచయం చేసాడు.

అపోహలు

[మార్చు]
  • ఏసు క్రీస్తు అమెరికా వారి దేవుడు: ఇందులో వాస్తవం లేదు. ఏసు క్రీస్తు జన్మించినది ఇశ్రాయెల్ దేశంలో జెరూసలేం అనే గ్రామంలో.
  • క్రైస్తవ మతం చాలాలో కేడర్ మతం: ఇందులో వాస్తవం లేదు. క్రైస్తవ మతంలో కేవలం పేదవారే కాకుండా ధనవంతులు కూడా ఉన్నారు. పాపం చేయడాన్ని ఏ మతమూ ప్రోత్సహించదు . మనుష్యులు చేసే తప్పులు బట్టి మతం పై చులకన భావం కలిగియుండటం సరికాదు .

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]