చంద్ర సిద్ధార్థ
Appearance
చంద్ర సిద్దార్థ | |
---|---|
జననం | చంద్ర సిద్దార్థ |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | దర్శాకుడు, నిర్మాత, రచయిత |
గుర్తించదగిన సేవలు | ఆ నలుగురు, మధుమాసం, అప్పుడప్పుడు |
తల్లిదండ్రులు |
|
చంద్ర సిద్దార్థ ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత.
నేపధ్యము
[మార్చు]చంద్ర సిద్దార్థ, పూర్ణచంద్రరావు, శకుంతలాదేవి దంపతులకు జన్మించాడు. బడిలో ఉండగానే చిత్రలేఖనంలో, సృజనాత్మక రచనల్లో అనేక అవార్డులు అందుకున్నాడు. దాంతో ఆయన సృజనాత్మక రంగంలోనే రాణించాలనుకున్నాడు.[1] హైదరాబాదు నిజాం కళాశాలలో విద్యనభ్యసించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు సాహిత్యంలో పట్టభద్రుడయ్యాడు. దర్శకుడు ఉప్పలపాటి నారాయణరావు దగ్గర జైత్రయాత్ర చిత్రానికి గాను సహాయ దర్శకుడిగా పనిచేశాడు. తర్వాత నిరంతరం అనే చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం మలేషియాలో నిర్వహించిన భారతీయ చలన చిత్రోత్సవాలలో ప్రదర్శింపబడింది.
పురస్కారములు
[మార్చు]- నంది ఉత్తమ చిత్ర పురస్కారము - ఆ నలుగురు
- నంది ఉత్తమ కుటుంబ కథా చిత్ర పురస్కారము - అందరి బంధువయ
- నంది ప్రత్యేక జ్యూరీ పురస్కారము -అందరి బంధువయ
సినీప్రస్థానము
[మార్చు]దర్శకుడిగా
[మార్చు]- ఆటగదరా శివ (2018)
- ఏమో గుర్రం ఎగరావచ్చు (2013)
- మధుమాసం
- అందరి బంధువయ (సినిమా)
- ఇదీ సంగతి (2008)
- ఆ నలుగురు
అప్పుడప్పుడు (2003)
నిర్మాతగా
[మార్చు]- నిరంతరం
- హౌస్ఫుల్
మూలాలు
[మార్చు]- ↑ కె., క్రాంతి కుమార్ రెడ్డి. "తొలియత్నం: ఆ విషయంలో నేనెప్పటికీ గిల్టీగా ఫీలవుతుంటా!". sakshi.com. సాక్షి. Retrieved 10 November 2016.