Jump to content

క్షయ

వికీపీడియా నుండి
క్షయవ్యాధి
వర్గీకరణ & బయటి వనరులు
క్షయ వ్యాధి బాధితుడి ఛాతీ ఎక్స్-రే
m:en:ICD-10 {{{m:en:ICD10}}}
m:en:ICD-9 {{{m:en:ICD9}}}
m:en:OMIM {{{m:en:OMIM}}}
DiseasesDB 8515
m:en:MedlinePlus 000077 మూస:MedlinePlus2
m:en:eMedicine {{{m:en:eMedicineSubj}}}/{{{m:en:eMedicineTopic}}} 
MeSH C01.252.410.040.552.846

క్షయ వ్యాధి (Tuberculosis) ఒక అంటువ్యాధి. ఇది ఊపిరితిత్తులకు సంబంధించినదైనా, చర్మము నుండి మెదడు వరకు శరీరంలో ఏ భాగానికైనా ఈవ్యాధి వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలో దీర్ఘకాలిక రోగాలలో ప్రధానమైనది ఈ క్షయవ్యాధి. మైకోబాక్టీరియా లేదా మైకో బ్యాక్టీరియం ట్యూబర్ క్యులోసిస్ అనే సూక్ష్మక్రిమివలన ఈ వ్యాధి వస్తుంది.[1] క్షయవ్యాధి సోకని శరీరావయవాలు క్లోమము, థైరాయిడ్ గ్రంథి, జుట్టు. మిగిలిన అవయవాలన్నింటికి క్షయవ్యాధి కలిగే అవకాశం ఉంది. ఈ వ్యాధి ప్రధానంగా శ్వాసకోశాన్ని దెబ్బ తీస్తుంది.

డా. రాబర్ట్ కోచ్ క్షయ వ్యాధికారక సూక్ష్మక్రిములను మొదటిసారిగా మార్చి 24, 1882 న గుర్తించారు. ఇందుకుగాను 1905 లో వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రదానం చేయబడింది. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం మార్చి 24ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం నిర్వహించబడుతుంది.[2][3]

సూక్ష్మక్రిముల్ని గుర్తించడం వీటిలో ముఖ్యమైన పరీక్షలు. కొద్ది నెలల తేడాలో అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం, రాత్రి పూట స్వల్పస్థాయిలో జ్వరం రావడం, జ్వరం వచ్చినప్పుడు బాగా చెమట పట్టడం, నెలల తరబడి తగ్గని దగ్గు వంటివి ముఖ్యమైన రోగలక్షణాలు.

మాంటూ చర్మపరీక్ష

క్షయ జబ్బు ఉన్నవారు దగ్గినా, తుమ్మినా లేదా ఉమ్మినా, గాలి ద్వారా వేరే వారికి వ్యాప్తి చెందుతుంది. ప్రపంచ జనాభాలో ప్రతి ముగ్గురులో ఒక్కరికి ఈ వ్యాధి సోకుతుంది. ప్రస్తుతం క్షయ నిర్ధారణకు వ్యక్తుల నుంచి నమూనాలు సేకరించి, పరిశోధనశాలల్లో బ్యాక్టీరియాను అభివృద్ధి చేస్తున్నారు. దీనికి దాదాపు ఎనిమిది వారాల సమయం పడుతుంది. ఇంతకంటే వేగంగా పనిచేసే పరీక్షలు ఉన్నప్పటికీ అవి అన్ని రకాల క్షయ బ్యాక్టీరియాలను గుర్తించలేవు. క్షయ వ్యాధి నిర్ధారణకు ఇకపై వారాల కొద్దీ వేచి ఉండాల్సిన అవసరం లేదు. కేవలం ఒక్క గంటలో వ్యాధి తాలూకూ బ్యాక్టీరియాను గుర్తించేందుకు డీఎన్‌ఏ ఆధారిత పద్ధతిని అభివృద్ధి చేసినట్లు బ్రిటన్ హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హెచ్‌పీఏ) శాస్తవ్రేత్తలు ప్రకటించారు.[4]

చరిత్ర

[మార్చు]

ఐరోపాలో క్షయ బ్యాక్టీరియా 7 వేల ఏళ్లక్రితమే మనుగడ సాగించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఐరోపాలో ఏడువేల ఏళ్లక్రితమే అత్యంత ప్రాచీన క్షయ కేసు ఉన్నట్లు స్జెగెడ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు మురియెల్ మాసన్ పరిశోధనలో వెల్లడైంది. హైపర్‌ట్రోఫిక్ పల్మనరీ ఆస్టియోపతి (హెచ్‌పీవో) అనే వ్యాధికి వేల సంవత్సరాల క్రితం క్షయ కారణమనీ, పురావస్తు రికార్డుల్లో నమోదైన వివరాల ప్రకారం గుర్తించారు. ఈ అధ్యయనంలో భాగంగా పరిశోధకులు దక్షిణ హంగరీలో ఏడువేల సంవత్సరాల క్రితంనాటి ప్రదేశంలో 71 మానవ అస్థిపంజరాలను పరీక్షించారు. వీటి ఆధారంగా ఇన్ఫెక్షన్లు, జీవక్రియ సంబంధ వ్యాధులకు సంబంధించి పలు కేసులను గుర్తించారు. కొన్ని అస్థిపంజరాల్లో హెచ్‌పీవోకు సంబంధించిన సంకేతాలు కూడా గుర్తించడంతో క్షయ అప్పట్లోనే ఉన్నట్లు భావిస్తున్నారు. డీఎన్ఏ, లిపిడ్స్ పరీక్షలు చేపట్టడం ద్వారా క్షయకు సంబంధించిన బ్యాక్టీరియా మనుగడను నిర్ధరించారు. ఇప్పటి వరకూ హెచ్‌పీవో, క్షయకు సంబంధించి ఇదే అత్యంత ప్రాచీన కేసుగా భావిస్తునట్లు పరిశోధకులు మాసన్ పేర్కొన్నారు.

