గ్రాండ్ మాస్టర్ (చదరంగం)
ప్రపంచ చదరంగ సంస్థ ఫిడె ద్వారా ఇచ్చే అత్యుత్తమ టైటిలు. ఎలో రేటింగు ని బట్టి ఈ టైటిల్ ని ఇస్తారు.[1] ఎలో రేటింగు 2500 కన్న ఎక్కువగా ఉన్న వారిని గ్రాండ్ మాస్టర్ అంటారు. 2400 ల కన్నా ఎక్కువ ఎలొ రేటింగ్ ఉంటే ఇన్టర్నేషనల్ మాస్టర్ అని అంటారు. ఒక సారి గ్రాండ్ మాస్టర్ అయ్యాక వారి ఎలో రేటింగ్ పడిపోయినా వారు జీవిత కాలం గ్రాండ్ మాస్టర్ గానే ఉంటారు.
ప్రపంచ వ్యాప్తంగా 1972 నాటికి 88 గ్రాండ్ మాస్టర్లు ఉండగా, 2009 నాటికి ఆ సంఖ్య 1240 కి చేరుకుంది.
ఇటలీలో వెర్గానీ కప్ టోర్నీలో భరత్ సుబ్రమణియం తన 9 రౌండ్లలో 7.5పాయింట్లను సాధించి గ్రాండ్‌స్లామ్‌కు కావాల్సిన 2500 ఎలో పాయింట్ల రేటింగ్ దాటాడు. దీంతో 73వ టీనేజర్‌గా చెన్నైకి చెందిన 14 ఏళ్ల భరత్ సుబ్రమణియం చెస్‌లో గ్రాండ్‌మాస్టర్ ఖ్యాతి గుర్తింపు పొందాడు.[2]
భారతీయ గ్రాండ్ మాస్టర్లు
[మార్చు]పురుషులు:
- విశ్వనాథన్ ఆనంద్ (ఎలో రేటింగ్: 2788)
- దొమ్మరాజు గుకేష్ (2758)
- లంకా రవి (IM 2404)
- శశి కిరణ్ (2661),
- పెండ్యాల హరికృష్ణ - ఆంధ్రప్రదేశ్ (2673),
- యస్ యస్ గంగూలి (2634),
- పరిమార్జన్ నేగి (2615),
- అభిజిత్ గుప్తా (2584),
- సందీపన్ చందా (2611),
- అభిజీత్ కుంతే (2515),
- గోపాల్ (2598),
- అరుణ్ ప్రసాద్ (2564),
- పి. మగేష్ చంద్రన్ (2532),
- దీపన్ చక్రవర్తి (2524),
- యస్. కిదంబి (2516),
- తేజస్ బక్రే (2465),
- ప్రవీణ్ థిప్సే (2466) ,
- దివ్యేందు బారువా (2473),
- రమేష్ (2482),
- నీలోత్పల్ దాస్ (2471)
వీరితో పాటు 61 మంది భారతీయ ఇంటర్నేషనల్ మాస్టర్స్ ఉన్నారు మహిళలు: 11 మంది:
- కోనేరు హంపి - ఆంధ్రప్రదేశ్(2595),
- దివ్యా దేశ్‌ముఖ్ - మహారాష్ట్ర (2456)
- ద్రోణవల్లి హారిక ఆంధ్ర ప్రదేశ్ (2491),
- బొడ్డా ప్రత్యూష - ఆంధ్రప్రదేశ్ (2328)
- యస్. విజయలక్ష్మి (IM-2464),
- నిషా మొహొతా (2334),
- తనియా సచ్ దేవ్, ఢిల్లీ, ( IM-2405),
- యస్. మీనాక్షి (2320),
- ఈషా కరవడే (IM-2391),
- సౌమ్యా స్వామినాథన్ (2297),
- స్వాతి ఘటే (2323),
- ఆర్తి రమేష్ (2199) ,
- మేరి ఆన్ గోమ్స్ (2396),
- కృతిక నదిగ్, కర్నాటక, (2273)
మూలాలు
[మార్చు]- ↑ "Title Holders". web.archive.org. 2009-03-30. Archived from the original on 2009-03-30. Retrieved 2021-07-10.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Chess Grandslam 14 ఏళ్ల చెన్నై బాలుడిని వరించిన గ్రాండ్‌స్లామ్." EENADU. Retrieved 2022-01-15.
బయటి లంకెలు
[మార్చు]- http://www.cpai.in/ Archived 2009-01-25 at the Wayback Machine