ఐక్యరాజ్య సమితి

[మార్చు]

ఐక్యరాజ్య సమితి తన నివేదికలో ప్రతి సంవత్సరం, 10 మిలియన్ల మంది క్షయవ్యాధి (టిబి) తో అనారోగ్యానికి గురవుతున్నారని, ఈ వ్యాధి నివారించదగిన, నయం చేయగల వ్యాధి అయినప్పటికీ, ప్రతి సంవత్సరం 1.5 మిలియన్ల మంది మరణిస్తున్నారని, ప్రపంచంలోని అంటువ్యాధుల్లో ఇది ఒకటని  ఐక్యరాజ్య సమితి పేర్కొన్నది.

క్షయవ్యాధి (టిబి) తో అనారోగ్యానికి గురయ్యే వారిలో ఎక్కువ మంది తక్కువ, మధ్య ఆదాయ దేశాలలో నివసిస్తున్నారు, అయితే  ప్రపంచవ్యాప్తంగా మనుగడలో ఉంది. బంగ్లాదేశ్, చైనా, భారతదేశం, ఇండోనేషియా, నైజీరియా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, దక్షిణాఫ్రికా వంటి దేశాలలో కనిపిస్తారు.

ప్రపంచ జనాభాలో నాలుగింట ఒక వంతు మంది టిబి బ్యాక్టీరియా బారిన పడ్డారని అంచనా వేయబడింది, కాని చాలా మందికి టిబి వ్యాధి అభివృద్ధి చెందదు, కొంతమంది సంక్రమణను నివారిస్తారు  టిబి బ్యాక్టీరియా సోకిన వ్యక్తులు టిబితో అనారోగ్యానికి గురయ్యే జీవితకాల ప్రమాదం 5–10% ఉంటుంది. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారిలో ఎయిడ్స్ (హెచ్ఐవి), పోషకాహార లోపం, మధుమేహ వ్యాధి బారిన  ఉన్నవారు, పొగాకు ఉపయోగించే వ్యక్తులు ఉన్నవారు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది.[5]

నిరోధం

[మార్చు]

క్షయవ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలలో  సంక్రమణ నివారణ మార్గదర్శకాలను అనుసరించడానికి సహాయపడుతుంది.[6]

  • చేతులను శుభ్రంగా, తరచుగా కడగాలి.
  • దగ్గినప్పుడు  మోచేయి నోటిని రుమాలతో కప్పడం.
  • వ్యాధి ఉన్న  వ్యక్తులతో సన్నిహిత సంబంధాలకు దూరంగా ఉండటం.
  • వ్యాధి కి  వైద్యుడు సూచించిన మందులన్నింటినీ సరిగ్గా తీసుకోవడం.
  • క్షయ (టిబి) వ్యాప్తిని ఆపడానికి అత్యంత ముఖ్యమైన చర్యలు సరైన వెలుతురు (వెంటిలేషన్) కలిగి ఉండటం, వ్యక్తిగత రక్షణ పరికరాలను ఉపయోగించడం.

ప్రపంచములోని కొన్ని దేశాలు బాసిల్లస్ కాల్మెట్-గెరిన్ (బిసిజి) అని పిలువబడే టిబి వ్యాక్సిన్ను ఉపయోగిస్తాయి. మెనింజైటిస్, మిలియరీ క్షయ అని పిలువబడే వాటిని నివారించడానికి టిబి  అధిక శాతం ఉన్న దేశాలలోని పిల్లలకు వ్యాక్సిన్ ఎక్కువగా ఇవ్వబడుతుంది. ఈ టీకాకు అవసరమైన చర్మ పరీక్షలను చేయడం జరుగుతుంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. వేదగిరి, రాంబాబు (1993). ఊపితిత్తుల ఊసు. విజయవాడ: పల్లవి పబ్లికేషన్స్. p. 13.
  2. ప్రజాశక్తి (24 March 2018). "క్షయ నియంత్రణ సాధ్యమే..!". Archived from the original on 24 March 2019. Retrieved 24 March 2019.
  3. మనతెలంగాణ (24 March 2018). "నగరానికి క్షయ ముప్పు…". డాక్టర్ రమణ ప్రసాద్. Archived from the original on 24 March 2019. Retrieved 24 March 2019.
  4. సాక్షి16.9.2010
  5. "Tuberculosis". www.who.int (in ఇంగ్లీష్). Retrieved 2023-03-23.
  6. "Tuberculosis: Causes, Symptoms, Diagnosis & Treatment". Cleveland Clinic (in ఇంగ్లీష్). Retrieved 2023-03-23.
"https://te.wikipedia.org/w/index.php?title=క్షయ&oldid=4311153" నుండి వెలికితీశారు